Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
టీఆర్ఎస్ ను జాతీయస్థాయి పార్టీగా మార్చేందుకు బీఆర్ఎస్ చేశారు. ఆ పార్టీకి జాతీయ స్థాయిలో హైప్ తీసుకొచ్చేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. గతంలో ఢిల్లీలో సభను నిర్వహించి.. పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కాని ఢిల్లీలో సభ పెట్టలేదు. ఆ తరువాత ప్రెస్ మీట్ అన్నారు. ఆ మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. తాజాగా కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఖమ్మంలో ఈ నెల 18బ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ పేరు మార్చాక నిర్వహిస్తోన్న మొదటి సభ ఇదే కావడంతో.. దీనినే బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా ప్రకటించారు. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇద్దరు ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్ తోపాటు కేరళ సీఎం విజయన్ ను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో, టీఆర్ఎస్ బలోపేతానికి ఆ…
తెలంగాణ కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి జనవరి 26 నుండి జూన్ 2 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. తమను సంప్రదించకుండా పాదయాత్రను ఎలా ప్రకటిస్తారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తోన్న.. రేవంత్ మాత్రం పాదయాత్రపై వెనక్కి తగ్గే యోచనలో లేరు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని రోజుకు 19కి.మీ పాదయాత్ర చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. దాదాపు 120రోజులకు పైగా ఈ యాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్దం అవుతోంది. అధిష్టానం నుంచి పాదయాత్రకు అనుమతి రాలేదని సీనియర్లు చెప్తున్నా.. రేవంత్ మాత్రం పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజానికి గతంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నారు. కాని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్కలు రేవంత్ పాదయాత్ర చేస్తే తాము చేస్తామని అడ్డు పడటంతో రేవంత్ చేయలనుకున్న పాదయాత్ర వాయిదా పడింది. ఇక, మునుగోడు ఉప ఎన్నిక…
టాలీవుడ్ ముద్దుగుమ్మ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా షూటింగ్ లో భాగంగా ముద్దు సీన్స్ , స్కిన్ షో చేయాల్సి వచ్చినప్పుడు హీరోయిన్స్ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముద్దు సీన్స్ చేసే సమయంలో హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా సిగ్గు పడుతుంటారని చెప్పుకొచ్చింది. ఆ సీన్స్ చేసే సమయంలో కొంత భయాందోళనకు గురి కావడం జరుగుతుంటుందని చెప్పింది. ఎందుకంటే అందరి ముందు అలాంటి సీన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా అని వివరించింది. ఇకపోతే, సినిమాలతోపాటు రకుల్ వ్యక్తిగత జీవితం కూడా చర్చలో నిలుస్తునే వస్తోంది. జాకీ భగ్నానితో రకుల్ డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి సన్నిహిత బంధాన్ని కూడా పంచుకుంటున్నారు. ఇటీవల జాకీ పుట్టిన రోజు మరియు క్రిస్మస్ వేడుకలలో రకుల్ ప్రీత్ కనిపించింది. పీకలోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు…
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడుతోందని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతను జట్టులోకి తిరిగి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతని మోకాలికి సర్జరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే రిషబ్ ను ఇప్పట్లో గ్రౌండ్ లో చూసే అవకాశం ఉండదు. ఎనిమిది నెలల తరువాత పంత్ కోలుకున్నా ప్రాక్టీస్ చేయడానికి మరింత సమయం పడుతోంది. అంటే దాదాపు సంవత్సరం తరువాతే పంత్ పునరాగమనం ఉండనుంది. ఈ సమయంలోనే టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్…
హీరోయిన్ సాయి పల్లవి అరుదైన అమ్మాయి. ఓ కాన్సెప్ట్ తో సాగే హీరోయిన్. కథ సరిగా లేదనుకుంటే ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా అందులో నటించదు. అందుకే సాయి పల్లవికి తక్కువ కాలంలోనే క్రేజ్ వచ్చింది. ఇందుకే కాదు. పొట్టి , పొట్టి నిక్కర్లు వేసుకొని అందరి హీరోయిన్స్ లా స్కిన్ షో అసలే చేయదు. సాయి పల్లవిని చూస్తె నేటితరం సౌందర్యలా అనిపిస్తుంటుంది. డబ్బుల కోసం ఏమాత్రం కక్కుర్తి పడదు. సినిమా నిరాశపరిచి నిర్మాత నష్టపోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోట్లు ఆఫర్ చేసి యాడ్ లో నటించండని కోరినా.. జనాలను మోసగించే ప్రకటనలలో నటించేది లేదంటూ చెప్పేసింది. ఇన్ని గొప్ప లక్షణాలు కల్గిన అమ్మాయి కనుకే సాయి పల్లవికి ఫాలోయింగ్ ఎక్కువ. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి సినిమాలు…
ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన, టీడీపీ నేతలు చెప్తున్నారు. జగన పరిపాలనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు విపక్షాలు సిద్దం అవుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించాలంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా కాకుండా కలిసి వెళ్ళాలనే యోచనలో జనసేన- టీడీపీలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి జనసేన ప్రధాన మద్దతుదారుగా ఉంది కాబట్టి టీడీపీ – జనసేన పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ఉమ్మడిగా పోరాట కార్యాచరణ రూపొందించడానికి వీరిద్దరూ కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే, వీరి భేటీ చివరి వరకు గోప్యంగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నట్లు మీడియాకు తెలిసింది. అయితే వీరి భేటీలో పొత్తు చర్చలు…
చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం వైసీపీకి అస్సలు రుచించడం లేదు. పొత్తులపై చర్చించి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయోమోనన్నది వైసీపీ ఆందోళన. ఇదే జరిగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు- పవన్ కళ్యాణ్ చేతులు కలపడం వైసీపీకి నచ్చడం లేదు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారనే విషయం మీడియా ద్వారా తెలియగానే వైసీపీ హాహాకారాలు మొదలెట్టింది. అప్పటికీ పవన్ , చంద్రబాబుల భేటీనే ముగియలేదు. అప్పుడే రచ్చ షురూ చేసేశారు. వారి భేటీ సారాంశం బయటకు చెప్పకముందే వైసీపీ నేతలు గుండెలు బాదేసుకున్నారు. వైసీపీ రాజకీయం అలాగే ఉంటుంది మరి. ఇక, చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళారని తెలియగానే ఒక్కో వైసీపీ నేత దిగజారి మాట్లాడారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని…
ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థినికి ప్రేమ లేఖ రాశాడు. పదమూడేళ్ళ బాలికకు 47 ఏళ్ల ఉపాధ్యాయుడు తన చేతిరాతతో లవ్ లెటర్ రాసి వృత్తికి కళంకం తీసుకొచ్చాడు. పదమూడేళ్ళ బాలికపై మనసు పడిన హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్ధినికి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. దాన్ని ఇంటికెళ్ళి చదువుకోమని చెప్పాడు. దాంతో సార్ ఏం రాశాడోనని ఆతృతగా ఇంటికెళ్ళి గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి చదివింది. అందులో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. గ్రీటింగ్ కార్డు చదివిన విద్యార్థిని ఆ ఉపాధ్యాయుడి నీచపు బుద్దిని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అ ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్…
ఇటీవల మెగా బ్రదర్స్ పై ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను తాజాగా ఖండించారు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. ఆమె ఇలా నిరాదర ఆరోపణలు చేస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ఉనికి కోసం మెగా బ్రదర్స్ పై నిందలు మోపడం సరైంది కాదంటూ రోజాకు గెటప్ శ్రీను హితవు పలికారు. అసలు విషయం ఏంటంటే…మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ మంత్రి రోజా ఇటీవల దారుణమైన కామెంట్స్ చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదు. కనీసం సొంత జిల్లా ప్రజలకు కూడా ఏమి చేయలేదు. అందుకే ముగ్గురు అన్నదమ్ములను ఏపీ ప్రజలు ఓడించారు. ఎన్టీఆర్ , ఎంజీఆర్, జయలలిత తమకు జీవితం ఇచ్చిన ప్రజలకు మేలు చేశారు. మెగా బ్రదర్స్ ను నెత్తినమోసిన తెలుగు ప్రజలకు వారు ఏం చేయలేదని రోజా మండిపడ్డారు. రోజా వ్యాఖ్యలపై నాగబాబు ఎదురుదాడి చేశారు. రోజా నోరు మున్సిపాలిటీ చెత్త…
శనివారం శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ-20మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరెగిపోయాడు. ఆకాశమే హద్దుగా భీకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి లంక బౌలర్లు, ఫీల్డర్లు ఆకాశానికేసి చూడటమే సరిపోయింది. సిక్సులు, ఫోర్లతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య ఇన్నింగ్స్ చూసిన వారంతా ఇదేం బ్యాటింగ్ శైలిరా మావా. ఇలా కొత్తగా ఆడుతున్నాడనేలా వైవిధ్యమైన బ్యాటింగ్ తో అలరించాడు. స్టేడియం నలుమూలలా బౌండరీలు బాది లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. బాల్ వేగంతో వేస్తె స్టాండ్ లోకి వెళ్తుంది. దీంతో తెలివిగా లంక బౌలర్లు స్లో బంతులు విసిరినా సేం రిజల్ట్ రుచి చూపించాడు మిస్టర్ 360సూర్య కుమార్ యాదవ్. బాల్ ఎక్కడ వేసినా, ఎలా వేసినా ఫైనల్ రిజల్ట్ మాత్రం బంతి స్టాండ్ లోకి వెళ్ళడమే. దిగ్గజ బ్యాట్స్ మెన్ కు కూడా తెలియని టెక్నిక్ తో క్రికెట్ కు సరికొత్త ఆటను పరిచయం…