Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
భారత్ జోడో యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. దేశ ఐక్యతే ధ్యేయమని చాటుతూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇటీవల బీజేపీ చేపట్టిన ర్యాలీలకు మాత్రం జనం ఆదరణ అంతగా లభించలేదు. రాహుల్ యాత్రకు మాత్రం జననీరాజనం పలుకుతున్నారు. దీనిని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం హైలెట్ చేసింది. ఇంకేముంది బీజేపీకి ఎక్కడో మండింది. రాహుల్ గాంధీని అవమానించేందుకు గతంలో ఏవేవో ప్రయత్నాలు చేసిన బీజేపీ సోషల్ మీడియా వింగ్ మరోసారి అలాగే విఫలయత్నం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల రాహుల్‌గాంధీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్న ఫోటోను మార్ఫింగ్ చేసి తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. రాహుల్‌గాంధీ అల్పాహారం ముందున్న టీ గ్లాసుకు బదులుగా మందు గ్లాస్ పెట్టడం, డ్రై ఫ్రూట్స్ స్థానంలో మాంసాహారం ప్లేట్‌ని మార్చి ఆ ఫోటోను సోషల్ మీడియాలో బీజేపీ సోషల్ మీడియా విభాగం…
కువైట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతుల పట్ల రిక్రూమెంట్ ఏజెన్సీ సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఉద్యోగాలకు పిలిచి నగ్నంగా ఇంటర్వ్యూలు చేయించారని ఓ యువతి చెప్పడంతో సంస్థపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. కువైట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల కోసం స్పెయిన్ లో గత ఏడాది నవంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎయిర్ వేస్ తరఫున ఓ రిక్రూమెంట్ ఏజెన్సీ ఈ ఇంటర్వ్యూను నిర్వహించింది. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పిన రిక్రూమెంట్ ఏజెన్సీ సిబ్బంది యువతులను ఒక్కరోక్కరిగా లోనికి పిలిచారు. ఇంటర్వ్యూ చేసే గదిలోకి వెళ్ళాక యువతుల బట్టలు విప్పించినట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. యువతుల శరీరంపై టాటూలు ఇతర మచ్చలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు బట్టలు విప్పించారని దరఖాస్తు చేసుకున్న యువతి తెలిపింది. ఒంటిపై కేవలం లోదుస్తులతో నిల్బోబెట్టారని…
ఆస్కార్ బరిలో ఈసారి ఇండియా కూడా నిలిచింది. భారతదేశానికి చెందిన చాలా సినిమాలు షార్ట్ లిస్టు అయ్యాయి. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్, రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాటు వివాదాస్పద చిత్రంగా నిలిచిన ది కాశ్మీర్ ఫైల్స్ చోటు దక్కించుకున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్ కోసం వరల్డ్ వైడ్ గా 301 చిత్రాలు పోటీ పడుతున్నాయి. జనవరి 12 నుంచి 17వ వరకు షార్ట్ లిస్ట్ అయిన చిత్రాలు ఓటింగ్లో నిలుస్తాయి. ఆయా విభాగాల వారీగా అత్యధిక ఓట్లు పొందిన సినిమాలు నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటాయి. ప్రతి విభాగం నుంచి ఐదేసి చిత్రాలు నామినేషన్ లో నిలుస్తాయి. అలా వాటిలో ఒకటి ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తుంది. వరల్డ్ వైడ్ చిత్రంగా ఓ సినిమా గుర్తింపు పొందటం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని అదంతా ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలతో పోటీ పడి…
నీరాకు వేదామృతం అని పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బ్రాహ్మణ, గౌడ కులస్థుల మధ్య వివాదం రాజుకుంది. వేదాలను కించపరిచేలా నీరా( కల్లు) కు ఆ పేరు ఎలా పెడుతారని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నీరా అంటే మత్తు పదార్థం కానే కాదు. కల్లును మత్తు లేకుండా చేసి తాగేదే “నీరా”. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా బ్రాహ్మణ సంఘాలు రచ్చ చేస్తున్నాయి. ప్రకృతిసిద్ధంగా వచ్చిన నీరా స్వచ్ఛమైనదని తెలిపే ఉద్దేశంతో వేదామృతమని పేరు పెడితే బ్రాహ్మణ సంఘాలు రచ్చ చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. మత్తు పదార్థానికి వేదామృతం అని పేరు పెడితే తప్పుపట్టాల్సింది కాని, మత్తు లేని పానీయానికి వేదామృతం అని నామకరణం చేస్తే బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారో తెలియడం లేదు. నీరా కేఫ్ పేరును వేదామృతం అని…
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు హైకోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన తెలంగాణలో సీఎస్ కొనసాగేందుకు అనర్హుడని తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ గురువారం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల సమయం కావాలని కోరినప్పటికీ హైకోర్టు నిరాకరించింది. గురువారం ఏపీలో రిపోర్ట్ చేయాలనీ డీవోపీటీ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆయన సీఎస్ పదవిని అధికారికంగా కోల్పోయినట్లే. దాంతో వెంటనే సోమేశ్ కుమార్ ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమైన ప్రయోజనం లేకుండా పోయింది. సోమేశ్ కుమార్ ను ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కొత్త సీఎస్ ను నియమించుకోవాల్సి ఉంది. తెలంగాణలో సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో అనే విమర్శలు ఉన్నాయి. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ధరణి అంశం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి…
సినిమాలకు ఎప్పుడో దూరమైనా నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారు.ఆయన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇటీవల గుంటూర్ జిల్లాలో టీడీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన తారకరత్న తాను ఎన్నికల్లో పోటీకి సిద్దమని ప్రకటించేశారు. కాని ఆయన పోటీ ప్రకటనను టీడీపీ సీరియస్ గా తీసుకోలేదు. ఆయన మాత్రం టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించాలని తాజాగా లోకేష్ ను కలవడంతో స్పష్టమైంది. ఏపీలో ఎదో ఓ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున తారకరత్నకు టికెట్ ఇవ్వడం కష్టమే. ఎందుకంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలే ఉన్నారు. ఎదో సర్దుబాటు చేసి తారకరత్నకు టికెట్ ఇచ్చినా ఆ నియోజకవర్గానికి ఆయన కొత్త అవుతారు. దీంతో ఆయనను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంపై టీడీపీ సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కాకపోతే, టీడీపీకి నందమూరి కుటుంబం మద్దతు కావాలని…
సహజనటి జయసుధ నాటి స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తునే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన జయసుధ ఇప్పటికీ కొన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోయిన్ కంటే కూడా ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఆరు పదుల వయస్సు దాటి ఏడు పదుల వయసుకు సమీపిస్తోన్న జయసుధ మరో పెళ్లికి సిద్దమైందంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలం కిందట ఆమె భర్త మరణించడంతో ఆమె రెండో పెళ్లికి రెడీ అయిందని ప్రచారం జరిగింది. మరోవైపు.. ఒంటరితనం అనుభవించలేక మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుందని వార్తలు వస్తున్నాయి. వీటిపై చాలామంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఏడు పదుల వయసులో పెళ్లి ఏంట్రా అని తప్పుబట్టారు. అయిన జయసుధ రెండో పెళ్లి…
ఎమ్మెల్యే సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పేదల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే సీతక్కను పార్టీలకతీతంగా అభిమానిస్తుంటారు. ములుగు నియోజకవర్గంలో సీతక్క అంటే ఎనలేని అభిమానం చూపే ప్రజలే ఆమె బలం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లలో ముందు వరుసలో నిలిచే సీటుగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తోన్న ములుగు నియోజకవర్గం ఉంటుంది. అందుకే సీతక్క ఓటమి కోసం అప్పుడే కేసీఆర్ అండ్ కో ప్రణాలికలు సిద్దం చేస్తోంది. సీతక్కకు అధికార పార్టీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. మంత్రి పదవి ఆఫర్లు వచ్చాయి. ఆర్ధిక పరమైన ఆఫర్లు వచ్చాయి కాని వాటన్నింటికి సీతక్క నో చెప్తూ.. కాంగ్రెస్ తోనే కలిసి సాగుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సీతక్కను ఓడించే నేత కోసం అన్వేషణలో పడ్డారు కేసీఆర్. ములుగులో సీతక్కను ఓడించే నేత బీఆర్ఎస్ నుంచి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చూపు ములుగులో పట్టు…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీకి అనుబంధ సంఘాలు వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అగ్రనేత బీఎల్ సంతోష్ ను కేసీఆర్ టార్గెట్ చేయడం పట్ల ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఇన్నాళ్ళు తెలంగాణపై పెద్దగా దృష్టి సారించని ఆర్ఎస్ఎస్ పెద్దలు ఫామ్ హౌజ్ కేసులో బీఎల్ సంతోష్ ను బీఆర్ఎస్ అధినేత ఇరికించాలని చూడటంతో కేసీఆర్ పతనమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈమేరకు హైదరబాద్ లో ఆర్ఎస్ఎస్ తోపాటు హిందుత్వ సంఘాల కీలక నేతలు సమావేశమై చర్చించారు. డిసెంబర్ లో తెలంగాణ పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేసీఆర్ ను హెచ్చరించి వెళ్ళారు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో కాని బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ అనుబంధ సంఘాలు కూడా తమ శక్తిని వినియోగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఎల్ సంతోష్ బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. ఆర్ఎస్ఎస్ తరుఫున…
పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కాగానే బీజేపీ శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పవన్ టీడీపీతో వెళ్తే బీజేపీకి ఇబ్బంది అవుతుందని ఆయన్ను పచ్చ పార్టీ వైపు వెళ్ళకుండా ప్రయత్నాలు చేస్తోంది. తమతో ఉంటే సీఎంను చేస్తామని చంద్రబాబుతో వెళ్తే ఎప్పటికీ సీఎం కాలేరనే సందేశాన్ని ఏపీ బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. సీట్లు లేవు. ఇక పవన్ ను సీఎంను ఎలా చేస్తారని సందేహాలు ఉండొచ్చు. అందుకే తాము తలచుకుంటే రాజకీయం ఎలా ఉంటుందోనని సంకేతాలు పంపుతున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఎంతసేపో పట్టదని చాలా ఉదాహరణలు చెబుతున్నారంటున్నారు. ఏపీలో కాపులకు సీఎం పదవి రావాల్సి ఉందని..పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్తే అది ఎలా సాధ్యమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సీఎం పదవిని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చైర్ లో కూర్చోబెడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.…