Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలను నెల రోజుల ముందుగానే నిర్వహించడం…వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం చూస్తుంటే కేసీఆర్ ముందస్తుకు ఫిబ్రవరిలోనే ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 13న మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే కేసీఆర్ అదే స్థలంలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 17 న సచివాలయం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదీ కూడా మోడీ సభను తలదన్నేలా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సభకు జాతీయ నేతల్ని ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్…
నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ , ఏయన్నార్ ల మధ్య ప్రత్యర్ధులు సైతం ఈర్ష్యపడే సాన్నిహిత్యం ఉండేది. మధ్యలో కొన్ని పొరపచ్చాలు వచ్చినా చివరిదాకా వారు ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేశారు. కాని ఎన్టీఆర్, అక్కినేని వారసులు మాత్రం తండ్రుల అనుబంధాన్ని కొనసాగించడంలేదు. ఇటీవల ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి బాలయ్య ఆ చులకన భావంతో కామెంట్స్ చేయడానికి గల కారణం.. రాజకీయమే. ఎన్టీఆర్, ఏయన్నార్ లు సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. అక్కినేని కన్నతల్లి పున్నమ్మ ఎన్టీఆర్ ను తమ పెద్దబ్బాయిగా అభిమానించేవారు. అలాగే, ఏయన్నార్ ను సైతం ఎన్టీఆర్ తల్లి చిన్నబ్బాయిగా ట్రీట్ చేసేది. అలా అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య క్లోజ్ రిలేషన్ షిప్ ఉండేది. ఎన్టీఆర్, ఏయన్నార్ లు ఇద్దరి…
యువగళం పేరిట నారా లోకేష్ ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతిచ్చారు. కాకపోతే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. మొత్తంగా 14కండిషన్స్ పెట్టారు. వీటిని తప్పనిసరిగా పాటించాలంటూ ఆదేశించారు. అయితే.. ఆ కండిషన్స్ ఎప్పుడు పాటించేవే. ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని కండీషన్స్ పెట్టారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని చిత్తూర్ జిల్లా ఎస్పీ ఆదేశించారు. నిజానికి ఎవ్వరు పాదయాత్రలు చేసినా, యాత్రలు చేసినా అత్యవసర సేవలకు ఆటంకం కల్గించాలని చూడరు. ఒకవేళ చూసిన ఆ ఎఫెక్ట్ పాదయాత్ర చేసేవారిపైనే పడుతుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కల్గించరు. అయినా ఈ షరతులను ప్రత్యేకంగా ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 27న కుప్పంలో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర నాలుగు వందల రోజులపాటు 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర…
ఉద్యోగం పేరుతో అమెరికాలో స్థిరపడిన భారతీయుల పరిస్థితి పూర్తిగా తలకిందులు అవుతోంది. మంచి ఉద్యోగం దొరికింది.. ఏ చీకు , చింత లేదని ఇన్నాళ్ళు సంబరపడిన వాళ్ళంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అక్కడి ఐటీ సంస్థలు లేఆఫ్ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటంతో భారతీయులు దిక్కులేనివాళ్ళుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ధిక మాంద్యం బూచి చూపి పెద్ద, పెద్ద ఐటీ సంస్థలే రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా కొలువులు కోల్పోయిన వాళ్ళలో 30నుంచి 40శాతం ఉద్యోగులు భారతీయులే ఉన్నారు. అందులో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగం పోతే పోయింది కాని దీనికి తోడు హెచ్-1బీ వీసా నిబంధనల కత్తి వీరి మెడపై వేలాడుతోంది. ఈ విసాతో అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగం కోల్పోతే 60రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాలి. కొత్త ఉద్యోగం దొరక్క.. ఉన్న ఉద్యోగం పోవడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పేరు…
కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన పార్టీ ప్రచార రథం “వారాహి” వెహికిల్ కు ప్రత్యేక పూజలు చేయించారు పవన్ కళ్యాణ్. పవన్ రాకతో కొండగట్టు అంజన్న ఆలయం జనసేనాని అభిమానులతో కిక్కిరిసిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికైతే బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న పవన్ కళ్యాణ్..కొన్ని అంశాల్లో బీజేపీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ రోల్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. పొత్తులపై తొందరేమి లేదని.. ఎన్నికల నాటికీ ఓ క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ఏపీతోపాటు తెలంగాణలో శక్తిమేరకు జనసేన వాయిస్ వినిపిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్తవారు వస్తే కొత్తగా ఎన్నికలలోకి వెళ్తామని పవన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎవరూ తమతో రాకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. బీఆర్ఎస్ పై స్పందించిన పవన్ మార్పు మంచిదే…
అధికారిక కార్యక్రమాల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై తో వేదిక పంచుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తే గవర్నర్ తో వేదిక పంచుకోవాల్సి వస్తుందని.. ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర వేడుకలపై ఇప్పటికీ రాజ్ భవన్ కు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఏడాది కూడా ప్రగతి భవన్, రాజ్ భవన్ లో వేర్వేరుగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి.. ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. కాని గణతంత్ర దినోత్సవాన్ని మాత్రం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు కారణం.. గవర్నర్ తమిళిసై జెండా…
బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవి నుంచి తప్పిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఆయన పదవి కాలం ముగియనుండటంతో కేంద్ర క్యాబినెట్ లోకి బండిని తీసుకొని.. ఆయన స్థానంలో ఈటలకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారని కాషాయ పార్టీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. కొంతమంది నేతలు బండి సంజయ్ ను తప్పించే అవకాశం లేదని.. ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర నాయకత్వం అనుకుంటుందని చెప్తున్నారు. కాని రాష్ట్ర స్థాయిలో మాత్రం అద్యక్ష మార్పు ఉంటుందని ఆ పార్టీ వర్గాలే ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నమాట వాస్తవమే. బండి సంజయ్, ఈటల, కిషన్ రెడ్డి వర్గాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. పార్టీలో ప్రాధాన్యత లేని వారంతా ఈటల అండ్ కిషన్ రెడ్డిల గ్రూప్ నేతలుగా చెలామణి అవుతున్నారు. కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో బీజేపీలో చేరిన…
చేగువేరా బిడ్డ అలైదా గువేరా హైదరాబాద్ వస్తోందని తెలిసి అంతగొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళ లో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని కిక్కిరిసిన రవీంద్ర భారతి లో ఒంటికాలు మీద నిలబడి ఒక్క సారి ఆమెను చూసి బయట పడ్డా.. ఐరిష్ మూలాలున్న చే కుటుంబ లాటిన్ అమెరికా లో స్థిరపడ్డ మెడికో ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన చే రష్యన్ విప్లవం విజయవంతం అయిన పదేళ్లకు పుట్టాడు. యాబయ్యో దశకం లో మొదలైన అలజడులు చూసి పెరిగి వాటికి ఆకర్షితు డై క్యూబన్ విప్లవాన్ని ఆవహించుకుని బొలీవియన్ విప్లవం లో హంతక సి ఐ ఎ చేతిలో హత్యకు గురై అమరుడు అయ్యాడు. క్యూబా పెట్టుబడిదారీ సమాజ శవపేటికకు మేకులు కొడదాం అనుకున్నది. అలా…
వివేక్ , ఈటల రాజేందర్ ల పైసల పంచాయితీ ఎపిసోడ్ పై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకే పార్టీకి చెందిన నేతలు అందరూ చూస్తుండగానే పైసల కోసం పంచాయితీ పెట్టుకోవడం… అందులోనూ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఆ ఇద్దరి నేతల తగువులాట చర్చనీయాంశం అయింది. పార్టీ పరువు తీశారని ఈ ఇద్దరంటే గిట్టని నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో వివేక్ నుంచి ఈటల 10కోట్లు తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఉప ఎన్నిక ముగియగానే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఉప ఎన్నిక ముగిసి ఏడాది అయిపోయినా ఇంతవరకు వివేక్ కు ఇస్తానన్న 10కోట్లు ఇవ్వలేదు. ఎన్నిసార్లు వివేక్ పీఏ ఫోన్ చేసినా ఈటల స్పందించకపోవడంతో.. ఇక…
తెలంగాణలో రాజకీయాలు రోజరోజుకి హీటెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ప్రధాన పార్టీలు సభలు, బహిరంగ సభలు, పాదయాత్రలతో దూకుడు పెంచుతున్నాయి. నిజానికి ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నప్పటికి ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే కర్నాటకతోపాటు ఎన్నికలు రానున్నట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లినా కేసీఆర్‌కు తప్పని తిప్పలు… అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నాడు. కానీ ముందస్తుకు వెళ్లినా కేసీఆర్‌కు ఈసారి ఓటమి తప్పదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్‌పై వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మెజార్టీ ప్రజలు కేసీఆర్ పాలనలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, ఇచ్చిన హమీలు అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, భూదందాల ఆరోపణలతో పలువురు ఎమ్మెల్యేలు ఉంటే.. మరికొందరు ఎమ్మెల్యేలేమో నియోజకర్గాలను పట్టించుకున్న…