Author: Prashanth Pagilla

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి నిలవాలని భావిస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా కాంగ్రెస్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ బాస్ అనుకుంటున్నారు. ఏయే వర్గాలు బీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్నాయో గుర్తించిన కేసీఆర్ ఆ వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు హామీలను అమలు చేస్తున్నారు. కొత్త హామీలను తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు తప్ప రైతాంగానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల జాడ లేక కేసీఆర్ పై కోపంతో ఉన్నారు. ఎన్నికల ఇయర్ కావడంతో 2023నుంచి కేసీఆర్ గేర్ మార్చారు. రైతు రుణమాఫీపై నాలుగేళ్ళుగా కాలయాపన చేస్తూ వచ్చిన కేసీఆర్ తాజాగా రైతురుణమాఫీ చేశారు. ఇంకొంతమందికి చేయాల్సి ఉంది. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ ఆయా శాఖలను ఆదేశిస్తున్నారు. అయితే, ఈసారి ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కసితో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల…

Read More

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ దరఖాస్తులను పరిశీలించి వడపోత స్టార్ట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ చేపట్టిన సర్వే రిపోర్ట్.. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈవాల్టి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవుతుందని రేవంత్ స్పష్టం చేయగా… సోషల్ మీడియాలో మాత్రం ఎస్కే టీమ్ చేపట్టిన అభ్యర్థుల ఎంపిక ముగిసింది. కాంగ్రెస్ 65స్థానాల్లో గెలవబోతుంది.. ఆ స్థానాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కింది జాబితా తెగ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ గెలిచే స్థానాలు, ఓడిపోయే స్థానాలు ఇవేనంటూ ఈ జాబితా వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ – 3 సీట్లు సిర్పూర్ – రావి శ్రీనివాసరావు – ఓటమి చెన్నూరు – బోడ జనార్దన్ – ఓటమి బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్ – గెలుపు మంచిర్యాల – కొక్కిరాల…

Read More

బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ మార్చే అవకాశం ఉందా..? సిట్టింగ్ లపై భారీగా వ్యతిరేకత ఉన్నప్పటికీ మొండిపట్టుదలకు పోయిన కేసీఆర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారా.? తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చాలని.. లేదంటే బీఆర్ఎస్ కు పరాభవం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కేసీఆర్ వచ్చే ఎన్నికలకుగాను 115మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండటంతో తాను ప్రకటించే హామీలతో వ్యతిరేకత అంత తుడిచిపెట్టుకుపోతుందని లెక్కలు వేసుకున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత భారీగా పెరుగుతుందని నిఘా వర్గాలు నివేదించడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూడా వ్యతిరేకతను తగ్గించుకొని ఎమ్మెల్యేలు ఎవరు..? అని కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో వారిపై మరోసారి సర్వే చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ సర్వే చేయించి ఎవరెవరికీ…

Read More

బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫ్యామిలీకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ను కాదని నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో రేఖా నాయక్ ఫ్యామిలీకి ఇచ్చిన ఝలక్ తో అసంతృప్తులకు బీఆర్ఎస్ బాస్ ఓ వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఉదయం ఓ ఛానెల్ లో మాట్లాడుతూ రేఖా నాయక్ తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత కొన్ని గంటలకే రేఖా నాయక్ అల్లుడు శరత్ చంద్ర పవార్ ను తెలంగాణ స్టేట్ పోలిస్ అకాడమికి ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తోన్న ఆయన్ని బదిలీ చేసి రేఖా నాయక్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది. శరత్ చంద్ర స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను అపాయింట్ చేసింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అత్తమీద కోపం అల్లుడి మీద…

Read More

తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్ లోకి వెళ్ళకుండా నిలువరించే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడటంతో పార్టీ క్యాడర్ కొంత దూరమైంది. ఇప్పుడు ఆ జిల్లాలో బలమైన నేతగానున్న తుమ్మల కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే జిల్లాలో పార్టీ బలహీన పడుతుందని.. అది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ ఆందోళన. అందుకే తుమ్మలను బీఆర్ఎస్ లోనే కొనసాగేలా చూడాలని హరీష్ రావుకు బాధ్యతలు కట్టబెట్టారు. రాజ్యసభ సీటు ఇస్తామని.. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను పూర్తిగా నీ చేతుల్లోనే ఉంచుతామని తుమ్మలకు మనస్సు దోచేలా హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా కేకే కు మరోసారి పొడగింపు ఉండదని.. ఆయన స్థానంలో నీకు పదవి ఇస్తామని ఆఫర్…

Read More

బలమైన ఇన్వెస్టర్ల చేతిలో “రాజ్ న్యూస్ “… నిజమే రాజ్ న్యూస్ దశ తిరిగింది. మీడియా రంగంపై పట్టున్న.. జర్నలిజంపై గౌరవమున్న మంచి ఇన్వెస్టర్ల చేతికి రాజ్ న్యూస్ చేరింది. ప్రముఖ మీడియా సంస్థలలోని పలువురు HOD లు మంచి ప్యాకేజీలతో రాజ్ న్యూస్ లో చేరినట్టు సమాచారం. కొత్త మేనేజ్మెంట్ రాకతో..ఇకపై టైంకు జీతాలు వస్తాయని.. ఇప్పటికే పని చేస్తున్నవారు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇక ఎండీ పవన్ వేమూరి సైతం ప్రస్తుత టాప్ ఛానల్స్ లో ఒక ఛానల్ సక్సెస్ లో తెర వెనుక సూత్రధారి.. తాజాగా తానే రాజ్ న్యూస్ టేకప్ చేయటం… పక్కా ప్రొఫెషనల్స్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో రంగంలోకి దిగటం.. మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. కొత్త మేనేజ్మెంట్.. కొత్త ఎక్విప్ మెంట్..భారీ రిక్రూట్ మెంట్… సరి కొత్త ఆలోచనలతో.. ఏ పార్టీ జెండా మోయకుండా.. ప్రజా ఎజెండాతో All new Raj news…దశ…

Read More

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ లో విడుదల కానుంది. ఈలోపే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి ఎన్నికల రేస్ ను స్టార్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం తామేమి తక్కువ తినలేదనే రేంజ్ లో దూసుకుపోతోంది. ఎందుకంటే.. ఆ పార్టీలోకి కీలక నేతలు చేరుతుతున్నారనేది ఇందుకు ప్రధాన కారణం. మాజీ ఎంపీ గడ్డం వివేక్ కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వివేక్ సోదరుడు గడ్డం వినోద్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన బెల్లంపల్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ ను వివేక్ ఆశిస్తున్నారని టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు వివేక్ సంసిద్దంగా ఉన్నారని టాక్. అదే సమయంలో ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ – బీఆర్ఎస్ ఒకటి కాదని జనాలకు ఎంత చెబుతున్నా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు. ఈ అనుమానాలు జనాల్లో…

Read More

రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలనే టీపీసీసీ ఆదేశాలతో నేతలంతా దరఖాస్తులు చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ దరఖాస్తులు అందజేశారు. మొత్తం 1000వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో సెగ్మెంట్ నుంచి ఎనిమిది అప్లికేషన్లు వచ్చినట్లు. ఇల్లందు నుంచి అత్యధికంగా 36మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ నుంచి అంజన్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ దంపతులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి అప్లై చేశారు. నాగార్జున సాగర్ , మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారులు దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహతోపాటు…

Read More

రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సిన వాడు ఎదుగుతాడు అనేది నానుడి. దీనిని పక్కాగా ఆచరణలో పెడుతున్నారు సీఎం కేసీఆర్. ఇన్నాళ్ళు గవర్నర్ తో డీ అంటే డీ అనేలా తలపడిన కేసీఆర్ ఇప్పుడు రూట్ మార్చారు. గవర్నర్ తో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు. ఎప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేలా గవర్నర్ , ముఖ్యమంత్రిలు ఒక్కసారిగా కలుపుగోలుగా మాట్లాడుకున్నారు. ఇందుకు రాజ్ భవన్ వేదికగా మారింది. గురువారం పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో ముచ్చటించారు. తమ మధ్య గతంలో ఎలాంటి వివాదాలు లేవన్నట్లు వారు మాట్లాడుకున్నారు. వారెం మాట్లాడుకున్నారో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారలా మాట్లాడుకున్న ఒక్క రోజులోనే గవర్నర్ ను సచివాలయానికి కేసీఆర్ ఆహ్వానించారు. గతంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకుండా అవమానించారని రచ్చ జరిగింది. ఇప్పుడు మాత్రం సచివాయాలనికి గవర్నర్ ను స్వయంగా…

Read More

కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం ఏఐసీసీ ఓబీసీ కో ఆర్డినేటర్ , తమిళనాడు ఇంచార్జ్ డా. కేతూరి వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సెంటిమెంట్ దృష్ట్యా తన కూతురితో కలిసి గాంధీ భవన్ కు వచ్చిన కేతూరి వెంకటేష్ కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి తన దరఖాస్తును సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈసారి టికెట్ తనకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొల్లాపూర్ లో పెరిగిన బహుజనవాదం తన గెలుపుకు దోహదం చేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్ టికెట్ కోసం జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్ రావులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒక్క కేతూరి వెంకటేష్ మాత్రమే బీసీ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ కోటాలో తనకు టికెట్ వస్తుందని నమ్మకంతోఉన్నారు. 1962తరువాత కొల్లాపూర్ నుంచి ఇప్పటివరకు బీసీ అభ్యర్థికి కాంగ్రెస్…

Read More