Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఏపీ సీఎం జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో కేంద్ర పెద్దలతో జగన్ భేటీ అయ్యారు. ఏపీ సమస్యలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని అంటున్నా..ముందస్తు ఎన్నికలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమేనన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీ సర్కార్ వ్యూహాలను పసిగడుతోన్న చంద్రబాబు ముందస్తుకు టీడీపీ నేతలను రెడీ చేస్తున్నారు. ఆయన జనాల్లో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీకి పోటీగా టీడీపీ కూడా ముందస్తు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దూకుడు కొనసాగిస్తోంది. దీంతో టీడీపీని సైడ్ చేయాలని అనుకుంటున్నారో ఏమో కాని, ముందస్తు ముచ్చటే లేదని వైసీపీ చెబుతోంది. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయంటోంది. కాని వైసీపీ వాలకం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తున్నారు. మార్చిలో ఈ కార్యక్రమం ముగియనుంది. అప్పుడే టికెట్లు కూడా ప్రకటిస్తామని జగన్ స్పష్టం…
ప్రముఖ ఓటిటి సంస్థ ఆహకు అన్ స్టాపబుల్ కాసుల వర్షం కురిపిస్తోంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ టాక్ షో కు ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇతర టాక్ షో లకు భిన్నంగా అన్ స్టాపబుల్ టాక్ షో విత్ NBK ను రూపొందించటం ఒక ఎత్తైతే.. స్టార్ హీరోలతో ఈ షో ను ప్లాన్ చేయడం మరో ఎత్తు. ఈ షో కు గెస్టులుగా వస్తున్న సెలబ్రిటీల జీవితాల్లోని కాంట్రవర్సి , రూమర్స్ పై బాలయ్య ప్రశ్నిస్తుండటం ఆసక్తి కల్గిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను రంగంలోకి దించారు. ప్రభాస్ పై అన్ స్టాపబుల్ షో రెండు ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు.మొదటి ఎపిసోడ్ ను డిసెంబర్ 29న రిలీజ్ చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని ప్రకటించడంతో ఆహకు ఆడియన్స్ పోటెత్తారు. లక్షలాది మంది ఆడియన్స్…
కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి ఒక్కరికీ వందలాది సందేశాలు వస్తున్నాయి. ఏకబిగిన సోషల్ మీడియా వేదికగా విషెస్ ల పర్వం కొనసాగుతోంది. అయినా.. ఒకటే సందేహం. ఈ కొత్త సంవత్సరమైనా మన జీవితం మారుతుందా..? కేవలం క్యాలెండర్ లో ఇయర్ మారినంత సులువుగా మన జీవితం మారుతుందా..? అనే ప్రశ్న దాదాపు అందరి మెదళ్లలో నానుతోంది. క్యాలెండర్ లో ఇయర్ మారినంత ఈజీగా మన జీవితాలేమి మారవు. కాని.. కొత్త సంవత్సరంలోనైనా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని పని చేసేవారికీ న్యూ ఇయర్ కొత్త అనుభూతినిచ్చేదే. జీవితంలో స్థిరపడేందుకు ఈ కొత్త సంవత్సరాన్ని సవాల్ గా తీసుకొని పని చేయండి. వ్యసనాలు వదిలేసేందుకు ఈ ఇయర్ నుంచి మొదలు పెట్టండి. విజయవంతమైన స్నేహితులు , బంధువులను స్ఫూర్తిగా తీసుకుని గెలిచేందుకు ఈ ఇయర్ ను ఎంచుకోండి. లేకపోతే ఈ ఇయర్ కూడా నిర్లిప్తతతో నిండి ఉంటుంది..మరో ఏడాది కోసం ఇవే ఆశలతో ఎదురుచూడాల్సి…
తనపై అసత్య ఆరోపణలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చి మరీ హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు బీఆర్ఎస్ అధినేతను ఉద్దేశించినవే. అధినేతకు హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సోషల్ మీడియా కూడా సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మౌనమే మేలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుంది. బీజేపీ పగబడితే ఎలా ఉంటుందో పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు రుచి చూపించింది. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ ను పడగొట్టారు. ముగ్గురు కీలక నేతల్ని జైలుకు పంపారు. హోంమంత్రి దేశ్ ముఖ్‌నూ జైలుకు పంపారు. చివరికి శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను కూడా వదల్లేదు. ఆఖరికి ఉద్ధవ్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి సంతృప్తి పొందింది బీజేపీ. ఇప్పుడు వారి పగ తెలంగాణపైకి మళ్లిందని బీఎల్ సంతోష్ వార్నింగ్…
దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ గేట్ వే అవుతుందని ఆ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పక్కా అధికారంలోకి వస్తామని… విజయం ఎలా సాధించాలో మా లెక్కలు మాకు ఉన్నాయంటూ అధికారంపై ధీమా వ్యక్తం చేశారు షా. పోటీ చేసేందుకు రాష్ట్రంలో బలమైన అభ్యర్థులే లేరని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ చెప్తుంటే.. అమిత్ షా మాత్రం అధికారం మాదేనని అంటున్నారు. బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతిచోట హిందుత్వాన్ని రెచ్చగొడుతుంది. ఇది వాళ్ళ విధానం. ఎందుకంటే హిందుత్వాన్ని ఎంత రెచ్చగొడితే అంత ఓట్లు రాలుతాయనేది కమలనాథుల ధీమా. ఈ అస్త్రమే తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడుతుందని అమిత్ షా ఆలోచన కావొచ్చు. అందుకే ఆయన పై కామెంట్స్ చేసి ఉండొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రతి విషయాన్ని ఉపయోగించుకుంటుంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా హిందుత్వ కార్డును బలంగా వాడుతున్నారు. మునావర్ ఫరూకీ…
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు మామూలుగా ఉండవు..ఓ పట్టాన అర్థం అవ్వవు..తమ రాజకీయ లబ్దికోసం రాజకీయనాయకులు, పార్టీలు ఎన్ని ఘోరాలు చేయడానికైనా వెనకాడవు. నాకు జరిగిన ఒక అనుభవం, రాజకీయం ఎంత నీచమో తెలిసేలా చేసింది.. వారం క్రితం కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్వేత హోటల్ లో బైరి నరేష్ కూర్చొని ఉన్నాడు..నేను అదే హోటల్ లో రిసెప్షన్ లో నిలబడి ఉన్న. అంబేడ్కర్ వాది బైరి నరేష్ ను పలకరిద్దామని అటు వెళ్ళబోయా. అంతలో నాకు వేరే ఫ్రెండ్ అడ్డుగా వచ్చాడు. వాడితో మాట్లాడుతూ ఉన్న..అంతలో హోటల్ మెయిన్ డోర్ దగ్గర హడావిడి. ఎవరు వస్తున్నారని చూస్తే బండి సంజయ్ , శ్రవణ్ ఇద్దరు కారులోనుంచి కిందికి దిగి మా పక్క నుంచే లోపలికి వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాల తరువాత బైరి నరేష్ ను ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడు. నేను నరేష్ ను కలిసి వెళ్ళిపోదామని…
ఇంట్లో సందడి, సందడి చేసే పిల్లాడికి ఉన్నట్టుండి విరేచనాలు అయ్యాయి. ఆ తరువాత వాంతులు కూడా కావడంతో వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. చికిత్స పొందుతునే ఆ పిల్లాడు కన్నుమూశాడు. కొడుకును పోగొట్టుకున్న దుఖంలో ఉండగానే కూతురికీ విరేచనాలు ఆయ్యాయి. దీంతో వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా వాంతులు చేసుకుంది. ఆసుపత్రిలో చేర్చిన రెండు రోజుల తరువాత తను కూడా కన్నుమూసింది. ఒకరెంట మరొకరు ఆ పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల కన్నీటిని ఆపడం ఎవరి తరం కాలేదు. వారికొచ్చిన ఆపద చూసి ఊరు, ఊరంతా కంటతడి పెట్టింది. వారితో కలిసి దుఃఖాన్ని పంచుకుంది ఆ ఊరు. పిల్లలు లేరన్న బాధలో ఉండగా పది రోజుల తరువాత తల్లి కూడా అనారోగ్యం పాలయింది. అవే లక్షణాలతో ఉండగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల తరువాత ఆమె కూడా తుది శ్వాస విడిచింది. ఆ తరువాత భార్యా, పిల్లల…
పవిత్ర లోకేష్.. పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితమైన పవిత్ర లోకేష్ సినిమాలతో కన్నా వ్యక్తిగత విషయాలతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఇటీవల కాలంగా పవిత్ర లోకేష్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరు మైసూర్ లో ఓ హోటల్ ఉండగా నరేష్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవిత్ర లోకేష్, నరేష్ లు పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతుండగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెతో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ వెల్లడించారు. నరేష్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? ఈ…
పెళ్ళైన పది రోజులకే ఓ నవ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకొని ఆపై షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. పోలిసుల విచారణలో సినిమా ట్విస్ట్ లను మించి ఈ లవ్ స్టొరీ బయటకు వచ్చింది. పుదుమనైకి చెందిన పద్దినిమిదేళ్ళ యువతికి తన మేనమామతో వివాహం జరిపించారు. పెళ్లి అయిన పదిరోజుల తరువాత ఆమె ఇదివరకు ఉద్యోగం చేసే జ్యూస్ దుకాణానికి వెళ్ళిపోయింది. రోజు ఉదయం వెళ్లి రాత్రి 7గంటలకు వచ్చే యువతి ఆరోజు రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అదృశ్యమైన యువతి తరుచుగా గోకుల్(26) అనే వ్యక్తితో మాట్లాడేదని గుర్తించారు. అతడిది ఒడియటూరు అని నిర్ధారించుకున్నారు. Also Read : అన్నాచెల్లెళ్ళు ప్రేమించుకున్నారు – ఇంట్లో విషయం తెలియడంతో.. గోకుల్ పల్లికొండ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నట్లు పోలిసుల విచారణలో తేలింది. అయితే , అప్పటికే గోకుల్…
టాలీవుడ్ నటి పూర్ణ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, పెళ్ళైన ఆరు నెలల్లోనే పూర్ణ ప్రెగ్నెన్సీ ప్రకటించడం విశేషంగా మారింది. గత ఏడాది ప్రారంభంలో పెళ్లి అనౌన్స్ మెంట్ చేశారు పూర్ణ. వ్యాపారవేత్త అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగింది. నెలలు గడిచిన పెళ్లి వార్త బయటకు చెప్పకపోవడంతో బ్రేకప్ అయి ఉంటుందని అనుకున్నారు. కాని అంతలోనే పూర్ణ షాక్ ఇచ్చింది. మాకు పెళ్లి కూడా జరిగిపోయిందని చెప్పింది. జూన్ 12న దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. అనివార్య కారణాల వలన నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాం. కేరళలో బంధువులు, మిత్రుల కోసం ఇండియాలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు పూర్ణ. అయితే…