Author: Prashanth Pagilla

హోంగార్డులను పర్మినెంట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం.. హామీని నెరవేర్చకపోవడం కేసీఆర్ కు రివాజుగా మారింది. 2014 నుంచి పలు వేదికలపై కేసీఆర్ ఏడుసార్లు హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ఫలితంగా జీతాల కోసం అధికారుల కాళ్ళవెళ్ళా పడటం.. అధికారుల నుంచి చీదరింపులు.. ఇవన్నీ భరించలేక రవీందర్ అనే హోంగార్డు తాజాగా ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఒకే హామీ.. కొత్త వేదిక.. సరికొత్తగా హామీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 20 న హోంగార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు చూపుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2014, జూన్ 22న జరిగిన సూపర్ కాప్ మీటింగులో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఆ తరువాత మూడేళ్ళు కాలయాపన చేసిన కేసీఆర్ 2017,జనవరి 31న భక్తరామదాసు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో హోంగార్డులకు…

Read More

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి మకాం మార్చనున్నారా..? దక్షిణాదిన కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తుండటంతో సౌత్ సెంటర్ గా పాలిటిక్స్ చేయనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ హైదరాబాద్ కు మకాం మార్చనున్నారాని రెండు రోజులుగా వార్తలు గుప్పుకుమంటున్నాయి. అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన సాధ్యమైనంత ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలనేది రాహుల్ ప్లాన్. అందుకోసం సౌత్ సెంటర్ గా రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఉంటుందనేది పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే రాహుల్ కోసం హైదరాబాద్ లో మంచి ఇంటిని సెర్చ్ చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బోయిన్ పల్లిలో 8ఎకరాల స్థలం ఉంది. అక్కడ రాహుల్ కోసం ఇంటి నిర్మాణం చేపడితే ఎలా ఉంటుంది..? అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అది రాహుల్ ఉండేందుకు ఆమోదయోగ్యంగా ఉంటుందా..? లేక మరో స్థలం చూడాలా..? అనే పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు.…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి… బుధవారం గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద కాళేశ్వరం అవినీతిపై కాగ్ రిపోర్ట్ ను వివరించారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆధారాలను కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్ళారు. మొత్తం ప్రాజెక్టులో రూ.48 వేల కోట్ల అవినీతి జరగగా.. కేవలం పంపు మోటార్ల కొనుగోలు ప్రక్రియలోనే రూ.5600 కోట్లకు పైగా దగా చోటు చేసుకుందన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా మారిందని వివరించారు నాగం జనార్ధన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన అవినీతిపై కాగ్ నివేదికను కేసీ వేణుగోపాల్ కు నాగం సమర్పించారు. పార్టీ పరంగా కాళేశ్వరంపై గాలి ఆరోపణలు చేయకుండా పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లి కేసీఆర్…

Read More

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది. పెద్దగా పోటీ లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారు అయింది. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాపై మరింత స్పష్టత రానుంది. అయితే, ఒక్కో టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడే నియో నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దాంతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? అని పార్టీ ఆలోచనలో పడింది. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న నియోజకవర్గాలు అభ్యర్థులు వేరే..!! 1.వనపర్తి – చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి 2. అంబర్ పేట – నూతి శ్రీకాంత్ గౌడ్ / మోతా రోహిత్ / లక్ష్మణ్ యాదవ్ 3.మహాబూబాబాద్ – బలరాం నాయక్/ మరళీ నాయక్ /బెల్లయ్య నాయక్ 4.జనగామ – పొన్నాల లక్ష్మయ్య/ కొమ్మూరి…

Read More

ప్రేమను నిరాకరించినందుకు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలిని ఓ వ్యక్తి కత్తితో పొడిచిన ఘటన కూకట్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకే యువతిని కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ఆరు నెలల కిందట రాజు(32) అనే వ్యక్తికి సోషల్ మీడియాలో 23ఏళ్ల బాధితురాలు పరిచయమైంది. రాజును స్నేహితుడిగా మాత్రమే ఆమె భావించింది కానీ అతను మాత్రం ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె తిరస్కరించింది. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా..? తాను మాత్రం ఎప్పుడు ఆ ఉద్దేశ్యంతో చూడలేదని స్పష్టం చేసింది. ఇది గడిచిన తరువాత మహిళకు ఫోన్ చేసిన రాజు.. అత్యవసరంగా నిన్ను కలవాలంటూ కోరాడు. కలిసినప్పుడు మళ్ళీ తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎన్నిసార్లు ప్రపోజ్ చేసిన తన నిర్ణయం మారదని మహిళా ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రాజు.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆమె కత్తితో పొడిచాడు. అనంతరం తాను…

Read More

బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ – హరీష్ రావుల మధ్య గ్యాప్ వచ్చిందా..? ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఇద్దరి నేతల మధ్య మనస్పర్ధలు తలెత్తాయా..? కేటీఆర్ తన అనుకూలురుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడితే హరీష్ అంగీకరించలేదా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు కేటీఆర్ అండ్ హరీష్ రావులు మెయిన్ పిల్లర్స్. అందుకే అభ్యర్థుల ఎంపిక సందర్భంగా వారిద్దరి అభిప్రాయాలను పరిగణనలోకు తీసుకున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కేటీఆర్ , హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని టాక్. నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని కేటీఆర్ పట్టుబట్టగా.. హరీష్ రావు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ పెండింగ్ లో ఉంచారని అంటున్నారు. మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మైనంపల్లి కొడుకు అంశాన్ని కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారని కానీ హరీష్ రావు…

Read More

తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఓడించేందుకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఈసారి బరిలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై అలుపెరగకుండా పోరాడుతోన్న మల్లన్నకు ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతునిస్తుందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో టీజెఎస్ సోషల్ మీడియా చేస్తోన్న ప్రచారం అనేక అనుమానాలకు తెరలేపుతోంది. మేడ్చల్ నుంచి కోదండరాం బరిలో ఉంటారని టీజేఎస్ పార్టీ లీకులు ఇస్తోంది. ఆయనకు కాంగ్రెస్ మద్దతునివ్వాలని సోషల్ మీడియా క్యాంపైన్ కొనసాగుతోంది. అయితే ఇదంతా తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు జరుగుతోన్న కుట్ర అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మేడ్చల్ లో మల్లారెడ్డి తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్నారు. అదే సమయంలో మల్లన్న మంత్రి మల్లారెడ్డి భూకబ్జాల బాగోతాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూ వస్తున్నారు. దీంతో మేడ్చల్ లో మల్లారెడ్డిని ఓడించడం మల్లన్నకు సాధ్యం అనే వాదనలు వస్తుండగా… కోదండరాం బరిలో ఉంటారని తాజాగా జరుగుతోన్న ప్రచారం…

Read More

మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో నిలపాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తోంది. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకపోతే అప్పటికప్పుడు అభ్యర్థిని ఫిక్స్ చేయడం ఇబ్బంది అవుతుందని హైకమాండ్ గ్రహించింది. ఇందుకోసం కేసీఆర్ ముందస్తుగా ప్లాన్ బీ కూడా రెడీ చేసి ఉంచుతున్నారు. హరీష్ రావుపై మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడం వెనక హరీష్ ఉన్నారని ఎకిపారేశారు. ఇది బీఆర్ఎస్ లో ఓ అలజడిని సృష్టించింది. కేటీఆర్ , కవితలు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ మైనంపల్లిపై ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదు. ఆయన మాత్రం తనతోపాటు ఆయన కుమారిడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇద్దరికీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మల్కాజిగిరిలో మైనంపల్లి బలమైన నేతగా ఉన్నారు. అందుకే ఆయనపై చర్యలకు బీఆర్ఎస్ వెనకడుగు…

Read More

నల్గొండ నియోజకవర్గం 1.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2.దుబ్బాక నరసింహ్మ రెడ్డి 3.డా.చెరుకు సుధాకర్ 4.డా.మల్లెబోయినా ఆంజనేయులు 5.తాండు సైదుల్ గౌడ్ 6.నూనె కోటి 7.వనమాల రమేష్ నేత దేవరకొండ నియోజకవర్గం 1.నేనావత్ బాలు నాయక్ 2.డా.రవి నాయక్ 3.నేరావత్ కిషన్ నాయక్ 4.వదిత్య రమేష్ 5.రామావత్ జగన్ లాల్ 6.నేనావత్ ప్రవళిక నాయక్ 7.శ్రీ రాముల జ్ఞానేశ్వర్ 8.అంగోతు ప్రవీణ్ నాయక్ 9.కేతావత్ బీల్యా నాయక్ 10.మూడవత్ రేఖ్యా నాయక్ నాగార్జున్ సాగర్ నియోజకవర్గం 1.కుందూరు రఘువీర్ 2.జయవీర్ కుందూరు మిర్యాలగూడ నియోజకవర్గం 1.కుందూరు రఘువీర్ 2.పడిగి రాంలింగయ్య యాదవ్ 3.ముదిరెడ్డి నర్సిరెడ్డి 4.బాతులా లక్ష్మణ్ రెడ్డి 5.అలుగుబెల్లి లక్ష్మ రెడ్డి 6.చిరుమర్రి క్రిష్ణయ్య 7.గోపగాని మాధవి 8.జటంగి వెంకటనర్సయ్య 9.చిలుకూరి బాల క్రిష్ణయ్య 10.గుండు నరేందర్ రెడ్డి 11.కొర్ర నాగు నాయక్ 12.కేతావత్ శంకర్ నాయక్ 13.కర్నాటి నాగేంద్ర ప్రసాద్ 14.ముత్తినేని వీరయ్య 15.చల్లా తేజ వీరా వెంకట సత్యనారాయ…

Read More

తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోంది. అధికారానికి దగ్గరగా పార్టీ దూసుకుపోతోంది. అన్ని అనుకూలిస్తే బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పిడుగులాంటి వార్త ఒకటి కాంగ్రెస్ ను తెలంగాణలో వెనక్కి లాగే అవకాశం ఉంది. వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా షర్మిలకు లాభమో నష్టమో కానీ కాంగ్రెస్ కు మాత్రం నష్టమే. ఆమెను ఏపీకి పంపిస్తే సరేసరి..కానీ తెలంగాణలో ఉంచితే మాత్రం కాంగ్రెస్ కు కష్టకాలమే. షర్మిలకు ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు ఇదివరకే చెప్పారు. కానీ ఆమె మాత్రం తాను ఏపీకి వెళ్ళను…తెలంగాణలో రాజకీయాలు చేస్తానని పట్టుదలగా ఉన్నారు. పార్టీని విలీనం చేస్తే ఏపీలో కాంగ్రెస్ అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హైకమాండ్ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆమె మాత్రం తెలంగాణలో ఉంటానని చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల ఒత్తిడి ఫలిస్తే మాత్రం కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. 2018ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా…

Read More