Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
సంపదలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి అని కెసిఆర్ ఎంత గట్టిగా ఉదరగోట్టినా అవి అన్ని అబద్దాలేనని తేలిపోయింది. చేసిన అప్పులకు కిస్తిలు కట్టలేని దుస్తితిలో ఉంది. ఈనెల రూ. 5 వేల కోట్ల కిస్తి కట్టాలి. కానీ ఆర్థిక శాఖా దగ్గర నయా పైసా లేదు. ఈ కిస్తి కట్టేందుకు మళ్ళి అప్పు చేయవలసిన దుస్తితి. అందుకే ఆర్బిఐ దగ్గర మరోసారి అప్పు చేసి ఈ కిస్తి కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ కిస్తీలు సరిగ్గా కట్టకపోతే ఓపెన్ మార్కెట్లో పరువుపోతుంది. ఇకపై అప్పు పుట్టదు. ఈ నెల ఉద్యోగుల జీతాలు ఎలా ఇవ్వాలో కెసిఆర్ కి అర్థం కావడం లేదు. ఇప్పటికే ‘రైతుబంధు’ పథకం కింద సగం కోతలు విధించారు. కేవలం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకే డబ్బులు పంచారు. 11 ఎకరాల భూములు ఉన్న రైతులను ‘మోతుబరి రైతులు’, వాళ్లు ధనవంతులు, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కొచం ఆందోళన కరంగా ఉన్నదని ఆమెను ఈ రోజు ఉదయం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీని పర్యవేక్షిస్తోంది. అనుకోకుండా ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు ఈ ఆసుపత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆమెను పరిశీలిస్తున్నామని, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. కాబట్టి ఎవ్వరు ఆందోళన చెందరాదని భరోసా ఇచ్చారు. సాయంకాలం ఆమె హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని డాక్టర్ లు తెలిపారు.
గుడివాడ ఎమ్మెల్యే, పలు వివాదాలను తలా మీద వేసుకున్న కొడాలి నానిని అరెస్ట్ చేయడనిని దాదాపు రంగం సిద్దమయ్యింది. ఆయన పై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. లోగడ ఆయనకు ఎన్నిసార్లు సమన్లు పంపినా కోర్టుకు హాజరు కాలేదు. అందుకే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కన్నెర్ర చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన గవర్నర్‌పేట సీఐ సురేష్ కుమార్‌ని ‘నాని ఎందుకు హాజరు కావడం లేదని’ న్యాయమూర్తి ప్రశ్నించారు. పని ఒత్తిడి వళ్ళ రాలేకపోతున్నారని ఆయన ఎప్పటిలా తప్పించుకునే దోరణిలో జవాబు చెప్పినట్లు తెలిసింది. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దాన్ని వెంటనే అమలు చేయాలని సీఐని జస్టిస్ గాయత్రీదేవిని ఆదేశింకారని తెలిసింది. అసలు కేస్ ఏమిటంటే, నాటి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ భారీగా ఆందోళనలు చేశారు. పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి…
కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకే గుండె పోటు అధికంగా వస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిందని సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు గురువారం ఓ నివేదిక విడుదల చేశారు. ఈ నేపద్యంలో కోవిడ్ వచ్చి తగ్గినవారిలో వైరస్ ప్రభావం ఇంకా పోనట్లు తెలిసింది. గుండె రక్తనాలాల లోపలి పొరల్లో (ఎండోతేలియం) ఈ వైరస్ నిద్రావస్తలో ఉండటం వల్ల కొందరికి గుండెపోటు వస్తున్నట్లు పరిశోధనలో ప్రాథమికంగా తెలిసినట్లు అయన చెప్పారు. కోవిడ్ వచ్చి తగ్గిన అన్ని వయసువల్లలో ఈ గుండెపోటు లక్షణాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇదే ఆందోళన కలిగించే విషయం. దీని నివారణ చర్యలు అందుకే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన అడ్వైసరి (సలహా మండలి) లో యువతీ యువకులు కూడా వెంటనే గుండె పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. 18 నుంచి 40 ఏళ్ళు వచ్చి, లోగడ కరోనా సోకి తగ్గిన వాళ్ళు ప్రతి ఆరు నెలలకు…
దేశంలోనే సంచలనం రేపిన కాకతీయ వైద్య కళాశాల (కె ఎం సి) పిజి వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో తగిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా. ఇందులో మొదటి అడుగుగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకతీయ వైద్య కళాశాలలోని అనస్తిశియ విభాగం అధిపతి ప్రోఫేసర్ కె. నాగర్గున రెడ్డి ని బదిలీ చేసింది. ఆయనను భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల అనస్తిశియ విభాగం అధిపతిగా పంపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖా కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రీతి సీనియర్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇది ఆత్మహత్యా, హత్యా అనే నిజం బయటికి రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ నాయకులు ఎవరికి వారుగా తమ వంతు కుట్రలు పన్నుతున్నారు. ఇక ప్రభుత్వం ఏం చేసుతోందో చూడాలి. ప్రీతి కేసు…
నిత్యానంద స్వామి రాసలీలల గురించి అందరికి తెలుసు. రేప్ కేసులల్లో, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగామారి దేశం వదిలి పారిపోయిన ఈ దొంగ స్వామిజి తన మరో ప్రియురాలిని ప్రపంచానికి ప్రయిచయం చేశాడు. ఆమె పేరు విజయప్రియ నిత్యానంద. ఆమెను అందరికి తెలివిగా పరిచయం చేస్తూ మరో స్కాం కు తెర లేపాడు. ఇప్పటికే అతను ‘యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస’ అనే ఓ దేశాన్ని నిర్మించినట్లు కోతలు కోశాడు. అలాంటి దేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పుడు మరోసారి అందరి చెవిలో పువ్వు పెట్టాడు. ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 24న జెనీవాలో జరిగిన 19వ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల సదస్సులో కైలాస దేశం ప్రతినిధిగా ‘విజయప్రియ నిత్యానంద’ పాల్గొన్నది అని ట్విట్టర్ లో సంచలన లేపాడు. ఫిబ్రవరి 24న జరిగిన సుస్థిర అభివృద్ధి చర్చలో ఆమె ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ నుంచి ప్రసంగిచింది అని ప్రకటించాడు. ఆమెతో పాటు…
కెసిఆర్ తో మూడు చెరువుల నీళ్ళు తాగించాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై భావించారు. కానీ దానికంటే ముందే కెసిఆర్ ఆమెతో ఏడు చెరువుల నీళ్ళు తాగించాలని సిఎస్ శాంతికుమారితో ఏకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులను ఆమె 4 నెలలుగా పెండింగ్లో పెట్టారు. ఇంకా వాటిని ఆమోదించలేదు. కనీసం వాటిని తిరస్కరించినట్లు కూడా తిప్పి పంపలేదు అన్నది ఆమె మీద మోపిన అభియోగం. ఆమె ఆమెదం పొందితే కానీ ఆ పది బిల్లులు అమలు చేయలేరు. బిల్లు లో మార్పులు చేర్పులు చెప్పే అధికారం, మరి కొన్ని విశిష్ట అధికారాలు గవర్నర్ కి ఉన్నప్పటికీ ఏదో విషయం వెంటనే తేల్చి చెప్పాలి. ఇలా దాటవేసే పద్దతులు పాటించి కాలయాపన చేయడం మాత్రం మంచిది కాదు అన్నది కెసిఆర్ ప్రాధాన ఆరోపణ. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివకు ఉభయ సభల్లో…
‘అదాని – హెండేన్ బర్గ్’ కేస్ పరిశీలన కోసం కేంద్ర లోగడ ఓ కమిటీని నియమించి సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీం కోర్ట్ కు సమర్పించింది. కేంద్రం మీద ఏ మాత్రం నమ్మకం లేని సుప్రీం కోర్ట్ దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్ట్ గురువారం కొత్త కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారి చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే దీనికి నాయకత్వం వహిస్తారు. ఈ కమిటిలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఓ పి భట్, జె పి దేవదత్, ఇన్ఫోసిస్ సహా వ్యవస్తాపకుడు నందన్ నిలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కే వి కామత్, సోమశేఖరన్ సుందరేశన్ సభ్యులుగా ఉన్నారు. మార్కెట్ నియంత్రణ సంస్ట (సెబి) ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. దీనిని వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి రెండు నెలలలోపు సుప్రీం కోర్ట్ కు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ఆదేశించారు.…
రేటింగ్ : ౩.25 /5 బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి డైరెక్టర్ : వేణు టిల్లు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , వేణు టిల్లు, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ఇతరులు. ‘దిల్ రాజు’ ఓ సినిమాను నిర్మించినా, సమర్పించినా దానికి కమర్షియల్ విలువలు వస్తాయి. ‘బలగం’ సినిమాకు కమర్షియల్ హంగులు వచ్చయి అంటే అతని పేరే కారణం. అది ఐఎస్ఐ బ్రాండ్ లాంటిది. అలాగని ఇది పక్తు కమర్షియల్ సినిమా కాదు. హాఫ్ బీట్ కమర్షియల్ సినిమా. ఇలాంటి సహజ సినిమాలు మలయాళం, తమిళ్ లో విరివిగా తీస్తారు. కానీ మన తెలుగులో చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇదో మంచి ప్రయత్నం. ఇలాంటి సినిమాలను ఎక్కడా బోర్ లేకుండా తీయడం మెచ్చుకో దగిన అంశం.…
జి – 20 విదేశాంగ మంత్రుల సమావేశం ఈ రోజు మన దేశంలో మొదలవుతోంది. ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేందుకు కారణం ఒక్కటే – రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఇండియా ఎలా అపుతుందని. ఈ యుద్దాన్ని ఆపే చొరవ ఒక్క ఇండియాకు మాత్రమే ఉన్నదని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అందుకే ఈ సారి జి – 20 దేశాల నిర్వహణ ఇండియా కు అప్పగించారు. నిజానికి ఈ అవకాశం చైనా కు కూడా ఉంది. ఎందుకంటే ఇండియా, చైనా రెండు దేశాలు రష్యాకు రెండు కళ్ళ వంటివి. కానీ చైనా, అమెరికాకు పడదు. రష్యా, అమెరికాకు కూడా పడదు. కానీ ఇండియా మాత్రం అటు అమెరికా, ఇటు రష్యా తో మంచి స్నేహ సంబందాలు కలిగి ఉంది. ఆ మాట కొస్తే ఒక్క పాకిస్తాన్, చైనా మినహా, మొత్తం ప్రపంచంతో మంచి స్నేహ సంబందాలు కలిగి ఉంది. చైనా…