Author: Duriki Mohan Rao

నెహ్రూ వంశంలో ముగ్గురు ప్రధానులు. దేశ రాజకీయాలను శాసించే నాలుగు తరాల ఆధిపత్యం. నాలుగో తరానికి చెందిన రాహుల్ గాంధీ కాలం కలిసిరావడం లేదు. ఒక్క అడుగుముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. లలిత్ మోడీలాగా ఆయన స్కాం లు చేయలేదు. నిరవ్ మోడీ లాగా బ్యాంకు ల్లో కోట్లాది రూపాయలు దోచుకుని విదేశాలకు పారిపోలేదు. ‘మోడీ ఇంటి పేరున్న వాళ్ళు దొంగలు’ అని ఓ తప్పుడు మాట దొర్లాడు. అంతే! పచ్చిగుడ్డే పామై కరిచింది. దానిని తప్పుపడుతూ మోడీ ఇంటిపేరును ముంచిన వాళ్ళను పట్టి పోలీసులకు పట్టించకుండా, ఆ ఒక్క పదం వాడిన పాపానికి రాహుల్ గాంధీ మీద కోర్ట్ లో కేస్ వేశారు పూర్నేష్  మోడీ. సూరత్ కోర్ట్ దానికి శిక్షగా రాహుల్ కి రెండు సంవత్సరాల సాధారణ శిక్ష విధించింది. రూ. 15,000 జరిమానా విధించింది. రాహుల్ గాంధీని దోషిగా తేలిన 23 మార్చి 2023…

Read More

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉండవల్లి శ్రీదేవి తన కూతురుని దీవించామని సి ఎం జగన్ ఇంటికి వెళ్లారు. ఇది ఒక కుంటిసాకు. ఆమెకు దళిత మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తానని జగన్ పలుమార్లు మాటిచ్చారు. ఆమెకే కాదు, ప్రతి ఏమ్మేల్లెకు ఇలాంటి హామీలు ఇవ్వడం సర్వసాధారణం. మేకపాటి చంద్రశేఖర్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి కి  కూడా మంత్రి పదవి ఇస్తానని ‘నిర్మ వాషింగ్ పౌడర్ వ్యాపార ప్రకటంలా’ పలుమార్లు జగన్ మాటిచ్చి తప్పించుకున్నారు జగన్. ఇది కూడా సర్వసాధారణం. అంతేకానీ మంత్రి పదవి కోరినవాళ్లను ”నీకు పదవి ఇవ్వను. ఏం చేసుకుంటావాలో చేసుకో. మరోసారి బిచ్చగడ్డిలా మంత్రి పదవి అడిగి చావుకు. మరోసారి అడిగితే  కాళ్లు విరిచేస్తా నాయాల్ది. వెళ్ళు” అని ఏ సిఎం కూడా కఠువుగా తిట్టి మెడబట్టి గెంటేయడుగా. అందరికి ఆశలు కల్పించి, తమ పని…

Read More

అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు ఉంది ఎమ్మెలి కవిత సుప్రీం కోర్టుకు వెళ్లిన వ్యవహారం. ‘తనకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదు, తాను నిర్దోషిని’ అని సుప్రీం కోర్ట్ లో కేస్ వేసివుంటే బ్యుటి పార్లర్ నుంచి వచ్చినంత అందంగా ఉండేది. ఓ మంచి సందేశం జనాల్లోకి వెళ్ళేది. కానీ ఆమె సుప్రీం కోర్ట్ లో వేసింది ఈ విషయం మీద కాదు. చాలా సిల్లి కేసు. ‘అనుమానితురాలు ఒకవేళ మహిళ అయితే, ఆమె ఇంటికి ఈడి వెళ్లి విచారించాలి’ అనే నిబంధన ఉన్నది. దీనిని ఈడి అధికారిలు అతిక్రమించి తమ కార్యాలయానికి రమ్మని తనకు నోటిసులు ఇచ్చారు అన్న సిల్లి  ఆరోపణ. ఈడి తమ కార్యాలయానికి పిలిచి అవమానపరిచింది అనే అంశం మీది సుప్రీం కోర్ట్ లో కేసు వేశారు. అంటే ఈ కేసుతో ఆమెకు సంబంధం ఉన్నదని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నట్లా?…

Read More

ఈ సినిమా చూశాకా తలపోటు వచ్చిన ప్రేక్షకుడికి చాలా సందేహాలు కలుగుతాయి. అందులో ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకుడి కోసం కృష్ణ వంశీ తీశాడు అని. నాటక కళా కారుల కోసం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో రంగస్థల కళాకారులు ఎక్కడున్నారు? అసలు రంగస్థలం ఎక్కడ బతికుంది? కృష్ణ వంశీ చిన్నతనంలోనే నాటకరంగం కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. అతను ఎదిగాకా ఇప్పటివరకు అతను కనీసం పాతిక నాటకాలు చూసాడా? ఈ జనరేషన్ లో  కనీసం 1 శాతం యువకులైనా నాటకాలు చూడలేదు. ఇప్పుడున్న  జనాభాలో కనీసం 5 శాతం మంది నాటకాలు చూడలేదు. మరి అందరు మరిచిపోయిన రంగస్థలం గురించి చెప్పాలి అనుకోవడం కృష్ణ వంశీ అమాయకత్వం. ఇదే సినిమా 1960 లో వచ్చిఉంటే పెద్ద హిట్ అయ్యేది. కృష్ణ వంశీ ఇంకా ‘నెగిటివ్’ రీళ్లు  వాడే సినిమాలోంచి బయటపడి డిజిటల్ చిప్ లు వాడే…

Read More

రాజకీయ నాయకులకు ‘పదవులు’ కావాలి, కామాంధులకు అమ్మాయి  ‘పెదవులు’ కావాలి. అవి లేకపోతే వాళ్ళు బతకలేరు. ప్రజా సేవ చేయడానికి కాదు. తాము అక్రమాలు చేసి సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోడానికి, జైలుకు వెళ్లి చిప్ప కూడు తినకుండా ఉండడానికి. ప్రతిపక్షంలో ఉంటే తాము చేసిన స్కాం లు బయటపడతాయి. ఆవుల కుమ్ములాటలో లేగ దూడ కాళ్ళు విరిగినట్లు జగన్, చంద్రబాబు నాయుడు కుమ్ములాటలో ఏమ్మేల్లెలు, ఎంపి ల కాళ్ళు విరగొచ్చు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలి. పదవి లో ఉండగానే మరో పార్టీలో టికెట్ సంపాదించుకోవాలి. ఇది రాజకీయ ఫిలాసఫీ. ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు జనవరి నుంచి వీస్తున్నాయి అని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. అందుకే చంద్రబాబు నాయుడు రెచ్చి పోతున్నారు. జగన్ కృంగిపోతున్నారు. దీనికి గొప్ప రీజన్ లు, లాజిక్ లు అక్కర లేదు. ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మార్పు ఎలాంటిదంటే…

Read More

ఉన్నట్టు ఉండి ఈ రోజు నిమ్స్ లోని నర్సులు సమ్మె బాట పట్టారు. అన్ని వార్డ్ లలో రోగులకు సేవలు నిలిచిపోయాయి. ఇన్ పేషేంట్, అవుట్ పేషేంట్ లు నానాఅవస్థలు పడుతున్నారు. ఈ రోజు జరగవలసిన  ఆపరేషాలు ఆగిపోయాయి. నర్స్ లు  లేక కొన్ని విభాగాలను యాజమాన్యం ఈ రోజు ఉదయం నుంచి మూసేసినట్లు తెలిసింది. డాక్టర్ లు సమ్మె చేస్తే వచ్చే నష్టం కంటే నర్సులు సమ్మె చేస్తేను నష్టం ఎక్కువగా ఉంటుంది. నర్సుల డిమాండ్లు ఈ రోజు కొత్తగా తెరమీదికి వచ్చినవి కావు. కొన్నేళ్ళ తరబడిగా పెండింగ్ లో  ఉన్నాయి. ఈ రోజు మొదటిసారి చేసిన సమ్మె కూడా కాదు. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మెరుపు సమ్మెలు చేస్తూనే ఉన్నారు. సమ్మె చేసిన ప్రతిసారి ఉన్నత అధికారులు లేదా మంత్రులు రావడం, వాళ్ళ డిమాండ్లు తప్పక నేరవేరుస్తాము అని హామీ ఇవ్వడం, దానితో చల్లబడిన నర్స్ లు…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం భయటపడగానే ఎమ్మెల్సి కవిత తన పది సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది అని ఈడి లోగడ  ప్రధానంగా ఆరోపించింది. ఈడి తో రెండుసార్లు జరిగిన విచారణలో కూడా ఈ ప్రశ్నలే పదే పదే ఆమెను అడిగింది. అయితే వాటిని ధ్వంసం చేయలేదని ఆమె నిన్న రాత్రి జరిగిన విచారంలో చెప్పినట్లు తెలిసింది. ఈ సెల్ ఫోన్లలో x x x 99 99 999 చాలా కీలకమైనది. దీని ఐ ఎం ఈ ఐ నెంబర్ 352493645127612. ఇది మార్చిన తేదీ 09-08-2022. దీని డేటా గనక దొరికితే చాలా నిజాలు వెలుగులోకి వస్తాయి అని ఈడి అధికారులు భావిస్తున్నారు.  అసలు ఒక సి ఎం కూడా వాడని విధంగా ఒక ఎమ్మెల్సి  పది ఫోన్లు ఎందుకు వాడాల్సి వచ్చిదో నని  ఈడి ని ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్న. అందుకే ఆమె ఈ రోజు తన దగ్గర…

Read More

ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత ఈ రోజు ఓ లేఖ రాశారు. అదిప్పుడు సంచలనం గా మారింది. ఆమె ఆ లేఖలో అతనిని నిందిస్తూ తాను ఫోన్ల ధ్వంసం చేసినట్లు ఆరోపించడం దారుణం అన్నారు. ఇది కేవలం దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, లోగడ తాను వాడిన పోన్లు అధికారులకు సంపర్పించాను అని పేర్కొన్నారు. ‘దీనికితోడు ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా?’ అని ఆమె ఘాటుగా స్పందించారు. ఇది కేవలం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు అని తన ఆవేదన వెళ్లగక్కారు. తాను సెల్ ఫోన్ లు ధ్వంసం చేశానని పేర్నకొనడం కేవలం ఓ కుట్ర గా అభివర్ణించారు. తనను కనీసం సమన్ చేయకుండా, లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఎందుకు ఈ ఆరోపణలు చేసింది? అని నిలదీశారు. ఆమెను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది.…

Read More