Author: Prashanth Pagilla

తెలంగాణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఒకేసారి ఈడీ నోటిసులు ఇష్యూ చేయడం సంచలనంగా మారింది. రోహిత్ రెడ్డితోపాటు రకుల్ ను కూడా ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ నోటిసులో పేర్కొన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతంలోనే ఈడీ విచారణ జరిపింది. కాని రాష్ట్ర పోలిసుల నుంచి సహకారం అందలేదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని చెప్పడం.. కోర్టులో సైతం అదే చెబుతూ చార్జీషీట్ దాఖలు చేయడంతో క్లీన్ చిట్ వచ్చింది. ఆ తరువాత డిజిటల్ ఎవిడెన్స్ పై ఈడీ హైకోర్టుకు వెళ్ళడం..అయినా వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతామన్న ఈడీ హెచ్చరికలతో ఆధారాలు ఇచ్చారు. అయితే, ఆల్ ఆఫ్ సడెన్ గా ఈడీ కూడా డ్రగ్స్ కేసులో సైలెంట్ ఐపోయింది. తాజాగాఈ కేసును వెలికి…

Read More

అవతార్ 1 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ ను కొనసాగించాడు దర్శకుడు.  నావిగా మరీనా జెక్ ( శామ్ వాషింగ్టన్ ), నావి రాణి నేయితిరి ( జో సల్దానా) పెళ్లి చేసుకొని, ముగ్గురు పిల్లలతో హ్యాపీగా పండోరా గ్రహంపై లైఫ్ ను కొనసాగిస్తారు. ‘ అవతార్ ‘ మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కల్నల్ మెయిల్స్ ( స్టీఫెన్ లాంగ్ ) చనిపోయినట్టు చూపించారు కదా, ఇప్పుడు అతను నావిగా తిరిగి వస్తాడు. జెక్ మీద పగతో అతని చంపాలని నావిలుగా మారిన కొంతమంది సైన్యంతో పండోరా గ్రహంపై అడుగు పెడుతాడు. దాంతో కుటుంబాన్ని రక్షించుకునేందుకు జెక్ అడవులను వదిలి సముద్ర తీరానికి వెళ్తాడు. అక్కడ రీఫ్ అనే మరో తెగ ఉంటుంది. ఆ తెగ లీడర్ రోనాల్( కేట్ విన్స్ లెట్ ), ఆమె భర్త టోనోవరి ( క్లిప్ కర్టిస్) ఎలా సాయమందించారు..? జెక్…

Read More

బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాదిన పార్టీని విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నించిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో నార్త్ తరువాత చూద్దాంలే అనుకున్నారో ఏమో, ఇప్పుడు సౌత్ పై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను విస్తరించేందుకు అనుకూలమైన రాష్ట్రాల ఎంపికలో ఏపీ ఫస్ట్ ప్లేసులో ఉంది. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దింపారు. ఆయనకున్న బంధుత్వాలు ఏపీలో పార్టీ ఎదుగుదలకు కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తూ ఉండొచ్చు. అయితే, ఏపీ సమస్యల పట్ల కేసీఆర్ స్టాండ్ ను బట్టి బీఆర్ఎస్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ మూడు రాజధానుల అంశం. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. గతంలో జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తే కేసీఆర్ అందుకు జై కొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ జాతీయ స్థాయి పార్టీగా మారాలనుకుంటుంది కాబట్టి , గతంలో తీసుకున్న…

Read More

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి అదృష్టం తొందరగానే తలుపు తట్టింది. చాలా తక్కువ కాలం వ్యవధిలోనే హీరోయిన్ గా మెరిసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ నటుడు అరవింద్ కృష్ణ ఇటీవలే ఓ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఏ మాస్టర్ పీస్” టైటిల్ తో తెరకెక్కనున్న ఈసినిమాలో హీరోయిన్ గా అషు రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సుకు దర్శకత్వం వహిస్తుండగా కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ ను రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా, 2018లో అషు రెడ్డి వెండితెరపై కనిపించింది. నితిన్ , మేఘా ఆకాష్ కాంబోలో వచ్చిన “ఛల్ మోహన్ రంగ” చిత్రంలో అషు ఓ పాత్రలో కనిపించింది. ఆ తరువాత ఆమెకు సినిమాలో నటించే అవకాశాలే రాలేదు. చాన్నాళ్ళ తరువాత అషుకు మళ్ళీ సినిమాలో నటించే అవకాశం…

Read More

హీరోయిన్ అంజలి ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా తెలుగింటి అమ్మాయిగా తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరిస్ లో నటిస్తోంది అంజలి. గతంలో చేసిన ఝాన్సీ వెబ్ సీరిస్ కు ప్రశంసలు దక్కగా ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఫాల్’ అనే వెబ్ సీరిస్ కూడా అదే ఆదరణను సొంతం చేసుకుంది. ఫాల్ వెబ్ సీరిస్ ప్రమోషన్ లో పాల్గొన్న అంజలి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తన పెళ్లి విషయంపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. అమెరికాలో ఉంటున్న ఓ ఇండియన్ ను అంజలి పెళ్లాడారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రతిసారి నా పెళ్లి విషయంలో నిరాదార వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. పెళ్లి చేసుకుంటే అందరి చెబుతాను. అప్పటివరకు ఇలాంటి నిరాధార వార్తలను ఆపండని…

Read More

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పలు ప్రాంతీయ పార్టీల అధినేతలకు, రైతు సంఘాల నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు కాని, అఖిలేష్ యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. ఆదిలో బీఆర్ఎస్ కు చుక్కెదురైనట్లు అనిపించింది. నెక్స్ట్ డే పార్టీ కార్యాలయంలోనే కేసీఆర్ ఉండటంతో కీలక నేతలు మద్దతు తెలిపేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. బీఆర్ఎస్ నేతలు తప్ప బయట నేతలెవరూ పార్టీ కార్యాలయం గడప తొక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఘనంగా ప్రారంభించాలని, జన సమూహాన్ని ఎక్కువగా కనిపించేలా ఉంచాలని కేసీఆర్ ఆదేశాలతో ఒక్కో ఎమ్మెల్యే సొంత డబ్బులతో వంద మందిని వెంటేసుకెళ్ళారు. గురువారం వారంతా కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. వారు తప్ప తెలంగాణేతరులు ఎవరూ కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పేందుకైనా ప్రముఖ…

Read More

సెలబ్రిటీలు ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తారు. పొద్దున లేస్తే నైట్ వరకు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. గతంలోనంటే సోషల్ మీడియా లేదు కాబట్టి, పేపర్ లోనో, టీవీలోనో సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించిన విషయాలను చూసి తెలుసుకునే వారు. ఆ రోజులు పోయాయి. ఏ విషయమైనా, అది మంచిది అవ్వని, చెడు కాని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఓ గుడ్ న్యూస్ ను దాచిపెట్టింది. ఆ హీరోయిన్ ఎవరని ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా అలరించిన శ్రియ. తనకు సంబంధించిన గుడ్ న్యూస్ ను కొన్నాళ్ళు దాచేసింది. తాజాగా దృశ్యం 2సక్సెస్ మీట్ లో పాల్గొన్న శ్రియ తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ ఏందుకు దాచాల్సి వచ్చిందో రీజన్ చెప్పేసింది. నా కూతురు కడుపులో ఉన్నప్పుడు మధుర క్షణాలను మనసారా ఆస్వాదించాలని అనుకున్నాను. ఎలాంటి ఒత్తిడికి…

Read More

కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ అంశం వ్యూహత్మక తప్పిదమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా..? ఈ పరిణామంతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలనుకుంటే సీన్ రివర్స్ అయిందా..? అనసవరంగా కాంగ్రెస్ ను కెలికి ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చామని కేసీఆర్ లో అంతర్మథనం మొదలైందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపి.. టెక్నికల్ గా ఆ పార్టీని బలహీపర్చాలనుకుంది టీఆర్ఎస్. అందులో భాగంగా మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ రూమ్ ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. కవితను లిక్కర్ క్వీన్ అంటూ అసభ్యకరంగా మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు చేశారని ఆఫీసుపై దాడి చేసినట్లు చెప్పారు. మా పార్టీ వార్ రూమ్ ను సీజ్ చేస్తారా..? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారమంతా దశలవారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇంకేముంది.. పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలతో చెలరేగిపోయారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా…

Read More

బుల్లితెరపై ఎన్నో షో లు వస్తుంటాయి. తెరమరుగు అవుతుంటాయి. కాని కొన్ని షో లు చెరగని ముద్ర వేసి అలా నిలిచిపోతాయి. అలా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న షో ” అలీతో సరదాగా”. ఈ షో కు కమెడియన్ అలీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు వచ్చే గెస్ట్ లను అలీ ఆట పట్టిస్తూ సరదాగా సాగిపోయే షో గా నిలిపాడు. అప్పుడప్పుడు ఈ షో ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. ఫన్, ఎమోషన్ కలబోతతో ఉండే ఈ షో కు భారీగానే ప్రేక్షక ఆదరణ ఉంటుంది. డిసెంబర్ 19వ తేదీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్ కు యాంకర్ సుమ కనకాల గెస్ట్ గా వచ్చారు. ఇద్దరు సరదాగా నవ్వుతు,నవ్విస్తూ షోను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో తనకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య…

Read More

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ క్వీన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే మాదాపూర్ లోని ఎస్కే కార్యాలయంపై దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆఫీసులోని కంప్యూటర్లను తీసుకెళ్ళడంతోపాటు నలుగురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. నోటిసులు కూడా ఇవ్వకుండా ఆఫీసును ఎలా సీజ్ చేస్తారని, అసలెలా ఆఫీసులోకి చొరబడుతారని ప్రశ్నించారు. ఈ అంశంపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కాని, మహిళలను కించపరిచేలా పోస్టింగ్ లు పెట్టారని.. మార్ఫింగ్ ఫోటోలతో ఇలా చేయడం నేరమని చెప్పారు. టీఆర్ఎస్ , బీజేపీ సోషల్ మీడియా అర్గనైజర్లు చేసే పోస్టింగ్ లు మరీ దారుణంగా ఉంటాయి. లిక్కర్ క్వీన్ కవిత అంటూ ఢిల్లీలో బీజేపీ నేతలు ఎన్నిసార్లు ట్రెండింగ్ చేశారో…

Read More