Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
మీరు ‘శత్రువు’ సినిమా చూసారా? అందులోని కోట శ్రీనివాసర మ్యానరిజం గుర్తుందా? ఈ జన్మకు మరిచిపోరు. కోట విలన్ గా పచ్చి నెత్తురు ఎలా తాగాలో ప్లాన్ చేస్తుంటాడు. ఈలోగా అతనికి ఎదురుగ ఉన్న అమ్మయి పైట జారిపోతుంది. అంతే! మూడ్ ఆఫ్ అయ్యిన కోట ”పైట జారిపోయింది రా బాబోయ్…” అని విసుక్కుంటాడు. అతని అనుచరులు వెంటనే ఆమెకు పైట వేస్తారు. వెంటనే మూడ్ ఆన్ అయ్యిన కోట ”థాంక్స్” అని అసలు సీన్ లోకి వెళ్ళతాడు. మరో చోట ఒకడిని చంపద్దనికి హోటల్ కి వెళ్ళతాడు. సీరియస్ సీన్. అక్కడ ఓ పౌన్ టైన్ నీళ్ళు వేదజిమ్ముతుంది. అంతే! మూడ్ ఆఫ్ అయ్యిన కోట ”హోటల్లో ఈ జలపాతాలు ఎందుకురా బాబోయ్…” అని విసుక్కుంటాడు. అతని అనుచరులు వెంటనే దానిని ఆఫ్ చేస్తారు. వెంటనే మూడ్ ఆన్ అయ్యిన కోట ”థాంక్స్” అని అసలు సీన్ లోకి వెళ్ళతాడు.…
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్ కూతురు ఐశ్వర్య రజనికాంత్ ఇంట్లో నిన్న దొంగతనం జరిగింది. ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ఈ లో ఉన్న ఆమె విషయం తెలుసుకుని షూటింగ్ ఆపి, ఇంటికి పరుగెత్తింది. అల్మారా తెరిచి ఉంది. అందులో ఉండవలనసిగ్రాము 60 ల బంగారు గొలుసు కనిపించలేదు. ఇల్లు చిందర వందరగా ఉన్నది. ఆమె వెంటనే పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు. పోలీసుకు వచ్చి కేసు నమోదుచేసి ముందుగా ఆమె ఇంటి పనిమనిషిని అరెస్ట్ చేయబోయారు. కానీ ఐశ్వర్య రజనికాంత్ అడ్డుపడి, ఆమె చాలా కాలంగా తన ఇంట్లో పని చేస్తోంది అని, ఆమె అలాంటిది కాదని పోలీసులకు చెప్పి తన పెద్ద మననసుని చాటుకున్నారు. అసలు దొంగలను పట్టుకోవాలి కోరారు. ఆ పోయిన సొమ్ము విలువ దాదాపు మూడు లక్షలు. కానీ ఆమె షూటింగ్ ఆపడం వల్ల జరిగిన నష్టం దాదాపు రూ. 25 లక్షలు. ఆమె గొలుసు పోయినందుకు బాధపడలేదు.…
నిన్న, అంటే సోమవారం ఉదయం 10:30 నుంచి రాత్రి 9:10 నిముషాలవరకు ఎమ్మెల్సి కవితను ఈడి అధికారులు దాదాపు పది గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఆ విచారణంలో ప్రధాన నిందితుడు రామచంద్రన్ పిళ్ళై చేతులు ఎత్తేశాడు. తానూ రూ. 100 కోట్ల స్కాం చేసినట్లు దాదాపు ఒప్పుకున్నాడు. అయితే అతను కవితకు కేవలం బినామిని అని చేతులు ఎత్తేశాడు. దానితో కవిత గొప్ప ఇరకాటంలో పడ్డారు. నిన్న కవిత, పిళ్ళై ని ఒకేసారి విచారించినప్పుడు కూడా అతను అదే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. అయితే అతను లోగడ మాట్లాడిన మాటల డేటా మొత్తం సెల్ల్ ఫోన్ లలో ఉన్నాయి. కానీ వాటిని పగలగొట్టారు. వాటిలోని డేటాను వెలికి తీసే పనిలో ఈడి ప్రత్యేక నిపుణులను కేటాయించింది. ఆ ఆధారాలు ఇప్పుడు కీలకం కానున్నాయి. అవి నిన్న సకాలంలో ఈడి కి అందలేదు. బహుశా ఈరోజు అందితే ‘ఢిల్లీ లిక్కర్…
టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ దర్యాప్తులో సిట్ అధికారులకు మతిపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ చీఫ్ అధికారి, అడిషనల్ ఎస్ పి అయిన ఏ.ఆర్. శ్రీనివాస్ నేతృత్వంలో సైబరాబాద్ క్రైమ్ ఏసిపి అయిన కే.వి.ఎం. ప్రసాద్ తదితరులు గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని హిమాయత్ నగర్లో ఉన్న సిట్ కార్యాలయంలో నిందుతులను విచారిస్తున్నారు. నిన్న ఏడు గంటలపాటు విచారించారు. ఈ రోజు కూడా విచారిస్తున్నారు. నేరస్తులకు పట్టపగలే చుక్కలు చూపే సిట్ చీఫ్ అధికారి, అడిషనల్ ఎస్పి అయిన ఏ.ఆర్. శ్రీనివాస్ కే నిందితులు కొత్త కొత్త ట్విస్ట్ లు ఇచ్చి షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైనది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్ని కూడా నిందితులు అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. గురుకుల ఉద్యోగాల కోసం లోగడ నిర్వహించిన పరీక్షల విషయంలో కూడా ప్రవీణ్ రేణుకకు సహకరించినట్లు తెలిసింది. అసలు వీళ్ళ ఇద్దరిమధ్య…
ఈ రోజు ఉద్యయం 11 గంటలకు ఈడి కార్యాలయానికి హాజరు కావలసిన ఎమ్మెల్సి కవిత 10 :౩౦ హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్ళై కస్టడి ఈ రోజు మధ్యాహాన్నం ౩ గంటలకు ముగియనుంది. లోగడ ఈడి ఆయనను విచారించి నప్పుడు రూ 100 కోట్ల స్కాం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే తాను కవితకు బినామిని అని చేతులు ఎత్తేశాడు. దానితో ఆ కేసు బంతి కవిత కోర్ట్ లో పడింది. అందుకే కవితను, పిళ్ళై ని ఎదురెదురుగా కూర్చోపెట్టి ఏకకాలంలో విచారించాలని ఈడి నిర్ణయించింది. సమయం తక్కువగా ఉన్నందువల్ల ఓ అర్థ గంట ముందుగా విచారణకు రావాలని ఈడి కవితను ఆదేశించినట్లు తెలిసింది. ఎందుకంటే ఈడి ఆల్రెడీ కోర్ట్ నుంచి ‘కేవియట్’ కేసు పెట్టి ఈ అనుమతి తీసుకుంది. అందుకే ఆమెకు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా అర్థ గంట ముందే…
ఆంధ్రప్రదేశ్ ఇసుక మాఫియా దేశం లోనే నెంబర్ వన్. ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా పైసా వసూల్ చేసేది ఇసుక మాఫియా మీదే. రాజకీయ నాయకులకు, మంత్రులకు ఇది కల్పతరువు లాంటిది. ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక కాంట్రాక్ట్ లు ఇచ్చినప్పటికీ మంత్రుల అధీనంలో, లేదా ఎం పి, ఎమ్మెల్లే ఆధీనంలోనే అంతా జరుగుతుంది. సగం వైట్, సగం బ్లాక్ దందాకు ఇది పెట్టింది పేరు. ఇది ఓ సాలెగూడు లాంటిది. కొత్త పురుగులు వస్తే బయటపడవు. సాలె పురుగుకు బలి కావలసిందే. ఇలాంటివి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కళ్లేపల్లి ప్రేమ్ రాజ్ అనే కొత్త ఇసుక కాంట్రాక్టర్ కూడా ఇలాగే ఇసుక మాఫియా అనే సాలెగూడులో ఇరుక్కుని బలయ్యాడు అనే పుకార్లు షికార్లు చేసున్నాయి. ఇది సాధారణ ఆత్మహత్య అని అందరు తొలుత భావించారు. కానీ దీనివెనుక రాజకియ హస్తం ఉన్నదనే అనుమానాలు మొదలయ్యాయి. కళ్లేపల్లి ప్రేమ్ రాజ్ బి టెక్ చదివాడు.…
దేశం లోనే అతి పెద్దదయిన కాకతీయ మేఘా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ లో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గీనుకొండ ప్రాంతంలోని 3 వేల ఎకరాలల్లోటెక్స్ టైల్ పార్క్ ను మొదలుపెట్టింది. దీనితోపాటు సిరిసిల్లా మేఘా టెక్స్ టైల్ పార్క్ ను ”పి ఏ.ఎమ్ మిత్ర పథకంలో” సిరిసిల్లా లో కూడా ఏర్పాటు చేయాలనీ కేటిఆర్ ప్రధాన మంత్రి మోడీని పలుమార్లు కోరారు. మోడీ చేపట్టిన ‘పిఎమ్ మిత్ర పథకం’ కింద దేశం లోని ఎనిమిది రాష్టాలల్లో మేఘా టెక్స్ టైల్ పార్క్ లు ఏర్పాటు చేయాలనీ మోడీ నిర్ణయించారు. అయితే ఇందులో తెలంగాణ పేరును కూడా చేర్చి కేటిఆర్ కు శుభవార్త చెప్పారు. అయితే ఆ మేఘా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ లో ఏర్పాటు చేస్తారా, లేకా సిరిసిల్లలో ఏర్పాటు చేస్తారో ఇంకా నిర్ణయించలేదు మోడీ. దీనిని సస్పెన్స్ లో పెట్టి అందరిలో టెన్షన్…
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేస్కుని ప్రజలలో చులకన అయ్యి రాజకీయంగా ఓటమి పాలయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కడతాను అని నిన్నటివరకు నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయమే కొంపముంచింది అని ఈ రోజు ఉదయం వచ్చిన సర్వే ప్రాథమిక ఫలితాలు తేటతెల్లం చేశాయి అని తెలిసింది. మూడు రాజధానులు కడతాను అని నిన్న రాత్రి వరకు జగన్ ప్రకటించారు. దానివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చుకుని ఓట్లు వేస్తారు అని కలలు కన్నారు. కానీ అవి పగటి కలలు అని ఎమ్మెల్సి ఓటర్లు ఇచ్చిన ట్విస్ట్ తో ఈ రోజు ఉదయం మేలుకున్నారు. సర్వే రిపోర్ట్ చూసి ఖంగుతిన్నాడు. ఎమ్మెల్సి స్థానాలలో ఓడిపోయిన వై ఎస్ ఆర్ పార్టీ నాయకులకు జగన్ ఫోన్ చేసి ‘మనం ఎందుకు ఓడిపోయామో చెప్పగలరా?’ అని ఒకే ఒక్క ప్రశ్న అడిగినట్లు తెలిసింది. వాళ్ళు అందరు మూకుమ్మడిగా చెప్పిన…
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి ఇప్పటివరకు 11 మందిని ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే కేసులలో విచారణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మంది తాము నిర్దోషులము, మా మీది కేసు కొట్టివేయాలి అని కోర్టును ఆశ్రయించారు. అది సర్వసాధారణం. ‘నేను తప్పు చేసాను. కాబట్టి నన్నశిక్షించాలి’ అని ఎవ్వరూ కోరుకోరు. ఈడి కూడా దీనిని పెద్దగా పట్టించుకోదు. మొన్న కవిత కూడా సుప్రీం కోర్ట్ కో ఇలాంటి కేసు వేసింది. కానీ ఈడి దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే సుప్రీం కోర్ట్ లో కవిత మీద ‘కేవియట్’ కేసు పెట్టింది. దీనిలో ఉన్న వెసులుబాటు ఏమిటంటే, ‘నిందితులు’, లేదా ‘అనుమానితులను’ ఈడి పిలిచినపుడు కార్యాలయానికి రాకపోతే వాళ్ళను అరెస్ట్ చేసి విచారించే హక్కు లభిస్తుంది. కేవలం కవిత మీద ‘కేవియట్’ కేసు పెట్టడానికి బలమైంక కారణం ఈడి కి దొరికింది. ఆమె ఓసారి డుమ్మాకొట్టినా మొన్న…
”ఆప్ ఈట్ తో మారేతో హమ్ పత్తర్ సే మారింగే” అన్నది బిజెపి నినాదం. అంటే మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాము అన్నది అర్థం. లోగడ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు వాళ్ళను అవమానపరుస్తూ బిఆర్ఎస్ కొన్ని వాల్ పోస్టర్ లు అతికించింది అనే ఆరోపణలు ఉన్నాయి. దానిని మనసులో పెట్టుకున్న బిజెపి దానికి ప్రతీకారంగా ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ లో ఇరుక్కున్న ఎమ్మెల్సి కవితను అవమానపరుస్తూ హైదరాబాద్ నగరం నిండా వాల్ పోస్టర్లు అతికించింది అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది బిజెపి చేసిన పని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వీటిమీద ఎవ్వరి పేరు లేదు. ఈ వాల్ పోస్టర్ లు వాషింగ్ పౌడర్ నిర్మా, టైడ్ వ్యాపార ప్రకటలను పోలి ఉన్నాయి. ఒక పోస్టర్ లో మద్యం సీసాలు, కవిత నవ్వుతున్న ఫోటోతో కూడిన…