Author: Prashanth Pagilla

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా నియామకమైన మాణిక్ రావు థాకరే రంగంలోకి దిగబోతున్నారు. బుధ, గురువారాల్లో తెలంగాణ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సీనియర్ నేతల అసంతృప్తిని మాణిక్ రావు థాకరే అడిగి తెలుసుకున్నారు. కొత్త ఇంచార్జ్ వస్తోన్న నేపథ్యంలో సీనియర్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందోనని టి. కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఏ ఇంచార్జ్ నేత వచ్చిన వారితో సీనియర్లు సఖ్యతగా మెదిలింది లేదు. వారిపై ఆరోపణలు చేయడం అసమ్మతి నేతలు పనిగా పెట్టుకున్నారు. అప్పట్లో కుంతియా వచ్చినా తరువాత మాణికం ఠాగూర్ వచ్చినా అసంతృప్తి నేతల తీరు మారలేదు. ఇదివరకు వచ్చిన ఇంచార్జ్ నేతలందరూ సీనియర్లతో సాఫ్ట్ గానే వ్యవహరించారు. కాని ఇప్పుడొస్తోన్న మాణిక్ రావు థాకరే మాత్రం కఠినంగా ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. మొదటగా ఆయన సాఫ్ట్ గా ఉంటారని ఆ తరువాత తనకు నచ్చకపోతే తన స్టైల్…

Read More

-తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు. -సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు. -కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు. -రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించిన కేంద్రం -కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు. -క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్. -క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం. -క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్ గా కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులను…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చంద్రబాబును కలిశారు. అయితే, చంద్రబాబును రజినీకాంత్ ఎందుకు కలిశారన్నది క్లారిటీ లేదు. మర్యాదపూర్వక భేటీగానే టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుతో రజినీకాంత్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంతోనే హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు చంద్రబాబును కలుస్తుంటారని చెబుతుంటారు. అదే సమయంలో.. బాబు కుటుంబంలో ఎవైన శుభకార్యాలు ఉన్నప్పుడు రజినీకాంత్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. అయితే, పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన మరుసటి రోజే రజినీకాంత్ చంద్రబాబు ఇంటికి వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. సినీ ప్రముఖులు వరుసగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు, రజినీకాంత్ స్నేహితులు. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీకి మద్దతు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వంలో, పార్టీలో కనీసం పదవి కూడా కట్టబెట్టలేదు. ఈ మధ్య ఓసారి…

Read More

నాగాలాండ్ ఎన్సీపీ రాష్ట్ర అద్యక్షుడు సులంతుంగ్ హెచ్ లోథా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఇటీవల భేటీ అయ్యారు. నాగాలాండ్ లో బీఆర్ఎస్ విస్తరణపై వీరి భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రికి లోథా వివరించారు. నాగాలాండ్ లోనూ బీఆర్ఎస్ ను విస్తరించాలని.. వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తమ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ను విస్తరించాలని కోరినా లోథా..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తాను చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాగాలాండ్ లో ఎన్నికలు జరగనున్న క్రమంలో లోథా బీఆర్ఎస్ మంత్రితో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఎన్నికల్లో పోటీకి ఆయనతోపాటు మరికొంతమంది ఆసక్తిగా ఉండటంతోనే ఈ భేటీ జరిగినట్లు…

Read More

పవన్ కళ్యాణ్ , చంద్రబాబులు మళ్ళీ ఒకటి అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను కలిసి పోటీ చేదామని చంద్రబాబు కోరారు. కాని పవన్ మాత్రం తన బలమేంటో నిరూపించుకుంటానని.. ఒంటరిగా పోటీ చేశారు. దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీతో దూరంగానే ఉండిపోయారు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి సాగిన ఎలాంటి ప్రయోజనం లేదని.. ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇక టీడీపీకి దూరం అయినట్లేనని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీతో కలిసి నడించేందుకు అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్.అయితే, ఆయన ఉన్నట్టుండి టీడీపీకి మద్దతు తెలిపేందుకు కారణం జగన్ రెడ్డే. అధికారం ఉందనే అహంకారంతో రాజకీయ నాయకులను వేధించడం..కొత్త జీవోలు అమలు చేసి ప్రతిపక్ష నాయకులను జనాల్లోకి వెళ్ళకుండా చేయాలనుకుంటున్నారు జగన్. ఇవే పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య ఐక్యతకు దారితీస్తున్నాయి. విడివిడిగా ఉంటే జగన్ ను ఎదుర్కోవడం…

Read More

తెలంగాణ దుఃఖిస్తోంది. ఉబికివస్తోన్న కన్నీటిని దిగమింగుకోలేక.. ప్రభుత్వాధినేత హామీ అమలుకై నిలదీసేందుకు వెళ్లిన సామాన్యుల ఊపిరితీయాలనే అధికార పార్టీ నాయకుల అరాచకాన్ని చూసి ఊపిరాడక రోదిస్తోంది. ఎవనిపాలయిందిరా తెలంగాణ అని ఉద్యమకారులను కన్నీటితోనే ప్రశ్నిస్తోంది. మార్కేండయ ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడటమే లేదు. ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో తెలియదు. ఎప్పటికీ పూర్తి చేస్తారో క్లారిటీ లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆ ప్రాజెక్టు స్థల సందర్శనకు పిలుపునిచ్చారు. అ ప్రాజెక్టు ఉన్నది పాకిస్తాన్ సరిహద్దులో అన్నట్లు అక్కడికి వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉసిగొల్పాడు.ఇంకేముంది బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. నన్ను వదిలిండేయా మీ కాళ్ళు పట్టుకుంటానని బాల్య నాయక్ అనే గిరిజన వ్యక్తి బతిమాలితే.. గొంతుపై కాలేసి అణచివేశారు. హాహాకారాలు…

Read More

కొత్త సంవత్సరంలో తొలి పండగ సెలవులపై ఆతృతతో ఎదురుచూస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఎప్పుడెప్పుడు పరీక్షలు రాసి పట్టణం నుండి పల్లె వైపుకు ప్రయాణం చేయాలన్న ఉత్సుకతతోనున్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీ, గురుకులకు చెందిన విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీల్ మిట్టల్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈనెల 14 వ తేదీన భోగి, 15న మకర సంక్రాంతి,16న కనుమ పండగ సందర్బంగా కేవలం మూడు రోజులు సెలవు దినాలుగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు రోజుల సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు మళ్ళి 17 వ తేది మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

Read More

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని శివచరణ్ రెడ్డి అనే యువకుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప ఎవరూ లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించగా.. తాజాగా శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మిదేవి ఓ వీడియో విడుదల చేశారు. చంద్రశేఖర్ తనతో 18 ఏళ్లు కాపురం చేశారని, తమ కుమారుడు శివచరణ్ రెడ్డిని అప్పట్లో ఆయన బాగా చూసుకునే వారని అన్నారు. తనకు 15 ఏళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని కాని, రెండేళ్లకే కొండారెడ్డి తనను వదిలేసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. దీంతో తాను తన పిన్ని ఇంటికి వచ్చానన్నారు. అప్పుడు తన విషయం మా మామ, చంద్రశేఖర్ రెడ్డికి చెప్పారని లక్ష్మిదేవి చెప్పుకొచ్చారు. మోసం చేసిన వ్యక్తి గురించి ఎక్కువ బాధపడొద్దని.. నిన్ను చూసుకుంటానని చంద్రశేఖర్ చెప్పినట్లు చెప్పారామె. పెళ్లి చేసుకుంటానని నమ్మించి…

Read More

-18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -అమిత్ షా తో భేటీ తర్వాత పొంగులేటి నిర్ణయం -అనుచరుల ను సిద్ధం చేస్తున్న పొంగులేటి -పొంగులేటి బిజెపిలోకి చేరిక దాదాపు ఖరారు -రేపటి నుంచి నియోజకవర్గాల్లో అనుచరులతో భేటీ -శ్రీనివాసరెడ్డి తో నేరుగా అధిష్టానం మంతనాలు….. ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వమే రంగంలోకి దిగింది. ఇందుకోసం కేంద్రహోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ నెల 18న అమిత్ షా తో పొంగులేటి సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయమై అయన అనుచరులకు ఆల్రెడీ సంకేతాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి తన అనుచరులతో భేటీ కానున్న…

Read More

ప్రేమించడం తప్పా..? కానే కాదు. ప్రేమ పేరుతో వంచించడమే తప్పు. ఇది మనసుకు గాయం చేస్తుంది. చాలా కాలంపాటు మనసుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. ప్రాణాలు బలితీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఓ యువకుడు ప్రేమలో మోసపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణమేంటో సూసైడ్ లెటర్ లో ప్రస్తావించాడు. ఈ విషాదకర ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడకు చెందిన బీటెక్‌ విద్యార్థి అబ్దుల్‌ సలామ్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ లెటర్ లో రాశాడు. తనను ప్రేమించిన యువతిలో మార్పు రావడంతో.. ఆ మార్పుకు కారణమేంటని ఆరా తీస్తే షాకింగ్ నిజాలు తెలిసాయని వాపోయాడు. పెళ్ళైన వ్యక్తితో న్యూడ్ కాల్స్ చేస్తూ రిలేషన్ ఉందని రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసి తాను మానసికంగా చాలా బాధపడ్డానని పేర్కొన్నాడు. తనను మార్చేందుకు చాలాసార్లు ప్రయత్నించానని అయినా, తనలో కించిత్ మార్పు లేదని…

Read More