Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మంత్రి మల్లారెడ్డిని సాగనంపెందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయా..? మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు హటాత్తుగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి కారణమేంటి..? కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? మల్లారెడ్డిపై అసంతృప్తి వెళ్ళగక్కాలని ప్రగతి భవన్ నుంచే ఎమ్మెల్యేలకు గైడ్ లైన్స్ అందాయా..? తెలియాలంటే ఈ పూర్తి కథనం చదవాల్సిందే. Also Read : మంత్రి మల్లారెడ్డిపై కేసీఆర్ సీరియస్..? మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా గ్రేటర్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అరికపూడి గాంధీ, వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావులు భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రి తీసుకెళ్తున్నారంటూ ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు ఈ సమావేశం నిర్వహించామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇన్నాళ్ళు మంత్రి ఒంటెత్తు పోకడలపై ఏనాడూ నోరు మెదపని ఎమ్మెల్యేలు సడెన్ గా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డిని…
బీఆర్ఎస్ లో లుకలుకలు మెల్ల, మెల్లగా బయటకొస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వెళ్లగక్కుతూ నలుగురు ఎమ్మెల్యేలు సమావేశం కావడం రచ్చకు కారణమైంది. అయితే, మేడ్చల్ జిల్లాలో మాత్రమే కాదు, పలు జిల్లాలో మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో తమ మాటే చెల్లుబాటు కావాలని ఎమ్మెల్యేలపై మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో అనుచరవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రుల వ్యవహారశైలిని అధిష్టానంతో చెప్పుకుందామంటే అపాయింట్ మెంట్ ఇవ్వరు. అపాయింట్ మెంట్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు తాజాగా మల్లారెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల స్ఫూర్తితో మంత్రుల పెత్తనాన్ని ప్రశ్నించేందుకు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విషయం పరిశీలిద్దాం. ఖమ్మం జిల్లాలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్…
-మంత్రి ఎర్రబెల్లితో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీక్రెట్ భేటీ -పీసీసీ సమావేశానికి డుమ్మా కొట్టి ఎర్రబెల్లితో మంతనాలు -మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చలు -భేటీ విషయం తెలిసి వెళ్లిన ఛానెల్ ప్రతినిధికి బెదిరింపులు -మీటింగ్ అరెంట్ చేసిన మైహోం రామేశ్వర్ రావు టీపీసీసీ మాజీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కోవర్టన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్ అధినేత కనుసన్నలో పని చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉండనే ఉంది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నపుడే టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. దీని వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో సంక్షోభ వాతావరణం గట్టిపడేలా నేతృత్వం వహిస్తోన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సీక్రెట్ గా భేటీ కావడం సంచలనంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం…
టి. కాంగ్రెస్ ఏర్పడిన సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి స్వరాన్ని వినిపించిన సీనియర్లను గ్రూప్ గా బీజేపీలో చేర్చుకొని.. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనమైందని చెప్పుకోవాలని తెగ ఆరాటపడుతోంది. దీనికోసం కమలనాథులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్తే ఇంటలిజెన్స్ వర్గాలు ఈజీగా పసిగట్టేస్తున్నాయి. అదే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపితే అలాంటి ప్రమాదం ఉండదు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలే పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్టు లీకులు ఇస్తున్నారు. బీజేపీలో చేరేందుకు టి. కాంగ్రెస్ సీనియర్లు అంగీకరిస్తే బీజేపీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరికను ఖరారు చేస్తామని.. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్ని ఒకేసారి బీజేపీలో చేర్చుకుంటే కాంగ్రెస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చునని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. తొమ్మిది…
బీఆర్ఎస్ లో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పార్టీని అన్ని తానై నడిపిస్తోన్న కేసీఆర్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమయం చూసి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య రాజకీయం పతాకస్థాయికి చేరుకోవడంతో ఈడీ, సీబీఐలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్ తో బీఆర్ఎస్, ఈడీ తో బీజేపీ, ప్రత్యర్ధి పార్టీలకు ఉచ్చు బిగించేందుకు ట్రై చేస్తున్నాయి. ఈ రాజకీయంలో తామెక్కడ బుక్ అవుతామోనని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. మంత్రులు తలసాని, గంగుల, మల్లారెడ్డి ఇల్లు, ఆస్తులపై కేంద్ర దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటిసులు ఇచ్చింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈడీ రాడార్ లో ఉన్నారని ఆందోళన చెందుతున్నారు. Also Read : కాంగ్రెస్ పై కోవర్ట్ ఆపరేషన్ – రంగంలోకి ఎర్రబెల్లి కేసీఆర్…
పెళ్లి సందD శ్రీలీల మొదటి సినిమా. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాలీవుడ్ ఫీచర్స్ తో టాలీవుడ్ కు మంచి హీరోయిన్ దొరికిందని ఇండస్ట్రీ గుసగుసలాడుకుంది. ప్రస్తుతం రవితేజ సరసన ధమాకాలో శ్రీలీల నటిస్తోంది. తాజాగా ధమాకా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడిన మాటలు రవితేజ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. రవితేజకు నేను పెద్ద ఫ్యాన్ ను. చాలా అంకిత భావంతో పనిచేసే హీరో ఆయన. ఓ ఫైట్ సీన్ తెరకెక్కిస్తోన్న సమయంలో ఆయన కాలికి గాయమైంది. పన్నెండ్లు కుట్లు కూడా పడ్డాయి. కాని ఆ తరువాత రోజు ఆ గాయాన్ని కూడా పట్టించుకోకుండా షూట్ కు వచ్చారని మాస్ మహారాజ అంకిత భావాన్ని చెప్పుకొచ్చింది. పన్నెండు కుట్లు కూడా పడి ఆయన పాట షూటింగ్ కు రావడం చూసి శ్రీలీల షాక్ అయినట్లు చెప్పింది. నేనో మెడికల్ విద్యార్ధిని. ఆ పెయిన్ ఎలా…
కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ల కోసమే అధికారులు సర్కార్ కు సరెండర్ అవుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు టి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఎం కేసీఆర్ ప్రాపకం కోసం పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఎస్కే ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్లపై తప్పుడు పోస్టింగ్ లు సృష్టించబడ్డాయని సీవీ ఆనంద్ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పారు. సొంత పార్టీ నేతలపై వ్యతిరేక పోస్టింగులు అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం ఎందుకు సృష్టిస్తుంది..? తన కళ్ళను తనే పోడుచుకుంటారా ఎవరైనా..? సొంత పార్టీ నేతలను వీక్ చేస్తే ఆ పార్టీ ఎలా బలపడుతుంది..? రేవంత్ పై అగ్రహంగా ఉన్న సీనియర్లు ఈ విషయాన్ని పట్టించుకోరని అనుకున్నారో ఏమో కాని సీవీ ఆనంద్ కాంగ్రెస్ లో…
ఏదో చేయలనున్నారు. పార్టీని ఇరుకునపెట్టేసి పెత్తనం చెలాయించాలనుకున్నారు. కాని సీనియర్ల రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. సీనియర్ నేతల కుట్ర రాజకీయం వలన పార్టీ పూర్తిగా రేవంత్ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్లపై విశ్వాసం కోల్పోయిన హైకమాండ్, పార్టీ కార్యవర్గ సమావేశాలకు సీనియర్లు డుమ్మా కొట్టినా వాటి సమావేశాలు నిర్వహించాలని రేవంత్ ను ఆదేశించింది. ఈ సమావేశానికి అందరూ వచ్చారు కాని అసంతృప్తి గళం వినిపిస్తోన్న తొమ్మిది మంది మాత్రమే అటెండ్ కాలేదు. వారు మినహా మిగిలిన నేతలంతా రేవంత్ పైవే ఉన్నారని తేలిపోయింది. సీనియర్ల కుట్ర రాజకీయాలపై హైకమాండ్ కు నివేదిక అందింది. వారు కావాల్సుకునే కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ముద్రను వేస్తున్నారని గ్రహించింది. ఇటీవల ప్రకటించిన నూతన కమిటీలో 13మంది మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అయినప్పటికీ, 58మంది టీడీపీ నేతలకు ఈ కొత్త కమిటీలో చోటు కల్పించారంటూ సీనియర్లు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వారు మాట్లాడిన…
యాత్ర ఫర్ చేంజ్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. జనవరి 26న యాత్ర ప్రారంభమై తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలను స్పృశిస్తూ ఈ యాత్ర జూన్ 2న ముగియనుంది. దాదాపు ఐదు నెలలపాటు రేవంత్ యాత్ర కొనసాగనుంది. అయితే, యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంలో మూడు ప్లేసులు పరిశీలనలో ఉన్నాయి. జోగులాంబ గద్వాల్, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం , ఆదిలాబాద్ జోడే ఘాట్. ఈ మూడింట్లో ఎదో ఒక ప్లేసు నుంచి రేవంత్ రెడ్డి యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. కాంగ్రెస్ కు గతంలో వెన్నుదన్నుగా నిలిచి, తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ వైపు మొగ్గిన సామజిక వర్గాలను తిరిగి పార్టీ వైపు టర్న్ చేసుకోవాలన్నది ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రెడ్డి సామజిక వర్గాలను మరోసారి కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తే కాంగ్రెస్…
రాధిక- మెగాస్టార్ చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే వీరిద్దరి జోడికి అత్యధికులు అభిమానులుగా నిలిచారు. చాలా సినిమాలో నటించడం వలన వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఏ ఇంటర్వ్యూలోనైనా చిరును గుర్తు చేస్తుంది రాధిక. చిరును కూడా అంతే. రాధిక పట్ల అమితమైన అభిమానం చూపిస్తుంటారు. ఇప్పుడు అదే స్నేహంతో రాధికతో సినిమా చేసేందుకు చిరు ముందుకొచ్చారు. రాధిక సొంత బ్యానర్ రాడాన్ లో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ గురించి చర్చలు జరుగుతున్నాయి. కథా ఫిక్స్ అయితే చిత్రీకరణ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరుతో సినిమాను ఫైనలైజ్ అవ్వడంతో రచయితలతో రాధిక సంప్రదింపులు జరుపుతున్నారు. తమ జోడికి తగ్గట్లుగా ఎవరి దగ్గర కథ ఉందో సెర్చ్ చేస్తున్నారు. అదే సమయంలో , చిరు…