Author: Duriki Mohan Rao

ఈరోజు సికింద్రాబాద్ లో జరిగిన సభలో మోడీ ప్రసంగిస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్సి కవితను టార్గెట్ చేశారు. కెసిఆర్ కుటుంబ పాలనను విమర్శిస్తుంనే కవిత పేరు ఎక్కడా వాడకుండా ఆమెను పరోక్షంగా హెచ్చరించారు. డిల్లి లిక్కర్ స్కాం ను ప్రస్తావించకుండానే కవిత అందులో పూడుకుపోయింది అనే అర్థం ధ్వనించేలా మాట్లాడారు. కుటుంబ పాలన వల్ల అవినీతి పెరుగుతుంది అని అన్నారు. పెద్దలు చేసే తప్పులే పిల్లలు కూడా చేస్తారు అని అటు కెసిఆర్ ని ఇటు కవితను ఉద్దేశించి అన్నారు. చట్ట బద్దమైన సంస్థలు తమ విదులు నిర్వహిస్తుంటే వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. వాళ్ళను హెచ్చరిస్తూ, బెదిరిస్తూ ముందుకు సాగిపోవాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. అంటే డిల్లి లిక్కర్ స్కాంలో ఈడి తన విధులు సక్రమంగా నిర్వహిస్తుంటే, కవిత వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళను బెదిరిస్తున్నారు అని పరోక్షంగా నిందించారు. తప్పు చేసిన…

Read More

పలానా రోజు మనం చస్తున్నాము అని కర్మ కాలి ముందే తెలిస్తే ఏం చేస్తాము? ముందు మనం ఏడుస్తాము, తరువాత మన వాళ్ళను ఏడిపిస్తాము. శోక సముద్రంలో మునిగి ఆ చావు రోజు కంటే ముందే గుండె పగిలి చస్తాము. ఆ నరకం అనుభవించకుండా ఒక్కసారిగా టక్కున ప్రాణం పోయింది మేలు. ఇదొక శాపం. కానీ డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్ కి ఆ శాపం తగిలింది కాబోలు. లంగ్  క్యాన్సర్ వచ్చింది. అతను పుట్టింది ఖమ్మం. వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు చేస్తున్నాడు. పది మందిని బ్రతికంచే అతనే చావు ముంగిట నిలిచాడు. డాక్టర్లు ముందుగా ఇచ్చిన డెత్ డేట్ మార్చి 27, 2023. అతను బాధ పడలేదు. భయపడలేదు. అతని వయసు కేవలం 32 ఏళ్ళు మాత్రమే. అప్పటికే అతనికి పెళ్లయ్యింది. భార్య పేరు సింధు. ఎం ఎస్ సి…

Read More

అభివృద్ది చెందిన అమెరికా లాంటి దేశంలో న్యూ యార్క్, వాషింగ్టన్ లాంటి మహానగారాలను ‘స్లీప్ లెస్ సిటీస్’ అంటారు. అంటే ‘నిదురలేని’ నగరాలు అని అర్థం. 24 గంటలు అన్ని షాపులు తెరిచి ఉంటాయి. ఈ వ్యాపార సముదాయాలు పగలుకు-రాత్రికి, పండగలకు-పబ్బాలకు సెలవు లేకుండా 24 గంగలు, 365 రోలులు తెరిచే ఉంటాయి. అందుకే వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అర్థిల్లుతోంది. ఇప్పుడు ఇదే విధానన్ని కెసిఆర్ పాటిస్తూ కొత్త జి వో విడుదల చేశారు. తెలంగాణలో ఇకనుంచి 24 గంటలు వ్యాపార సముదాయాలు తెరుచుకోవచ్చు. అయితే అది కేవలం హైదరాబాద్ లాంటి మహా నగరానికే పరిమితం చేయలేదు. మొత్తం తెలంగాణకు వర్తిస్తుంది. అంటే అన్ని నగరాలు, పట్టణాలు, తాలుకాలు, 24 తెరిచే ఉంటాయి.  ప్రపంచంలో ‘స్లీప్ లెస్ సిటీ’లు ఎన్నో ఉన్నాయి. కానీ ‘స్లీప్ లెస్ స్టేట్’ బహాశ తెలంగాణ ఒక్కటేనేమో? దీనివల్ల రాష్ట్రం ఆదాయం విపరీతంగా…

Read More

ఈరోజు ప్రధాన మంత్రి  మోడీ నరగానికి వస్తున్న సంధర్బంగా మొత్తం నగరం కాషాయం రంగుతో నిండిపోయింది. మోడీ దృష్టిలో పడాలని బిజెపి నేతలు ఎవరికీ వారుగా పోటిపడి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ నగరం నిండా పెట్టారు. మొత్తం కాషాయం మాయం చేశారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే రోడ్ల మీద బిజెపి నాయకులు పోటిపడి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ పెడితే పర్వాలేదు. కానీ మోడీ రాని పాత బస్తీలో, నగరం నలుమూలలా కాషాయం రంగు రేపరెపలాడుతోంది. ఎందుకు? అంటే ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశించే బిజెపి కార్పొరేటర్లు, ‘బి’ గ్రేడ్ నాయకులు అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తమ సత్తా ఏమిటో అధిష్టానానికి చూపి పార్టీ టికెట్ సంపాదించుకోవాలని వీడియోలు, ఫోటోలు తీసి దాచుకుంటున్నారు. వీళ్ళు టికెట్ ఆశించే ఆశబాహులు. దీనికి అయ్యిన ఖర్చు దాదాపు రూ 13 కోట్లు అని తెలుస్తోంది. అయితే…

Read More

బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రధాని మోడీ ఆన్ లైన్ ద్వార రైళ్ళను, విమానాలను, కంపెనీ ప్రారంభోత్సవాలు చేస్తారు. కానీ బిజెపి అధికరలో లేని రాష్ట్రాలల్లో మాత్రం తమ పార్టీ పబ్లిసిటీ చేసుకోడానికి పని కట్టుకుని వస్తారు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు ఏదో ఒక వంకతో వచ్చి బిజెపి మైలేగిని పెంచుతున్తున్నారు మోడీ. ఈ రోజు సికింద్రాబాద్ కు మోడీ వచ్చేది పక్కా అధికారిక పర్యటన. బిజెపి పార్టీ కి సంబంధించి ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ లు ఉండకూడదు. ముఖ్యంగా ఆయన రాజకీయ గురించి అస్సలు మాట్లాడకూడదు. కేవలం ఆ విభాగం అభివుద్ది గురించి, దానిని బాగోగుల గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది ఎప్పుడో మోడీ మరిచిపోయారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా సిఎం స్వాగతం చెప్పాలి. ప్రధానితోపాటు వెంట ఉంది, అన్ని కార్యక్రమాలల్లో పాలు పంచుకోవాలి. ప్రధానిని…

Read More

రాజకీయం రంగును మతాలకు పులిమిన ఘనత బిజెపికి దక్కుతుంది. దీనిని మొదలు పెట్టిన ఘనగా కూడా  ఆ పార్టీకే దక్కుతుంది. అది పుణ్యమో? పాపామో వాళ్ళకే తెలియాలి. కానీ ఆ మతరాజకీయాన్ని మతంతోనే  ఎదురుకోవాలని అటు బిఅరేస్ ఇటు వైసిపి బలంగా నమ్మి చాలా తెలివిగా మసులుకుంటున్నాయి. బిజెపి అన్ని పనులు చేసింది ఒకఎత్తు, రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించింది మరోఎత్తు. రామజన్మ భూమి వలన బిజెపి ఉత్తర భారత దేశంలో ఒక్కసారిగా హిమాలయం లాగా ఎదిగింది పాతుకుపోయింది. దాని ధాటికి కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీలు విలవిలలాడుతున్నాయి. దీనిని సరిగ్గా అర్థం చేసుకున్న కెసిఆర్ ఆ వేవ్ ని తెలంగాణాలో తగ్గించాలని రాముడి మీద దృష్టి పెట్టడంలేదు. నిజానికి కెసిఆర్ ని మించిన హిందూ భక్తుడు రాజకీయంలో మరొకరు లేరు. మోడీ కంటే పరమ భక్తుడు. కానీ ఇక్కడ రాజకీయం వేరు. మతం వేరు. తీర్థం…

Read More

కొన్ని సినిమాల కథలు వాల్ పోస్టర్ చూస్తే తెలిసిపోతాయి. కొన్ని ట్రైలర్ లు చూస్తే ఆ సినిమాల కథలు తెలిసిపోతాయి. మరికొన్ని సినిమాల మొదటి సీన్ చూడగానే కథ తెలిసిపోతుంది. ఈ సినిమా వాల్ పోస్టర్ చూస్తే కథ ఏమిటో తెలిసిపోతుంది. చాలా పాత కథ. లోగడ ఇలాంటి కథతో, ఇలాంటి పాత్రతో బాలకృష్ణ ఓ సినిమా చేశారు. అది అస్సలు ఆడలేదు. దాదాపు అందరు హీరోలు ఇంలాంటి కథలు చేసి ‘రీల్లు’ కాల్చుకున్నవాళ్ళే. వెంకి నటించిన ఒక్క ‘శత్రువు’ మాత్రమే బాగా ఆడింది. కథ ఏమిటంటే? కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేసే రవీంద్ర (రవితేజ) రకరకాల వ్యక్తుల ముసుగులో హత్యలు చేస్తుంటాడు. తాను ముసుగుగా వాడుకున్న వ్యక్తులనే ఈ హత్యల్లో నేరస్తులుగా చిత్రీకరిస్తాడు. ఎలాంటి ఆధారం వదలకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతాడు. ఈ హత్యలన్నీ రవీంద్ర ఎందుకు చేస్తున్నాడు? అస్సలు ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులను…

Read More

నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల నివారణకు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్టానిక కార్పో రేటర్లతో కూడిన ఒక కమిటి వేశారు. దీనిని రహమత్ నగర్ కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి సారథ్యంలో వహించారు. కమిటి నగరం మొత్తం తిరిగింది. ఓ నివేదికను తయారుచేసి 26 సూచనలతో కూడిన నివేదికను విజయలక్ష్మీకి ఇవ్వగా ఆమె ఆ దిశగా ఆక్షన్ ప్లాన్ మొదలు పెడుతున్నారు. ఇందులో ప్రధానమైనవి, ప్రస్తుతం జిహెచ్ఎంసి దగ్గర కేవలం 50 వీధి కుక్కలను పట్టుకునే వాహనాలు ఉన్నాయి. ఇందులో 14 జిహెచ్ఎంసిసి సొంత వాహనాలు. 36 అద్దె వాహనాలు. ఇవి సరిపోవడంలేదు. అందుకే కుక్కల బెడదను సమర్థవంతంగా నియంత్రించడానికి, ఉద్యోగులతోపాటు పాటు మరో 10 అదనపు వాహనాలను నియమించాలని యోచిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో స్టెరిలైజ్ చేయని కుక్కలను పట్టుకోవడానికి వ్యాన్‌లను రాత్రి షిఫ్ట్‌లో కూడా మోహరిస్తారు. నగరంలో ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన వెటర్నరీ ఆఫీసర్ల…

Read More

నిన్న హనుమకొండ కోర్టులో మధ్యాహాన్నం రెండు గంటలనుంచి రాత్రి వరకు జరిగిన వాదోపవాదాల తరువాత బండి సంజయ్ ని జడ్జి విడుదల చేశారు. బండి సంజయ్ బయటికి రాగానే ముందుగా మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ పలు హెచ్చరికలు చేశారు. పలు సవాళ్ళు విసిరారు. అందులో ముఖ్యమైనది ”కెసిఆర్ కి దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో పదో తరగతి పరీక్ష లీకేజీ మీద దర్యాప్తు చేయిస్తావా?” అని సవాల్ విసిరారు. ”పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ని నేను లీక్ చేస్తే, మరి తెలుగు పేపర్ని ఎవరు లీక్ చేసినట్లు?” అని సూటిగా ప్రశ్నించారు. ”ఆ అవసరం నాకు ఎందుకు వస్తుంది?” అని ప్రశ్నించారు. ”అసలు పరీక్షన హాలులోకి సెల్ ఫోన్ వెళ్ళితే పోలీసులు ఏం చేసున్నారు?” అని నిలదీశారు. ఒక ఎంపి ని అరెస్ట్ చేయాలంటే ముందుగా అరెస్ట్ వారెంట్ ఇవ్వలని పోలీసులకు తెలియదా? అరెస్ట్ వారెంట్ లేకుండా…

Read More

చిలకలూరి పేట దేనికి ప్రసిద్దో అందరికి తెలుసు. ఒకప్పుడు అది దేశంలోనే శృంగార రాజధాని ఎంతగా పేరు సంపాదించిందో కూడా తెలుగు ప్రజలకు తెలుసు. చిలకలూరి పేటతో పాటు పెద్దాపురం, మండపేట లాంటి ఏరియాల్లో ‘రామా’ అన్నా అందులో బూతు వెతుకుతారు శృంగార ప్రియులు. మరి అలాంటి చిలకలూరి పేటలో జగన్ బహిరంగంగా మాట్లాడుతూ ‘నాకు చేతకాదు’ అనేసరికి సభ ఒక్కసారిగా గొల్లుమంది. అందులోను ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంబిస్తూ. అందులోను ఆ చిలకలూరి పేటలో మొదటి సారి ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే పథకాన్ని ప్రారంబిస్తూ. జగన్ మాటలను మొదట జనం అపార్థం చేసుకున్నా తర్వాత నిజం తెలుసుకుని మరోసారి నవ్వుకున్నారు. ఆయన మాట్లాడుతూ”నాకు మోసం చేయడం చేతకాదు. నాకు అబద్దాలు చెప్పడం చేతకాదు. నాకు జిత్తులమారి నక్కలా ప్రవర్తిచడం చేతకాదు. నాకు కుట్రలు కుతంత్రాలు చేయడం చేతకాదు” అన్నారు. అయితే తెలుగు దేశం తమ్ముళ్ళు మాత్రం…

Read More