Author: Prashanth Pagilla

నాస్తికుడైన బైరి నరేష్ హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అశ్లీల అసభ్య పదాలతో హిందూ దేవుళ్ళను వర్ణించడంతో హిందుత్వ సంఘాలు రచ్చకెక్కాయి. బైరి నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. ఇక ఈ విషయంలో కొంతమంది బైరి నరేష్ ను సమర్దిస్తుండగా.. మరికొంతమంది ఆయనను తప్పుబడుతున్నారు. నిజానికి , బైరి నరేష్ హద్దు మీరి మాట్లాడారు. ఆయన నాస్తికుడు. అంటే దేవుళ్ళను విశ్వసించరు. అయినంత మాత్రానా దేవుళ్ళను అసభ్య పదాలతో వర్ణించడం తప్పుడు కాదా..?అంటే తప్పే. ఆయన చెప్పాలనుకున్నది మరో విధంగా కూడా చెప్పొచ్చు. కాని వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అసభ్య పదాలను వాడుతూ మాట్లాడారు. రాష్ట్రంలో చాలామందే నాస్తికులు ఉన్నారు. వారందరూ రాజ్యాంగానికి లోబడి తమ ఆలోచనను ప్రజల ముందు ఉంచుతారు. కాని బైరి నరేష్ మాత్రం గీత దాటి మరీ మాట్లాడేశారు.…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారు కూడా బీజేపీకి విరాళాలు కట్టబెడుతున్నారు. గత ఏడాది ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. యశోదా ఆసుపత్రి బీజేపీకి ఏకంగా రూ. పది కోట్ల విరాళాన్ని ఇచ్చినట్లు పేర్కొంది. యశోదా ఆసుపత్రిపై కేసీఆర్ అపారమైన ప్రేమ కనబరుస్తారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా యశోదాకే వెళ్తారు. కేసీఆర్ కుటుంబీకులకు ఈ ఆసుపత్రితో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి ఆసుపత్రి మేనేజ్ మెంట్ బీజేపీకి ఏకంగా పదికోట్ల విరాళాన్ని కట్టబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ నేతలు కూడా ఆ స్థాయిలో బీజేపీకి విరాళం ఇవ్వలేదు. విశాఖ ఇండస్ట్రీస్ అధినేత జి. వివేక్ మూడు కోట్లు విరాళం ఇచ్చారు. మిగిలిన వాళ్ళు లక్షల్లోనే విరాళం ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ అధినేతతో సఖ్యత మెయింటేన్ చేసే యశోదా ఆసుపత్రి…

Read More

తమ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు, పదవులతో బీజేపీలో చేర్చుకునేందుకు ప్రలోభాలకు గురి చేశారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో , వీడియోలను బయటపెట్టడంపై సీబీఐ కేసీఆర్ ను ప్రశ్నించనుంది. అలాగే, బీజేపీలో చేరుతామంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్ చేశారో , తమ పార్టీ తరుఫున గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు దాదాపు అలాంటి ఆఫర్స్ ఇచ్చి కేసీఆర్ కొనుగోలు చేశాడని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఎలాగైతే సీబీఐకి అప్పగించారో..తమ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి కేసీఆర్ చేకూర్చిన ప్రయోజనాలను బయటపెట్టేలా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read : కేసీఆర్ రాజ్యంలో మాయమైపోతున్న తెలంగాణం 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి…

Read More

ఫేమస్ పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో జబర్దస్త్ యాంకర్ రష్మీని పోల్చి అందరికీ షాక్ ఇచ్చాడు అటో రాం ప్రసాద్. న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రత్యేక స్కిట్స్ చేశారు. రష్మీ, ఇమ్మాన్యూయేల్, అటో రాం ప్రసాద్ కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో వీరు స్కూల్ పిల్లలుగా కనిపిస్తారు. రష్మీని గౌనులో చూసిన ఇమ్మాన్యూయేల్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని అంటాడు. వెంటనే ఎక్కడో ఏంట్రా ఆమె మియా ఖలీఫా అంటాడు రాం ప్రసాద్. రష్మీని పోర్న్ స్టార్ తో పోల్చడంతో స్టేజ్ పైనున్న వారే కాకుండా జడ్జీలు కూడా నోరెళ్ళబెడతారు. చివరికి రష్మీ కూడా షాక్ అవుతుంది. టీచర్ గా కనిపించే ఇంద్రజ బెత్తంతో అటో రాం ప్రసాద్ కు నాలుగు వాతలు పెట్టి మందలిస్తుంది. పంచ్ ల పేరుతో రష్మీపై అటో రాం ప్రసాద్ వేసిన పంచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ…

Read More

టీమిండియా చిచ్చరపిడుగు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు డివైడర్ ను డీకొట్టడంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారును పంత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి మెర్సిడెస్ బెంజ్ కారులో పంత్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగినప్పుడు కారులో పంత్ మాత్రమే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయని.. దీంతో కారు అద్దాలను ధ్వంసం చేసి పంత్ బయటకొచ్చాడని తెలిపారు. పంత్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైన ఘటనలో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలినట్లు తెలుస్తోంది. కాలికి ఫ్రాక్చర్ అయింది. మొదట పంత్ ను రూర్కీ ఆసుపత్రికి తరలించగా ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న సమయంలో పంత్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం…

Read More

డీజీపీ మహేందర్ రెడ్డి పదవి విరమణ పొందటంతో ఇంచార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతోపాటు మరో ఐదు స్థానాల్లో ఐపీఎస్ లను బదిలీ చేశారు. ఈ ఆరు చాలా పవర్ ఫుల్ పోస్టులు. పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఈ ఐదు పోస్టుల మీదుగానే నడుస్తుంది. అయితే, ఈ ఆరు పోస్టుల్లో నియామకం అయిన వారు తెలంగాణ క్యాడర్ కు చెందిన వారే కాని తెలంగాణ స్థానికత ఉన్నవారు కాదు. ఇప్పుడు ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్నారు. ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కీలక పోస్టుల్లో స్థానికేతరులు నియామకం అవుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఒక్క కీలక పోస్టులోనైనా తెలంగాణకు చెందిన వారికీ బాధ్యతలు అప్పగించకుండా తెలంగాణ అధికారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ లలో సమర్ధులైన తెలంగాణవారు లేరా..? వారినెందుకు కీలక శాఖల్లో నియమించడం లేదని…

Read More

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో విశేష ఆదరణ పొందింది. ఈ షో కు వచ్చే టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు బాలయ్యతో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా బాలయ్య సెలబ్రిటీల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి వారు ఈ టాక్ షో లో పాల్గొన్నారు. అయితే, ఈ షో కు సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా మీడియా స్ట్రీమింగ్ చేయకముందే సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆహా టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో కు గెస్ట్ గా వెళ్ళారు. ఆయన ఈ టాక్ షో లో…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన హీరాబెన్ ను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.30గంటలకు తుదిశ్వాస విడిచారు. తన తల్లి మృతి మరణించినట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. వందేళ్ళ అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని తల్లి గురించి పేర్కొన్నారు. ఆమె నిస్వార్ధ కర్మయోగి అని, ఆమె జీవితం మొత్తం విలువలతోనే నిండిందని చెప్పారు. https://twitter.com/narendramodi/status/1608622111660331012 తన మాతృమూర్తి వందో పుట్టిన రోజున తనను కలిసినట్లు ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. తనను కలిసినప్పుడల్లా ఓ విషయాన్ని చెప్పేవారని పేర్కొన్నారు. జీవితాన్ని స్వచ్చంగా గడపాలని, విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పేవారని తెలిపారు. ప్రధాని ఎప్పుడు తన మాతృమూర్తి గురించి చెప్పేవారు. తనతోనున్న బంధాన్ని నెమరువేసుకునే వారు. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన తల్లిని…

Read More

హిందీ బిగ్ బాస్ 16 రియాలిటీ షో లో ఇద్దరమ్మాయిలు లిప్ కిస్ పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వారాలుగా సౌందర్య, శ్రీజితా ల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. కాని, ఉన్నట్టుండి ఇద్దరు కలిసిపోయారు. తమ మధ్య ఇదివరకు ఏం జరగలేదు అన్నట్లుగా కలిసిపోయారు. ఒకరికొకరు మేకప్ వేసుకోవడంతోపాటు జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపారు. ఆ తరువాత కెప్టెన్ రూమ్ లోకి వీరిద్దరూ కలిసి ప్రవేశించగా.. శివ థాకరే, అబ్దు రోజిక్ వారిని చూసి ఆశ్చర్యపోతారు. శత్రువుల్లా ఉండే వీళ్ళేనా ఇలా కలిసిపోయిందని షాక్ అవుతారు. శివ థాకరే, అబ్దు రోజిక్ చూస్తుండగానే ముద్దు కూడా పెట్టుకుంటారు. అంతేకాదు మీరు కూడా తమను అనుకరించాలని మరింత రచ్చ చేయడం వీడియోలో కనిపిస్తోంది. https://twitter.com/AbduRozikFamily/status/1608146637419089920

Read More

దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం, అత్యధిక కేసులున్న ముఖ్యమంమంత్రుల జాబితాలో తెలుగు రాష్ట్రాల సీఎంలే నెంబర్ వన్ గా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అత్యంత ధనవంతుడైన సీఎం జాబితాలో మొదటి ప్లేసులో నిలిచారు. పాలిటిక్స్ లోకి రాకమునుపు సండూర్ పవర్ కంపెనీ ప్రారంభించి అప్పుల చేసిన జగన్ రాజకీయాల్లోకి వచ్చాక కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. సీఎంల గత ఎన్నికల అఫిడవిట్లను సేకరించి ఓ నేషనల్ మీడియా ఈ వివరాలను ప్రకటించింది. ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతుడిగా మొదటి స్థానంలో జగన్ నిలవగా.. చివరి స్థానంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. జగన్ ఆస్తులు రూ.370 కోట్ల కాగా.. మమతా బెనర్జీ ఆస్తి కేవలం 15లక్షలు మాత్రమే. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆస్తి రూ.56 లక్షలు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రూ.73 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక కేసుల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగానున్న అందరి ముఖ్యమంత్రులతో చూస్తె తెలంగాణ…

Read More