Author: Prashanth Pagilla

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు ప్రగ్యా ఠాకూర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందువులంతా కత్తులు రెడీ చేసుకోవాలంటూ ఆమె చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందువులంతా తమను తాము రక్షించుకునేందుకు పదునైన కత్తులను ఇంట్లో ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఊరికే ఉంచుకోవడం కాదు..అవి పదునుగా ఉన్నాయో లేదో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. శివమోగ్గలో జరుగుతోన్న హిందూ జాగరణ్ మంచ్ దక్షిణ ప్రాంత సదస్సులో ఆమె మాట్లాడారు. మనపై జరిగే దాడులను ఎదుర్కోవడం మన హక్కు అంటూ చెప్పుకొచ్చారు. లవ్ జిహాదీ వారికీ ఓ సంప్రదాయం ఉంటుంది. హిందువులూ ప్రేమిస్తారు. అయితే వారు దేవుడిని ప్రేమిస్తారు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెబుతారు. లవ్ జిహాదీ ప్రయోగించే వాళ్ళకు అదే పద్ధతిలో ఆన్సర్ ఇవ్వాలి. దేవుడు సృష్టించిన ఈ లోకంలో పాపాత్ములున్నారని .. వారిని అంతం చేయాలని లేదంటే ప్రేమకు సరైన అర్థం…

Read More

టాలీవుడ్ కాంట్రవర్సరీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పుడు ఎదో ఒక వార్తల్లో నానుతూనే ఉంటుంది. గతంలో “మా” ఆఫీసు ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన నాటి నుంచి శ్రీరెడ్డి ఫేమస్ అయిపొయింది. Also Read : ఆ డైరక్టర్ నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా చేయాలనుకున్నాడు – ట్వింకిల్ ఖన్నా అదే సమయంలో తనకు హీరోయిన్ అవకాశాలు ఇస్తామని వాడుకున్నారని పలువురు స్టార్ ల పేర్లు కూడా బయటపెట్టి సంచలనం రేపింది. అందుకు సంబంధి కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టి టాలీవుడ్ ను షేక్ చేసింది శ్రీరెడ్డి. ఇటీవల శ్రీరెడ్డి చేసిన ఓ ప్రకటన సంచలనం రేపుతోంది. ప్రస్తుతం నానక్ రామ్ గూడ వద్దనున్న రామానాయుడు స్టూడియోను రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కోసం నిర్మాత సురేష్ బాబు ఇచ్చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ స్టూడియో సమీపంలో ఉండటంతో అక్కడ అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. Also Read : ఓ…

Read More

ఐసీయూలోనున్న కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీ ఫామ్ లోకి వచ్చింది. ఇదే బీఆర్ఎస్ , బీజేపీలకు కంటగింపుగా మారింది. అందుకే పార్టీని చక్కదిద్దాలనుకున్న ప్రతిసారి రేవంత్ ప్రయత్నాలకు అడ్డం పడుతూనే ఉన్నారు. కోవర్ట్ ఆపరేషన్ తో రేవంత్ ను దెబ్బతీయాలనుకున్నారు కాని అది వర్కౌట్ అవ్వలేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ లు ప్లాన్ మార్చాయి. తమ కనుసన్నలో నడిచే యూట్యూబ్ ఛానెళ్ళు, పత్రికలతో రేవంత్ పై దుష్ప్రచారం చేయించారు. అందులో భాగమే రేవంత్ కొత్త పార్టీ అనే ప్రాపగండా. తెలంగాణలో కొత్త పార్టీ పురుడోసుకుందని.. తెలంగాణ సామజిక కాంగ్రెస్ పార్టీ పేరిట రేవంత్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారని బీఆర్ఎస్ అనుకూల జర్నలిస్ట్  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆ జర్నలిస్ట్ ను ప్రశ్నించి ఆధారాలు బయటపెట్టాలని ప్రశ్నించడంతో తప్పుడు  సమాచారం  వలెనే ఇదంతా జరిగిందని తరువాత స్పష్టత…

Read More

సాధారణంగా అధికార పార్టీలకు పెద్దమొత్తంలో విరాళాలు అందుతాయి. కాని ఊహకు అందని విధంగా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు విరాళాలు అందుతుండటం బిగ్ డిబేట్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ తరువాత అత్యధిక విరాళాలు పొందుతోన్న పార్టీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార బీఆర్ఎస్ , వైసీపీ పార్టీలే. ఎన్నికల కమిషన్ కు అధికారికంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు అందించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ , వైసీపీలు వందల కోట్లకు పడగలెత్తాయి. Also Read : ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం – జగన్ మాస్టర్ ప్లాన్ తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ కు 2021-22 మధ్య కాలంలో రూ. 218.11కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చారు. అయితే, అంతకుముందు ఈ మార్గాల్లో పైసా కూడా రాలేదు కాని ఈసారి మాత్రం కోట్లలో ఆదాయం వచ్చింది.…

Read More

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఇంటర్ ద్వితీయ పరీక్షలను జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలను ఏప్రిల్ 15నుంచి 25వ తేదీ వరకు…ఏప్రిల్ 30నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం , మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఈమేరకు ఏపీ ఇంటర్ బోర్డు టైం టేబుల్ ను ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ ఎద్యూకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో టీఆర్ఎస్ తెగ ఇదైపోతుంది. కేంద్రాన్ని దోషిగా చూపించి కేసీఆర్ పొందాలనుకున్న మైలేజ్ హైకోర్టు తీర్పుతో నీరుగారిపోయినట్లైంది. కేంద్రంపై మాపై దర్యాప్తు సంస్థలను వదిలితే తామేమి తక్కువ కాదని కేసీఆర్ చూపిన ధైర్యం ఇప్పుడు సన్నగిల్లిపోనుంది. Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసును సీబీఐకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తను జైలుకు వెళ్లేందుకు కూడా రెడీగా ఉన్నానని ప్రకటించారు. అసలు ఈ కేసులో నగదు చెల్లింపులే జరగలేదని అలాంటప్పుడు ఈడీ ఎలా ఎంటర్ అవుతుందని ప్రశ్నించారు. ఆయన గంభీరంగా ఈ ప్రకటనలు చేసిన పైలెట్ లో మాత్రం ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇది పైలెట్ రోహిత్…

Read More

ఆలు లేదు చూలు లేదు. అల్లుడి పేరు సోమ లింగం అన్నట్లుంది తెలంగాణ బీజేపీ నేతల తీరు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కాని అప్పుడే సీఎం నేనంటే నేనేనని వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఒకరు సీఎం రేసులో ఉన్నానని నేను ప్రకటించగానే మరో నేత కౌంటర్ గా తనకు కూడా ఆ అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానాలు చేస్తూ పార్టీలో హీట్ పెంచేస్తున్నారు. Also Read : సీరియస్ ఇష్యూ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వేటు..? తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటోంది. ఇది బాగానే ఉన్నా…సీఎం పదవిపై అప్పుడే ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేయడం ఆ పార్టీ నేతలకే కాదు క్యాడర్ కు కూడా రుచించడం లేదు. Also Read : బీజేపీని వదిలించుకోవాలని ఈటల భావిస్తున్నారా..? బీజేపీ…

Read More

వరుసకు వారిద్దరూ అన్నాచెల్లెళ్ళు. కాని వావివరసలను పట్టించుకోకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించారు. దాంతో ఇద్దరు కలిసి జీవించడం సాధ్యం కాదని.. విడిపోయి ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నిజ జీవితంలో కలిసి ఉండకపోయిన చావులో మాత్రం ఇద్దరు కలిసే చావాలని నిర్ణయించుకొని రైలు కిందపడి పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట – కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఏపీలోని కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం దానాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70కుటుంబాలు పత్తి చెల్లో పని చేసేందుకు తెలంగాణకు వలస వచ్చాయి. చేగుంటకు వచ్చి అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరమ్మ – మున్నెల్ల దంపతులకు మణికుమార్ (25) అనే కుమారుడు, శాంతమ్మ – కేశవల కుమార్తె అనిత…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సిట్ కు బదులుగా సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ  వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ నిలిచిపోనుంది. ఇక , సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.

Read More

దక్షిణాదిన ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా అలరించిన త్రిష   పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారనీ  ఆ తెగ ప్రచారం జరిగింది. ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారని త్వరలోనే ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరుతారని కథనాలు వెలువడ్డాయి. Also Read : పడక సుఖం అందిస్తేనే సినిమా ఆఫర్స్ – ఆర్జీవీ హీరోయిన్ ఎమోషనల్ ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలైంది. ఆ తరువాత ఆమెను వెతుక్కుంటూ సినిమా ఆఫర్స్ వచ్చినా వాటిని తిరస్కరించారు.దీంతో త్రిష రాజకీయాల్లోకి రావాలనుకునే సినిమా ఆఫర్స్ ను అంగీకరించడం లేదని ప్రచారం జరిగింది. Also Read : హోమో సెక్సువల్ క్యారెక్టర్ లో రెచ్చిపోయిన మంచులక్ష్మి! ఈ ప్రచారంపై తాజాగా త్రిష స్పందించింది. తను నటించిన కొత్త చిత్రం ” రాంగీ” ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న త్రిష మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. తనకు రాజకీయాలపై…

Read More