Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
మనుషులలో కొందరికి ‘చిల్లర’ బుద్దులు ఉంటాయి. మరి ‘కరెన్సీ’ బుద్దులు కూడా ఉంటాయా? అంటే అవును అనక తప్పదు. దీనికి ఉదాహరణ విశాఖపట్నం కలెక్టరేట్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. తాజాగా ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. రాజశేఖర్ కూడా ఉన్నారు. అతడు శ్రీముఖ లింగం దేవాలయ ప్రధాన ఆర్చకుడు. కాబట్టి హుండిలో వేసే చిల్లరలాగా తన ఇంట్లో కూడా ఒక హుండీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఎన్నికల కోసం ఎప్పటినుంచో చిల్లర పోగుచేస్తూ వచ్చారు. ఇక ఎన్నికలు రానే వచ్చాయి. ఆ చిల్లరను మోసుకుంటూ నామినేషన్ వేసేందుకు విశాఖ కలెక్టరేట్కు వచ్చాడు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ అక్కడే అసలు సమస్య మొదలయింది. నామినేషన్ ఫీజ్ పది వేలు చెల్లించాలి. ఆ చిల్లర తీసుకోండి అని అధికారుల ముందు చిల్లర సంచులు గుమ్మరించారు. అవన్నీ రూపాయి…
బిఆర్ఎస్ పార్టీ జాతీయస్టాయిలో గెలవాలంటే ముస్లింల ఓట్లు ఎంతో కీలకం. లోగడ కాంగ్రెస్ కి రిజర్వు లో ఉన్న ఈ ఓట్ల మీద కన్నేసిన కెసిఆర్ మజ్లిసే పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. అయినా పైకి మాత్రం అలాంటిది ఏమి లేదని కెసిఆర్ ఎన్నిసార్లు చెప్పారు. కానీ కార్యాచరణలో మాత్రం అవన్నీ అబద్దాలని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. ఇప్పుడు కూడా అదే జరికింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకు ఇచ్చి దేశవ్యాప్తంగా మజ్లిసి మద్దత్తు కూడబెట్టుకోవాలనే ఒప్పందం ఇద్దరి మధ్య దాదాపు ఫలించింది. ఎంఐఎం తరుపున మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్ వేశారు. డమ్మీ అభ్యర్థిగా మహ్మద్ రహీంఖాన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. వీళ్ళకు పోటిగా బిఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్తితో నామినేషన్ వేయించలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా ఉలుకు-పలుకు లేదు. దీనికితోడు ఎంఐఎం తరుపున మీర్జా రెహమత్ బేగ్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్…
తాను కుక్కలను ప్రేమిస్తానని, నగరంలో ఉన్న వీధి కుక్కలను ఏరి పారేయలేను అని జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మీ వితండవాదం చేశారు. దానికి తోడూ ‘వీధి కుక్కలు తమ పిల్లలను పీక్కు తింటుంటే తల్లిదండ్రులు ఏం చేసున్నారు? మీ పిల్లలను మీరు కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. అయినా ఇలాంటి పనులు కూడా జిహెచ్ఎంసి చేయాలా? అని ప్రెస్ తో కోపంగా మాట్లాడారు. ఆమె బాధ్యతారహిత జవాబుకు ఎలా స్పందించాలో ఎవ్వరికి అర్థం కాలేదు. దీనికి తోడూ ఆమె తన ఇంటి పెంపుడు కుక్కకు రొట్టె తినిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తాను ఓ మథర్ థెరీసా కంటే గొప్ప మానవతా వాదిని అన్నట్లు చాటుకున్నారు. కానీ వివాదాలను వెంటేసుకుని తిరిగే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు కరెక్ట్ జవాబు చెపుతూ, సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.…
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఆదేశాల మేరకు ఏపి సిఐడి అధికార్లు మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కూతురు ఇంట్లో దాడులు నిర్వహించారు. నారాయణ కుమార్తె కుకట్ పల్లి లోని లోధా బెల్లెజా అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. ఆయన కూడా ఆ ఇంట్లో ఉన్నారని పక్కా సమాచరం అందిన తర్వాత ఒక్కసారిగా దాడులు చేశారు. పదో తరగతి పరీక్ష పత్రాల లికేజ్ వ్యవహారంలో అయన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రోజుకు ఆరు గంటలు ఆయనను, ఆయన బంధువులను విచారించవచ్చు అని కోర్ట్ అనుమతి ఇచ్చింది. లోగడ ఆయనకు ఆపరేషన్ జరిగిన కారణంగా విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఆయన ఏదోఒక సాకు చూపి తప్పించుకున్తున్నారని సిఐడి కోర్టులో కేస్ వేసి ఈ అనుమతి తీసుకుంది. కేవలం పదో తరగతి పరీక్ష పత్రాల లికేజ్ వ్యవహారం కాకుండా ఆయన మీద ఉన్న ‘రింగ్ రోడ్’…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు ఆయనను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అది కూడా మాములు అరెస్ట్ కాదు – ‘చేతికి బేడీలు వేసి గోరా గోరా ఇడ్చుకు పోతామని’ బెదిరించి కాలర్ పట్టి లాక్కుపోయారు. అయన ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరగనున్న కాంగ్రెస్ ప్లీనరీ కోసం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనను ఇంట్లో అరెస్ట్ చేయకుడా, పబ్లిక్ గా ఆయన పరువు తీయాలని పోలీసులు ముందే నిర్ణయించారు. అందుకే ఆయనను వెంటాడుతు విమానాశ్రయానికి చేరుకొని, విమానం ఎక్కి కూర్చోగానే ఒక్కసారిగా సినిమాటిక్ గా అస్సాం పోలీసులు ఆయనను విమానం దించి అరెస్ట్ చేసారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. బోర్డింగ్…
హిందువులు గొడ్డు మాంసం తినడం అంటే దానిని మించిన పాపం మరొకటి లేదని బిజెపి, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. ఈ నినాదం వాళ్ళ ఓటు బ్యాంకు కూడా. దేశంలోని ఆవులను చంపరాదని, కబేళలను ముసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా గొడ్డు మాంసం అమ్మడాన్ని నిషేదించే కొత్త చట్టాలు తెచ్చింది. ఆవును కౌగిలించుకునే రోజు లాంటి హడావుడి చేస్తోంది. మరి ఆ హిందూ మతం అనే ఓటుకే తూట్లు పెడుతూ మేఘాలయ బిజెపి అద్యక్షుడు ఎర్నెస్ట్ మౌరి సంచలన వ్యాక్యలు చేసి బాంబు పేల్చారు. ”నేను గొడ్డు మాంసం తింటాను. మా మేఘాలయలో అందరు తింటారు. మా రాష్ట్రంలో గొడ్డు మాంసం పై ఎలాంటి నిషేదం లేదు. మాకు కబేళలు ఉన్నాయి. అక్కడ గొడ్డు మాంసం కొనడం, అమ్మడం ఇప్పటిల జరుగుతోంది. ఇది మా రాష్ట్రం సంస్కృతిలో ఒక భాగం. దీనిని కాదనే హక్కు ఎవ్వరికి లేదు”…
జనం మీద పోలీసులు తమ పాశవిక ప్రతాపం చూపుతారని విన్నాము, చూశాము. కానీ కాబోయే పోలీసుల మీదే పోలీసులు తమ దాష్టికం చూపిన వైనం నిన్న బుధవారం రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. దీనివెనక తెలంగాణ ప్రభుత్వం కుట్ర దాగిఉన్నదని తెలుస్తోంది. పోలీసులు, ఎస్ఐ పోస్టుల బర్తిలో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ తప్పిదాలు అడుగడుగునా బయటపడుతున్నాయి. వాటిని ఎండగట్టేందుకు దరఖాస్తుదారులు యాసం ప్రదీప్, కళ్యాణ్ నిన్న సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ కి బయలుదేరుతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు. తమకు జరిగిన అన్యాయాన్ని సుప్రీం కోర్టులో కూడా మొరపెట్టుకునే అవకాశం ఈ స్వతంత్ర దేశంలో లేదా? అని సాటి దరఖాస్తుదారులు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఉద్యోగాల నియామకంలో మొదటినుంచి తెలంగాణ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకుని, దరఖాస్తుదారులను ముప్పతిప్పలు పెడుతోంది. లోగడ జరిగిన రాత పరీక్షలో రిక్రూట్మెంట్ బోర్డ్ …
”నేను పారేసుకున్న నా బాల్యం ఎక్కడుందని వెతుక్కోను?” అని ఓకవి హృదయం రగిలి అన్నాడు. కానీ ఇప్పుడు మన దేశంలో అందరు పిల్ల పరిస్టితి ఇదే. తల్లిపాలు మరువక ముందే, తల్లి ఒడిలో తనివితీరా ఆడుకోక ముందే, తమ అల్లరితో ఇల్లు పీకి పందిరి వేయకముందే నర్సరీ పేరుతో ప్రీ స్కూల్స్ అనే జైలు లో పిల్లలను వేసున్నారు తల్లిదండ్రులు. అమ్మకు, ఆయమ్మకు తేడ తేలియని ఆ పసికందులు సాటి పిల్లలతో ఆడుకుని తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోవడం లేదు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల తమ పిల్లను తప్పటడుగులు వేయక ముందే నర్సరీ స్కూల్ కి పంపి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన తరువాత ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తారు? వాళ్ళను కూడా వృద్దాశ్రమనికి పంపి ఎందుకు చేతులు దులుపుకోరు? ఈ ఊరు నుంచి ఆ ఉరు ఎంత దూరమో – ఆ ఉరు నుంచి ఈ ఊరు కూడా అంతే …
మొన్న విమానంలో ఓ దుర్మార్గుడు ఓ మహిళ ముఖం మీద మూత్రం పోసి పైచానిక ఆనందం పొందారు. ఆ వార్త మరువకముందే నిన్న మరో మూర్కుడు కర్ణాటక ఆర్టిసి బస్సులో ఓ మహిళ ముఖం మీద మూత్ర విసర్జన చేసి సభ్యసమాజం తల వంచుకునేలా చేశాడు. ఆ ముర్కుడి పేరు రామప్ప (25), మెకానిక్ ఇంజనీరింగ్ చదివాడు. కర్ణాటకలోని విజయపురం నుంచి మంగళుర్ వెళ్ళుతున్న కర్ణాటక ఆర్టిసి బస్సు హుబ్బలి సమీపంలోని కిరేసురులోని దాబా ముందు ఆగింది. భోజనం చేయడానికి చాలా మంది దిగారు. ముందు వరుసలో ఓ మహిళ నిడురపోతోంది. రామప్ప ఉన్నట్టుండి ఆమె ముఖం మీద మూత్ర విసర్జన చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె మేలుకొని భయంతో కేకలేసింది. అయినా అతను ఆగకుండా అలాగే విసర్జించాడు. ఈ కేకలు విని డ్రైవర్, కండక్టర్తోపాటు సాటి ప్రయాణికులు వచ్చి అతనిని దేహశుద్ది చేశారు. బస్సు లోంచి దించేసారు. ఆమె…
న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం రోజు రోజుకో కిక్కు ఇస్తోంది. అది మాములు కిక్ కాదు. ఫుల్ బాటిల్ ఒకే పెగ్గులో తాగితే ఎంత కిక్ ఇస్తుందో ఇప్పుడు అంతే జర్క్ ఇచ్చింది. ఎంఎల్సి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈ నెల 8న సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యు కోర్ట్ లో హర్జరుపరచగా ఆయనకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విదించిన విషయం తెలిసిందే. ఇతనిని విచారించేందుకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి సిబిఐ స్పెషల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. దీనితో తీగ లాగితే దొంక కదులుతుంది అని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిజమే. కానీ, సామాన్యంగా ఇలాంటి కేసులు అనేక మలుపులు తిరిగి చివరికి బకరాగాల్లే బలవుతారు. లోగడ ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ కీలకపాత్ర పోషించింది అని నమ్మిన సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను కోర్ట్ రిమైండ్ ఖైదీగా జైలులు పంపిన…