Author: Duriki Mohan Rao

కాంగ్రెస్ పార్టీ మహావృక్షాన్ని ఎక్కడికక్కడా ముక్కలు ముక్కలుగా నరకాలని బిజెపి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా తప్పటడుగులు వేస్తూ మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కుటిల రాజకీయాలకు కొత్తగా తెరలేపింది అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా చివరికి తండ్రి – కొడుకు, అన్నా – తమ్ముడు అనే బేధాలు కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. గత నాలుగు రోజులుగా ఈ పరిణామాలు దీనిని రుజువుచేస్తున్నాయి. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించినప్పటినుంచి కాంగ్రెస్లో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనారోగ్యంతో మంచం పట్టిన సీనియర్ నేతలు కూడా మళ్ళి రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా మాజీ పిసిసి ప్రెసిడెంట్, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ చాలా కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాటికి కాళ్ళు చాపిన ఆయనను నలుగురు తీసుకొచ్చారు అందం కంటే మోసుకొచ్చారు అంటే బాగుంటుంది.…

Read More

మనిషి బతికుండగా ఎలాంటి  వాడో మోసేది  ‘ఆ నలుగురు’. అదే మనిషి ఛస్తే మోసేది కూడా ‘ఆ నలుగురే’. అందుకే నలుగురితో బాగుండాలి అని పెద్దలు అంటారు. శవాన్ని ‘ఆ నలుగురు’ మోశారు అంటే నిప్పుడు పెట్టడానికి ఐదోవాడు రెడీ అవుతాడు. ఆ తర్వాత చితి మీద కట్టెలు పేర్చేందుకు మిగతా వాళ్ళు కూడా తోడవుతారు.  ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే. మొన్న జరిగిన ఎన్నికలలో జగన్ మనుషులు క్రాస్ ఓటింగ్  కు పాల్పడి తెలుగు దేశం పార్టీని  గెలిపించిన ‘ఆ నలుగురు’ ఎమ్మెల్యేలు – ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని ముందుగా వార్తను మా ‘పాలీ ట్రిక్స్’ వెలుగులోకి తెచ్చింది. చివరికి అదే నిజమైంది. ‘ఆ నలుగురు’ వైసీపీ పార్టీ పరువును చంపేశారు. ‘ఆ నలుగురు’ ఇప్పడు ఆ పాడెను మోయాలని చూస్తుంటే ఏకంగా చితి…

Read More

”మల్లా రెడ్డి నిజంగానే  హౌల గాడు, అతని మాటలు పట్టించుకోవద్దు” అని కాంగ్రెస్, బీజేపీ నాయకులే కాదు, చివరికి బిఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటారు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఆ మాటలు నవ్విస్తాయి. అతను ఏం చేస్తాడో తెలియదు. కానీ ఓ మంత్రిగా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. చిరంజీవి లాంటి ఆక్షన్ హీరోలా సినిమాలల్లో బ్రమ్మానందం లాంటి కమేడియన్ ఉంటాడు. సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో ఒక్కసారిగా నవ్వులు విరబూయాలంటే కమేడియన్ అవసరం. అలాగే సీరియస్ గా సాగే రాజకీయ సభలలో మల్లా రెడ్డి కూడా ఓ కమేడియన్ లాగా జనాన్ని గొల్లున నవ్విస్తాడు. అందుకే కేటిఆర్ తన సభలలో మల్లా రెడ్డిని కావాలని పిలిపించి మైక్ ఇస్తాడు. ఇంకే? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. కానీ  ఇప్పటివరకు కమేడియన్ లా ఉన్న మల్లా రెడ్డి ఇప్పుడు ‘పిట్టల దొరలా’ మారాడు. అందుకే నిన్న జరిగిన…

Read More

రాహుల్ గాంధీ లోక్ సభ అనర్హత వేటు పడే అవకాశం దాదాపు లేనట్లేనని తలలు పండిన సీనియర్ లాయర్లు చెపుతున్నారు. ఎందుకంటే ఈ కేసు శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ పార్టీ ఎంపీగా ఐన పి.పి. మహమ్మద్ ఫైజల్ కేసుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. పి.పి. మహమ్మద్ ఫైజల్ 2014 – 2019 ఎన్నికల్లో లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసు తీర్పు ఈ ఏడాది జనవరిలో కవరత్తీ సెషన్స్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్ సభ సచివాలయం జనవరి 13న ఒక ప్రకటన విడుదల చేసి ఖాళీగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో లక్షద్వీప్ ను ప్రకటించింది. ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ద్వారా…

Read More

ప్రముఖ సినీనటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతోంది అని చాలా రోజులుగా పుకార్లు పుడుతున్నాయి. మొదట్లో ఆమె వాటిని ఖండించారు. ఆ తర్వాత అది నిజమేనని స్వయంగా ఒప్పుకున్నారు. ఆమె పెళ్లి ఈ ఏడాది జూలై లో ఓ సుప్రసిద్ధ నటుడితో జరగబోతోంది అని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కానీ ఆమె దానిని మరోసారి ఎప్పటిలా ఖండించారు. కానీ ఆమెకు అతిసన్నిహితుడు అయిన మిత్రుడు, ప్రముఖ తమిళ నటుడు బెయిలవన్ రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ ”మీనా రెండో పెళ్లి ఓ పాన్ ఇండియన్ హీరోతో జూలై లో జరగబోతోంది. ఆ హీరో వయసు 39 ఏళ్ళు. ఆ హీరో ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది” అని చిన్న క్లూ ఇచ్చి తప్పించుకున్నాడు. ఈ వార్త గురించి మీన ఇంకా నోరు విప్ప లేదు. కానీ ఇది కేవలం పుకార్లు మాత్రమేనని నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం రంగనాథన్…

Read More

శనివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ లో విద్యుత్ సౌధ ముందు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక్కసారిగా ఉదృతంగా సమ్మె చేశారు. వీళ్ళ డిమాండ్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఆ డిమాండ్లు నెరవేరుస్తామని లోగడ కెసిఆర్ చాలాసార్లు మాట ఇచ్చి తపించుకున్నారు. కానీ ఈసారి తప్పించుకునే అవకాశం లేకుండా ఉద్యోగులు చాలా కట్టుదిట్టంగా మహాధర్నా చేపట్టారు. వాళ్ళు సమ్మెలోకి దిగితే రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. గాలి వీయగానే తుర్పాలా బట్టాలి. కెసిఆర్ నీ జయించాలంటే ఇదే సరైన అదును. అందుకే ధర్నా తో మొదలు పెట్టారు. సమ్మేలోకి దిగుతామని జెఏసి  హెచ్చరించింది. అదే జరిగితే తెలంగాణాలో కరెంట్ చార్జీలు భారీగా  పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు కెసిఆర్ గొప్ప ఇరకాటంలో పడ్డారు. ఉద్యోగుల కోరికలు తీర్చితే ఖచ్చితంగా కరెంట్ చార్జీల మోత మోగుతుంది. ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు…

Read More

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలల్లో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదికూడా రిజర్వేషన్ మీద. నిన్న జరిగిన వాడివేడి సమావేశాలల్లో అతి కీలకమైన మూడు బిల్లులలో రెండు బిల్లులు జగన్ చలువతో ఆమోదం పొందాయి. అందులో ప్రధానమైనది మతం మారిన దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని సభ తీర్మానం చేసింది. దీనిమీడ లోగడ చాలా వాదోపవాదాలు జరిగాయి. అందుకే చాలా సులువుగా అందరు ఆమోదించారు. రెండవ బిల్లు బోయ వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని కూడా సభ తీర్మానం చేసింది. దీని మీద కూడా లోగడ చాలా చర్చలు జరిగాయి కాబట్టి సభ ఆమోదించింది. ఈ రెండు తీర్మాలను ఆమోదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ సిఫార్సు చేస్తోంది. పొతే కాపు రిజర్వేషన్ బిల్లు ఎప్పటిలా నాన్చుడి దొరనికి గురయ్యింది. దీని మీద జగన్ పెద్దగా  ఆసక్తి చూపలేదు.        దీనిని కదిలించడం అంటే తేనే తొట్టికి…

Read More

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ త్వరలో రద్దు కానుంది. దీని స్టానంలో వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైలు రాబోతోంది అని కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రతిపాదన తెస్తోంది. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య పరుగులు పెట్టనుంది. అయితే ఈ రైల్ ఎన్ని స్టేషన్ లల్లో ఆగుతోందో, ఎన్ని గంటలు సమయం ఆదా అవుతోందో, దీని ధర ఎంతో ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాకాకు ‘మొదటి వందే భారత్’ రైల్ ని ప్రవేశ పెట్టారు. ఇది విజయవంతం అయ్యింది. ప్రయాణికుల సమయం చాలా ఆదా అవ్వడంతో ఇది నిండిపోతోంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు ‘సికింద్రాబాద్ – తిరుపత’ మధ్య వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ స్టానంలో వందే భారత్ రైల్ ని ప్రవేశ పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ ‘రెండో వందే భారత్’ కూడా విజయవంతం అయ్యితే మరికొన్ని వందే భారత్…

Read More

మాజీ ఎం పి, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తు సూరత్ కోర్ట్ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇది విని బిజెపి పండగ చేసుకుంది. అదే ఛాన్స్ అనుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం మీద అనర్హత వేటు పడేలా చేసింది. ఇదే అదును అనుకుని అతనికి న్యూ ఢిల్లీలో కేటాయించిన లూటీయేన్స్ భవంతిని 30 రోజులల్లో ఖాళి చేయాలి అని నోటీసులు వచ్చేలా చేసింది. ఈ నోటిసు నుంచి తప్పించుకోవాలంటే హై కోర్ట్ నుంచి ఉపశనం పొందితే తప్పా అందులో ఉండలేరు. ఇలాంటి శిక్షలు పడడం భారతదేశ చరిత్రలో కొత్త కాదు. ఇలాంటి కేసులలో లోగడ చాలామంది నేతలు ఎదుర్కున్నారు.  అయితే వీళ్ళందరూ నేరాలు – ఘోరాలు చేసి ప్రజలను అష్టకష్టాలపాలు చేసినవాళ్లు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడే ఎలాంటి నేరం చేయకుండా కేవలం నోరుజారి ‘ఒక్క తప్పుడు మాట మాట్లాడి’ చట్టానికి…

Read More

పిల్లకు పుట్ట కూడదు అనుకునే ప్రేమికులు అనేకరకాల పద్దతులు పాటిస్తారు. అందులో పురుషుడు రతి సమయంలో కండోమ్ వాడడం. ఇప్పుడున్న పద్దతులల్లో ఇది చాలా వాడుకలో ఉన్నది. కానీ దీనివలన రతి సుఖం సంపూర్ణంగా ఉండదు అనే అపవాదు కూడా ఉన్నది. అంతేకాకుండా ‘కాపర్- టి’ లాంటివి వాడితే కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే అపోహలు కూడా ఉన్నాయి. ఇవన్ని కాకుండా గత 25 ఏళ్లుగా కెన్యా దేశంలో అమలులో ఉన్న పాతవిధానం చాలా గొప్పదని ఇప్పుడు ప్రపంచం మొత్తం దానినే ఇప్పుడు అనుసరిస్తోంది. దానిని ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఈ కొత్త విధానం పేరు ”సబ్ డెర్మల్ కాంట్రాసెప్టిక్ ఇంప్లాంట్”. అంటే ఇదేదో ఆపరేషన్ కాదు. చాలా సులువు పద్దతి. స్త్రీ మోచేతి చర్మం కింద పైపొరలోతేలికపాటి సూది మాదిరి ఒక సన్నటి తీగలాంటి సాధనాన్ని అమరుస్తారు. ఇది 3…

Read More