Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మారిది బిఆర్ఎస్ ఓవర్ ఆక్షన్. బిఆర్ఎస్ ఈ మధ్య మొదలు పెట్టిన ఆత్మీయ సమ్మేళనం అమాయకుల పాలిట శాపంగా మారింది అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. నిన్న ఉచిత భోజనం కోసం జనం కొట్టుకున్నారు. రక్తపాతం జరిగింది. అది మరువక ముందే ఈ రోజు ఇద్దరు చనిపోయారు, ఆరుగురి పరిస్టితి విషంగా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఏదో ఘన విజయం సాదించినట్లు కార్యకర్తలు విచ్చలవిడిగా బాణాసంచా కాల్చారు. అక్కడ ఎవరున్నారు? చుట్టు పక్కల గుడిసెలు ఉన్నాయా? లేవా అని కూడా చూడలేదు. నిప్పు రవ్వలు పూరి గుడిసె మీద పడ్డాయి. అందులోని గ్యాస్ సిలిండర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తుల కాళ్ళు తెగిపడ్డాయి. ఒకరి కడుపు లోనుంచి పేగులు బయటికి వచ్చాయి.…
దేశంలోనే సంచలనంగా మారిన టి ఎస్ పి ఎస్ సి ఏ ఈ పరీక్షా పత్రాల లికేజి కేసు గురించి తెలిసిందే. అందరి జాతకాలు బయటపెడుతూ సిట్ ఉన్నత అధికారి, అడిషనల్ పోలీస్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ తుది నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి నిన్న మంగళవారం హై కోర్టులో జడ్జికీ సమర్పించారు. దాదాపు రెండు వారాలుగా లోతుగా దర్యాప్తు చేసిన ఆయన ఎవ్వరిని వదలలేదు అని తెలిసింది. తప్పు చేసినవాళ్ళను, ఆ తప్పు చేయించిన వాళ్ళను, దానికి సహకరించిన వాళ్ళను ఏ ఒక్కడిని కూడా ఆయన వదలలేదు అని తెలిసింది. దీనితోపాటు ఆయన ఎవ్వరు ఉహించని కొత్త విషయాలు కూడా అందులో పొందుపరిచినట్లు కూడా సమాచారం అందింది. ఇందులో బడా నేతల జాతకాడా కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ నేతలు ఎవరు అనే కొత్త ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎవరికివారుగా భయంతో వణుకుతున్నారు. తేలు కుట్టిన దొంగల్లా అందరు…
”బిఆర్ఎస్ చేసే అక్రమాలను, కుంభకోణాలను బయిటకి తీస్తాము” అని మొన్న నగరానికి వచ్చిన మోడీ ప్రగల్బాలు పలికారు. అమిత్ షా నగరానికి వచ్చిన ప్రతిసారి ఇదే నినాదాన్ని ఆవులా తెగ నేమరువేస్తారు. ఇక టిబిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి ”బిఆర్ఎస్ చేసే అక్రమాలను, కుంభకోణాలను బయిటకి తీస్తాము. కెసిఆర్ ని జైలుకు పంపుతాము. ఆయన చేసిన పాపాలు బయటపెట్టి చిప్ప కూడు తినిపిస్తాను. ఆయన కోసం చంచల్ గూడా జైలు సిద్దంగా ఉన్నది” అని కల్లు తాగిన కోతిలా గెంతుతాడు. బాగానే ఉంది. ఎవరు తప్పు చేసినా శిక్ష పడేలా చేయడం అందరి బాధ్యత. రూ . 800 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని యశోదా ఆసుపత్రి వాళ్లకు రూ . 100 కోట్లు అమ్మి కెసిఆర్ డబ్బులు దండుకున్నారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముందు ఆరోపించారు. మాములుగా ఆరోపించాకుడా దానికి…
రూ . 800 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని యశోదా ఆసుపత్రి వాళ్లకు రూ . 100 కోట్లు అమ్మి కెసిఆర్ డబ్బులు దండుకున్నారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న మీడియాముందు ఆరోపించారు. మాములుగా ఆరోపించ కుండా దానికి తగిన ఆధారాలు, డాకుమెంట్లు చూపడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. నిన్నటివరకు రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగిన కెసిఆర్, ఇప్పుడు ఆ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్లు ఒక్కసారిగా ‘తుస్సు’ మన్నట్లు మౌనం వహించారు. దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం దీనిని ఖండించనూ లేదు. ఈ మౌనం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఎందుకు మౌనం వహిచారో చూడాలి. మౌనం అర్థ అంగీకారం కావచ్చు. కానీ రాజకీయ నాయకులు అంత తొందరగా లొంగుతారా? కెసిఆర్ ఇప్పుడిప్పుడే బిఆర్ఎస్ పార్టీని జాతీయ స్టాయికి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్తిలో ఏఒక్క కుంభకోణం…
నిజం సినిమా డైరెక్టర్ కిషోర్ వెన్నెలకంటితో మా రిపోర్టర్ జరిపిన ఇంటర్వ్యూ మీకు మక్కికి మక్కీగా అందిస్తున్నాము. రిపోర్టర్: కిషోర్. ఈ నిజం సినిమా ఎందుకు చూడాలి? కిషోర్ : ఇంతకుముందు మీరెప్పుడూ చూడని రెక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి. మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరి చూసి వుంటారు. కానీ ఇది రేక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి, ప్రేమ దేశం సినిమాతో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ బయటకు వచ్చాయి. అప్పటివరకు లవ్ స్టోరి అంటే ఏడ్పులు, త్యాగాలు ఉండేవి. కానీ ఈ సినిమా కొత్త కోణంలో వుండటం వల్ల ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. ఇంకా కొత్తగా ఏం చెప్పగలం. కొత్త కథ ఏం రాయగలం అని అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదటి ఆలోచన ఈ ‘నిజం’ కథ. ఇందులో మీరు రెక్ట్ ఆంగిల్ లవ్ స్టోరి తో పాటు ఒక పొలిటికల్ క్రైం డ్రామా చూస్తారు. లవ్ స్టోరి…
అది శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం, కమ్మరవాండ్ల పల్లి. చాలా ప్రశాంతమైన ఊరు. ప్రేమానురాగాలకు పేరు మోసిన మంచి ఊరు. ఆ ఉరికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు సాఫ్ట్ వేర్ ఇంజనియర్. పెళ్లి చూపులకు పక్క ఊరికి వెళ్ళాడు. ఆమె పేరు లక్ష్మీ. పెళ్లి చూపుల్లో అందరికి నచ్చింది. ఆమెకు తిమ్మరాజు కూడా నచ్చాడు. ఇష్ట పూర్వకంగా పెళ్ళికి ఒప్పుకుంది. ఆమె తల్లి దండ్రులు సంతోషించారు. ఘనంగా పెళ్లి చేశారు. అందరు సంతోషంగా ఉన్నారు. పెద్దలు కలిసి మూడో రోజే శోభనం చేశారు. ఆ రాత్రి ఇద్దరు స్వర్గం చవిచూశారు. కుట్ చేసే ఉదయం ఆమె కనిపించలేదు. ఆమె బట్టలు, నగలు కనిపించలేదు. పుట్టింటికి వెళ్ళింది అనుకుని తిమ్మరాజు, అతని తమ్ముడు ప్రశాంత్ పరుగెత్తారు. తీరా చూస్తే ఆమె పుట్టింటికి కూడా వెళ్ళలేదు. పాదాల పసుపు పారాణి కూడా ఆరని నవదంపతుల మధ్య గొడవలు ఏముంటాయి? మరి ఆమె చెప్పాపెట్టకుడా…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తెలుగుదేశం పార్టీకి కి చెందిన ‘చైతన్య రథం’ పత్రిక కార్యాలయం లో సిఐడి అధికారులు ఈ రోజు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. తెలుగుదేశం జనరల్ సెక్రటరీ పేరుతో నోటిసులు జారి చేశారు. ‘చైతన్య రథం’ పత్రికలో గత కొన్ని రోజులుగా అబద్దపు కథనాలు, ఎల్లో జర్నలిజం వార్తలు రాస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత అక్కడ ఉన్న లాయర్ కి నోటిసులు ఇచ్చారు సిఐడి అధికారులు. గత ఎన్నికలల్లో బుగ్గన రాజేంద్రనాథ్ తన ఎన్నికల కమిషన్ అఫిడివీటిలో స్టిర ఆస్తులు, చర ఆస్టుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. పత్రిక తప్పుడు కథనాలు రాసినట్లు ఆరోపిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ ఇచ్చిన పిర్యాదు మేరకు సిఐడి రంగంలోకి దిగింది. ఈ కేసు త్వరలోనే కోర్ట్…
ఎంత మంచి కూర వండినా, చివరికి బిర్యానీ వండినా ఉప్పు తప్పక ఉండాలి. ఉప్పు లేనిదే ఏ కూర రుచిగా ఉండు. అందుకే ప్రతి కూర ఉప్పుతో అణిగిమణిగి ఉంటాయి. అందుకే ఉప్పుకు గర్వం పెరుగుతంది. నేను లేనిదే ఏ కూర లేదు అనే ఖండకావరం పెరుగుతుంది. అందుకే అన్ని కూరలతో గొడవపడి బయటికి వస్తుంది. ఇక తనకు అన్ని కురల కంటే ఎక్కువ గౌరవం పెరుగుతుంది అని కూరగాయల మార్కెట్ లో పోటి పడుతుంది. కానీ దానిని సంతలో ఎవ్వరు కొనరు. ఉప్పును ఎవ్వరు ఒక కురలాగా వాడుకోరని ఉప్పుకు అప్పుడు తెలిసి బోరున ఏడుస్తుంది. వెనక్కి వెళ్ళితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు కూడా బిఆర్ఎస్ పార్టీ లో ఉప్పులాంటి వాళ్ళు. వాళ్లవల్ల బిఆర్ఎస్ పార్టీకి మేకలు జరిగన మాట వాస్తవం. వాళ్ళ సేవలు ఆ పార్టీ ఎంతో ఉపయోగపడిన…
అనేక తర్జన భర్జనల తర్వాత, అనేక నివేదికల తర్వాత, అనేక ఆందోళన తర్వాత, అనేక వాదోపవాదాల తర్వాత దాదాపు 36 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం అమల్లోకి తీసుకొచ్చింది. 2023 నుంచి అమలులోకి రాబోతోన్న ఈ కొత్తవిద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. ఆ కొత్త విధానంలో ముఖ్య అంశాలను భారత ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. అవి ఏమిటంటే – 1. నర్సరీ లో 4 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 2. జూనియర్ కిన్దేన్ గార్డెన్ లో 5 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 3. సీనియర్ కిన్దేన్ గార్డెన్ లో 6 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 4. మొదటి తరగతిలో 7 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 5. రెండో తరగతిలో 8 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 6. మూడో తరగతిలో 9 సంవత్సరాలు పిల్లలను చేర్చుకుంటారు. 7.…
బిజెపి ఉనికిలేని రాష్ట్రాలల్లో ప్రభుత్వ సంస్థలను అమ్మి, నాలుగు డబ్బులు పోగుచేయాలన్నది బిజెపి కుట్ర. ఆ డబ్బును బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో దారాదత్తం చేయాలన్నది మోడీ మరో కుట్ర. దీనిని ఆరేళ్లుగా ఆమము చేస్తున్నారు. బిజెపి ఉనికిలేని రాష్ట్రాలల్లో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్టానంలో ఉంది. అక్కడ బిజెపికి ఎలాంటి భవిష్యత్తు లేదని తేలిపోయింది. అందుకే విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు మోడీ. అందుకే మార్చ్ 27 వ తేదినా ఈఓజి (ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన) విడుదల చేసింది బిజెపి సర్కార్. దానిని అందరు ఒక్క గొంతుకతో వ్యతిరేకించినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. ఎందుకంటే ఓసారి జైలు జీవితం గడిపి, చిప్ప కూడు తిన్న జగన్ ఇప్పుడు ‘పప్పు’ కూడు తింటున్నారు. అందుకే ‘పప్పు సిఎం’ గా మారారు. మోడీతో అతనికి చీకటి ఒప్పందాలు కుదిరాయి అన్నది అందరికీ తెలుసు.…