Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
హీరోయిన్ రష్మిక మందనపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించాలని సంచలన నిర్ణయం తీసుకోనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కన్నడ లాంగ్వేజ్, కన్నడ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చిత్ర పరిశ్రమ షాకింగ్ నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా రష్మిక మందన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు సౌత్ ఇండస్ట్రీలో విరివిగా అవకాశాలు తలుపు తట్టడంతో అనతికాలంలో అగ్రశ్రేణి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇకపోతే ఇటీవల రష్మిక చేసిన కామెంట్స్ ఆ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టాలా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక మందన.. తనకు మాతృ భాష కన్నడ మాట్లాడటం కష్టంగా ఉంటుందని…ఇతర భాషలు మాట్లాడటం మాత్రం సులువుగా ఉంటుందని చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. సినిమా అవకాశాల కోసం మాతృ భాషను…
సింగర్ సునీత మళ్ళీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రామ్ – సునీతలు తమ దాంపత్య జీవితానికి గుర్తుగా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి సునీతకు చిన్న వయస్సులోనే పెళ్లైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాని భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా చాలా కాలంపాటు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించారు. ఈ సమయంలో బిజినెస్ మ్యాన్ మ్యాంగో రామ్ – సునీతలు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. తమ పెళ్ళికి పిల్లలు కూడా అంగీకరించారని సునీత చెప్పిన సంగతి తెలిసిందే. పిల్లల ఒత్తిడి కూడా పెళ్లికి ఓ కారణమని ఆమె చెప్పుకొచ్చారు. నాలుగు పదుల వయస్సులోనున్న వీరు తల్లిదండ్రులు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించారన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం నిజంగానే ఆమె తల్లి…
మహిళలనుద్దేశించి ప్రముఖ యోగ గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు చీరలు, సల్వార్ సూట్ లలో అందంగా ఉంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మహిళలు ఏ దుస్తులను ధరించకపోయినా తన కంటికి అందంగానే కనిపిస్తారని వివాదాన్ని రాజేశారు. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళలను శృంగారవస్తువులుగా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు. యోగాను మార్కెటింగ్ చేసే రాందేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు నగ్నంగా బాగుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు నారాయణ. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపైను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో రాందేవ్ బాబా పక్కనున్న మహిళలు ఆయన్ను చెప్పుతో కొట్టాల్సిందన్నారు.
రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ , బీజేపీ నేతలే ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. అదేంటి.. టీఆర్ఎస్ , బీజేపీ నేతలెందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటారని ఆశ్చర్యపోకండి..ఈ పూర్తి స్టొరీ చదివితే అసలు విషయం మీకే అర్థం అవుతోంది. రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్వపక్షంలోనే విపక్షంలా పరిణమించారు సీనియర్లు. వారందరిని కలిసి పార్టీ కోసం పని చేయాలని రేవంత్ కోరినా అబ్బే మేము మారమంటే మారమన్నట్లుగా వ్యవహరించారు. రేవంత్ కు సహకరించడం దేవుడెరుగు, పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేస్తూ ప్రత్యర్ధులకు సహకరిస్తున్నారు.ముసుగుదొంగలైన సీనియర్లు కాంగ్రెస్ ను వీడితే క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ వేదికగా సంబరాలు చేసుకుంటోంది. ప్రస్తుతం పార్టీని వీడిన నేతలంతా రేవంత్ వ్యతిరేకులే. పార్టీ కోసం విరామం లేకుండా పని చేస్తున్న రేవంత్ కు బంధనాలు తగిలిస్తోన్న వారే. కాంగ్రెస్…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వ తీరు సరిగా లేదంటూ సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఆయన సారధ్యంలో పని చేయలేమంటూ ఒక్కొక్కరు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. రేవంత్ ఒంటెత్తు పోకడలతోనే పార్టీని వీడుతున్నామని చెప్తున్నారు. అందరితో సఖ్యతగా మెలగాలని చెప్పి రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. సీనియర్లందరిని ఇంటికి వెళ్లి మరీ కలిసి పార్టీ కోసం ఐక్యంగా పని చేద్దామని కోరారు. అందుకు సీనియర్లు కూడా అంగీకరించారు. ఇక, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఒకప్పటి మాటేనని అనుకున్నారు. పరిస్థితి కూడా చక్కబడటంతో కాంగ్రెస్ లో ఊపు కనిపించింది. అంతలోనే సీనియర్లు ఒక్కొక్కరు ఆధిపత్యం కోసం, అసహనంతో రేవంత్ పై విమర్శల వాగ్భానలను ఎక్కుపెట్టారు. వరుసగా నిరసన కార్యక్రమాలకు రేవంత్ పిలుపునిస్తూ పార్టీని జనాల్లోకి ప్రవాహంలా తీసుకుపోతున్న సమయంలో అసంతృప్తి సెగలను రాజేశారు. సీనియర్లకు నచ్చజెప్పినా ఫలితం…
కేంద్రం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పిలుపు వచ్చింది. ఆయన వెళతారో లేదో ఇంకా స్పష్టత లేదు. కొంతకాలంగా ప్రధానిని నేరుగా కలిసేందుకు కేసీఆర్ అస్సలు ఇష్టపడటం లేదు. మోడీ తెలంగాణ పర్యటనకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆహ్వానం పలకాల్సి ఉన్నా కేసీఆర్ అవేవి పట్టించుకోకుండా మంత్రులను పంపిస్తున్నారు. అయితే, జీ20 దేశాల కూటమికి భారత్ సారధ్యం వహిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చే నెల 5న కేంద్రం సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రావాలంటూ కేసీఆర్ కు కబురు పంపారు. కేంద్రంతో కోరి కయ్యం పెట్టుకున్న కేసీఆర్ ఈ సమావేశానికి దూరంగానే ఉండొచ్చు. అయితే, ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. కేసీఆర్ వచ్చే నెలలో ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ గా అనుమతులు డిసెంబర్ మొదటి వారంలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్…
తెలంగాణ ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలకు నిధుల కటకట కొనసాగుతోంది. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని కేసీఆర్ చెప్పదల్చుకున్నట్టున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విదిస్తోన్న అంక్షల వలన 2022-23ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణకు రావాల్సిన ఆదాయంలో 40వేల కోట్లు తగ్గుదల చోటు చేసుకుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. ఈ అంశాన్ని జనాల్లో చర్చకు పెట్టాలని డిసెంబర్ లో వారం వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే , 40వేల కోట్లను ఆదాయంగా కేసీఆర్ పైకి చెబుతున్నారు కాని అవన్నీ రుణాలు. అప్పులను తీసుకోకుండా తెలంగాణపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రాష్ట్రాన్ని నిధుల సమస్య వేధిస్తోంది కాబట్టి, ఆ 40వేల కోట్లను ఆదాయంగా చెబుతున్నారు కేసీఆర్.…
ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల వ్యవధిలోనే సోదరుడు, తల్లి, తండ్రి ఇలా ఒక్కొక్కరు కాలం చేయడంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తన తండ్రి మరణంపై మహేష్ బాబు తాజాగా భావోద్వేగ లేఖ వెలువరించారు. నాన్నా.. మీ జీవితం చరితార్ధమైంది. మీ వీడ్కోలు మరింత వైభవంగా జరిగింది. అదంతా మీ గొప్ప దనం. మీరు మీ జీవితంలో ధైర్యం కోల్పోకుండా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి , నా గుండె ధైర్యం అన్ని మీతోనే పోయానని అనుకున్నాను. కానీ, ఇదివరకు లేనంతగా గుండెధైర్యం నాలో కల్గింది నాన్నా.ఇప్పుడు నాకు భయం లేదు నాన్న.మీ ఆశీస్సులు నాపై ఉన్నంత కాలం మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా. మీరు ఎక్కడున్నా గర్వపడేలా చేస్తా.. లవ్యూ నాన్న అంటూ ట్విట్టర్ లో లెటర్ ను పోస్ట్ చేశాడు మహేష్ బాబు. https://twitter.com/urstrulyMahesh/status/1595709014230564864
పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీపై సర్కార్ జాప్యం, ధరణి పోర్టల్ లో అవకతవకలను నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు సమస్యలు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు గాలి అనిల్ కుమార్ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోడు భూములకు పట్టాలిస్తామని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన గాలి అనిల్, ఆ హమీ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా కేసీఆర్ ఇంకా నెరవేర్చలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ తో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా ఆ దరిద్రాన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని…
విలక్షణ నటుడు కమల్ హసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికావడంతో ఆయన్ను ఉదయం చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసిన అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో కమల్ హసన్ డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. కళా తపస్వి విశ్వనాథ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాయంత్రానికి చెన్నై వెళ్ళిపోయారు. అప్పటివరకు బాగానే ఉన్నా కమల్ హసన్ కు జ్వరం రావడంతోపాటు గురువారం ఉదయం శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. విక్రం సినిమా ద్వారా హిట్ కొట్టేసిన కమల్ హసన్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.