Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే తనకు హైకమాండ్ అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా పార్టీ నేతలను ఐక్యం చేయాలనే అధిష్టానం సూచనలతో అదే అంశంపై దృష్టిసారించారు. గాంధీ భవన్ కు రానని.. రేవంత్ రెడ్డితో వేదిక పంచుకొనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గాంధీ భవన్ మెట్లు ఎక్కించారు. రేవంత్ తో కలిసి కూర్చోబెట్టారు. కలిసి మాట్లాడుకునేలా చేశారు. సీనియర్లలో బలమైన నేతగానున్న కోమటిరెడ్డి కూడా పట్టువీడుపులు వీడటంతో మిగతా సీనియర్లు కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. అధికార పార్టీపై పోరాడకుండా తమలో తాము పోరాడుకుంటున్న టి. కాంగ్రెస్ నేతలకు మాణిక్ రావు థాకరే ఓ ఫార్ములాను సెట్ చేశారు. రేవంత్ పాదయాత్ర చేస్తే తమకు పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మొండికేస్తోన్న సీనియర్లకు సర్దిచెప్పారు.. రేవంత్ రెడ్డికి యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. మిగతా…
2002లో గుజరాత్ లో చెలరేగిన అల్లర్ల వెనక మోడీ హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మోడీని నరహంతకుడు అని విమర్శలు చేస్తుంటారు. అధికారం కోసం ఇదంతా చేయించారన్న ఆరోపణలు మోదీపై ఉన్నాయి. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ అల్లర్లలో మోడీ పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చినా అంత ఈజీగా మోడీని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. కేంద్రదర్యాప్తు సంస్థలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయి బీజేపీ ఏజెంట్లుగా పని చేస్తున్నాయి కాబట్టి. ఇకపోతే..గుజరాత్ అల్లర్ల వెనక మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీని ఇటీవల విడుదల చేసింది. ఈ అల్లర్లకు మోడీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసి డాక్యుమెంటరీలో తేల్చింది. అయితే.. ఆ డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను గురువారం యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసింది. అయితే, అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే…
ఇటీవల కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే తమకు నచ్చిన వారితోనే జీవితం పంచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపిస్తోంది. లింగబేధం చూపకుండా ఒక్కటైపోతున్నారు. ఇద్దరు స్నేహితులు ( ఆడవారు) లేదా, మగవారు పెళ్లి చేసుకుంటున్న వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. అయితే..వీరిద్దరి ఒప్పందంలో భాగంగా ఓ యువతి లింగమార్పిడి చేసుకుని మగవారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆ యువతి ఇచ్చిన షాక్ కు లింగమార్పిడి చేసుకున్న యువతి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకథలో అసలేం జరిగిందో చూద్దాం. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీజిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. దీంతో వీరు నిర్ణయానికి వచ్చేశారు. జీవితాంతం కలిసి…
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సడెన్ సర్ప్రైజ్ లు మామూలే. అదేంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా..? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టొరీపై లుక్కేయండి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎదో ఒక టైంలో తెరపై కనిపించే అవకాశం ఉంది. కొంతమంది లీడ్ రోల్ పోషిస్తే.. మరికొంతమంది సైడ్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. అయితే.. ఇటీవల నటీనటులే కాదు డైరక్టర్లు కూడా నటనలో భాగం అవుతున్నారు. అలా ఓ ఫుల్ లెన్త్ డాక్యూమెంటరీలో స్టార్ డైరెక్టర్ కనిపించనున్నారు. ఇదేదో సైడ్ క్యారెక్టర్ లోనో కాదండోయ్. లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఆ డైరక్టర్ ఎవరో కాదు.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి హీరోగా సినిమా ఏమైనా చేస్తున్నాడా? అనే అనుమానం మీకు రావొచ్చు. అయితే ఇంచుమించుగా అలాంటిదే. రాజమౌళి లీడ్ రోల్ లో ఓ డాక్యూమెంటరీలో కనిపించనున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్ గా తనదైన…
పాదయాత్ర అనుమతుల విషయంలో ఏపీ సర్కార్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడిచే అవకాశం కనిపిస్తోంది. యువగళం పేరిట ఈ నెల 27 నుంచి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం అనుమతులు కోరగా ఏపీ సర్కార్ ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో లోకేష్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి “యాత్ర” పేరిట పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 26న ప్రారంభమై జూన్ 2న ముగించనున్నారు. అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. కొన్నాళ్ళుగా రేవంత్ పాదయాత్ర విషయంలో కనిపించిన చిక్కుముళ్ళు తాజాగా తొలగిపోవడంతో నూతనోత్తజంతో పాదయాత్రకు రెడీ అయ్యారు. రేవంత్ పాదయాత్ర చేసేందుకు సిద్దం అయ్యారు కాని, సర్కార్ నుంచి అనుమతులు వస్తాయా..? అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే.. ఏపీతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు…
దిశ పేపర్ బరితెగించి బీజేపీకి ఉంపుడుగత్తె పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో బీజేపీకి మైలేజ్ తీసుకొచ్చేందుకు వ్యూహకర్త పాత్రలో కథనాలు ప్రచురిస్తోంది. ఆ పార్టీ నేతల కన్నా దిశ పేపరే ఎక్కువగా శ్రమిస్తోంది. ఏమాత్రం అనుమానం రాకుండా బీజేపీ వంత పాడుతోంది. అర్బన్ ప్రాంతాల్లో మినహా రూరల్ ప్రాంతాల్లో ఏమాత్రం బలం లేని బీజేపీకి దిశ వార్తలు బలం టానిక్ లా పని చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణలో బలపడుతుందని చెప్పేందుకు దిశ ఎంచుకున్న మార్గం కాంగ్రెస్ ను బలహీనపరచడం. ఇందుకోసం రేవంత్ నాయకత్వంపై నిత్యం బురదజల్లడమే ఎజెండాగా పెట్టుకొని పతాక శీర్షికన ప్రచురిస్తోంది. తాజాగా.. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ వార్త అన్ని ప్రధాన పత్రికలు హైలెట్ చేశాయి. కాని దిక్కుమాలిన దిశకు అదెంతమాత్రం పెద్ద న్యూస్ అనిపించలేదు. ఆ వార్తను హైలెట్ చేసి రాస్తే…కాంగ్రెస్ బలపడుతుంది. క్యాడర్ లో నూతనోత్తేజం నిండుతుంది. ఇదే దిశ బుగులు. అందుకే ఇంత ప్రధానమైన న్యూస్…
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయినట్లుంది. అందుకే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్ లో ఆకర్షణీయమైన కేటాయింపులు చేసి మరోసారి ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ పద్దులు సహజంగా మార్చిలో ప్రవేశపెడుతారు. కేంద్రం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెడుతోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆధారంగా రాష్ట్రాలు బడ్జెట్ లో కేటాయింపు చేసుకుంటాయి. అయితే.. ఈసారి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లోనే తెలంగాణ సర్కార్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటివారంలో పెట్టాల్సిన బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టాలనుకోవడంతో ముందస్తు ముచ్చట మరోసారి తెరపైకి వచ్చింది. ముందస్తు వ్యూహంలో భాగంగానే బడ్జెట్ సమావేశాలను ముందుకు జరిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇదే…
తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గెలుపొంది వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలనీ బీజేపీ భావిస్తోంది. కాని బీజేపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాంగ్రెస్ ఇదివరకులాగా బలహీనంగా లేదు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని మట్టి కరిపించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. పొరపాటున ఈ తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క రాష్ట్రంలో ఓడినా…లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపడం కష్టమే. కాంగ్రెస్ మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే బీజేపీ పతనం మొదలైనట్లే. కాబట్టి..ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఒకటే. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కర్ణాటక , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు చత్తీస్ ఘడ్ ,…
హైదరాబాద్ నడిబొడ్డున 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిగో, అదిగో ప్రారంభిస్తున్నామని చెప్పి రెండేళ్ళు అవుతుంది. కాని ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను నేటి తరానికి తెలియజేసేందుకు వీలుగా ఆయన విగ్రహంతోపాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిజంగా.. అంబేడ్కర్ పై కేసీఆర్ కు అంత గౌరవం ఉన్నదా..? అనేది ప్రశ్నార్ధకమే. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి వేడుకల సమయంలో ఆయన విగ్రాహానికి కేసీఆర్ నివాళులర్పించేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. కేవలం పత్రిక ప్రకటనలకు పరిమితం అవుతూ భారత రాజ్యాంగ నిర్మాతపై వివక్ష ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కులాధిపత్యంతో విర్రవీగే కేసీఆర్.. కుల వివక్ష కోసం జీవితకాలం పాటుపడిన అంబేద్కర్ కు గౌరవం ఎలా ఇస్తారు..?పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి దుండగులను శిక్షించాలని.. తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఏనాడూ…
చిన్నారులపై అకృత్యాలు ఆగడం లేదు. ఎన్ని చట్టలు తీసుకొచ్చినా కామందుల్లో మార్పు రావడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎనిమిదేళ్ళ బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బొటాడ్‌లో భగవాన్‌పొరా ప్రాంతంలో సంక్రాంతి రోజున ఓ బాలిక తన ఇంటి పక్కన పడిన గాలిపటాన్ని తెచ్చుకునేందుకు సాయంత్రం సమయంలో బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక కోసం తల్లిదండ్రులు చుట్టు పక్కల అన్నింట్లో వెతికారు. మా పాప ఏమైనా కనిపించిందా అని తెలిసి వాళ్ళను అడిగారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు విస్తృతంగా గాలించారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని…