Author: Prashanth Pagilla

వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బీజేపీ అండగా ఉంటుందని ఇటీవల తరుణ్ చుగ్ అన్నట్టు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ షర్మిల ఎవరో వదిలిన బాణం కాదు. ఆమె బీజేపీ బీజేపీ వదిలిన బాణమంటూ విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తుందని తరుణ్ చుగ్ అన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటిపై తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని తరుణ్​చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీకి అండగా నిలబడాలని తన అన్నట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉందని.. అలాంటప్పుడు మరో పార్టీతో పొత్తు ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇక, తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో అదే ఊపులో నిజామాబాద్…

Read More

జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను కోర్టు మరోసారి కొట్టివేసింది. హత్యలు చేసి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికీ న్యాయస్థానాల్లో బెయిల్ వస్తోంది. కాని శ్రీనివాస్ మాత్రం నాలుగేళ్ళుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. ఆయన తల్లి తన కొడుకుకు బెయిల్ ఇప్పించాలని జగన్ ను కోరుతున్నారు. కాని వైసీపీ నుంచి సరైన రియాక్షన్ లేదు. నిజానికి శ్రీనివాస్ కు ఎప్పుడో బెయిల్ వచ్చింది. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ళకే NIA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. శ్రీనివాస్ కు బెయిల్ రద్దు చేయాలని NIAకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ వలన శ్రీనివాస్ కు ఎన్ఐఏ బెయిల్ రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు బెయిల్ ఇచ్చినా ఇబ్బంది లేదని ఓ లేఖ ఇస్తే ఎన్ఐఏ బెయిల్ వచ్చేలా చూస్తుందని అనుకున్నారు. కానీ…

Read More

పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లో చేరేందుకు కీలక నేతలు సిద్దంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అదంతా హైప్ క్రియేట్ చేసుకునేందుకేనని రోజులు గడిచే కొద్ది తెలిసి వస్తోంది. ఏపీలో వైసీపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు టచ్ లో ఉన్నారని చివరికి జనసేన నేత తోట చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకొని అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అక్కడే బీఆర్ఎస్ దొరికిపోయింది. కీలక నేతలు టచ్ లో ఉన్నారని డబ్బా ప్రచారం చేసుకుంటుందని స్పష్టత వచ్చింది. తాజాగా ఒడిషాకు గిరిధర్ గమాంగ్‌ అనే సీనియర్ నేతకు ఆ రాష్ట్ర బీఆర్ఎస్ అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సాంకేతికంగా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. అదే సమయంలో బీజేపీ కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. ఎనభై ఏళ్ల గిరిధర్ గమాంగ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పలుమార్లు గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా…

Read More

బాబాల అవతారమెత్తి కొంతమంది కీచకులు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టడం కొనసాగుతూనే ఉంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే హర్యానా రాష్ట్రంలో జిలేబి బాబాగా గుర్తింపు పొందిన అమర్ వీర్(63) ఏకంగా 120మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు తేలడం సంచలనంగా మారింది. తన దగ్గరికి వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ఈ జిలేబి బాబా స్టైల్. అంతేకాదు ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని మహిళలపై పదేపదే అత్యాచారాలు చేయడం ఇతని దినచర్య. ఈ క్రమంలోనే అతని పాపం పండి కోర్టు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. అమర్ వీర్ కు నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహనకు వలస వెళ్ళాడు. 13ఏళ్ల పాటు జిలేబి దుకాణం…

Read More

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇది మా ఇంట్లో అది పెద్ద పండగ అంటున్నారు మెగా డాటర్ సుస్మిత. చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే, ఈ మూవీకి సుస్మిత కాస్ట్యుమ్ డిజైనర్ గా పని చేశారు. ఈ మూవీ విషయాలపై స్పందిస్తునే ఆమె పలు విషయాలను షేర్ చేసుకున్నారు. మా ఇంట్లో పెద్ద పండగ రాబోతుంది. చరణ్ తండ్రి కాబోతున్నాడు. వారికీ పాప , బాబు ఎవరు పుట్టిన ఆనందమే. మా కుటుంబంలో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అందుకే చరణ్ కు బాబు పుడితే బాగుంటుందని తన మనసులోని మాట బయట పెట్టారు సుస్మిత. ఇక, వాల్తేరు వీరయ్య సినిమాపై స్పందిస్తూ.. డైరక్టర్ బాబీ మాకు వింటేజ్…

Read More

ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ మహిళ. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అతను నిద్రలోకి జారుకున్నాక ప్రియుడి సహాయంతో భర్త గొంతుకు వైర్ బిగించి హత్య చేసింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి పొలిసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీవీఎంసీ రెండో వార్డు పరిధి వలందపేటకు చెందిన వంకా పైడిరాజు (34) అనే వ్యక్తి టైల్స్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య జ్యోతి (22)తోపాటు నాలుగేళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 29వ తేదీన పైడిరాజు రాత్రి భోజనం చేసి భార్య పిల్లలతో కలిసి నిద్రపోయాడు. మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి భీమిలి పోలీసులకు కంప్లైంట్ చేసింది. జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పైడిరాజు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను విచారించగా…

Read More

తెలంగాణలో పోలీసు విభాగం ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. తాజాగా పరీక్ష తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన చేసింది. సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాని తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం మార్చి 11న ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అంటే, ఒకరోజు ముందుకు జరిపారు. కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసింది.

Read More

పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok)ప్రజలు తమ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయాలని కోరుతున్నారు. పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు భారత్ లో విలీనం కోరుతూ ర్యాలీలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వం తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని..తాము పాక్ లో అంతర్భంగా ఉండలేమని చెప్పుకొచ్చారు. కార్గిల్ రోడ్డును తెరిచి భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని కోరుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత రెండు వారాలుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో అక్కడి పరిస్థితులు దుర్భరంగా మారాయి. ప్రజల జీవన పరిస్థితులు దిగజారాయి. నిత్యావసర సరకులు కూడా కొనుగోలు చేయలేని దుస్థితికి చేరాయి. ఆహార వస్తువులైన గోధుమల కోసం కొట్లాడుకోవాల్సిన దుస్థితి…

Read More

ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్ధినిపై మూడేళ్ళుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆపై బలవంతంగా బాలికను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. అతని వేధింపులు రోజురోజుకు అధికం కావడంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈపూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్ధిని టెన్త్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు బత్తుల రవి కుమార్ దగ్గర విద్యనభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బాలికపై కన్నేసిన రవి కుమార్.. అమ్మాయిని ఓరోజు తన ఇంటికి పిలిచి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక మత్తులో ఉండగానే నగ్నంగా ఉన్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ…

Read More

వచ్చే ఎన్నికల్లో వైసీపీని డీకొట్టేందుకు పొత్తులుంటాయని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఒంటరిగా వెళ్ళడం వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలి అది అంతిమంగా వైసీపీకి లాభిస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఉమ్మడిగా వెళ్ళడమే బెటర్ అని జన సైనికులకు రణస్థలం సాక్షిగా పవన్ సూచించారు. పొత్తు విషయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గౌరవ ప్రదమైన పొత్తులు ఉండాలంటూ టీడీపీకి సంకేతాలు పంపారు.అయితే, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లుగా టీడీపీ నుంచి పొత్తుల విషయంలో గౌరవం దక్కుతుందా..?లేదా అన్నదే టీడీపీ – జనసేన పొత్తుపై ఆధారపడి ఉంది. ఇటీవల చంద్రబాబుతో జరిగిన భేటీలో పొత్తు అంశాలపై చర్చించలేదని రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ అంశం తమ మధ్య చర్చలోకి రాకపోయినా భవిష్యత్ లో టీడీపీతో కలిసి సాగే అవకాశం ఉందని స్పష్టత ఇచ్చారు. టీడీపీహో పొత్తు తాము కోరుకున్నట్లు గౌరవంగా ఉండాలని పవన్ పరోక్షంగా చెప్పారు. ప‌వ‌న్ ప్ర‌స్తావించిన…

Read More