Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్షల షెడ్యూల్ పై ప్రకటన చేశారు. ఈసారి వంద శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల విధానం అమలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి పేపర్ కు మూడు గంటల సమయం ఉంటుందని వెల్లడించారు. ఒక్క సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20నిమిషాల సమయం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి, మార్చిలో పదో తరగతి విద్యార్ధులకు ఫ్రీ ఫైనల్స్ ఉంటాయని మంత్రి చెప్పారు. వ్యాస రూప ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్, సుక్ష్మ రూప ప్రశ్నలకు నో ఛాయిస్ విధానంతో ప్రశ్నా పత్రాలను స్టూడెంట్స్ కు అందుబాటులో ఉంచునున్నట్లు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో కేసీఆర్ మీడియా సమావేశం సందర్భంగా ఆధారాలను బయట పెట్టిన అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ కు ఈ సాక్ష్యాలను ఎవరిచ్చారో తేల్చడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి సబ్మిట్ చేయాల్సిన ఆడియో, వీడియోలను బయట పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. కేసీఆర్ మీడియా సమావేశంలోనే ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను విడుదల చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, కేసీఆర్ కు సాక్ష్యాలు ఎక్కడి నుంచి అందాయి..? ఎవరిచ్చారు..? దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన వీడియోలు కేసీఆర్ ఎందుకు బయటపెట్టారు..? అని సీబీఐ ప్రశ్నించనుంది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ తరువాత కూడా విషయం నిగ్గు తేలకపోతే కేసీఆర్ ను ప్రశ్నించనుంది. అదే జరిగితే ఈ కేసు సంచలనం సృష్టించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి…
తెలంగాణలో కాంగ్రెస్ బలీయంగా మారుతోంది. ఆ పార్టీలోకి కొంతమంది అధికార పార్టీ నేతలు చేరేందుకు సిద్దమయ్యారని డిసెంబర్ మొదటి వారంలో విషయం కేసీఆర్ కు తెలిసింది. అసలు హస్తం పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని భావించిన కేసీఆర్ కు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం ఇష్టం లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా, కాంగ్రెస్ చర్చలోకి వస్తోంది. బీఆర్ఎస్ అధికారానికి సవాల్ విసురుతోంది. ఎందుకిలా జరుగుతుందని చర్చించిన కేసీఆర్.. కాంగ్రెస్ దూకుడు వెనక ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉండటం వలెనే సాధ్యం అవుతుందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులను రంగంలోకి దింపితే ఇబ్బంది అవుతుందని గ్రహించి కొన్నాళ్ళు వేచి చూశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అద్యక్షుడు అయిన తరువాత ప్రతి విషయంలో సునీల్ కనుగోలు పాత్ర ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇన్ పుట్స్ ఇచ్చేది సునీల్ టీమే. ఎస్కే టీం…
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆమె మంగళవారం రాత్రి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దాంతో ఆమెను అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 2022 జూన్ లో మోడీ తల్లి 99వ వడిలోకి అడుగు పెట్టారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో మోడీ తన తల్లిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలోనే ఆమె అస్వస్థతకు గురవ్వడంతో తల్లిని చూసేందుకు మోడీ అహ్మదాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ లో సెక్యురిటిని పెంచారు. ఇదిలా ఉండగా.. మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కారులో ప్రయాణిస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆయన కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఓటీటీలో వస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో విత్ బాలకృష్ణ సెకండ్ సీజన్ ప్రతిష్టాత్మక ఎపిసోడ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ షో కి గెస్ట్ రావడంతో ఈ ఎపిసోడ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఎపిసోడ్ లో పవన్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని పవన్ అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల అంశం గురించి ప్రస్తావిస్తారా..? అనే చర్చ జరుగుతోంది. అయితే, తనను ఇబ్బంది పెట్టె ప్రశ్నలేవి అడగొద్దని బాలయ్య వద్ద పవన్ ప్రామిస్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కాని అదంతా అబద్దమని తేలిపోయింది. Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..! ఈ షో లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా అడిగేశారు బాలకృష్ణ. అసలు ఈ పెళ్లి సమస్య ఏంటయ్యా అని పవన్ ను ప్రశ్నించారు. అందుకు…
టీడీపీ అధికారంలోనున్న సమయంలో చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించిన జన విజ్ఞాన వేదిక లక్ష్మణ రెడ్డి ఇప్పుడు వైసీపీ సర్కార్ విధానాలను తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు జగన్ పాలనను ఖండించేందుకు ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొని జగన్ ను ఎకిపారేశారు. లక్ష్మణ రెడ్డికి మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి నెలకు రూ. నాలుగు లక్షల వరకు మూటజెప్తుంది వైసీపీ ప్రభుత్వం. తనకు వచ్చే జీతభత్యాల కన్నా రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని భావించి..జగన్ పై నిప్పులు చెరిగారు. Also Read : తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు BRS & YCP పార్టీల ఆదాయం ఎంతో తెలుసా..? అయితే, ఏపీ ప్రభుత్వంలో ఒక్క లక్ష్మణ రెడ్డి మాత్రమే అసంతృప్తిగా లేరు. చాలామందే ఉన్నారు. వారంతా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతూ మంచి జీతం వస్తోన్నా ఇవేవీ వాళ్ళను సంతృప్తి పరచడం…
నూతన సచివాలయ నిర్మాణం కోసం 650 కోట్లను కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం.. గ్రామ పంచాయితీ బాగోగుల కోసం మాత్రం నిధులు విడుదల చేసేందుకు ఇష్టపడటం లేదు. రెండేళ్లుగా గ్రామ పంచాయితీలకు నిధులు రిలీజ్ చేయకపోవడంతో సర్పంచ్ లు అప్పోసోప్పో చేసి పంచాయితీలను డెవలప్ చేశారు. పంచాయితీలకు ఇస్తామన్న పైసలనింకా విడుదల చేయకపోగా.. తాజాగా కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను పక్కదారి పట్టించి సర్పంచ్ ల నోట్లో మట్టి కొట్టేసింది. సర్పంచ్ ల డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి నిధులను డైవర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. Also Read : కవిత అరెస్ట్ తథ్యం – మరి బీజేపీపై బీఆర్ఎస్ బాస్ ఏం చేయనున్నారు..? పంచాయితీలో అభివృద్ధి పనులు చేయండి.. ఖజానా ఫుల్ లోడ్ తో ఉంది. మీకు నిధులు ఇస్తామని చెప్పడంతో సర్కార్ మాటలు నమ్మి అప్పులు చేసి గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేశారు సర్పంచ్ లు. డ్రైనేజీలు,…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించడం చాలా అలాంటి వారికీ హీరోయిన్ గా, నటిగా అవకాశాలు దక్కడం అంత ఈజీ కాదు. డైరక్టర్, నిర్మాతలతోపాటు హీరోను కూడా మెప్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా కమిట్ మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి చాలామంది అంగీకరించక చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించిన వాళ్ళు ఉండగా.. కమిట్ మెంట్లను కాదనలేక బలైనవారు ఉన్నారు. Also Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్ అయితే, కమిట్మెంట్లు ఇచ్చిన వారందరికీ అవకాశాలు వస్తాయా..? అంటే అది కూడా చెప్పలేం. ఒక్కోసారి అవసరం తీరిపోయాక పక్కకు పడేస్తారు. అందుకే చిత్ర పరిశ్రమలో రాణించడం ఆషామాషీ కాదని అంటోంది నటి గుంజన్. దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించిన వైఫ్.ఐ అనే చిత్రంలో గుంజన్ నటించింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను వివరిస్తు పలు విషయాలను పంచుకుంది గుంజన్. Also Read : శ్రీముఖి…
ఎన్నికలు సమీపిస్తున్నాయి. రైతుల్లో బీఆర్ఎస్ ప్రభుతంపై అసంతృప్తి తీవ్రం అవుతోంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ను ఆదరించిన రైతాంగం వరంగల్ డిక్లరేషన్ తరువాత క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతోంది. అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం రైతులను ఆకర్షిస్తోంది. రెండో దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతోన్నా ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ జరగక బ్యాంక్ సిబ్బంది వేధింపులు తాళలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సకాలంలో రైతు రుణమాఫీ జరగకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ సర్కార్ పై రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఎన్నికల సంవత్సరమైన 2023లో రైతు రుణమాఫీ చేసి తీరాలని కేసీఆర్ భావిస్తున్నారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తుందన్నది కేసీఆర్ భయం. దాంతో వచ్చే ఏడాదిలో…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కోపం కట్టలు తెంచుకుంది. సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసి బీజేపీని మట్టికరిపించింది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇది సోము వీర్రాజు చూసి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఏపీకి చెందిన వ్యక్తి కాకపోయినా పార్టీని అంటే ఊరుకుంటానా అనుకున్నారో ఏమో కాని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఊగిపోయారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలు రద్దు చేసిందని గుంటూరులో బీజేపీ చేపట్టిన ధర్నాలో సోము వీర్రాజు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ పై విమర్శలు చేసి ఆ తరువాత కేటీఆర్ పై కూడా రెచ్చిపోయారు. కేటీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టే ఉందన్నారు. కుటుంబ పార్టీలన్ని అబద్దాలే మాట్లాడుతాయన్నారు. కూతురు, కుమారుడు అందరూ అబద్దాలు మాట్లాడుతారని..ఇలా నాతో కేటీఆర్ మాట్లాడితే కడిగి పారేస్తానన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ…