Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు తదితరులు. సంగీత దర్శకులు: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్ …
మనకు ఏ నొప్పి వచ్చినా ముందుగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని ఉపశమనం పొందుతాము. దానితో నొప్పి తగ్గుతుంది అని మురిసిపోతము. కానీ ఆ పెయిన్ కిల్లర్ ఆ రోగాన్ని తగ్గించదు అని మీకు తెలుసా? ఉదాహణకు మీకు మోకాలు నొప్పి వచ్చిందే అనుకొందో. మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నొప్పి కొన్ని గంటలపాటు తగ్గుతుంది. అంటే మోకాలు నొప్పి తగ్గింది అని మురిసిపోతారు. ఇది తప్పు. మోకాలు నొప్పి అస్సలు తగ్గదు. ఆ నొప్పిని తెలియజేసే మెదడు నరాల మీద ఆ పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. మెదడు నరాలు తాత్కాలికంగా మోద్దుబారేలా చేస్తాయి. మీరు ఏ పెయిన్ కిల్లర్ వాడినా అది మెదడు మీదే ప్రభావం చూపుతుంది అని తెలుసుకోండి. కానీ అసలు రోగాన్ని ఎప్పటికీ తగ్గించదు. దానికి మందులు వేరుగా ఉంటాయి. తీర్థం వేరు – ప్రసాదం వేరు. అసలు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? మన…
”నాపేరు రికార్డ్ లల్లో ఉడడం కాదు – నా పేరు మీదనే రికార్డ్ లు ఉంటాయి” అనే డైలాగ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చెపితే విజిల్స్ పడ్డాయి. ఇప్పుడు దానిని నాని నిజం చేస్తున్నారు నాని. ‘దసరా’ సరికొత్త రికార్డులు సృస్తిస్తోంది. నేచురల్ స్టార్ గా పేరు పొందిన నాని నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా సంచలంగా మారింది. కేవలం రెండు వారాలలోనే రూ 120 కోట్లు సంపాదించింది. యువ దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను అద్బుతంగా చెక్కారు. ఇందులోని ప్రతి పాట ఓ ఆణిముత్యంలా ప్రజాదరణ పొందడం వల్ల కనక వర్షం కురుస్తోంది. ప్రతి రోజు ‘దసరా’ పండగ చూపిస్తోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం కొత్త రికార్డ్. లాంగ్ రన్ లో…
గత రెండేళ్లుగా చేసిన సర్వేలు దేశంలోనే అతి పేదరికం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని తేల్చాయి. ఇది షాకింగ్ వార్త కాదు. కానీ దేశంలోనే అత్యధిక సంపన్న సిఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త రికార్డ్ నెలకొల్పారు. తాజాగా ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. దేశంలో మిగతా 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్ కంటే తక్కువేనని ఈ సంస్థలు వెల్లడించాయి. అతి పేదరికంలో వెస్ట్ బెంగాల్ ముఖ్య మంత్రి గా మమతా బెనర్జీ ఉన్నారు. శభాష్ తల్లి. ఇక ఎక్కువ అప్పులు చేసిన జాబితాలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంచలన విషయాన్ని బయటపెట్టాయి. దేశంలోనే చంద్రబాబు వ్యక్తిగత సంపాదనలో అత్యంత ధనికుడైన మూడో ఎమ్మెల్యే అని…
చట్టం ప్రకారం జుబ్లిహిల్స్, బంజారా హిల్స్ లో నాలుగు లేదా స్పెషల్ పెర్మిషన్ తో మాత్రమే బహుళ అంతస్తులు కాటాలి. ఇది చాలా కాలంగా ఉన్న నిబందన. బంజారాహిల్స్ లో నందమూరి బసవతారకం కాన్సర్ ఆస్పత్రి నాలుగు అంతస్తులతో ఉంది. వాళ్ళు రెండు అంతస్తులు పెంచుకోవడానికి అనుమతి కోరితే కేసీఆర్, కేటిఆర్ దానిని తోసిపుచ్చారు. వాళ్ళు నిబంధనను సరిగ్గా పాటించినందుకు సంతోషమే. కానీ అదే ఆస్పత్రి పక్కన, కేబిఅర్ పార్క్ ఎదుట బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 14 లో కేసిఎస్ డెవలపర్స్ అధినేత కుర్ర శ్రీనివాసరావు భూమి ఉంది. ఇందులో ఐదు అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ కి బదులు కేసిఆర్ 16 అంతస్తులు కట్టుకోడానికి అనుమతి ఇచ్చారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది 2700 గజాలు. దీనిని కేసీఆర్ స్వయంగా తన పేరుతో ఇల్లీగల్ గా రాయిన్చుకున్నాడు అని ఆరోపించారు. కేవలం ఆరోపించాకుండా తగిన…
‘అనుకున్నది ఒక్కటి – అయినది ఒక్కటి – బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అన్నట్లు మారింది ముఖ్యమంత్రి జగన్ పరిస్టితి కాదు, అంధ్రప్రదేశ్ ఉద్యోగులది. జగన్ ఈరోజు కొట్టిన దెబ్బకు ఉద్యోగుల గూబ గుయ్యిమంది. ‘వెలుగు పరిది’ లో పనిచేస్తున్న మండల సంమాఖ్య క్లస్టర్ కోఅర్దినేటర్స్ (ఎం ఎస్ సి సి) ఉద్యోగుల జీతాలు పెంచుతామని జగన్ పలుమార్లు మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారు. కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని వాళ్ళ డిమాండ్లను నెరవేర్చి, జీతబత్యాలు పెంచుతానని ఆయన పలు మీటింగ్లల్లో కూడా మాటిచ్చారు. ఆయన సి ఎం అయ్యాక ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని కాలం వెళ్ళబుచ్చారు. ఇక ఓపిక నశించిన ఉద్యోగులు ఆందోళన బాట పట్టబోగా ఆర్థిక లోటువల్ల ఎం ఎస్ సి సి ఉద్యోగుల జీతాలు పెంచలేక పోతున్నాము అనే చావు కబురు చల్లగా చెప్పారు జగన్. అయితే ఈ చావు కబురు తాను చెప్పకుండా పంచాయితీ…
రాహుల్ గాంధీ కి ఏది కలిసిరావడం లేదు. బ్యాడ్ టైం నడుస్తోంది. ‘రాహు’ కాలం ఇంకా వెన్నంటి నడుస్తోంది. ఒక్క అడుగు ముందుకువేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ‘మోడీలు అందరు దొంగలు’ అన్న చిన్న మాటకు కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా వీర్ సావర్కర్ మనవడు మనవడు సాత్యకి సావర్కర్ నీ తెరమీదకి వచ్చేలా చేశారు బిజెపి నాయకులు. దగ్గరుండి రాహుల్ గాంధీ మీద కోర్ట్ లో కేసు వేయించారు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ లండన్ లో పాల్గొన్న ఓ కార్యక్రమంలో వీర్ సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడాడు అన్నది సాత్యకి సావర్కర్ ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి మీద రాహుల్ గాంధీ తెలిసి తెలియని అజ్ఘానంతో నోటికి వచ్చింది వాగాడు అని అతను ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అని అయన ధిమాతో చెప్పాడు.…
పాము కాటు కంటే దోమ కాటే ప్రమాదకరమని మన శాస్త్రవేత్తలు ముంబాయిలోని సెంట్రల్ రీసర్చ్ మెడికల్ సెంటర్ లో కనుగొన్నారు. పాము కాటు వెంటనే విషం ఎక్కుతుంది. కానీ దోమ కాటు స్లో పాయింజన్ లాగ పనిచేస్తుంది అని తెలిపారు. అందుకే మలేరియా, డెంగ్యు, మరో 12 రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని మనకు తెలుసు. కానీ ఆ కాటు పాము కాటు కంటే ప్రమాదకరం అని తెలియదు. అసలు ఈ మలేరియా వ్యాదిని కనుగొన్న శాస్త్రవేత్తఎవరో మనవాళ్ళకు చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ కు సమీపంలో ఉన్న బేగం పేటలో ఉండే బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. దోమకాటువల్ల మలేరియా వస్తుంది అని ఆయన రుజువుచేయగానే ప్రపంచం విస్తుపోయింది. దీనికి గాను 1902 లో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన నివసించిన ఇల్లు బేగం పేటలో ఇప్పటికీ ప్రదర్శనకు ఉన్నది. ఈ దోమల నివారణకు, హాయిగా…
బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యినట్లు టి బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కి జైలులో జ్ఞానోదయం అయ్యినట్లు ఉంది. ఒక్క రాత్రి జైలులో ఉన్నందుకే ఆయనలో తీవ్ర మనస్తాపానికి గురయ్యినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతనిని అర్థ రాత్రి పోలీసుకు అరెస్ట్ చేస్తే తన వెనక బిజేపి అధిష్టానం అండగా ఉంటుంది అనుకున్నాడు. ఆ విషయం తెలియగానే అమిత్ షా, నడ్డా లాంటి నాయకులు హుటా హుటిన హైదరాబాద్ కు పరుగెత్తుకు వస్తారు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. డిల్లి పెద్దలు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. పైగా రాజకీయాల్లో తెగేంత వరకు లాగొద్దు, చూసి నడుచుకోవాలి అని మందలించినట్లు తెలిసింది. దానిని తోడూ ప్రధాని మోడీ హైదరాబాద్ కి వచ్చే పర్యటన కార్యక్రమాలు చూసుకునే పనిలో ఇటు తెలంగాణ నేతలు బిజీగా ఉన్నారు. వీళ్ళు కూడా పెద్దగా పట్టించు కోలేదు. ఎవరి పనులు వాళ్ళవి. ఏ ఒక్క నాయకుడు కూడా…
కేసీఆర్ కీ ఓ మంచి అలవాటు ఉంది. చెప్పింది చేస్తారు. చేసేది చెపుతారు. ఒక్కసారి కమిట్ అయితే తనమాట తానే వినడు. కానీ ఎన్నికల ముందు ఓ చెడ్డ అలవాటు కూడా ఉంది. చెప్పింది చేయరు. చేసేది చెప్పరు. ఇక్కసారి కమిట్ అయితే అందరి మాట వింటారు. చివరి నిముషంలో అయన ఎటు మొగ్గుతారో, ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. చివరికి ఆయనకు కూడా తెలియదు. అంత టాప్ సీక్రేట్. ఈసారి సిట్టింగ్ ఎంఎల్ఏ ఎమ్మెల్యేలకు అందరికి మళ్ళి సీట్లు ఇస్తాను అని లోగడ ప్రకటించారు. దీనిని నమ్మినవాళ్ళ కంటే నమ్మని వాళ్ళే ఎక్కువా. వాళ్లు అనుమానించినట్లే జరిగింది. కేసీఆర్ రహస్యంగా జరిపించిన సర్వే రిపోర్ట్ లు అందాయి. దానిని ఆధారం చేసుకుని ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలోంచి ౩౦ మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లీక్ అయ్యింది. అయితే…