Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వసంత కృష్ణా ప్రసాద్ వైసీపీని వీడే యోచనలో ఉన్నారని..టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. మైలవరం నియోజకవర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ చేరికపై అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దేవినేని ఉమను కాదని కృష్ణప్రసాద్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున సీట్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన తండ్రి కేశినేని నాని ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర్ రావు కేశినేని నానిని ప్రత్యేకంగా కలిశారు. ఆ తరువాత కేశినేని నాని మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో ఎవరు..? ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని కేశినేని నాని ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే.. దేవినేని ఉండగా చంద్రబాబు మరొకరికి మైలవరం టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ…
తాను జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమె అంటూ స్టార్ కమెడియన్ హైపర్ ఆది బాంబ్ పేల్చారు. ఆది జబర్దస్త్ మానేయడం ఏంటి..? అందుకు ఆమె కారణం అనడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఈ కథనం పూర్తిగా చదివితే మీకే అర్థం అవుతుంది. అనసూయ జబర్దస్త్ మానేశాక ఆమె ప్లేసులో రష్మీ గౌతమ్ వచ్చారు. కొద్ది వారాలు రష్మీ జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించాక… కన్నడ అమ్మాయి సౌమ్యరావును జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు. దీంతో రష్మీ యధావిథిగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తోంది. ఇక, జబర్దస్త్ లో హైపర్ ఆదిదే హవా.అతని స్కిట్ కున్న డిమాండ్ దృష్ట్యా అతను జబర్దస్త్ ను శాసిస్తాడు. ఎవరిపైననా కామెంట్స్ చేయగలడు. ఆది కంటే సీనియర్ అయిన అనసూయనే వదలలేదు. ఇక కొత్తగా వచ్చిన సౌమ్యరావును ఎలా వదులుతాడు. ఆమెపై కూడా సెటైర్ల మోత మోగించాడు. హైపర్ ఆది కామెంట్స్ కు కౌంటర్…
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం ప్రదర్శించారు. పవన్ ను కెలికితే ఎలా ఉంటుందో రుచిచూపించారు. ఒక్కొక్కరిని పాయింట్ అవుట్ చేస్తే ఇచ్చి పడేశారు. జగన్ పేరును ఎక్కడ ప్రస్తావించకుండానే మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ కొత్త పేరుతో పిలిచారు. ఈ పేరు భలే గమ్మత్తుగా ఉండటంతో ఇక నుంచి జగన్ ను మూడు ముక్కల సీఎంగానే పిలుస్తారేమో. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తోన్న మంత్రి అంబటి రాంబాబుకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయలనిపిస్తే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని.. అప్పుడు చెప్పులతో బడితెపూజ చేస్తానని హెచ్చరించారు. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తోన్న రోజాను కూడా విమర్శించారు పవన్. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రస్తావించకుండా వెధవా.. నీ పేరు కూడా గుర్తు పెట్టుకుంటాం ఏంట్రా ? అని పవన్ ఇచ్చి పడేశారు. వ్యక్తిగతంగా…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “వాల్తేరు వీరయ్య ” శుక్రవారం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ఈ మూవీ ద్వారా మెగాస్టార్ లో నున్న టైమింగ్ ను బయటకు తీసానని చెప్పిన డైరక్టర్ బాబీ నిజంగా ఆ పని చేశాడా..? చాన్నాళ్ళ తరువాత చిరు ఖాతాలో భారీ హిట్ పడబోతుందన్నది నిజమేనా..? అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. కథ : జాలరిపేటలో ఉండే వీరయ్య(చిరంజీవి) ఆ పేటకు పెద్ద మనిషి. ఆ పేటలోని వీరయ్య మాటను ఎవరూ జవదాటరు. ఆయన ఏది చెప్తే అది చేసేస్తారు. ఆయన అంటే ఆ పేట వాసులకు విపరీతమైన అభిమానం ఉంటుంది. అయితే, వీరయ్యతోనే ఉంటూ కొంతమంది ఆయనకు తెలియకుండా డ్రగ్స్ దందా చేస్తారు. విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ ( రవితేజ) పేటకు వెళ్లి డ్రగ్స్ సరఫరా చేస్తోన్న వాళ్ళను అరెస్ట్ చేస్తారు. తమ వాళ్లకు ఏ పాపం తెలియదని…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మారేలా లేరు. మాణికం ఠాగూర్ ను తొలగించి మాణిక్ రావు థాకరేను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా అపాయింట్ చేసినా సీనియర్లు బెట్టు వీడటంలేదు. మాణిక్ రావు థాకరే మొదటి సారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సీనియర్ నేతలు తమ పంథా మార్చుకోకపోవడం గమనార్హం. గాంధీభవన్ కు వచ్చి కలవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాకరే సూచించారు. గాంధీ భవన్ కు తాను రానే రానని వెంకట్ రెడ్డి చెప్పారు. దాంతో బయట హోటల్లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో థాకరేను కలిసి మాట్లాడారు. ఆ తరువాత ఆయన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను తాను ఏమాత్రం ఖాతరు చేయలేదని చెప్పేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వెంకట్ రెడ్డికి హైకమాండ్ రెండు సార్లు షోకాజ్ నోటిసులు జారీ చేసింది. వాటిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అవి ఎప్పుడో…
ఈ నెల 23న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ , బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. కాకపోతే వివాహ ముహూర్తం కొద్దిగా లేట్ అయింది. భారత జట్టు తరుఫున నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ పెళ్లి పీటలు ఎక్కనుండటంతో మరికొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరంగా వుండబోతున్నాడు. వీరి వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. కేఏల్ రాహుల్ ,అతియా శెట్టి విహహ వేడుకలు ముంబైలో అతియా శెట్టి నివాసంలో జరుగనున్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి విహహ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ నుంచి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు వివాహ…
మంత్రి పదవిని కోల్పోయాక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వైసీపీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్న పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో నెల్లూరు నుంచి నారాయణ పై గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. పిన్న వయస్సులోనే జగన్ దృష్టిని ఆకర్షించి మంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేయడంలో అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉంది. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఆ కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్ కు అడ్డం తిరిగారు. మంత్రి పదవి పోయిన తరువాత ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అనిల్ కుమార్ వ్యతిరేక వర్గమంత ఆయన బాబాయ్ రూప్ కుమార్ చెంతకు చేరింది. మొన్నటివరకు అనిల్ యాదవ్ తో ఉన్న నేతలు ఆయన…
వన్డే వరల్డ్ కప్ కు ఆటగాళ్ళ ఎంపికపై బీసీసీఐ దృష్టి పెట్టింది. 2011లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత టీమిండియాకు మరోసారి కప్ ను అందుకునే అదృష్టం దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ లక్ష్యంగా ఆటగాళ్ళను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. వరల్డ్ కప్ కు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో యువఆటగాళ్ళకు ఛాన్సులు ఇస్తూ పరిక్షిస్తోంది బీసీసీఐ. అత్యుత్తమంగా రాణించే వారికీ జట్టులో స్థానం కల్పించడం కోసం ప్రయోగాలు చేస్తోంది. ఇందులో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తుండగా.. జూనియర్లకు కూడా వరుస అవకాశాలు ఇస్తు పరిక్షిస్తోంది. టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సూర్య కుమార్ కు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం ఇస్తారా..?ఇవ్వరా అనే చర్చ అప్పుడే జరుగుతోంది. ఎందుకంటే.. లంకతో జరిగిన టీ20లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శతకం బాదిన సూర్యకు ప్రస్తుతం జరుగుతోన్న వన్డే సీరిస్ లో మాత్రం…
మేకపాటి ఫ్యామిలీకు ఏపీ రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత ఉంది. ఆర్థికంగా అత్యంత బలమైన మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు కారణంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. శివచరణ్ రెడ్డి తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలో చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫోటోలను బయటపెట్టడంతో చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముంగిటకు వచ్చి.. తనకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. శివచరణ్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఆ తరువాత శివచరణ్ రెడ్డి తల్లి మీడియా ముంగిటకు వచ్చి జరిగిన…
గోపీచందు మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ ల జోడీగా తెరకెక్కిన “వీర సింహ రెడ్డి ” సంక్రాంతి కానుకగా గురువారం విడుదలైంది. ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే స్టెప్పులతోపాటు స్ట్రాంగ్ డైలాగుల కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం. కథ : బాలసింహా రెడ్డి (బాలకృష్ణ ) ఫారిన్ లో ఒక బ్యాంకు మ్యానేజర్ గా పనిచేస్తుంటాడు. అతని సహుద్యోగి శృతి హాసన్ ఉంటుంది. బాలకృష్ణ తండ్రి వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. సీమలో శాంతికి విఘాతం కలిగితే అసలు సహించడు. సీమలో ఎవరిని కత్తి పట్టకుండా ఉండేందుకు తానూ కత్తి పడుతాడు. విలన్స్ చేసే ప్రతీ దుశ్చర్యలను నాశనం చేస్తూ వాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ప్రతీ విషయంకి అడ్డు వస్తున్నాడని విలన్…