Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు వ్యూహాత్మకంగా ఇచ్చినవేనా..? బీఆర్ఎస్ – బీజేపీల మధ్య క్విడ్ ప్రోకోలో భాగంగానే కవిత అరెస్ట్ నిలిచిపోయిందని.. కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలను కన్ఫ్యూజ్ చేసేందుకే ఈ నోటిసులు ఇచ్చారా..? బీజేపీ – బీఆర్ఎస్ ల నుంచి ఊహించని నేతలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటనతో.. చేరికలను నిలువరించేందుకే కవితకు నోటిసులు ఇచ్చారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో స్తబ్దుగా ఉన్న ఈడీ ఆర్నెళ్ళ తరువాత కవితకు తాజాగా నోటిసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయంశం అవుతోంది. ఫిబ్రవరిలో కవితను విచారణకు పిలిచిన సమయంలోనే ఆమెను అరెస్ట్ చేస్తామన్నంత పని చేసింది ఈడీ. కాని ఆ తరువాత విచారణ వేగం తగ్గింది..అరెస్ట్ అవుతుందనుకున్న కవిత అరెస్ట్ నిలిచిపోయింది. కవితను లిక్కర్ స్కామ్ నుంచి రక్షించేందుకు బీఆర్ఎస్, బీజేపీతో అంతర్గత ఒప్పందం…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవితకు మరోసారి ఈడీ నోటిసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో విచారణ మందగించింది అని వార్తలు వెలువడుతుండంతోపాటు బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే అరెస్ట్ నుంచి కవితకు ఉపశమనం లభించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటిసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముగిసిన అధ్యయనం అని ఇటీవల ప్రచారం జోరందుకుంది. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి, మా గుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లి, బుచ్చిబాబులు అప్రూవర్లుగా మారారు. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటిసులు ఇవ్వడంతో రేపు ఏం జరగబోతుంది..? అనే ఉత్కంట బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈడీ నోటిసులపై కవిత ఇంకా స్పందించలేదు. నిజామాబాద్ పర్యటనలోనున్న ఆమె హైదరాబాద్…
ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కొడుకు వార్తలెక్కారు. ఎదో పెద్ద ఘనకార్యం చేసి కాదు. ఓ అమ్మాయి విషయంలో ప్రత్యర్ధులతో గొడవ పెట్టుకొని వార్తల్లో నిలిచాడు. జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ లో రాత్రి గ్రూప్ వార్ జరిగింది. ఓ గ్రూప్ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ది కాగా.. మరో గ్రూప్ సిద్దార్థది. వీరి మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది. పబ్ లో రెండు వర్గాలు ఎదురుపడటంతో బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో సిద్దార్థ్ వర్గం తీవ్రంగా గాయపడింది. ఈ గొడవలో ఓ యువకుడి కన్నుకు తీవ్ర గాయం అయింది. డేవిడ్ సవాంగ్ పై సిద్దార్థ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితులు గౌతమ్ సవాంగ్ ను కలిసి జరిగిన విషయాన్నీ వివరించారు. పెద్ద మనిషి ఇద్దరినీ కూర్చోబెట్టి వివాదాన్ని సద్దుమణిగెలా చేస్తారని అనుకుంటే రివర్స్ లో వార్నింగ్ ఇచ్చారు. తన కుమారుడిపై…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పరిణామాలు వేగంగా మారుతుండటంతో కవిత తన పంథా మార్చుకున్నారు. కేంద్రంలోని భాజాపా సర్కార్ ను వదిలేసి కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ ను అవుట్ డేటెడ్ నాయకుడని.. మోడీ ప్రభంజనం ముందు రాహుల్ ఏమాత్రం నిలబడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ బలహీనమైన నాయకత్వం వలెనే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం అయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పార్టీ మీటింగ్‌లో కవిత తన ప్రసంగం ఆసాంతం కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు. రాహుల్ ను విమర్శిస్తూ మోడీని పరోక్షంగా గ్రేట్ లీడర్ అనేలా వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన కవిత హటాత్తుగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ మోడీని ప్రశంసించడం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పరిణామలు మారుతుండటంతో కవిత ట్యూన్ లో చేంజ్ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రామచంద్ర పిళ్ళై కవిత తరుఫున బినామీగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది.…
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆ పార్టీ భవిష్యత్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. యువ గళం పేరిట పాదయాత్ర చేస్తోన్న లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో టీడీపీని నడిపించే సారధి ఎవరు అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఎన్నికల వరకు చంద్రబాబు, లోకేష్ లను జైలు గోడలకు పరిమితం చేయాలని వైసీపీ కుట్రలు చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీని నందమూరి ఫ్యామిలీ లీడ్ చేస్తుందా..? అనే సందేశాలు వస్తున్నాయి. టీడీపీ భవిష్యత్ పై చర్చోపచర్చలు జరుగుతున్న వేళ ఆ పార్టీ నేతలతో నారా భువనేశ్వరి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె పార్టీ నేతలతో భేటీ అవుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో ఎవరూ అధైర్యపడవద్దని .. తాను ఉన్నానని బాలకృష్ణ స్పష్టం చేశారు. బస్సు యాత్ర…
ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని లేదంటే సుధీర్ రెడ్డి ఓటమి కోసం పని చేస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్ అధిష్టానానికి అల్టిమేటం విధించారు. మంగళవారం ఎల్బీనగర్ లో పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు హెచ్చరికలు పంపారు రామ్మోహన్ గౌడ్. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతకు అవకాశం ఇచ్చి…పార్టీ ఎదుగుదల కోసం పని చేస్తున్న సొంత పార్టీ నేతలను పక్కనపెట్టడం సరైంది కాదన్నారు. సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వంపై కేసీఆర్ , కేటీఆర్ పునరాలోచించాలని కోరారు. లేదంటే సుధీర్ రెడ్డిపై పోటీకి లక్ష్మీ ప్రసన్నను నిలబెడుతామని హెచ్చరించారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ .. భౌతిక దాడులు చేయిస్తున్న ఎమ్మెల్యే కోసం పని చేసేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు రామ్మోహన్ గౌడ్.…
ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఎన్నికల రేస్ స్టార్ట్ చేయగా..కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎన్నికల పోరులో హస్తం పార్టీ వెనకబడిందని విమర్శలు వస్తున్న వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే జమిలి ఎన్నికలపై క్లారిటీ రాగానే అదే రోజున సాయంత్రం మొదటి విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది. 40మందితో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్లు, కాంపిటేషన్ లేని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 19నే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకున్నా…జమిలిపై పూర్తి స్పష్టత వచ్చాకే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలతో 22కు వాయిదా వేశారు. అభ్యర్థుల ప్రకటనపై ఇప్పటికే కాంగ్రెస్ ఆలస్యం చేసిందని పార్టీ నాయకత్వంపై నేతల ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఇక ఆలస్యం చేయకుండా 22న అభ్యర్థులను ప్రకటించాలని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ లిస్టులో…
ఏపీ అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందస్తుకు కేంద్రం అనుమతి కోసం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ బాట పట్టనున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతోపాటు హోంమంత్రి అమిత్ షా తో చర్చిస్తారని అంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జమిలి ఎన్నికల కోసమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ కూడా ఇదే ఆలోచనతో ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశాపర్చాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని మరికొద్ది రోజుల్లో సమావేశపరిచి.. తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అసెంబ్లీ వేదికగా జనాలకు తెలియజేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎన్నికల కోసమేనని అంటున్నారు. అయితే.. జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం పచ్చజెండా ఊపాలి, అందుకే ఆయన ఢిల్లీ బాట పడతారని అంటున్నారు.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ వెలువడకపోతే మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. పాక్షిక జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే తెలంగాణ ఎన్నికలు మే లో జరగడం ఖాయం. రాష్ట్ర అసెంబ్లీ గడువు జనవరి రెండో వారంలో ముగిసిపోతుంది. అలా ప్రభుత్వం రద్దు కాబడుతుంది. జనవరిలో తెలంగాణ ప్రభుత్వం రద్దైతే ఎన్నికలకు మరో ఐదు నెలలు ఉంటుంది. దాంతో పాలన ఎవరి చేతుల్లోనే ఉంటుంది..? అనేది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విదిస్తుందనేది తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణతోపాటు చత్తీస్ ఘడ్, రాజస్తాన్ లలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి పాలనను అనధికారికంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది.…
గజ్వేల్ బీజేపీ టికెట్ కు ఈటల రాజేందర్ భార్య జమున దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అనే విధానం కొనసాగుతోంది. ఈ విధానం కొనసాగుతుండటంతోనే కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై ఎదురుదాడి చేస్తుంటుంది బీజేపీ. ఇప్పుడు ఈటల హుజురాబాద్ నుంచి దరఖాస్తు చేసుకోగా ఆయన భార్య గజ్వేల్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించడంతో ….బీజేపీ తెలంగాణ శాఖపై కూడా విమర్శలు వచ్చేందుకు ఈ పరిణామం అవకాశం కల్పించేదిలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడేమో ఆయన భార్యను గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దించాలని చూస్తున్నారు. గజ్వేల్ బీజేపీ టికెట్ ఎవరికీ దక్కుతుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ ఈటల జమున దరఖాస్తు చేసుకోవడంతో ఆమె కేసీఆర్ పై…