Author: Prashanth Pagilla

ఐటీ, ఈడీలు దాడులు చేస్తే వాటిని ఎదుర్కోవాలని, ఎదురుదాడులు చేయాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కొవాలో పార్టీ నేతలకుట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఆయన ప్రసంగించారు. కేసీఆర్ సలహాను ప్రస్తుతం ఐటీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డి ఆచరణలో పెడుతున్నారు. వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని , తాము సేకరించిన పలు పత్రాలను మల్లారెడ్డి లాక్కున్నారని ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ దాడులు జరిగితే దాదాపు అందరూ సహకరించిన వారే ఉన్నారు కాని మల్లారెడ్డి మాత్రం ఐటీ అధికారుల తనిఖీలకు ఏమాత్రం సహకరించినట్టు లేరు. అంతేకాదు ఐటీ అధికారులపై ఎవరు ఎదురుదాడికి దిగలేదు. మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో డీ అంటే డీ అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే ఆయన మరికొన్ని సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్నది మల్లారెడ్డికి తెలియనిది కాదు. అయినప్పటికీ…

Read More

బిగ్ బాస్ రియాల్టీ షో పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ షో సాంఘీక దురాచారం వంటిదని మండిపడ్డారు. బిగ్ బాస్ హౌస్ ను గతంలో బ్రోతల్ హౌస్ తో పోల్చిన నారాయణ ఆ షో ను రద్దు చేసే వరకు తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. షో ను రద్దు చేయాలని ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని.. టీఎస్ హైకోర్టు కూడా తన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేదని చెప్పారు. తన పిటిషన్ ను ఏపీ హైకోర్టు స్వీకరించిందని…అందుకు ఏపీ హైకోర్టుకు దాన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు నారాయణ. ఈ షో ద్వారా అశ్లీల కంటెంట్ జనాల్లోకి వెళ్తుందని చెప్పారు.

Read More

ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పార్ట్ టైం ఏజెంట్, ఇన్సురెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండింట్లో 200వరకు ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2వరకు గడువు విధించింది. పార్ట్ టైం ఏజెంట్ గా నియమితులైన వారికీ రూ.7వేల నుంచి రూ. 25వేల వరకు, ఇన్సురెన్స్ అడ్వైజర్లకు రూ. 7వేల నుంచి రూ.15వేల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలు పార్ట్ టైం ఏజెంట్ : 100 పార్ట్ టైం ఇన్సురెన్స్ : 100 అర్హతలు పార్ట్ టైం ఏజెంట్ కు 12వ తరగతిలో ఉత్తీర్ణుడయి ఉండాలి పార్ట్ టైం ఇన్సురెన్స్ అడ్వైజర్ : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ

Read More

దృశ్యం 2రిలీజ్ సందర్భంగా నటి శ్రియా ఆమె భర్తతో వ్యహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అందరూ చూస్తుండగానే లిప్ కిస్ పెట్టుకోవడం తీవ్ర దుమారానికి తావిచ్చింది. ఇండియాలో ఫారిన్ కల్చర్ ను ప్రవేశ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో శ్రియ తీరును తప్పుబట్టారు. దీనిపై శ్రియ స్పందించింది. నా ప్రత్యేక క్షణాల్లో కిస్ చేయడం సాధారణమైన చర్య తను ముద్దు పెట్టాడు. నా వరకు ఇది క్రేజీ ఫీలింగ్. సహజంగా జరిగే చర్యలను ట్రోల్ చేయడం ఎందుకన్నది మా వారికీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. అయినా తనపై చేస్తోన్న చెత్త కామెంట్స్ కు సమాధానం ఇవ్వనని శ్రియ తెలిపింది. ట్రోల్స్ చేయడం అది వారి డ్యూటీ. వాటిని పట్టించుకోకపోవడం నా ఉద్యోగమంటూ.. నేను ఏం చేయాలనుకుంటే అది చేసేస్తానని వ్యాఖ్యానించింది. తాను నటించిన సినిమాలపై ఆండ్రీ రియాక్షన్ ఏమిటని అడగ్గా.. తన సినిమాలను ఎంతో ఇష్టపడతాడని చెప్పింది. మరోసారి వాటిని…

Read More

తెలంగాణ రాజకీయాలు సలసల మసులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో రాష్ట్రంలో ఆధిపత్యం చెలయించాలని బీజేపీ ప్రయత్నించగా…ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఫలితంగా టీ- పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. ఎమ్మెల్యేల ఎరవేతకు కేసుతో బీజేపీ దూకుడును నియత్రించాలనుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీపై యుద్ద ప్రకటనలు చేశారు. ఆ పార్టీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల సీఎం లకు, సిజే లకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను పంపారు. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసి పలువురు కమలనాథులకు నోటిసులు పంపారు. మరికొద్ది రోజుల్లోనే అమిత్ షా కు కూడా నోటిసులు పంపనున్నారని సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు. బీజేపీపై ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోన్న టీఆర్ఎస్ ను సైలెంట్ చేసేలా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ, ఈడీలు టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా సోదాలు నిర్వహించాయి.…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికీ నోటిసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బీఎల్ సంతోష్ కు నోటిసులు ఇవ్వగా పరిస్థితులను బట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కూడా నోటిసులు ఇష్యూ చేసే అవకాశం ఉందని సిట్ సంకేతాలు ఇస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని అమిత్ షా తెరవెనక ఉండి నడిపించినట్లు సిట్ అధికారులు పరోక్షంగా లీక్ చేస్తున్నారు. ఈ డీల్ తో సంబంధం ఉందని అనుమానిస్తోన్న తొమ్మిది మందిపై సిట్ బృందం దృష్టి సారించింది. ఇందులో నోటిసులు పొందిన వారు కాకుండా ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హూస్బలె , అమిత్ షా ప్రైవేట్ సెక్రటరీ సాకేత్ కుమార్ ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచిందని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులను దత్తాత్రేయ రెడీ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ…

Read More

తెలంగాణలో ఐటీ, ఈడీ వరుస దాడులతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు ఎవరు టార్గెట్ అవుతారోనని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ఐటీ, ఈడీ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ ధైర్యం చెబుతున్నా కొంతమంది నేతల్లో మాత్రం బెంగ తొలగడం లేదు. ఐటీ, ఈడీల రాడార్ లో ఉన్నారని పార్టీకి చెందిన కీలక నేతలను కేసీఆర్ హెచ్చరించారు. ఏ క్షణమైనా దాడులు జరిగొచ్చునని అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు పలు అవకతకలకు పాల్పడినట్లు సమాచారం సేకరించి పెట్టుకున్న దర్యాప్తు బృందాలు దాడులతో వారిని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఏర్పరుచుకున్న వ్యవస్థపై యాభై బృందాలతో దాడులు చేశాయి. స్పష్టమైన సమాచారం తెలియరాలేదు కాని, వందల కోట్ల అవకతవకలు బయట పడే అవకాశం ఉందన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి చేసే వ్యాపారాలన్నీ పెద్దవే. ఆయనకు చెందిన మెడికల్ కాలేజ్ లో…

Read More

టాలీవుడ్ యాంకర్ , నటిగా అనితా చౌదరి మెప్పించి కొంతకాలం అలరించింది. ఆ తరువాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమైంది. చిత్ర పరిశ్రమకు ఆమె ఎందుకు దూరమైందో ఎవరికీ తెలియదు. తాజాగా అనిత చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను చిన్న వయస్సులో ఉండగానే మా నాన్న చనిపోయారు. దాంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడే పెళ్లి ఆలోచన వద్దని కెరీర్ పై దృష్టి సారించాను. కానీ కృష్ణ చైతన్యతో పరిచయం వలన పెళ్లి చేసుకోవాలని అనిపించింది. తను ఉండేది అమెరికాలో. అతన్ని పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందని కృష్ణ చైతన్యను వద్దనుకున్నా. అయితే, కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్ కు కజిన్ కావడంతో ఆయనే నాకు ఫోన్ చేసి కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకో అంటూ బలవంతం చేశాడు. తను ఎంత చెప్పిన వినిపించుకోకపోవడంతో మూడేళ్ళు అతనితో మాట్లాడలేదు. ఆ…

Read More

మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయముంది. మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు. నియోజకవర్గాలను మూడు కేటగిరిలుగా విభజించి సర్వేలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాల్లో సర్వే సంస్థలు ఇటీవల సర్వేలు నిర్వహించాయి. టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలను ఏ కేటగిరి, కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇంకాస్త ఫోకస్ పెడితే టీఆర్ఎస్ గెలిచే సీట్లను బీ కేటగిరి, బీజేపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరు ఉండే నియోజకవర్గాలను సి కేటగిరిగా విభజించారు. అయితే, ఈ సర్వేలో టీఆర్ఎస్ కు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు కేవలం 35నుంచి 40వరకు మాత్రమే ఉన్నాయి. ద్విముఖ పోరు ఉండే నియోజకవర్గాలు 30- 34 ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ కు…

Read More

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వాసనను ఏడేండ్ల కిందటే ఎమ్మెల్సీ కవిత పసిగట్టారా..? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతారని కవితకు ముందే తెలుసా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణ జాగృతి అనే ఎన్జీవో సంస్థకు అదనంగా భారత్ జాగృతి ఫౌండేషన్ అనే సంస్థను కవిత ఏడేండ్ల కిందటే నెలకొల్పినట్లు తాజాగా తేలడంతో బీఆర్ఎస్ ఆవిర్భావం ముందస్తు వ్యూహమేననే వాదనలకు బలం చేకూరింది. ఈ కంపెనీకి కవిత, ఆమె భర్త అనిల్ ఇద్దరూ డైరక్టర్ లుగా వ్యవహరిస్తున్నారు. సాంస్కృతిక కార్యకలాపాలతో జాగృతి ప్రాచుర్యం పొందగా… భారత్ జాగృతి మాత్రం చారిటి సర్వీసులను అందించే లక్ష్యంతో ఆవిర్భవించింది. Also Read : సొంత పార్టీ నేతలకు తలనొప్పులు తెచ్చిన కేసీఆర్..! ఇటీవల కవిత మాట్లాడుతూ… సాహిత్యంతో సమాజాన్ని మేల్కొలిపెందుకు కృషి చేసిన రచయితలు, కవులకు వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ వేదికగా భారత్ జాగృతి ఫౌండేషన్ ద్వారా పురస్కారాలను అందిస్తామని ప్రకటించారు.…

Read More