Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా రైతులను ఆదుకుంటామని తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 709 రైతు కుటుంబాలకు 1010 చెక్కులను మే లో పంపిణీ చేయగా ఆ చెక్కులు చెల్లడం లేదంటూ తాజాగా సమాచారం బయటకు వచ్చింది. దీంతో చెల్లని చెక్కులను ఇస్తావా దొరా అంటూ కేసీఆర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం విచారణ జరిపింది. Also Read : కోదండరామా ఏంటి రాజకీయం..! 1010చెక్కులను పంపిణీ చేశామని, అందులో 814చెక్కులకు నగదు చెల్లింపులు కూడా కంప్లీట్ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా చెక్కుల చెల్లింపులు ఆగిపోవడానికి ప్రభుత్వం కారణం కాదని చెప్పింది. నిబంధనల ప్రకారం చెక్కులను ఇచ్చిన మూడు నెలల లోపు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాలపరిమితి ముగిసాక డిపాజిట్ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని..అలా చేయడం…
వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. వివిధ సామజిక వర్గాలకు చెందిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆలేరు పట్టణం 6వ వార్డుకు చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరందరికీ ఆయన కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఏపీకి మాత్రమే పరిమితమైన కుల రాజకీయం తెలంగాణలోనూ పాగా వేయడానికి కేసీఆర్ ప్రధాన కారణమని బీర్ల ఐలయ్య విమర్శించారు. కుల రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రాజేస్తున్నారన్నారు. దళిత బంధు తరహాలో ఆర్థికంగా,రాజకీయంగా వెనకబడిన వడ్డెర సామజిక వర్గానికి చేయూతనందించడం కోసం వడ్డెరబంధును తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డెర కులస్తులకు అండగా తాను ఉంటానని వారికీ ఐలయ్య అభయం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వడ్డెరలకు ప్రత్యేకంగా డబుల్ బెడ్…
తెలంగాణ జన సమితి అద్యక్షుడు కోదండరాం మౌనంపై కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరగగా…అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు జరిపారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నా నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. టీజేఎస్ అద్యక్షుడిగా కంటె కూడా టీజేఏసీ అద్యక్షుడిగా కోదండరాం సుపరిచుతులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జన సమితి పార్టీని స్థాపించినా అనుకున్నంతగా పార్టీ సక్సెస్ అవ్వలేదు. రాజకీయ చదరంగంలో తనదైన ముద్ర వేయలేకపోయారు. జన సమితిలోనున్న కొద్దోగొప్పో ప్రజాబలం, ఆర్థిక బలం కల్గిన నేతలు కూడా తక్కువ కాలంలోనే టీజేఎస్ ను వీడారు. ప్రస్తుతం ఆ పార్టీని రాజకీయ నిరుద్యోగులు షెల్టర్ గా వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చ జరుగుతోన్న వేళ టీజేఎస్ చర్చే…
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు రవాణా ఇబ్బందులను తప్పించేందుకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. శంషాబాద్ వరకు మెట్రో సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను ప్రారంభించేందుకుగాను డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనుంది. ఈ నేపథ్యంలోనే మెట్రో సర్వీసులను మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడగించేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గాలి అనిల్ డిమాండ్ చేశారు. ఆయన లేవనెత్తిన డిమాండ్ కు మెదక్ జిల్లా వాసులు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు. సంగారెడ్డి పట్టణం గ్రేటర్ హైదరాబాద్ కు సమీప దూరంలో ఉండటంతో నిత్యం లక్షలాది మంది మహానగరానికి రాకపోకలు కొనసాగిస్తుంటారు. BHEL, BDL, MRF, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, పలు బీరు కంపెనీలతోపాటు చిన్న, మధ్యతర పరిశ్రమలు, విద్యా సంస్థలు సంగారెడ్డి చుట్టు పక్కల ఏరియాలో ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు హైదరాబాద్…
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు బీజేపీలో చేరినా తాము మాత్రం కాంగ్రెస్ తోనే కలిసి సాగుతామని స్పష్టం చేశారు. పార్టీ, కుటుంబం వేర్వేరు అని వ్యాఖ్యానించారు. రవీంద్ర జడేజా భార్య రివాజా జడేజా గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జడేజా తండ్రి కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా జడేజా తండ్రి అనిరుద్ జడేజా క్లారిటీ ఇచ్చారు. Also Read : రవీంద్ర జడేజా భార్యకు ఎమ్మెల్యే టికెట్ తన కోడలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినంత మాత్రాన తమ కుటుంబం బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కాదని.. తాను కాంగ్రెస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. మా ఇంటి కోడలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెతోపాటు తన సోదరుడిపై…
ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంతో బీజేపీని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారా..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించేందుకు సిట్ కు పక్కా ఆధారాలు లభించాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన నిందితుల వాట్సప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. ముగ్గురిని మీకు పరిచయం చేయాలని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు రామచంద్రభారతి బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు మెసేజ్ చేయగా..ఆర్ విశిష్ట గురించి డీహెచ్ చర్చించాలని సంతోష్ రిప్లై ఇచ్చారు. వీటిని సిట్ సేకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి ఊపిరిరాడకుండా చేసేందుకుగాను బీఎల్ సంతోష్ పాత్రకు సంబంధించి కీలకమైన ఆధారాలను సిట్ కనుగొన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 26న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు…
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నా “జై భీమ్”మూవీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. తన నటనతో లాయర్ పాత్రలో పూర్తిగా జీవించేశారు. విశేష ఆదరణ చూరగొన్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. మరోసారి లాయర్ పాత్రలో సూర్య నటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవల సినిమా దర్శకుడు, నిర్మాత వెల్లడించారు. ఏడాది కిందట ఓటీటీల్లోకి వచ్చిన “జై భీమ్” కు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో జై భీమ్ మూవీ డైరక్టర్ జ్ఞానవేల్, నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొన్నారు. ఆ వేడుకలో జై భీమ్ సినిమా సీక్వెల్ ప్రస్తావన రాగా.. అందుకు సమాధానమిస్తూ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. జై భీమ్ కు సీక్వెల్ ఉండనుందనే ప్రకటనతో సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ సినిమాలో సూర్య…
స్కూల్ పిల్లల బ్యాగులో ఏముంటాయి..? పెన్నులు, పెన్సిల్, పుస్తకాలు ఉంటాయి. కాని అక్కడి స్కూల్ పిల్లల బ్యాగులో మాత్రం వీటికి బదులు కండోమ్, గర్భనిరోధక మాత్రలు కనిపించడం సంచలనంగా మారింది. 8,9,10 తరగతి చదివే విద్యార్థులు తరగతి గదుల్లోకి సెల్ ఫోన్స్ తీసుకొస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్ లోనూ తనిఖీలు చేపట్టాలని స్కూల్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఇందులో భాగంగా బెంగళూర్ లోని ఓ స్కూల్ లో 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగ్ లను చెక్ చేయగా అందులోనున్న వస్తువులను చూసి టీచర్లు షాక్ అయ్యారు. విద్యార్థుల బ్యాగ్ లో పుస్తకాలతోపాటు కండోమ్ , గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు చూసిన టీచర్లు బిత్తరపోయారు. అంతేకాదు కొంతమంది స్టూడెంట్స్ తీసుకొచ్చే వాటర్ బాటిల్స్ లో మద్యం కలిపి ఉన్నట్లు తేలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు ఇంటికొచ్చాక ఎం…
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఆషూరెడ్డి ఫేం దక్కించుకుంది. పైగా సమంత ఫేస్ ను పోలి ఉండటం ఆషూకు కలిసొచ్చింది. దాంతో సినిమా అవకాశాలతోపాటు, బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేసే అవకాశం ఆషూకు తొందరగానే తలుపు తట్టింది. ఛల్ మోహన రంగ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన జూనియర్ సమంత అవకాశాలు వస్తుండగానే పైచదువుల కోసమని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆషూ తిరిగొచ్చాక బిగ్ బాస్ తో మళ్ళీ ఆడియన్స్ ను పలకరించింది. బిగ్ బాస్ సీజన్ 3లో అందాలను ఒలకబోసి కుర్రకారు దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాత పలు కామెడి షోలు, ఈవెంట్స్ లో సందడి చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. Also Read : కేజీఎఫ్ ఫేమ్ తో హీరోయిన్ హరిప్రియ – త్వరలోనే వెడ్డింగ్..? తిరిగి బిగ్ బాస్ సీజన్ 6లో మరోసారి…
తెలంగాణలో వరుసగా రెండు రోజుల నుంచి వైఎస్ షర్మిల కేంద్రంగా రాజకీయం రంజుగా నడుస్తోంది. ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడిన నాటి నుంచి రాజకీయం ఆమె చుట్టే తిరుగుతోంది. వైఎస్ షర్మిల జగన్ వదిలిన బాణం కాదు బీజేపీ వదిలిన బాణమంటూ టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. దీనిని ఖండించకుండా బీజేపీ కూడా షర్మిలకు మద్దతు పలుకుతోంది. షర్మిల ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ – బీజేపీ ల మధ్య బుధవారమంతా మాటల యుద్ధం కొనసాగింది. ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్ షర్మిల మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అయినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడు ఆమె చుట్టూ ఉండే లీడర్లే నిత్యం కనిపిస్తున్నారు. మొదట్లో కొంత మీడియా కవరేజ్ ఇచ్చినా ఆమె పాదయాత్రకు ఆదరణ ఉండటం లేదని గ్రహించి మీడియా కూడా గుడ్ బై చెప్పేసింది. దాంతో షర్మిల రూట్ మార్చింది. టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా…