Author: Prashanth Pagilla

నవరస నటనా సార్వభౌముడు  కైకాల సత్యనారాయణ మృతి చెందిన వార్తను మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ నటుడు చలపతిరావు(78)హఠాన్మరణం చెందారు. ఆదివారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. 1944 మే8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోలందరి సినిమాలో నటుడిగా, విలన్ గా నటించి ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. Also Read : దివికేగిన నవరస నటనా సార్వభౌముడు చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రవి బాబు ఇంట్లోనే చలపతిరావు ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి కన్నుమూశారు. చలపతిరావు ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి…

Read More

దేశాన్ని ఐక్యం చేసేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనతో సోనియా గాంధీ కూడా చేరారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి ప్రేమను పంచడం తన తల్లి నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు. Also Read : భారత్ జోడో యాత్రపై కేంద్రం ‘కరోనా’ కుట్రలు భారత్ జోడో యాత్రకు శనివారంతో తాత్కాలిక బ్రేక్ పడనుంది. వాహనాలు నిర్వహణకు ఇవ్వనున్నారు, దాదాపు ఎనిమిది రోజుల విరామం తరువాత భారత్ జోడో యాత్ర వచ్చే నెల మూడో తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. ఇక, భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా వేలమంది ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారు. https://twitter.com/RahulGandhi/status/1606543782841044992 Also Read : యాత్ర.. ఫర్ చేంజ్ పేరుతో రేవంత్ పాదయాత్ర BF7కొత్త వేరియంట్ నేపథ్యంలో…

Read More

చైనాలో నమోదు అవుతోన్న కరోనా కేసులు ప్రపంచ దేశాలను ఆందోళన గురి చేస్తున్నాయి. రోజుకు పది లక్షల కేసులు నమోదు అవుతున్నట్లు లండన్ కు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ఇది పొరుగు దేశాలను భయం గుప్పిట్లోకి నెడుతోంది. ముఖ్యంగా ఇండియాలో కేసులు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అప్పుడే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షలు విధిస్తారా..? అని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ భయం స్టాక్ మార్కెట్లను పతనం వైపు నడిపిస్తోంది. ఇప్పుడు దేశంలో భరోసా కంటే భయమే ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ భయంతో జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. లాక్ డౌన్ పునరావృతం అవుతుందన్న భయాలు అన్ని రంగాలను కుదిపేస్తున్నాయి.2019లో ఆర్ధిక వ్యవస్థ ఎలా చితికిపోయిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మార్కెట్ల పతనం అప్పుడే ప్రారంభమైపోయింది. వారం రోజులుగా…

Read More

చైనాను హడలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో చైనా అల్లకల్లోలంగా మారింది. డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు ప్రపంచ దేశాలను బెంబేలేత్తిస్తుండగా.. జపాన్, దక్షిణ కొరియా, అమెరికాల్లో కూడా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. Also Read : కోరలు చాచిన కరోనా – ఒక్కరోజే పది లక్షల కేసులు భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని అయినప్పటికీ కోవిడ్ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మునుపటి పరిస్థితులు తలెత్తుతాయని రాష్ట్రాలను హెచ్చరించింది. Also Read : మళ్ళీ కరోనా ఆంక్షలు – మాస్కులు ధరించాల్సిందే చైనాలో నెలకొన్న పరిస్థితితో…

Read More

టీ. టీడీపీలో ఫుల్ జోష్ వచ్చిందా..? ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తుందా..?ఘర్ వాపసీకి చంద్రబాబు తెరతీయడంతో కొంతమంది కీలక నేతలు తిరిగి టీడీపీలో చేరబోతున్నారా..? టీడీపీకి టచ్ లోకొచ్చిన పాత నేతలు ఎవరు..? Also Read : టీఆర్ఎస్ కు బిగ్ షాక్ – నలుగురు ఎమ్మెల్యేలు జంప్..? ఒకే సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత టీడీపీ ఒంటరిగా ఏర్పాటు చేసిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ సభ విజయవంతం కావడంతో తెలుగు తమ్ముల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు మరెంతో కాలం సమయం లేదు. దీంతో టీడీపీ తన రాజకీయ వ్యూహ,ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఉనికి కోల్పోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక టీడీపీపైనున్న ఆంధ్రపార్టీ అనే ముద్ర లేకుండా…

Read More

సాధారణంగా మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు రాజకీయపరమైన భాషపై పట్టు లేకపోవడమే కారణం. ఆయనపై విమర్శలు, ఆరోపణలు వస్తేనే వాటిని ఖండించేందుకు , ఎదుడుదాడి చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యర్ధులను తనకు నచ్చిన భాషలో కడిగేస్తారు. అప్పుడప్పుడు మీడియా ప్రతినిధులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా పక్కకు తప్పుకుంటారు. అలాంటి మల్లారెడ్డి…కేటీఆర్ పై బండి సంజయ్ డ్రగ్స్ ఆరోపణలు చేశారని ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ స్టేట్ చీఫ్ పై రెచ్చిపోయారు. Also Read : బీజేపీకి టచ్ లో మంత్రి మల్లారెడ్డి -వేటు వేసేందుకు కేసీఆర్ రెడీ..? మా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరో రాష్ట్రంలో జరిగినట్లు చూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్ చేశారు. అంతేకాదు రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.…

Read More

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని చల్లార్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో బెట్టు చేయాలని సీనియర్ నేతలు భావించారు. అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ్ వద్ద పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించేలా ఉమ్మడి డిమాండ్ తో వాదనను వినిపించాలని సీనియర్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు. రేవంత్ ను పదవి నుంచి తప్పించకపోయిన కనీసం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ నైనా తొలగించేలా డిగ్గీరాజాపై ఒత్తిడి పెంచాలనుకున్నారు. దిగ్విజయ్ సింగ్ తో భేటీ తరువాత ఠాగూర్ ను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడుతుందని ప్రచారం చేసుకున్నారు. కాని దిగ్విజ య్ సింగ్ మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిందని..బహిరంగంగా అసంతృప్తి వ్యాఖ్యలు చేయవద్దని చెప్తూ వెళ్ళిపోయారు. అంటే..రేవంత్ ను కాని, ఠాగూర్ ను తొలగించే అవకాశం లేదన్నది స్పష్టం అవుతోంది. Also Read : ఉత్తమ్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోని ఓయూ జేఏసి నేతలు..! ఏదో ఒక విధంగా…

Read More

చైనాలో కరోనా రక్కసి మహోగ్ర రూపం దాల్చింది. కోవిడ్ కేసులు కుప్పలు, తెప్పలుగా నమోదు అవుతున్నాయి. అక్కడ నమోదు అవుతోన్న కేసుల సంఖ్యను జిన్ పింగ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు కాని పరిస్థితి దారుణంగా ఉంది. మరణాల సంఖ్య కూడా దాచేస్తోంది. ఈ నేపథ్యంలో లండన్ కి చెందిన ఎయిర్ ఫినిటి లిమిటెడ్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చైనాలో ప్రస్తుతం ప్రతిరోజు 10లక్షలు (1మిలియన్ ) కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, 5వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎయిర్ ఫినిటి లిమిటెడ్ సంస్థ అంచనా వేసింది. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని తెలిపింది. జనవరిలో 37లక్షలకు చేరుకుంటాయని, మార్చి నాటికీ 42లక్షల కరోనా కేసులు ప్రతిరోజు నమోదు అవుతాయని తాజా నివేదికలో హెచ్చరించింది. చైనా ప్రభుత్వం రోజువారీ కరోనా కేసులను తక్కువ చూపిస్తోందని పేర్కొంది. చైనా ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం…

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభాన్నికి ముగింపు పలికేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీ సీనియర్ నేతలకు షాక్ ఇచ్చారు. పార్టీలో జూనియర్లు , సీనియర్లు ఉండరని అందరూ సమానమేనని.. సీనియర్ నేతల వాదనను వీగిపోయేలా బదులిచ్చారు. పార్టీలో జూనియర్ అయిన రేవంత్ కింద తాము పని చేయడం ఏంటని సీనియర్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా రచ్చ చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే తమకు గౌరవమేమి ఉంటుందని తోచిన విధంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని పీసీసీగా మార్చాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాని సీనియర్లను బుజ్జగించేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ మాత్రం.. పార్టీలో జూనియర్, సీనియర్ అనే తారతమ్యం ఉండదని.. అందరూ ఒకటేనని తేల్చి చెప్పి సీనియర్ల నోరు మూయించారు. రేవంత్ నాయకత్వంలో నచ్చితే ఉండండి.. లేదంటే లేదని చెప్పినట్లుగా దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం ఉంది. పార్టీలో విబేధాలను పరిష్కరించేందుకు వచ్చిన డిగ్గీ రాజా అందరితో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. పీజేఆర్…

Read More

రాబోయే ఐపీఎల్ కోసం ఆటగాళ్ళ వేలం ప్రక్రియ నిర్వహించారు. కాసేపటి కిందట ఈ వేలం ప్రారంభమైంది. ఈసారి రికార్డ్ ధరకు ఆటగాళ్ళను పలు ప్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించే పంజాబ్ కింగ్ యాజమాన్యం ఈసారి వేలంలో దూకుడు ప్రదర్శించింది. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 18.50కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్. ఐపీఎల్ లో ఓ ఆటగాడి కోసం ప్రాంచైజీ వెచ్చించిన అత్యధిక ధర ఇదే. ఇక ఆస్ట్రేలియా టాల్ ప్లేయర్, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడుపోయాడు. అతడిని 17.50కోట్లకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం దక్కించుకుంది. గ్రీన్ కోసం ఢిల్లీ, ముంబై పోటీ పడగా ముంబై అతని కొనుగోలు చేసింది. ఇక, టీ20 వరల్డ్ కప్ లో తనదైన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్…

Read More