Author: Duriki Mohan Rao

క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడింది. దీనిని ఒక వార్తలా కాకుండా, ఒక డాక్యుమెంట్ సీరియల్ లాగా తీశారు. ‘క్యాచ్ అవుట్’ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంట్ సీరియల్ హక్కలను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. దీని ట్రైల‌ర్  నిన్న విడుదల కాగానే వైరల్ గా మారింది. అయితే ఈ కుంభకోణం ఎవరు చేశారు, ఏ దేశం వాళ్ళు చేశారు అనే విషయం ఇంకా బయటపెట్టలేదు. అప్పుడే దీనిమీద పెద్ద గాలిదుమారమే చెలరేగుతోంది. క్రికెట్ అభిమానులలో నరాలు తెగిపోపోయే ఉత్కంట మొదలయ్యింది. ఆట గళ్ళు కూడా భయపడుతున్నారు. అప్పుడే పాకిస్తాన్ లో ఓ భూకంపం వచ్చిన ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ లల్లో ఎక్కువగా పాకిస్తాన్ క్రీడాకారులే ఉన్నారు కాబట్టి. మొదటినుంచి పాకిస్తాన్ క్రీడా కారుల మీద అంతర్జాతీయ క్రికెట్ సంఘాలు డేగా కన్నేసి పెడతాయి. వాళ్ళకు డ్రగ్స్ పరీక్షలు తప్పక నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇండియాతో…

Read More

మీకున్న ఆధార్ కార్డ్ లోని పేరు, దాని స్పెల్లింగ్, ఓటర్ కార్డ్ తో లోని పేరుతో సరిపోవడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్ లో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారా? మీ ఇంటి అడ్రెస్స్ మారితే ఆధార్ కార్డ్ ఆఫీస్, రేషన్ కార్డ్ ఆఫీస్ , ఓటర్ కార్డ్ ఆఫీస్, పాన్ కార్డ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా? చెప్పులు అరిగేలా అన్ని ఆఫీస్ ల చుట్టూ తిరవవలసిన అవసరం లేదిక. ఇప్పుడు అన్ని సేవలను ఒకే గొడుకు కిందికి తేవాలని కేంద్ర మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త విధానం తీసుకు వస్తోంది. వీటిని అన్నింటిని ఆధార్ కార్డ్ కి లింక్ చేయప్బోతున్నారు. అంటే మీరు ఒక్క ఆధార్ కార్డ్ లో మార్పులు చేస్తే చాలు. ఆ మార్పులు ఆటోమాటిక్ గా డ్రైవింగ్ లైసెన్స్, రేషన్, ఓటర్ కార్డ్, పాన్  కార్డ్  లాంటి అన్ని విభాగాల్లో మారిపోతుంది. ప్రతి…

Read More

కొందరు బిఆర్ఎస్ నేతలు కామాంధులుగా మారి మహిళా కార్యకర్తలను, సర్పంచులను తమ కోరిక తీర్చాలని వేధించే వార్తలు లోగడ వెలుగులోకి వచ్చాయి. కానీ తన కోరిక తీర్చితేనే నిధులు విడులదల చేస్తానని ఓ బిఆర్ఎస్ నేత ఓ మహిళా సర్పంచ్ ఏకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా వేదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, జనగామా జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య. ఆమె ఈరోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తన మానసిక నరకాన్ని వివరిస్తూ  ఏడ్చారు. ఆ జిల్లాలోని ఓ బిఆర్ఎస్ నేత ఆమెను కొంతకాలంగా మానసికంగా హింసిస్తున్నాడని ఆమె ఆరోపించారు. మొదట్లో అతను ఫోన్ చేసి తన కార్యాలయానికి పిలిచేవాడు. తర్వాత తనతో పడుకోవాలని పచ్చిగా అడిగేవాడు అని ఆమె ఆవేదన చెందారు. అది తనవల్ల కాదని, మీకు తల్లి, చెల్లి లేరా అని నిలదీస్తే మొరటుగా జవాబు చెప్పాడని ఆమె…

Read More

ఉన్నట్లుంది జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా మెత్తబడింది. దీనికి కారణం త్వరలో రాబోతున్న ఎం ఎల్ సి ఎన్నికలు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో చదువుకున్న ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం. ఇప్పుడు ఏ మాత్రం బెట్టు చేసినా ఎన్నికలలో దారుణంగా ఓడిపోయే ప్రమాదం ఉందని జగన్ భయం. ఉద్యోగ సంఘాల ధీమా కూడా ఇదే. ఎన్నికల ముందు జగన్ తప్పక కాళ్ళ బేరానికి వస్తారని ఆశ. అందుకే ఇప్పటి వరకు సాగదీశారు. చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు గతకొన్ని నెలలుగా చేసున్న ప్రధాన డిమాండ్లల్లో పాత బకాయిల చెల్లింపులు, సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ రద్దు) అంశాలు ప్రధానమైనవి. వీటికి జగన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఉద్యోగులు ‘తగ్గేదే లే’ అన్నట్లు ఆందోళనలు చేస్తున్నాయి. ఎవరికి  వారే ఎమునా తీరే అన్నట్లు ఉంది పరిస్టితి. జగన్…

Read More

ఈ రోజే అంతర్జాతీయ కిడ్ని దినోత్సవం. అంటే మీ రెండు కిడ్నీలు బాగ్గునాయి, కాబట్టి ఈ రోజు పండగ చేసుకోమని కాదు. అసలు మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో ఏడాదికి ఒక్కసారైనా చెక్ చోసుకోవాలని ప్రపంచాన్ని హెచ్చరింకాదనికే డాక్టర్లు మార్చ్ 9 ని ప్రతి ఏటా అంతర్జాతీయ కిడ్ని దినోత్సవం జరుపుతారు. యూరప్, ఆసియాలో  ఈ రోజు ఆసుపత్రులు అన్ని వయసుల వాళ్లతో కిటకిట లాడతాయి – ఒక్క మనదేశం తప్పా. మన యువత లవర్స్ డే రోజు మాత్రం  అన్నిపనులు మానుకుని పార్క్ కి వెళ్లి చెట్ల పొదల్లో దురుతారు. అలానే ఈ రోజు కూడా యువతియువకులు ఆసుపత్రికి వెళ్లి కిడ్నీలు చెక్ చేయించుకుంటే మీ కిడ్నిల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు బయటపడతాయి. రాళ్ళు చిన్న సైజులో ఉన్నప్పుడు పెద్దగ ప్రభావం చూపవు. కానీ ఆ రాళ్ళు పెరిగాకే కొంపలు ముంచుతాయి. రెండింటిలో ఒకటి పని చేయడం ఆగిపోతుంది.…

Read More

నగ్మా 1990వ దశకంలో పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలల్లో అగ్ర హీరోలతో హీరోయిన్ గా నటించి రాణించారు. ఆమె ఒకడికి బుక్కయ్యి అడ్డంగా దొరికిపోయారు. ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్వరిని నమ్మరు. ఆమెకు హిరో యిన్ గా  అవకాశాలు తగ్గిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి బరిలోకి ఆమె ఓటమి పాలయ్యారు. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు మారింది ఆమె పరిస్టితి. ఆమె బ్యాంక్లో ఉన్న డబ్బు అంతంత మాతమే. ఈమధ్య ఆమె అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. ఆమె వివరాలను ‘కేవైసి’ లో అప్ డేట్ చేయాలనీ, లేకపోతే ఏటిఎం, క్రెడిట్కార్డ్ లు, బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని, మరో గంగలో గడువు ముగుస్తుంది అని…

Read More

ఈ రోజు సాయంతం 5 గంటలకు  కరీంనగర్ వేదికగా జరగబోయే కాంగ్రెస్ భారీ భహిరంగ సభకు ఛత్తీస్ ఘడ్ ముఖ్య మంత్రి భుపేష్ బగల్ ముఖ్య అథిదిగా హాజరు కాబోతున్నారు. లోగడ ఇదే కరీంనగర్లో 2004లో భారీ భహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొనడం. అదే సభలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి తెలంగాణ ఇస్తానని ఆమె తొలిసారి మాటిచ్చింది ఇక్కడే. ఆమె ఇచ్చిన మాట ఆ తరువాత నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన సభలల్లో చేసిన అన్ని ప్రమాణాలు విజయవంతం అయ్యాయి. దానితో కరీంనగర్ సభలు కాంగ్రెస్ కు చాలా సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నాయి. అందుకే కరీంనగర్ లో రేవంత్ సారధ్యంలో సొనియమ్మకు కృతజ్ఞత చెప్పుకుందామంటూ సభను నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యకుడిగా పదవి చేపట్టిన నాటినుంచి కాంగ్రెస్ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ముఖ్యంగా యువకులు ఈసారి కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు. ఆయన…

Read More

మొదటినుంచి వివాదస్పదంగా మారిన ‘జననన్న విద్యాకానుక’ మరోసారి ముడుపుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల్లల్లో పేద విద్యతులకు ఉచితంగా ఇచ్చే బ్యాగులు, బూట్లు, సాక్సులు తక్కువ నాణ్యతతో, ఎక్కువ ధరలో జగన్ ప్రభుత్వం కొని సరఫరా చేసి, అక్రంగా  కోట్లు దండుకుంది అని గత ఏడాది ప్రతిపక్షాలు ఆరోపించారి. ‘విద్యా కానుకలో’ పంచిన బ్యాగులు నాణ్యత లేకపోవడంవల్ల నెల రోజుల్లోనే చినిగిపోయాయి. బూట్లు వారం రోజులకే తూట్లు పడ్డాయి. సాక్సులు చినిగిపోయాయి. చిన్న పిల్లలు కావడం వలన వెంటనే చించేసారు అని జగన్ తప్పించుకోడానికి చూసారు. దీనికి తోడూ వాటి ధరలు మార్కెట్ ధర కంటే ౩౦ శాతం ఎక్కువని కాంగ్రెస్ నాయకులు బయట పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు. ప్రభుత్వం చూపిన లెక్కల ఆధారంతో 39,96,064 విద్యార్థులక కిట్ లు పంచారు. ప్రతి కిట్ కు రూ. 50 నుంచి రూ. 75 జగన్ ప్రభుత్వానికి ముడుపులు…

Read More

నిన్నటివరకు తనకు ‘డిల్లీ లిక్కర్ స్కాం’ తో ఎలాంటి సంబంధం లేదని ఎం ఎల్ సి కవిత బుకాయించారు. ఇప్పుడు ఈడి సమన్లు అందుకున్నారు. ఈ కేసులో ఆమె తన పేరు రాకుండా ఇప్పటివరకు చేసిన అన్నీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కెసిఆర్ తన కూతురిని కాపాడుకోవాలని తిప్పిన రాజకీయచక్రం ఎట్టకేలకు తిరగకుండా వెనక్కి వచ్చింది. ఇద్దరికీ దాదాపు అన్ని దారులు ముసుకున్నాయి. మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) బుధవారం హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేసింది. ఇతను దక్షిణ భారత్ ఆధారిత మద్యం తయారీదారుల సమూహం ‘ఇండోస్పిరిట్స్ ‘లో ఒక భాగస్వామి. ఇందులో ఇతని పాత్ర ఏంతో కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల విలువైన ‘కిక్బ్యాక్లు’ పంపినట్లు ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. ఇతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడు. దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుల…

Read More

మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ రోజు హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేసింది. ఇతను దక్షిణ భారత్ ఆధారిత మద్యం తయారీదారుల సమూహం ‘ఇండోస్పిరిట్స్ ‘లో ఒక భాగస్వామి. ఈ స్కాంలో  ఇతని పాత్ర ఏంతో కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల విలువైన ‘కిక్బ్యాక్లు’ పంపినట్లు ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. ఇతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడు. దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుల బృందాన్ని కలిగిన ‘సౌత్ గ్రూప్’లో ఇతను ఎంతో కీలక సూత్రదారి. ఈడీ చెప్పిన ఆధారాల ప్రకారం అతనికి కంపెనీలో 32.5% వాటా ఇవ్వబడింది. ఇతను హైదరాబాద్ ఆధారిత మద్యం వ్యాపారవేత్త మనీలాండరింగ్ ఢిల్లీలో మద్యం లైసెన్సులను పొందటానికి ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చినట్లు ఈడీ మొదటినుంచి ఆరోపిస్తోంది. సిబిఐ ప్రకారం పిళ్ళై నిందితుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22…

Read More