Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
త్వరలోనే సీనియర్ నటుడు నరేష్ నాలుగో వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. నటి పవిత్రతో కలిసి సహజీవనం చేస్తోన్న నరేష్ న్యూ ఇయర్ లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నటి పవిత్ర, నరేష్ లు ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది. న్యూ ఇయర్ టైంలో బాగా ఈ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో బయటకొచ్చిన తరువాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. నరేష్ కు చాలా మందితో అక్రమ సంబంధాలు ఉండేవి. ఆయన చాలా దుర్మార్గుడు. తప్పులన్నీ ఆయనే చేసి నాపై నిందలు వేస్తున్నాడు. దేవుడులాంటి కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టిన నీచుడు నరేష్ అని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఈ విషయాలను ఎక్కడ…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇందుకోసం కాలేజ్ లకు, ఆఫీసులకు డుమ్మా కొట్టేసి ఆ షో చూడడానికి వెళ్తుంటారు. ఆఫీసు మేనేజ్ మెంట్ ఆ రోజు సెలవు మంజూరు చేయకపోతే ఆ ఉద్యోగానికి రీజైన్ కూడా చేస్తారు. అలాంటి వారిలో బిగ్ బాస్ తో ఫేమస్ అయిన అషూ రెడ్డి కూడా ఒకరు. ఇంతకీ అషూ రెడ్డి తన జాబ్ ఎలా పోగొట్టుకుందో తెలుసుకుందాం. అషూ రెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్నది తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో తన జాబ్ ని కూడా మానుకుందట. అషూ రెడ్డి అప్పట్లో యుఎస్ లోని డల్లాస్ లో ఒక కంపెనీలో జాబ్ చేసేది. అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు…
ఎమ్మెల్యే సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పార్టీలకు అతీతంగా సీతక్కను అభిమానిస్తుంటారు. పేదల మనిషిగా నిత్యం ప్రజల్లో ఉండే సీతక్క కొడుకు గురించి పెద్దగా బయటకు తెలియదు. కాని సీతక్క కొడుకు సూర్య కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. సీతక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేయనుండగా..ఆమె కొడుకు మాత్రం పినపాక నుంచి పోటీకి సిద్దం అవుతున్నాడు. 2018ముందస్తు ఎన్నికల్లో పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రేగా కాంతారావు బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి సూర్య అక్కడ వరుసగా పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పినపాక నుంచి బరిలో ఉండనుంది నేనేనని సంకేతాలు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు సూర్య పోటీ చేయనున్నారా..? లేదా..? అనే సందేహాలకు తాజాగా తెరదించారు సూర్య. మొదటిసారిగా పినపాక నుంచి పోటీకి రెడీ అంటూ ప్రకటించేశారు.…
కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,శృతి హసన్ ల కాంబినేషన్ లో” వాల్తేరు వీరయ్య” అనే చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం ప్రారంభమైన మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకొని మరో వారం రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే చిత్రంలో కన్పించబోతున్నాడు. ఇందులో కీలక పాత్రలో ఊర మాస్ రవితేజ నటించడంతో అటు మెగా, ఇటు రవితేజ అభిమానులు ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుండి విడుదలైన టీజర్స్ మరియు పాటలకి అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వచ్చే వారం ఈ మూవీ రిలీజ్ కానుండటంతో మెగా అభిమానులు ఆ మూవీపై భారి అంచనాలతో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ సమయంలో శృతిహాసన్ ఎదుర్కున్న ఇబ్బందుల గురించి…
బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీ శారద పీఠాదిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయ్యప్ప స్వామిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజాన్ని కించపరచడమేన్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అయ్యప్ప స్వామిపై అశ్లీలతో కూడిన వ్యాఖ్యలు చేయడం హిందూ సమజానికే అవమాన్నారు స్వరూపానందేంద్ర. ఈ దేశంలో ప్రదానమైన గుళ్ళలో శబరీమల అయ్యప్ప ఆలయం ఒకటి. కాబట్టి ఇలాంటి విదేశీ మత ద్రోహులకు అమ్ముడు పోయిన నాస్తికులు అయ్యప్ప స్వామిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజాన్ని విచ్చిన్నం చేస్తాయన్నారు. Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..? బైరి నరేష్ వ్యాఖ్యలపై స్పందించని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై మండ్డిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత మంది హిందూ దేవుళ్ళను దూషించి హిందూ సమాజాన్ని కించపరిచే అవకాశం ఉందన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని…
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పార్టీని సంస్కరించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అద్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి.. ఆయన స్థానంలో ఈటలకు బాధ్యతలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. తెలంగాణ నుంచి మరొకరిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడీ అండ్ షా లు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, బండి సంజయ్ ఎంపీలుగా ఉండగా.. వీరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అద్యక్ష పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కేంద్రమంత్రివర్గంలో తీసుకుంటే ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుందని అగ్రనాయకత్వం భావిస్తోంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్…
దిశ పేపర్ బీజేపీ అనుకూల పత్రిక అన్నది ఓపెన్ సీక్రెట్. మొదట్లో స్వతంత్రంగా వ్యవహరించిన ఆ తరువాత బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందన్నది వేరే కథ. ఇటీవల ఆ పత్రికపై విమర్శలు వస్తే తాము స్వతంత్రంగానే ఉన్నామని ప్రకటించుకుంది. ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిస్తే బీజేపీకి అనుకూలామా అంటూ విమర్శలపై కౌంటర్ రాసుకొచ్చింది. ప్రభుత్వ తప్పులను ప్రచురిస్తే అందులో తప్పే లేదు. అది పత్రిక బాధ్యత. కానీ ఆ పేపర్ మెయిన్ ఎడిషన్ కొన్నాళ్ళుగా ఎవరి వార్తలతో నిండిఉంటుంది..? ఏ పార్టీకి ప్రాధాన్యత ఇస్తుందన్నది డైలీ పేపర్ చదివే పత్రిక పాఠకులను అడిగిగితే సరి. బీజేపీకి జాకీలు పెట్టేందుకు దిశా పెద్దఎత్తున కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి అనధికారిక వ్యూహకర్త పాత్ర పోషిస్తోంది. జనాలను కన్ఫ్యూజ్ చేసి..బీజేపీకి బలం పెంచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ హవా తెలంగాణలో కొనసాగించేందుకు ఆ పార్టీ నేతలే కంటే దిశా…
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీజేపీ పెద్దలు పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలకు సైతం భారీ మొత్తంలో ఆశ చూపించి 12మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని రేవంత్ చెప్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో… పన్నెండు మంది ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఇంప్లీడ్ ఇవ్వాలని కోరుతున్నారు రేవంత్. 2018 లో కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన ఆయన.. పార్టీ మారిన12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ సీఎల్పీ నేతతో కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి…
తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. నార్త్ లో బలంగా ఉన్నా సౌత్ లోనూ సత్తా చాటాలని బీజేపీ ఉవ్విల్లురూతోంది. ఇందుకు తెలంగాణ గేట్ వే అవుతుందని భావిస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచి బరిలో నిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కమలం కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేస్తోంది. ప్రధాని మోడీ వచ్చి డెవలప్ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో తమిళనాడుపై ఫోకస్ చేయగా తాజాగా తెలంగాణపై గట్టి ఫోకస్ చేస్తోంది. సౌత్ లో బలపడెందుకు తెలంగాణ ప్రవేశ ద్వారం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రధాని పోటీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారట. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి వాజ్ పేయ్ హయంలో (1999-2004)జితేందర్ రెడ్డి బీజేపీ…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ వెనక ముందు చూసుకోకుండా వ్యవహరించారు. గంటల కొద్ది వీడియోపుటేజ్ లను మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేశారు. వాటిని ముఖ్యమంత్రులకు, చీఫ్ జస్టిస్ లకు, సుప్రీంకోర్టుకు పంపుతున్నట్లు చెప్పారు.ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తాము సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని కోర్టులో చెప్పుకోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ముందు అప్పీల్ కు వెళ్ళింది. ఈ అప్పీల్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది అసలు కేసీఆర్ సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ తరుఫు న్యాయవాది అలా జరగలేదని చెప్తుండటం గమనార్హం. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు. సీఎం…