Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఇండియాకు కూడా కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం తన దృష్టిని భారత్ జోడో యాత్రపైకి మళ్ళించింది. వెంటనే భారత్ జోడో యాత్ర ఆపాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా లేఖ రాశారు. భారత్ జోడో యాత్రతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముగ్గురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అయితే, కరోనా నిబంధనలు కాంగ్రెస్ కు మాత్రమే వర్తిస్తాయా..? బీజేపీకి వర్తించవా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. కరోనా నివారణ దృష్ట్యా, దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కరోనా నిబంధనలను పాటించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబీకులకు ప్రాధాన్యత ఉంటుందని, కరోనా విషయంలో మాత్రం అందరికీ ఒకే విధమైన రూల్స్ వర్తిస్తాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలన్నారు.…
ప్రపంచవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతోన్న నేపథ్యంలో కోవిడ్ తాజా పరిస్థితిపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అద్యక్షతన సమీక్ష జరిగింది.. ఈ సమావేశానికి సీనియర్ అధికారులు, వైద్య నిపుణులు హాజరయ్యారు. చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్ సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ కు కూడా ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తుగా కేంద్రం ఈ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇక నుంచి మాస్క్ లను ధరించాలని , రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. కరోనాపై అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ కేంద్రం లేఖ రాసింది. ఇదివరకైతే అనుమానమున్న కేసు శాంపిల్స్ మాత్రమే జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించగా… ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ప్రతి పాజిటివ్ కేసును కూడా జీనోమ్ సీక్వెన్స్ కు పంపి పరీక్షించాలని…
రాజకీయ అవకాశవాదులలో కేసీఆర్ మించిన తోపు ఎవరూ లేకుండొచ్చు. అవసరానికి ఎవర్ని ఎలా వాడాలో, ఎవరిని వదిలించుకోవాలని ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అలా కేసీఆర్ రాజకీయ అవకాశవాదానికి బలై రాజకీయాలను వదిలేసినా వారు కొంతమందైతే, మరికొంతమంది పక్క పార్టీలోకి జంప్ చేసిన పరిస్థితి. టీఆర్ఎస్ లో ఎలాంటి ప్రాధాన్యత లేక పక్కనపెట్టేయడంతో బీజేపీలో చేరిన స్వామి గౌడ్ ను ఇటీవల తిరిగి సొంతగూటికి తీసుకొచ్చారు. పలు విషయాలపై అనర్గళంగా మాట్లాడే దాసోజు శ్రవణ్ ను కూడా గతంలో పక్కన పెట్టేయడంతో ఆయన కాంగ్రెస్ , బీజేపీలో చేరి కేసీఆర్ ఆహ్వానం మేరకుమళ్ళీ కారెక్కారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో ఆ పార్టీని తిరిగి దెబ్బకొట్టేందుకు గౌడ సామజిక వర్గానికి చెందిన స్వామి గౌడ్ తోపాటు మరో బీసీ నేత దాసోజు శ్రవణ్…
తగ్గేదేలేదన్న మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు తగ్గారు. అధిష్టానం క్లాస్ పీకిందో లేక పశ్చాతాపం చెందారో కాని క్రమశిక్షణ సందేశం వినిపించారు. తనపై అసమ్మత్తి గళం వినిపించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామంటూ ఆహ్వానించారు. సోమవారం రోజున మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే. మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఒంటెత్తు పోకడలపైఎమ్మెల్యేలు చర్చించడం కలకలం రేపింది. నామినేటెడ్ పోస్టులన్నీ తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని.. ఇది పద్ధతి కాదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని మల్లారెడ్డి తీరును తప్పుబట్టారు . ఇక నుంచి తగ్గేదేలేదని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మంత్రితో తాడోపేడో తేల్చుకుంటామనే తరహలో ప్రకటనలిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల భేటీ సెగ ప్రగతి భవన్ కు కూడా తాకినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డికి ప్రగతి భవన్ నుంచి క్లాస్…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ తేల్చింది. సమీర్ మహేంద్రు చార్జీ షీట్ లో ఈమేరకు కవిత పేరును చేర్చింది. సౌత్ గ్రూప్ నుంచి కవిత నేతృత్వం వహించారని…ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి అసలైన బాస్ కవితేనని చార్జీషీట్ లో ఈడీ పేర్కొంది. దక్షిణాది నుంచి శరత్ రెడ్డి , మాగుంట రాఘవ రెడ్డిలతో కలిసి కవిత లిక్కర్ బిజినెస్ రన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె అరుణ్ పిళ్ళై ను బినామీగా పెట్టుకున్నారని చార్జీషీట్ లో ఈడీ పేర్కొంది. అయితే, ఈ చార్జీషీట్ ను సవివరంగా అధ్యయనం చేస్తే మొత్తం కవితే ఈ పాలసీ రూపకర్త అన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి, లిక్కర్ స్కామ్ లో కవిత ఎటు తప్పించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయినట్లు అర్థం అవుతోంది. ఈడీ అధికారులు 181పేజీల చార్జీ షీట్ ను దాఖలు చేశారు. ఇందులో దాదపు ముప్పై సార్లు కవిత…
తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను టెస్టులకు సిద్దమని స్పష్టం చేశారు. నా బొచ్చు కావాలంటే బొచ్చు ఇస్తా, గోర్లు కావాలంటే గోర్లు ఇస్తా, రక్తంతోపాటు కిడ్నీ కూడా ఇస్తానని ఏ టెస్టులు చేయిస్తావో చేయించు అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ టెస్టులో తనకు క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ కమాన్ దగ్గర బండి సంజయ్ తన చెప్పుతో తనే కొట్టుకుంటాడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇటీవల బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలతోపాటు కేటీఆర్ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ తంబాకు తింటాడని వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు డ్రగ్స్ ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేటీఆర్ రెండు వెంట్రుకలు ఇస్తే ఆయన డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. దీనిపై తాజాగా స్పందించిన కేటీఆర్ నేను రెడీ అంటునే ప్రతి సవాల్…
రెండడుగులు వెనక్కి వేశానంటే..మరింత వేగంతో దూసుకొచ్చెందుకే అన్నట్లుంది కరోనా మహమ్మారి తీరు. ప్రస్తుతం చైనాలో కనిపిస్తోన్న పరిస్థితులు ప్రపంచ దేశాలను భయపెట్టిస్తున్నాయి. అతి త్వరలోనే కరోనా మరో వేవ్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మందికి కరోనా మళ్ళీ సోకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో పెరుగుతోన్న కేసులను చూస్తుంటే మరో వేవ్ తథ్యమని చెబుతున్నారు. చైనాలో అంక్షలను ఎత్తివేసిన తరువాత అక్కడ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఆసుపత్రులన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోయాయి. దాంతో అక్కడి జిన్ పింగ్ సర్కార్ అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేస్తోంది. యుద్దప్రాతిపదికన కొత్త ఆసుపత్రులని నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. పరిస్థితి ఇలాగె కొనసాగితే రాబోయే మూడు నెలలో 60శాతం మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఆందోళన నెలకొంది.…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్లు రేవంత్ కు సహకరించాలని కోరారు. అన్ని తెలిసిన పెద్ద నాయకులే తప్పు చేస్తున్నారని, కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం నమ్మకంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ డీసీసీ అద్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం సభను ఏర్పాటు చేశారు. ఈసభకు చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పంచాయితీ నేపథ్యంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని తెలిసి కూడా సీనియర్లు తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని కితాబిచ్చారు. దయచేసి సీనియర్లు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ,మీ కాళ్ళకు దండం పెడుతానంటూ ఎమోషనల్ అయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజామున జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆదిభట్ల పొలిసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన ఈ కిడ్నాప్ పెళ్లితో సుఖాంతం అయింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాజాగా యువతి ఓ సెల్ఫి వీడియో విడుదల చేయడంతో ఆమె కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. తాను, జాని అనే యువకుడిని ప్రేమించానని, తన ఇష్టపూర్వకంగానే జానీ తనను తీసుకెళ్లాడని యువతి తెలిపింది. తన సమ్మతితోనే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. తన పేరెంట్స్ పెళ్లిచూపులు చూస్తున్నారని, జానీకి ఫోన్ చేసి చెప్పడంతో తనను తీసుకెళ్లాడని తెలిపింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని తనే కోరినట్లు వివరించింది. తనను కారులో తీసుకెళ్ళే సమయంలో జానీ మాస్క్ ధరించి ఉండటంతో , అతను ఎవరో గుర్తించలేదని చెప్పింది. ఆ తరువాత కారులో కూర్చుకున్నాక జానీ అని తెలిసి రిలాక్స్ అయినట్లు తెలిపింది. అయితే, తమకు తన కుటుంబం నుంచి రక్షణ కల్పించాలంటూ…
తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నటన నుంచి సమంత లాంగ్ బ్రేక్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులేవి అంగీకరించవద్దని సామ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇటీవలే చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షించారు. అయితే, ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు నటనకు దూరంగా ఉండాలని సామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్నాకే కొత్త సినిమాలకు సైన్ చేయాలనుకుంటుంది. సమంత చివరి సినిమా యశోదా. మయోసైటిస్ కారణంగా సినిమా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనలేదు. హిందీలో ద ఫ్యామిలీ సీజన్ 2సక్సెస్ అవ్వడంతో పలు బాలీవుడ్ సినిమాలలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మధ్యలోనే అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది సామ్. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. తాను…