Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారుండరు. తనదైన యాంకరింగ్ తో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. టాలీవుడ్ బుల్లితెర యాంకరింగ్ లో మెగాస్టార్ అని చెప్పొచ్చు. అయితే…ప్రదీప్ ను ఎఫైర్, పెళ్లి వార్తలు చుట్టుముడుతునే ఉన్నాయి. ఇటీవల ప్రదీప్ మ్యారేజ్ న్యూస్ హైలెట్ అయింది. ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు అనే అమ్మాయిని ప్రేమించిన ప్రదీప్ మ్యారేజ్ చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దాంతో ప్రదీప్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తన పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు ప్రదీప్. నవ్య మారోతు కాదు కదా. నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అన్నారు. తాను రిలేషన్ తో ఉన్నదల్లా..టెలివిజన్ షోస్ తోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంత కెరీర్ పైనే ఉందని.. పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. మీ గోల్…
మనం విపరీతంగా అభిమానించే వ్యక్తుల పేర్లు, ఫోటోలను మన హృదయాలపై ముద్రించుకోవాలని అనుకుంటాం. అందుకోసం ప్రత్యేకంగా టాటూ వేయించుకొని అభిమానం చాటుకుంటాం. నచ్చిన హీరో, హీరోయిన్ ల ఫోటోలను శరీర భాగాలపై ముద్రించుకుంటాం. కాని ఓ హీరో తనకు నచ్చిన ఓ లెజెండరీ నటుడు , మాజీ ముఖ్యమంత్రి ఫోటోను తన గుండెలపై పొడిపించుకున్నారు. ఇంతకీ అతను ఎవరనేగా మీ సందేహం. తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్. తన అభిమాన హీరో ఎంజీఆర్ ఫొటోను గుండెలపై పొడిపించుకుని అభిమానం చాటుకున్నాడు. ఎంజీఆర్‌ను విపరీతంగా అభిమానిస్తుంటారు విశాల్. ఆ ఇష్టం, ప్రేమతోనే విశాల్ గుండెలపై ఏంజీఆర్ ఫొటోను పొడిపించుకున్నారని అర్థం అవుతుంది. https://twitter.com/madurimadhu1/status/1617773514022596609 ఇదిలా ఉండగా.. విశాల్ ఈ మధ్య కాస్త నేమ్మదించారు. ఆయన ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగు. తమిళ్ రెండింట్లో ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలోతన తరువాతి చిత్రంతో హిట్ కొట్టాలని కసిమీదున్నారు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపును కేసీఆర్ పై విజయంగానే ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది. అందుకే ఈటలకు పార్టీలో పెద్దపీట వేయాలని నిర్ణయించింది. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది. ఈటలకు ఆయా పార్టీ నేతలతోనున్న సత్సంబంధాల వలన బీజేపీలోకి పెద్ద, పెద్ద నేతలను తీసుకొస్తారనుకున్నారు. ఈటల కూడా ఇదే అనుకున్నారు. కాని ఈటల తనవంతు ప్రయత్నాలు చేసినా.. కమలం కండువా కప్పుకునేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. కేసీఆర్ కోవర్టుల వలనే బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయని ఈటల ఫీలవుతున్నారు. బీజేపీలో చేరికల కమిటీని ఏర్పాటు చేయడం వలన ఆ పార్టీలో చేరాలనుకున్న నేతల పేర్లు ముందే లీకవుతున్నాయి. అందుకే బీజేపీతో టచ్ లోకి వచ్చేందుకు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలెవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదని ఈటల అవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగానున్న కీలక నేతలను బీజేపీలో చేర్చుకొని కేసీఆర్ ను చావుదెబ్బ కొట్టాలనుకున్న…
ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తోందని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అన్ని స్థానాల్లో బరిలో ఉంటామని ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మణి నాయుడు స్పష్టం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏపీపై దృష్టిసారించారని.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను ఆప్ భర్తీ చేస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా ఆప్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 9 నెలలుగా అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్న మణినాయుడు.. ఇతర పార్టీల నుంచి నేతలు, సామాజిక కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. రోజు రోజుకు పార్టీ బలం పెరుగుతుందన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రతీ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏపీలో తామూ పోటీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రకటించగా.. తాజాగా ఆప్ కూడా ఇదే ప్రకటన చేయడం గమనార్హం. కేసీఆర్ తో అరవింద్ కేజ్రీవాల్ సఖ్యతగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి,…
గౌతమ్ అదానీ… ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. చాలా తక్కువ సమయంలో అంబానీని కూడా దాటేసి సంపన్నడిగా మారాడు. అంబానీ కిందిస్థాయి నుంచి ఎదిగాడు. అందుకే ఆయన బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఆశ్చర్యంగా అనిపించలేదు. అదానీ మాత్రం అంబానీని మించి బిలియనీర్ జాబితాలోకెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన అమంతం అలా ఎదగడానికి కారణం షేర్ మార్కెట్. అదానీ ఇటీవలి కాలంలో పోర్టుల్ని,ఎయిర్ పోర్టుల్ని కొనేస్తున్నారు. దీంతో సహజంగానే అదానీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరి సందేహం. అదానీకి ఆ డబ్బులు పోటీ పడి బ్యాంకులు, ఎల్ఐసీలు పంపిణీ చేస్తున్నాయి. హిన్ డెన్ బెర్గ్ రీసెర్చ్ సంచలన విషయాలను బయటపెట్టింది. అదానీ వ్యాపార సామ్రాజ్యం ఓ పేక మేడ అని తేల్చింది. దీనిపై ఆదానీ గ్రూప్ స్పందించింది. అదంతా అవాస్తవమని పేర్కొంది. కాని నిజ, నిజాలెంటో చెప్పలేదు. ఇప్పుడు అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లలో తగ్గుతున్నాయి. ఆయనపై నమ్మకం ఉంచి…
పోలీసు ఉద్యోగాలు (ఎస్సై, కానిస్టేబుల్) నియామక ప్రక్రియలో పాత పద్ధతిని కొనసాగించాలని యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడుతు.. పొలిసు రిక్రూట్ మెంట్ బోర్డుపై ఒత్తిడి పెంచుతున్నా పట్టించుకోకపోవడంతో గవర్నర్ తమిళిసైని కలిసి పోలీసు అభ్యర్థుల ఆందోళనను ఆమెకు వివరించారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు పొలిసు ఉద్యోగార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చొరవ చూపాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ తీసుకున్న నిర్ణయాల వలన చాలామందికి అన్యాయం జరిగింది. లాంగ్ జంప్, షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వలన ఎంతోమంది ఉద్యోగార్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. ఫలితంగా 2.8 లక్షల మంది ఉద్యోగానికి ఎంపిక కాకుండా పోయారని శివసేనా రెడ్డి…
ఒడిశాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాద్యక్షుడు జేపీ. నడ్డాకు పంపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు ఇటీవలే వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి వెళ్ళారు. తాజాగా పార్టీకి రాజీనామా చేయడంతో గమాంగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గిరిధర్ గమాంగ్ బీజేపీలో చేరారు. పార్టీలో కీలక బాద్యతలు నిర్వర్తించారు. బీజేపీలో తన కుమారుడిని అవమానించారని అందుకే బీజేపీతో అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమను కావాలనే పార్టీలో పక్కకు పెట్టి అవమానించారన్నారు. బీజేపీలో ఇంతకాలం సహకరించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ పార్టీలో చేరనున్నామనే విషయాన్ని గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. త్వరలోనే జాతీయ…
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేక పదవి నుంచి తప్పుకుంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా ఉందంటూ గోడును వెళ్లబోసుకున్నారు. తమను డబ్బుల కోసం ఎమ్మెల్యే గత కాలంగా వేధిస్తున్నారని.. అడిగినంత ఇవ్వకపోతే పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ సంజయ్ బెదిరించారని శ్రావణి ఆరోపించారు. బీసీ బిడ్డగా తన ఎదుగుదలను ఓర్వలేక దొరా అహంకారంతో కక్ష కట్టారన్నారు. అభివృద్ధి పనులకు పదేపదే అడ్డొస్తూ..సమాచారం లేకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా.. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానని చెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వేధింపులు తీవ్రతరం కావడంతో భరించలేక…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటిసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలంటూ నోటిసులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇటీవలే సీబీఐ నోటిసులు జారీ చేయగా ఈరోజు నోటిసు ఇచ్చి రేపు రమ్మంటే ఎలా వెళ్తామని.. ఐదు రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. తాజాగా నోటిసులు ఇచ్చిన సీబీఐ అవినాష్ రెడ్డి కోరినట్లుగానే ఐదు రోజుల తరువాతే విచారణకు హాజరు కావాలని సూచించింది. దాంతో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. ఆయనకు మరో మార్గమే లేదు. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరావ్వాలన్న సాకు చూపి విచారణకు…
తెలంగాణతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామ ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ జతీయ స్థాయి పార్టీ మారాక ఆ ప్రాంతాలపై కేసీఆర్ దృష్టి సారించడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో తమ గ్రామాలను విలీనం చేయాలని ప్రజల డిమాండ్ దృష్ట్యా అక్కడ పార్టీ విస్తరణకు ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు కేసీఆర్. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీని ఆశీర్వదిస్తే తెలంగాణ తరహ అభివృద్ధిని పరిచయం చేస్తామని చెప్పదల్చుకుంటున్నారు. ఇందులో భాగంగా నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ తోపాటు మంత్రులు, స్థానిక నేతలు హాజరు కానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే నాందేడ్ లో బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా పర్యటించి..పార్టీలో చేరేలా కొంతమంది స్థానిక నేతలను ఒప్పించారు. వారిని పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ కు…