Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ కాల్పుల్లో హిడ్మా మృతి చెందలేదని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మా చనిపోయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సేఫ్‌గానే ఉన్నట్టుగా చెప్పారు. దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు.. డ్రోన్‌లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయని లేఖలో ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులు ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారని అందులో భాగంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. పాలకులకు వ్యతిరేకంగా ప్రగతిశీల, విప్లవ, ప్రజా సంఘాలు ఏకం కావాలని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతిచెందినట్టుగా వార్తలు వచ్చాయి. హిడ్మా మరణాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించనప్పటికీ..…
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో ఉంటానని చెప్పిన వైఎస్ షర్మిల అక్కడ గెలిచేందుకు అప్పుడే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా పాలేరులో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలపై ఫోకస్ పెట్టారు. పాలేరు నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లకు ఆరోగ్య శ్రీ కార్డు తరహాలో కార్డులను ఇచ్చి ఉచిత వైద్యం అందించేలా ప్రిపేర్ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా హైదరాబాద్ లోనూ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించేలా ఉచిత వైద్యానికి అందే ఖర్చును పార్టీనే భరించేలా కసరత్తు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్స్ లను ఇప్పటికే రెడీ చేశారు. ఇక పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్, కాలేజ్ లో ఉచిత విద్య అందించేలా ఖర్చు చేయాలనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళతో ఒప్పందం చేసుకొని ఆ ఫీజ్ ను పార్టీనే భరించేలా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. వచ్చే…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అంటూ హడావిడి చేసింది బీజేపీ బలం పెంచుకునేందుకే తప్ప నిజానికి ఆమె అరెస్ట్ ఉండబోదని స్పష్టత వస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పై సానుభూతి పెరుగుతుందని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే కవిత అరెస్ట్ పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల డైరక్షన్ లో పని చేసే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈమేరకు దూకుడు తగ్గించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో హైదరాబాద్ లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. 91 సీఆర్పీసీ ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ సమకూర్చాలని ఆదేశించారు. ఎప్పుడు సమర్పిస్తారు..? ఎలా సమర్పిస్తానేది గోప్యంగా ఉంచారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేశారని..10మొబైల్ ఫోన్లు పగలగొట్టారని చార్జ్ షీట్లలో సీబీఐ విచారణకు మునుపే ఈడీ పేర్కొంది. సిమ్ కార్డులు కూడా మార్చారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఆమె కీలక…
సాధారణంగా అద్దెకు ఇళ్ళను, వస్తువులను ఇస్తుంటాం. కాని భార్యలను కూడా అద్దెకు ఇస్తారని ఎప్పుడైనా విన్నారా..? భార్యలను అద్దెకు ఇవ్వడమెంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. భార్యలను అద్దెకు ఇచ్చే సంప్రదాయం ఎక్కడో కాదు మన దేశంలోనే. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో భార్యలను అద్దెకిచ్చే సంప్రదాయం మనుగడలో ఉంది. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని రూపుమాపేందుకు ప్రయత్నించిన అక్కడి ప్రజలు మాత్రం ససేమీరా అంటున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని విడనాడేందుకు తాము సిద్దంగా లేమని ఖరాఖండిగా చెప్తున్నారు. శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరాలపాటు అద్దెకు ఇస్తారు. దీన్ని ధదీచ ప్రాత అని పిలుస్తుంటారు. భార్యను అద్దెకు తీసుకెళ్ళే వ్యక్తి వారి భర్తలకు రూ.10 లేదా 100 స్టాంపు కాగితాలపై సంతకాలు పెట్టి, ధర మాట్లాడుకుని అద్దెకు తీసుకుపోతారు.…
చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఎప్పుడు చూసేద్దామా అనే ఆతృతతో అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు మెగా అభిమానులు. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ఏపీలోనూ ఈ సినిమాకు 25రూపాయలు పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఈ మూవీపై పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మెగాస్టార్ కొత్త రికార్డ్ లను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు భారీగానే చేశారు. ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని చిరంజీవి ఈసారి మాత్రం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇటీవల మెగాస్టార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలను…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను వాడుకునేందుకు ఈ సినిమాలను అడ్డుపెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు అధికార పార్టీ కాచుకుకూర్చుకుందని..ఇద్దరు హీరోల అభిమానులు అలర్ట్ గా ఉండాలని నారా లోకేష్ సూచించారు. సినిమాలనేవి వినోదం కోసమేననే విషయాన్ని గుర్తించాలని నారా లోకేష్ సూచించారు. ఈ రెండు సినిమాలపై దుష్ప్రచారం చేస్తు సోషల్ మీడియా ప్రచారాలతో ఒకరి ఫ్యాన్స్ పై మరొకరి ఫ్యాన్స్ ను ఉసిగొల్పే ప్రమాదం ఉందని అలాంటి వారి ఉచ్చులో చిక్కుకోవద్దని లోకేష్ చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏపీలో అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన చేయవచ్చుననే విధంగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలు బాగా ఆడాలని లోకేష్ ఆకాంక్షించారు. సినిమాలను తాను చూస్తానని అభిమానులు కూడా చూడాలని అన్నారు. కాకపోతే ఈ సినిమాలను రాజకీయాల కోసం వాడుకునే ప్రమాదం…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. అందుకే వైసీపీ నేతలు నోటికి పని చెప్తున్నారు. పొత్తు కోసమే ఈ భేటీ జరిగిందంటూ మాట్లాడేస్తున్నారు. అంతేకాదు.. టీడీపీని జనసేన అడిగిన సీట్లు ఇవేనంటూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ చెబుతున్న ప్రకారం -టీడీపీని జనసేన కోరిన సీట్లు ఇవేనట 1.విశాఖ నార్త్ 2. చోడవరం 3. గాజువాక 4. భీమిలి 5. యలమంచిలి 6.రాజానగరం 7. అమలాపురం 8.రాజోలు 9. కాకినాడ రూరల్ 10. భీమవరం 11. నరసాపురం 12. తాడేపల్లి గూడెం 13. కైకలూరు 14. విజయవాడ పశ్చిమ 15. తెనాలి 16. సత్తెనపల్లి 17. గుంటూరు పశ్చిమ 18. దర్శి 19. గిద్దలూరు 20. చీరాల 21. చిత్తూరు 22. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న ఈ ప్రచారంపై జనసైనికులు స్పందించారు. చంద్రబాబు, పవన్ భేటీలో వైసీపీ నేతలు ఏమైనా కూర్చున్నారా ? లేక…
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్ – తెలంగాణ సరిహద్దులో చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు, గ్రే హౌండ్స్ దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో హిడ్మాను హతం చేశారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, CRPF కోబ్రా కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా హతమయ్యాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో హిడ్మా మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీలో చేరారు. ఆ తరువాత పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా కేంద్ర కమిటీలో కీలక సభ్యుడుగా మారాడు. ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా ఉన్నాడు. దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. మావోయిస్ట్ పార్టీలో చేరకముందు వ్యవసాయం చేస్తుండేవాడు. చదివింది ఏడో తరగతే అయినా ఓ లెక్చరర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో ప్రావీణ్యం ఉంది. 2001-02…
ఏపీ మంత్రి అంబటి రాంబాబు నయా దందా స్టార్ట్ చేశాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయనో లేక అధికారం ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటున్నారో కాని కక్కుర్తి పనులు మానడం లేదు. ఓ బిడ్డను ప్రమాదంలో కోల్పోయిన తల్లికి వచ్చిన పరిహారంలో సగం డిమాండ్ చేసి వివాదంలో ఇరుక్కున రాంబాబు.. మరో కక్కుర్తికి పాల్పడినట్లు తేలడంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సత్తెనపల్లిలో వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కొత్త స్కీమ్ ను ప్రారంభించారు. వాలంటీర్లను ఉపయోగించి.. ప్రభుత్వ పథకాలు పొందిన వారితో బలవంతంగా టికెట్లు అమ్మించి డబ్బులు వసూళ్లు చేశారు. ఈ తతంగమంతా మంత్రి అంబటి కనుసన్నలో నడిచింది. జనవరి 12న డ్రా నిర్వహించి విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటర్ సైకిళ్లు, 13 ఎల్ఈడీ టీవీలు, 75 మిక్సీలు అందిస్తామని ప్రకటించారు. ఒక్కో కూపన్ ధర వంద రూపాయలుగా…
ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు “ఆర్ఆర్ఆర్” మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉదయం మూవీ యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. థాంక్యూ సోమచ్ మావయ్యా అంటూ చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం జగన్ లు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు విషెస్ చెప్పగా వారికి కూడా ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. సీఎం జగన్‌కు ధ్యాంక్యూ సార్ అని రిప్లై ఇవ్వగా..ప్రధాని మోదీకి కూడా అదే విధంగా స్పందించి.. రీట్వీట్ చేశారు. జగన్, మోదీలు ఆర్ఆర్ఆర్ కు అవార్డు వచ్చిన విషయాన్ని చెబుతూ చేసిన ట్వీట్‌లో ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్‌లో మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్యాగ్ చేయలేదు. కీరవాణితో పాటు రాజమౌళిని…