Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
చేప బతికుండగా కంపు వాసనా వస్తుంది. అది చనిపోగానే ఆ వాసన పోతుంది అనుకుంటారు. కానీ అది చచ్చినా దాని కంపు పోయిచావదు. అవినీతి కూడా చేపలాంటిదే. వై ఎస్ రాజశేఖర రెడ్డి, అతని కుటుంబానికి నమ్మినబంటులా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీని సిబిఐ ఇంకా నీడలా వెంటాడు తోంది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించింది అని నమ్మిన సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను లోగడ కోర్ట్ రిమైండ్ ఖైదీగా జైలులు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా ఆమె కష్టాలు మాత్రం ఆమెను విడిచిపోలేదు. సిబీఐ సరైనా ధారాలు చూపలేకపోయింది అని తెలంగాణ హైకోర్టు ఈమధ్య ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మొదటినుంచి ఆమె తమ కుటుంబానికి అనుకూలంగా ఉన్నదని భావించిన జగన్ ఆమెను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇద్దరూ జైలుకు వెళ్లి…
ప్రపంచంలోని అతి పెద్ద కుంబకోణంగా చెప్పుకునే అదాని గ్రూప్ గురించి మన కేంద్ర ప్రభుత్వం కావాలని మర్చిపోతోంది. ప్రజలు కూడా మర్చిపోయేలా చేస్తోంది. కానీ ఆ విషయం మర్చిపోకుండా, మన దేశం బాగుకోరుతూ విదేశీ సంస్థ హిండెన్ బర్గ్ ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. శ్మశానంలో తొవ్వే కొలది ఎముకలు అన్నట్లు భయానక కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. నిజానికి ఈ పని చేయవలసింది మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ పనిని పరాయివాళ్ళు చేస్తుంటే మనవాళ్ళు కునుకు తీస్తున్నారు. ‘ఇచ్చితినమ్మా వాయినం – పుచ్చుకుంటినమ్మా వాయినం’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వాయినం ఇచ్చింది. దానిని కోర్టు ‘పుచ్చుకుంటి నమ్మా వాయినం అన్నట్లు’ నిపుణుల కమిటి వేసున్నట్లు ప్రకటించింది. కానీ ఆదాని గ్రూప్ల మీద ఎలాంటి నిషేధాలు ఇంకా ప్రకటించలేదు. ఆ అవినీతి ఇంకా ఎన్ని రంగాలకు వ్యాపించిందో తెలుసుకునే ఏర్పాట్లు ఇంకా…
లోగడ ఉమ్మడి ఏపిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వలేని వై ఎస్ రాజశేఖర రెడ్డి ‘అవుట్ సోర్స్’ అనే కొత్త పథకం పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు అలాంటి పద్దతిని ఏ పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అమలు చేస్తూ ‘వలంటీర్ల’ విధానం మొదలు పెట్టారు. వీళ్ళు ఎవరో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతి గ్రామంలో తన పార్టీ కార్యకర్తలకు ‘వలంటీర్ల’ ఎరను వేసి యువతను, నిరుద్యోగులను అడ్డంగా ఇరికించారు. వీళ్ళకు అన్ని అధికారాలు అంటగట్టారు. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలపైన గ్రామాలల్లో ‘వలంటీర్ల’దే పెత్తనం. వాళ్లు అడిగినంతా ఇవ్వాలి, చెప్పినట్లు చేయాలి. దానితో ప్రజల కష్టాలు క్రమంగా ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు చెపితే ఎవ్వరు పట్టించుకోలేదు. చిలికి చిలికి గాలివానల ఇది హై కోర్టు మెట్లు ఎక్కింది. రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి…
బిఆర్ఎస్ ప్రభుత్వానికి ‘రైతుబంధు’ ఓట్ల తింపెట్టిన కల్పతరువు. ఇప్పటివరకు ఆ పార్టీ గెలవడానికి కారణం కూడా ఈ పథకమే. ఇప్పుడున్న ఆర్థిక లోటువల్ల ఈ పథకంలో కెసిఆర్ కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చిన్నరైతు, మోతుబరి రైతు అనే తేడా లేకుండా అందరికి ‘రైతుబంధు’ డబ్బులు బ్యాంక్లో వేశారు. కానీ ఇప్పుడు 11 ఎకరాల కంటే ఎక్కువ భూములున్న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం లేదు. ఇప్పటివరకు 5 ఎకరాలు, అంతకంటే తక్కువున్న భూములున్న రైతుల ఖాతల్లోకి డబ్బులు వచ్చాయి. 11 ఎకరాల కంటే ఎక్కువ భూములున్న రైతులను ‘మోతుబరి’ రైతులుగా గుర్తించారు. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అవసరం లేదని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మోతుబరి రైతులకు చిల్లి గవ్వ అందలేదు. ఈ విషయం సంబంధిత అధికారులు చెప్పకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు ‘రబీ’ సీజను డబ్బులు కూడా సన్నకారు రైతులకు అందలేదు. పేద రైతులు,…
‘తాంబూలాలు ఇచ్చాము, ఇక తన్నుకు చావండి’ అన్నట్లు కేంద్ర ఎన్నకల సంఘం తెలంగాణ ఎమ్మెల్సి ఎన్నికల తాంబూలాలు ఇచ్చింది. ఏమ్మెల్లె కోటాలో 3, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లోకల్ బాడీస్, టీచర్స్ ఎమ్మెల్సి స్టానాలకు ఈ గురువారంలో నామినేషన్ల గడువు ముగుస్తోంది. దాని తర్వాత వెంటనే ఈ ఐదు ఎమ్మెల్సి ఎన్నికలు ఇసి నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అయితే ఇది బిఆర్ఎస్ కి కొత్త కాదు. పొతే మొన్నటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. బరువుతో పాటు బాధ్యతలు కూడా ఎక్కవే. లోగడ ఏమ్మెల్లె టికెట్లు దక్కని రెబల్స్ ని ‘ఎమ్మెల్సి’ టికెట్ ఇస్తానులే అని కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు ఎవరికి వారుగా మాటిచ్చి బుజ్జగించారు. ఎవరికి వారుగా కనీసం 40 మందికి మాట ఇచ్చారు. అంటే మొత్తం 40 ఇంటు ౩ = 120 కౌరవుల కంటే…
జోడో యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది. 52 ఏళ్ల అయన మునుపెన్నడూ లేనివిధంగా ఎంతో మేచ్యురిటితో తన మనసులోని మాటలను నిర్భయంగా చెపుతున్నారు. విదేశానికి చెందిన ‘ఇటాలియన్ మీడియా సంస్థ ‘కొరియర్ డెల్లా సెరా’ కు నిన్న ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’ అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ పరోక్షంగా మోడిని టార్గెట్ చేశారు. భార్యా భర్తలు అంటే ఒకరి కష్టలల్లో మరొకరు పాలు పంచుకోవాలి, ఏ పదవి వచ్చినా తన నానమ్మ ఇందిరా గాంధీలా అనుకువగా ఉండాలి అన్నారు. కానీ పదవి రాగానే భార్యను 40 ఏళ్ల పాటు వదిలేసే భార్తలా ఉండకూడదు. ఆ భార్యకు కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా పుట్టింటికి పంపివేయరాడు. గడ్డివాము కాడి కుక్కలా తాను సుఖపడకా, ఆమెను సుఖపడనీయక పోవడం మంచిది కాదు” అని…
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే తాను కాల్చే చుట్ట అందులో తగలబడి పోతోంది అని మరొకడు ఏడ్చినట్లు ఉంది గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వితండవాదం. సోమవారం అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు పిక్కుతిని చంపేసాయి. మరి కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త పేటలోని మారుతీ నగర్ లో మరో బాలుడిని వీధి కుక్కలు రక్త సిక్తంగా కరిచాయి. ఈ విషయం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ దగ్గరికి విలేకరులు తీసుకెళ్ళి ఆమె వివరణ కోరారు. నగరంలో ఉన్న దాదాపు తొమ్మిది లక్షల కుక్కులను పట్టు కుంటాము అని చెప్పాల్సిన ఆమె వితందవడంలోకి దిగారు. ‘పిల్లవాడిని కుక్కలు చంపేంత వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి విషయం జి హెచ్ ఎం సి ఎలా చూసుకుంటుంది? అని నిర్లక్ష్య సమాధానం చెప్పారు. పైగా తాను కుక్కల ప్రేమికురాలినని, తాను కుక్కలను పెంచుకుంటున్నట్లు,…
డ్వాక్రా మహిళల ఉత్పత్తులంటే లోకల్ ప్రోడక్ట్ అనే చిన్న చూపు ఉంది. నాణ్యత ఎంత బాగున్నా దానికి బ్రాండ్ ఇమేజ్ లేకపోవడంతో ఆ ఉత్పత్తులు గ్రామాల సంతలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడా కష్టాలు తీరుస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం అద్బుతమైన పతకం ప్రవేశపెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పేరుతో ఒక లోగోతో రాబోతోంది. ఇకపై డ్వాక్రా మహిళల ఉత్పత్తులు చేసే అన్ని రకాల వస్తువలకు ఈ బ్రాండ్ పెట్టనున్నారు. అంటే ఇకపై ఇది ఐ ఎస్ ఐ బ్రాండ్ లాంటిది. నాణ్యతకు, మన్నికకు, ధరకు ఇది ఒక అధికారిక స్టాంప్ లాంటిది. ఈ భాద్యతను సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) చేపట్టనుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన వివరాలను బట్టి ఇకపై వస్తువులు ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబులింగ్ తో…
ఈ సృష్టిలో అత్యంత కృరమృగం ఏదో తెలుసా? అని అడగగానే టక్కున చెప్పేది పులి లేదా సింహం. కానీ దానిని మించిన కృరమృగం మనిషి అని నోబెల్ గ్రహీత దలైలామా ఓ సందర్భంలో అన్నారు. అది నిజమే. ఏ మృగమైనా ఆకలి వేస్తేనే, ఇక తప్పదు అనుకున్నప్పుడే వేటాడి శాకాహార జంతువుని చంపుకు తింటుంది. శాకాహార జంతువులంటే మాంసం తినకుండా కేవలం గడ్డి, ఆకులు, అలములు తినే జింకలు, ఆవులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్ళను మాత్రమే తింటుంది. కానీ మాంసం తినే నక్కలు, కుక్కలు, తోడేళ్ళును చంపుకుతినవు. కానీ మనిషి దేనిని వదిలిపెట్టాడు. అన్నిటిని తింటాడు. దీనికి చక్కటి ఉదాహరణ – ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పులి కరెంట్ తీగను తొక్కి ప్రాణం వదిలింది. అక్కడి గ్రామస్తులు ఆ విషయాన్ని అటవీ శాఖకు చెప్పలేదు. కనీసం మానవత్వంతో దాన్ని పాతి పెట్టలేదు. ముందుగా దాని చర్మాని ఒలిచారు అమ్ముకోడానికి.…
గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ లో జరుగుతున్నా హై డ్రామా అంతా ఇంతా కాదు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కూడా మీరు ఇంతటి హై డ్రామా చూసి ఉండరు. గత ఏడాది బిఆర్ఎస్ ప్రభుత్వం గురుకులలో 9,౦౦౦ వేల ఉద్యోగాలు బర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి ఆర్థిక శాఖా అనుమతి లభించింది. కానీ అది ఇప్పటివరకు కార్యాచరణకు నోచుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తడిగుడ్డ వేసుకుని కూర్చుంది. దానికి కారణం అందరికి తెలిసిందే. వాటిని పక్కన పెట్టి గురుకుల శాఖలో మరో 2,391 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కూడా ఆర్థిక శాఖా అనుమతి పొందింది. అంటే మొత్తం 11,231 ఉద్యోగాలు రాబోతున్నట్లు తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకున్నారు. మరి ఎందుకు ఉద్యోగాలు బర్తీ చేయడం లేదని నిరుదోగులు నిలదీస్తే ”టీచర్ ఎం ఎల్ సి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు…