Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.కేసీఆర్ ముందస్తుకు వెళ్ళకపోతే డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు జరగుతాయి. ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాన్సెస్ ఎక్కువ. ఇంకాస్త గట్టిగా ఫైట్ చేస్తే తెలంగాణలోనూ కాంగ్రెస్ కు స్కోప్ ఉంది. అందుకే హైకమాండ్ ఈ రెండు రాష్ట్రాలకు కలిపి ఓ రాజకీయ వ్యూహకర్తను నియమించింది. అతడే సునీల్ కనుగోలు. ఎస్కే స్ట్రాటజీలతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దూకుడు కనబరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ లు ఓటమి పాలైతే మరొసారి ఆధికారాన్ని చేరుకోవాలంటే ఆ రెండు పార్టీలకు కష్టమే. ఈ విషయాన్ని అంచనా వేసిన బీజేపీ అధినాయకత్వం సౌత్ లో బీఆర్ఎస్ భుజాలపై గన్ ఉంచి కాంగ్రెస్ ను చంపాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి బీఆర్ఎస్ తరుఫునసంపూర్ణ సహకారం అందుతున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న ప్రాంతీయ…
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే లేకుండా చేస్తారని అనుకోకపోవడం మా తప్పేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్ వార్ రూమ్ ను సీజ్ చేయడంపై జగ్గారెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటిసులు జారీ చేయకుండా మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ కార్యాలయాన్ని పోలీసులు ఎలా సీజ్ చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కంప్లైంట్ కాపీ కూడా చూపించకుండా హార్డ్ డిస్క్ లు, సిబ్బంది ఫోన్లను లాక్కోవడం ఏంటన్నారు. లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా కవిత ఇంట్లో సీబీఐ కూర్చోలేదా..? సీబీఐని ఏం పికలేక మాపైన దాడి చేస్తారా అని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కి మహారాణి కవిత అని ఆరోపించిన జగ్గారెడ్డ కవిత మంచి యాక్టర్ అయ్యిందన్నారు. ప్రభుత్వ అవినీతిని వెలుగులోకి తీసుకొస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొంత మంది పోలీసులను పోలీసులు అనాలా.. ఇంకా…
కాంగ్రెస్ పార్టీ బ్యాక్ ఆఫీసుపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు యత్నించిన ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. బయటకు వెళ్లేందుకు ఉదయం రోహిన్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లోకి పోలీసులు వెళ్లి సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ అనామక వ్యక్తి ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు ఇవ్వకుండా మాదాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆఫీసులోనీ హార్డ్ డిస్క్ లు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా అని నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కులను తెలంగాణ ప్రభుత్వం హరిస్తోందని రోహిన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో…
వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ అవతార్ 2’. ఈ నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా…ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం స్టార్ట్ డైరక్టర్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. అతనెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎలాంటి రికార్డ్ లు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. 2009లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. దీంతో ఆయన మరో ప్రాజెక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటుంటే …అవతార్ 2,3,4,5 ఉంటుందని చెప్పేశాడు.దీంతో అవతార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త వైరల్ అవుతోంది.అవతార్ 2 తెలుగు వర్షన్…
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఢిల్లీలో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కీలక నేతలంతా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఆదేశించారు. మంత్రులంతా హస్తిన వెళ్ళిపోయారు. కాని కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ ప్రారంభోత్సవ వేడుకకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ లో ముఖ్యమైన సమావేశాలలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉందని అందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని అంటున్నారు కాని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక కన్న ఆయనకు ముఖ్యమైన మీటింగ్ ఏముంటుందన్నది సహజంగా అందరిలో కలిగే ప్రశ్న. కవిత మాత్రం రెండు రోజుల ముందే ఢిల్లీలో వాలిపోయింది. బీఆర్ఎస్ పై ఆమె మాత్రమే తరుచుగా, ఎక్కువగా మాట్లాడుతున్నారు. బీఆరెస్ పై కేటీఆర్ పెద్దగా మాట్లాడటంలేదు. దాంతో జాతీయ రాజకీయాలపై కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏదో జరుగుతుందన్న చర్చ తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ అసలు లక్ష్యమే రాష్ట్ర పాలన పగ్గాలు కొడుకు కి ఇచ్చి, జాతీయ స్థాయిలో కవితని యాక్టిివ్ చేయడమనీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్…
తెలంగాణ సీఎం కేసీఆర్ లో కలవరం మొదలైంది. హ్యాట్రిక్ విజయంపై బెంగ పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియాను టార్గెట్ చేశారు. కేసీఆర్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వెనక టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. అతని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి మాదాపూర్ లో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడులు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చి హార్డ్ డిస్క్ లు, ముగ్గురి సిబ్బంది ఫోన్లను తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి పోలీసులతో వాదనకు దిగినా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఉండటంతో పోలీసులు తమ పనిని చకచకా కానించేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కేసీఆర్ ను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆఫీసును సీజ్ చేశారు. మరి, బీజేపీ అనుకూల సోషల్ మీడియాలో నిత్యం అలాంటి కంటెంట్ ఎంతో ఉంటుంది.గతంలో వివరణ…
బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బుధవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. అది అద్దేది. సొంత బిల్డింగ్ మరోచోట నిర్మిస్తున్నారు. అది అందుబాటులోకి రావాలంటే మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. ముహూర్తం ఇప్పుడే బాగుందని అద్దె భవనం తీసుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి రావాలని రైతు సంఘాల నేతలకు, తనతో టచ్ లోనున్న వివిధ పార్టీల నాయకులకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. అయితే, కేసీఆర్ ఆహ్వానం అందుకున్న వారంతా హాజరు అవుతారా అన్నది క్లారిటీ లేదు. తెలంగాణ నుంచి మాత్రం మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆరెఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి భారీగా వెళ్లారు. ఇదంతా బాగానే ఉన్నా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పనున్నాం. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు ఇస్తున్న కేసీఆర్, జాతీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు రాకుంటే అది తెలంగాణ పార్టీ ఆఫీసుగానే ఉండిపోతోంది.…
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మారేలా లేరు. ప్రభుత్వ వైఫల్యాలను సమిష్టిగా ఎండగట్టాల్సింది పోయి, తమలో తాము పోరాడటానికి కత్తులు దూసుకుంటున్నారు. అధిష్టానం ప్రకటించిన టీ పీసీసీ కమిటీల విషయంలో పార్టీ నేతలు కొందరు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తమకన్నా జూనియర్లకు పైకమిటీలో చోటిచ్చి , మాకు మాత్రం అన్యాయం చేశారని అసంతృప్తి రాగం అందుకున్నారు. తమకు పలానా కమిటీలో చోటు కల్పించలేదని మరీ, సెకండ్ గ్రేడ్ లీడర్ తరహా కమిటీలో చోటు కల్పిస్తారా అంటూ రాజీనామా అస్త్రాలను స్టార్ట్ చేసేశారు. మొదట కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ తరువాత బెల్లయ్య నాయక్ నాకు ఈ పదవి వద్దంటూ రిజైన్ చేశారు.అయితే, టి.కాంగ్రెస్ అసంతృప్తులతో వరుసగా భట్టి విక్రమార్క భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ అసంతృప్తులు వెనక భట్టి విక్రమార్క ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఎందుకంటే, గతంలో రేవంత్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఆయన పాదయాత్రకు పర్మిషన్ ఇస్తే నేను పాదయాత్ర చేస్తా.…
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేశారు. ఈ విషయం పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. హనుమాన్ జీ ఆశీస్సులతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్న. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. ప్రేమతో మీ సురేఖ – చిరంజీవి కొణిదెల, శోభన, అనిల్ కామినేని అంటూ సంతోషం చాటుకున్నారు. ఉపాసన , రామ్ చరణ్ లకు 2012లోనే వివాహం అయింది. ఈ ఏడాదితో పదేళ్లు అయింది. ఇప్పటికీ పిల్లలు లేకపోవడంతో అప్పుడప్పుడూ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. కాని ఈసారి మాత్రం అధికారికంగా చిరంజీవి ప్రకటించి మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గం, యాంటీ రేవంత్ టీమ్ ఉండేది. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్న యాంటీ టీమ్ మద్దతు కొరాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. లేదంటే పార్టీ బలహీనపడుతుంది. అందులో భాగంగా సీనియర్లతో చర్చించకుండానే కొన్నిసార్లు రేవంత్ నిర్ణయాలు తీసుకున్నాడు.ఇది నచ్చని సీనియర్లు పార్టీ పరువు బజారుకీడ్చెలా విమర్శలు చేశారు. అధిష్టానం పలుమార్లు పిలిచి నచ్చజెప్పినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై అధిష్టానం కూడా విసిగిపోయినట్టు ఉంది. పని చేసే నేతలకే కత్తి అందివాలన్న యుద్దనీతికి కట్టుబడి రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ జంబో టీమ్ లో రేవంత్ రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సీనియర్ల మాటలను నమ్మితే పార్టీ నాశనం అవుతుందని ఎట్టకేలకు గ్రహించి పీసీసీ కార్యవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుల నియామకం వరకు…