Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
రేవంత్ రెడ్డి నాయకత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన సీనియర్ల పరిస్థితి ఎటుకాకుండా అయిపోయింది. నేతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ వచ్చి వెళ్లారు కాని సమస్య ఇంకా సద్దుమణిగినట్లు లేదు. పైగా, రేవంత్ దూకుడును ప్రోత్సహించినట్లుగా దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ పై సీనియర్లు డైలమాలో పడిపోయారు. కాంగ్రెస్ లో గౌరవంగా ఉండాలంటే చచ్చినట్టు రేవంత్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లేదంటే మరో పార్టీలో చేరాలి. ఇవి సీనియర్ల ముందున్న ఆప్షన్స్. Also Read : అటు, ఇటు కాకుండా అయిపోయిన సీనియర్లు..! అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ ను పంపడంతో బెట్టు చేయాలని సీనియర్లు ఫిక్స్ అయ్యారు. తమ అసంతృప్తి ఢిల్లీని తాకిందని.. ఇక పంతం నెగ్గుతుందనుకున్నారు. పీసీసీ పదవి నుంచి రేవంత్ ను దించేయడమో , మాణికం ఠాగూర్ ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించడమో చేసి పట్టు నిలుపుకోవాలనుకున్నారు. కాని అలాంటిదేమి లేదని…
కేంద్ర ఆర్ధిక శాఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్మలా సీతారామన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని సమాచారం. ఓ ప్రైవేట్ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, వార్షిక వైద్య పరీక్షల కోసమే నిర్మలా సీతారామన్ ఆసుపత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరీక్షల అనంతరం మంత్రిని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ బోలెడు హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మద్యపాన నిషేధం. వైసీపీ అధికారంలోకైతే వచ్చింది కాని, ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీని అమలు చేసింది లేదు. ఇప్పుడు దానిని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి మీడియాకు చెప్పారు. మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా చూస్తోంది ఏపీ సర్కార్. దాంతో మద్యపాన నిషేధంతో ఆదాయం మరింత పడిపోతుందని అంచనా వేసింది. దాంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు టూరిజం పేరుతో అదనంగా దుకాణాలు తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇటీవల ఇచ్చిన హామీ వైరల్ అవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరవై శాతం దుకాణాలు గీత కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారంటే లిక్కర్ పాలసీని మారుస్తారని అర్థం. దీంతో తెలివిగా ఆలోచించిన వైసీపీ అధిష్టానం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేముందు మద్యాన్ని నిషేధిస్తూ జీవో విడుదల చేసే అవకాశం ఉంది.…
రాజకీయాల్లో తలపండిన సొంత పార్టీ నేతలు తనకు ప్రత్యామ్నాయంగా మారితే ఎప్పుడు ఎవరిని, ఎలా తప్పించాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఎప్పుడు ఏ నేతను దగ్గరకు తీసుకోవాలో, ఏ నేతను దూరం చేసుకోవాలో ఆయనకు తెలిసినంతగా రాష్ట్ర రాజకీయాల్లో మరో నేతకు తెలియదు. గతంలో కేటీఆర్ కు పోటీగా రఘునందన్ రావు ఎదుగుతాడని భావించి ఫైర్ బ్రాండ్ ను ఏవేవో ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అదే కోవలో తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. Also Read : ఆ నలుగురికి కేసీఆర్ బిగ్ షాక్ – మంత్రివర్గం నుంచి ఔట్ తెలంగాణ క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తరువాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో క్యాబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారని అంటున్నారు. దీనీపై ఇంకా స్పష్టత రాలేదు…
చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అక్కడ 37లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయట. ఇది సరికొత్త రికార్డ్. ఇక కోవిడ్ కేసుల సంఖ్యను ప్రకటించడం కూడా మానేస్తామని చైనా హ్యండ్సప్ చెప్పేసింది. చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ లీక్ చేసిన చైనీస్ డాక్యుమెంట్స్ ప్రకారం గత 20రోజుల్లో 25కోట్ల మంది మంచాన పడినట్లు తేలింది. కాని, జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసాక డిసెంబర్ 7తరువాత చనిపోయింది కేవలం ఏడుగురు మాత్రమేనని అంటోంది చైనా. క్షేత్రస్థాయిలో కనిపిస్తోన్న పరిస్థితులు మాత్రం వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో సగానికి పైగా జనాభాను ఆక్రమించేసింది BF7వేరియంట్. ఆసుపత్రుల్లో పడకల్లేవ్. పడకలు దొరికిన ఐసీయూలో ఆక్సిజన్ లేదు. వైరస్ సోకి మరణిస్తే మార్చురీలో స్థలం కూడా లేకుండా పోయిన దీనస్థితి హృదయాలను కలిచివేస్తోంది. అంబులెన్స్ లను కూడా వెనక్కి పంపిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అల్లాడిపోతున్నారు. నెక్ట్స్ డిసెంబర్ లోగా…
తెలంగాణ కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించే అవకాశముందా…? ఇందుకు సంబంధించిన కసరత్తును కేసీఆర్ ప్రారంభించారా..? సంక్రాంతి తరువాత లేదా ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలనుకుంటున్నారా..? ఇదే జరిగితే కేసీఆర్ ఎవరిపై వేటు వేయనున్నారు..? ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు..? అనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. Also Read : బీజేపీకి టచ్ లో మంత్రి మల్లారెడ్డి -వేటు వేసేందుకు కేసీఆర్ రెడీ..? త్వరలో కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత ఎన్నికల తరువాత ఒకసారి మాత్రమే కేబినేట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. హరీష్ రావుతోపాటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆ తరువాత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన శాఖను హరీష్ రావుకు అదనంగా కేటాయించారు. Also Read : కేసీఆర్ కూతురికి కొత్త సంవత్సరంలో కష్టాలే..! ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే…
చైనాను హడలేతిస్తోన్న కరోనా మహమ్మారి ఇండియాలోనూ నెమ్మదిగా స్పీడ్ పెంచుతోంది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే మన దగ్గర కూడా కరోనా విస్పోటనం ఉంటుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. శుక్రవారం 201 కరోనాకేసులు నమోదు కాగా, శనివారం 227 కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో 3,424 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,30,693కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్ లలో యాక్టివ్ కేసులు 0.01శాతం కాగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.80శాతానికి పెరిగింది. దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా నివారణ చర్యలపై తిరిగి దృష్టి సారించాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియాతోపాటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా కరోనాపై…
సినిమా ఇండస్ట్రీలో ఓ సంప్రదాయం ఉంటుంది. మంచైనా, చెడైనా అందరూ కలిసే పంచుకుంటారు. కాని టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మాత్రం ఇండస్ట్రీలో ఎవరైనా ప్రముఖులు చనిపోతే ఆఖరి చూపు చూసేందుకు వెళ్లడంలేదు. ఇందుకుగల కారణం తెలియదు కాని అందరూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. Also Read : ఓ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు -హీరోయిన్ అంజలి కామెంట్స్ మొన్న ఆ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణిస్తే నాగార్జున నివాళులర్పించేందుకు వెళ్ళలేదు. కైకాల సత్యనారాయణను ఆఖరి చూపు చూసేందుకు కూడా వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. నాగ్ ఫ్యామిలీలో ఆయన తండ్రి, తల్లి కన్నుమూసిన సమయంలో చాలామంది నివాళులర్పించేందుకు తరలివెళ్ళారు. కాని నాగార్జున మాత్రం ఎవరు కన్నుమూసినా చివరి చూపు చూసేందుకు వెళ్ళడం లేదు. ఎవరైనా మరణిస్తే ఆఖరి చూపు చూసేందుకు వెళ్ళరు కాని, ఎవైన శుభకార్యాలు ఉంటె మాత్రం తప్పకుండా వెళ్తారు. కుటుంబ సమేతంగా వెళ్లి ఆశీర్వదిస్తారు.…
ధనవంతుల కుటుంబంలో ఏదైనా వేడుక నిర్వహిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మరీ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అంబానీ లాంటి ధనవంతుల కుటుంబంలో వేడుక జరిగితే ఆషామాషీగా నిర్వహిస్తారా..? అసలే ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఇటీవల అమెరికాలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు కవలల్లో ఒకరు మగ శిశువు మరొకరు ఆడ శిశువు. వీరికి కృష్ణ, ఆద్య అని నామకరణం చేశారు. తల్లి అయిన తరువాత మొదటి సారి ఈషా అంబానీ ఇండియాకు వస్తున్నారని అంబానీ ఫ్యామిలీ లోకమే ఆశ్చర్యపడిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా నుంచి వచ్చిన తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికింది అంబానీ ఫ్యామిలీ. వీళ్ళు ముంబై వచ్చేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ప్రయాణ సమయంలో కవలలకు ఎలాంటి ఇబ్బంది…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక నిందితుడు నందకుమార్ ను విచారించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల విచారణకు కోర్టు అంగీకరించింది.ఈ కేసులో నందకుమార్ ను ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ భావిస్తోంది. ఈ నెల 26,27 తేదీలలో చంచల్ గూడ జైల్లోనే నందకుమార్ ను ప్రశ్నించనున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తానని నందకుమార్ ప్రలోభ పెట్టారని.. ఆయన వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసును చేదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు నిలిచిపోయింది. Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు – వందల కోట్ల లెక్క తేల్చే పనిలో ఈడీ ఈ కేసు ఏసీబీ పరిధిలోకి వస్తుందన్న వాదనలు ఉన్నాయి. కాబట్టి ఏసీబీ దర్యాప్తు చేయాలా..?…