Author: Duriki Mohan Rao

ఒకప్పుడు అభివృద్ధి చెందిన నగరాల భూములను రాజకీయనాయకులు ఆక్రమించేవాళ్లు. ఇది అవుట్ డేట్ ఆక్రమణలు. ఇప్పడు పేద రైతుల భూములను ముందుగా ఆక్రమిస్తున్నారు. తర్వాత ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఆ భూముల ధరలు అమాంతం పెంచేయడం కొత్త ట్రెండ్. దీనికి మూల పురుషుడు నారా చంద్రబాబు నాయుడు. నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో  ముందుగా శంషాబాద్ లోని రైతుల భూములను ఎకరానికి చాలా తక్కువ ధరలో  (వేలల్లో) జయాబేరి కె. మురళి మోహన్ తో బినామిగా కొనిపించారు. ఆ తర్వాత అక్కడ అంతర్జాతీయ విమానశ్రయం రాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో కె. మురళి మోహన్ ఆ భూములను ఎకరానికి కోట్లల్లో అమ్ముకున్నారు. ఇదే స్కీంని మొన్ఆంన ధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి ‘అమరావతి’ రాజధానిగా ప్రకటించారు. ఇప్పడు జగన్ కూడా వైజాగ్ లో భూములు కొని దానిని రాజధానిగా ప్రకటించారు. తెలుగుదేశం నుంచి  అక్రమ పసుపు రంగు పూసుకుని వచ్చిన కెసిఆర్…

Read More

కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మా బొరుసు లాగా గొప్ప గొప్ప నాయకులకు 9 మంచి లక్షణాలతో పాటు ఒక ఆవలక్షణం కూడా ఉంటుంది. కెసిఆర్ కూడా దీనికి మినహింపు కాదు. ఆకలితో ఉన్నవాడిని చూసి చలిస్తారు. కంట తడి పెట్టుకుంటారు. వాడికి కడుపునిండా అన్నం పెట్టాలని మటన్ బిర్యానీ వండుతారు. మంచి విస్తరి వేసి గౌరవంగా కుర్చోపెడతాడు. కానీ తినే ముందు బిర్యనిలో తుపుక్కున ఉమ్మి ‘ఇక తిను బిడ్డా’ అంటారు. ఈ ఒక్క ఆవలక్షణం ఆయనను మొదటినుంచి అబాసుపాలు చేస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2001లో టిఆర్ఎస్ స్థాపించి దేశంలో సంచలనం సృటించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డంకులు ఏర్పడిన ప్రతిసారి తన పదవికి రాజీనామా చేసి, పార్టీతో రాజీనామాలు చేయించి ప్రజల్లోకి వెళ్లి మళ్ళి గెలిచారు. ఆయన అహింస పిలుపుతో తుపాకుల ఉద్యమాల గడ్డ యావత్తు తెలంగాణ అహింసతో కదం తొక్కింది. ఎక్కడా ఆంధ్ర వాళ్ళను కొట్టలేదు,…

Read More