Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. అందులో ఉచిత బియ్యం, పోడు భూములు, ఉచిత చీరలు లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకు గుడిలో రిజర్వేషన్ కల్పిస్తోందో. అంటే వి ఐ పి లు డబ్బులు పెట్టి కొనుక్కునే సేవలను తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకు ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రయోగం శ్రీశైలం మల్లన్న భక్తులకు కల్పిస్తున్నారు. ఇది గనక విజయవంతం అయితే ఇకపై అన్ని గుడులల్లో ఈ పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అందుకే శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం పేద భక్తులకు గొప్ప శుభవార్త చెప్పింది. ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన భక్తులకు నెలలో ఒక రోజు ఉచిత ఆర్జిత సేవలకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఆరుద్ర…
షుగర్ ఉన్నవాళ్ళు ‘మందు’లు వాడుతుంటారు. ఈ ‘మందు’లతో పాటు ‘మందు’ కొడితే ఏమౌతుంది? అనే గొప్ప సందేహం మన మందుప్రేమికులకు కలుగుతుంది. దానిని జవాబు ఒక్కటే. మద్యం తాగకూడదు. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవు. మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. అది కూడా మంచిది కాదు. ఒక్కసారి షుగర్ బయటపడిన వాళ్ళు జీవితాంతం మందులు వాడాలి, జీవితాంతం మందుకు దూరంగా ఉండడం మేలు. షుగరుకు మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని గుర్తు పెట్టుకోవాలి. మద్యంతో నాడులు దెబ్బతింటాయని అని గుర్తు పెట్టుకోవాలి. మామూలుగానే మధుమేహులకు సున్నితమైన నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువకాలం నుంచి షుగరుతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీనివల్ల చాలామంది కాళ్లు, చేతుల తిమ్మిర్లెక్కడం, మంట పెట్టటం, సూదులతో పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు షుగరు…
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో, ఇంటర్ వ్యూ లో, పాట్య పుస్తాకాలల్లో జనరల్ క్యాటగిరిలో ఏ సబ్జేట్ మీదనైనా ప్రశ్న వేయవచ్చు. కానీ సినిమాల మీద ఎలాంటి ప్రశ్నలు వేయరు. ‘సినిమాల మీద ప్రశ్నలు వేయరాదు’ అనేది ప్రభుత్వ ఉత్తర్వు కాదు. కానీ దీనిని ఈ దిక్కుమాలిన ఆచారంగా అనాదిగా అన్ని ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్నాయి. అసలు సినిమా అనేది విజ్ఞానం కాదు అని ఐఏఎస్ లు భావిస్తారు. రాజకీయ నాయకులు, చదువుకున్న మేధావులు కూడా ఇలాగే భావిస్తారు. సినిమాలు, నాటకాలు, టి వి లు కేవలం వినోదం కిందికి వస్తాయి అని భావిస్తారు. కానీ ఇది పచ్చి అబద్దం. దశావతారం తరువాత దేవుడు ఎత్తిన మరో అవతారమే సినిమా. అంత గొప్ప పవర్ ఫుల్ మీడియా. ఆ మాటకొస్తే రాజకీయం కంటే పవర్ఫుల్ మీడియా. పది మంది నోబెల్ గ్రహీతలు కలిస్తే ఓ స్టీవెన్ స్పెల్ బర్గ్, వందమంది శాస్త్రవేత్తలు కలిస్తే…
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పివచ్చి ఒక్కసారిగా కుప్పగాకులిపోయారు. అయన కుటుంబసభ్యులు వెంటనే ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రికి 10:50 గంటల సమయంలో హుటా హుటినా తరలించారు. వైద్యులు ఆయనకు అన్నిరకాల పరీక్షలు చేశారు. సోమవారం ఉదయం వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే జి.కిషన్‌రెడ్డికి ఛాతి నొప్పి రావడానికి కారణం గ్యాస్ సమస్య అని వైద్యులు తేల్చారు. ఆయన కొంత కాలంగా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. అయితే మరో 24 గంటల పాటు ఐసి లో డాక్టర్ల పర్యవవేక్షన్లో ఉంచాలని సూచించారు.
ప్రభాస్ రాముడి అవతారం గెటప్ పోస్టర్లు విడల చేశాడు ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓంరౌత్. రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నాడు అనే టాక్ ఎప్పుడో మొదలయ్యింది. ఐతే అతని పక్కన సీతగా నటిసున్న కృతి సనన్ ఫోటోలు, వీడియో క్లిప్పులు కూడా విడుదల చేశారు. రామాయణంలో కీలక ఘట్టమైన రావణ చెర లో ఉన్న సీతగా కృతిని చూపించడం, అలాగే ప్రభాస్ పై కూడా చిన్న పోస్టర్ లాంటిది చూపించారు. ఆదిలోనే హంస పాదు అన్నట్లు ఆమె సీత పాత్రలో నప్పలేదు అనే టాక్ మొదలయ్యింది. ఇప్పుడు ఆమె వల్ల ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేలా ఉంది. ఆమె అందంగా లేకపోవడం దీనికి కారణం. మగాడికి చీర చుట్టినట్లు ఉంటుంది అనే టాక్ మొదటినుంచి ఉంది. ఆమె నటించిన తెలుగులో ‘దోచేయి’, మహేష్ బాబుతో నటించిన ‘నేను ఒక్కడినే’ సినిమా అట్టర్ ఫ్లొప్ కావడానికి ఆమెనే బాధ్యురాలు అని పత్రికలు, సినిమా…
గత కొన్ని రోజులుగా యాదాద్రి దేవస్థాన వెబ్ సైట్ సాంకేతిక లోపాలతో భక్తులను ఇబ్బంది పెడుతోంది. ఆన్లైన్ సేవలలో చాలా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. దీనిమీద లోగడ అనేక పిర్యాదులు వచ్చాయి. మరి తెగేంత వరకు లాగకూడదు అనుకున్న యాదాద్రి దేవస్తానం పాలకమండలి ఈ లోపాలను సవరించే పని మొదలు పెట్టింది. అందుకే పోర్టల్‌ను తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి యాదాద్రి దేవస్థాన సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న పోర్టల్ www.yadadritemple.telangana.gov.inలోని లోపాలను సరిదిద్దడంతో పాటు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం అలయ అధికారులు ఓక ప్రకటనలో తెలిపారు. కాబట్టి భక్తులు ఆన్లైన్ మీద ఆదారపదకుండా నేరుగా యాదగిరి గుట్టకు రావాలని యాదాద్రి దేవస్థాన అధికారులు సూచించారు.
కాయగూరలు, మాంసం కూరలు, దుంపలు, పప్పు దినుసులలు మనిషికి బలాన్ని ఇస్తాయి. కానీ ఆకు కూరలు బలంతో పాటు ఆయువును కూడా పెంచుతాయి. ఆకులలో తమలపాకు రారాజు. దీనిని క్రమమ తప్పకుండా రోజు తీసుకుంటే మనిషి ఖచ్చితంగా వందేళ్ళు బతుకుతాడని ఆయర్వేద పండితులు ఐదు వేల ఏళ్ల కిందటే చెప్పారు. అందుకే దీనిని ‘మృత సంజీవిని’ అని కూడా పిలుస్తారు. ఏ శుభకార్యం జరిగినా ముందుగా తమలపాకుతో తాంబూలం ఇస్తారు. అంటే ఏ కార్యం చేసినా పని చేసి అలసిపోతారు. అందుకే తాత్కాలిక శక్తి ఇవ్వాలని తాంబూలం ఇస్తారు. దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా ఇదే. చివరికి శవం నోట్లో కూడా తమలపాకును పెట్టి కర్మాకాండ జరిపిస్తారు. అంతటి విశిష్ట స్టానం తమలపాకుకు ఎందుకు ఉందో తెలుసుకుందాము. ఒక సూపర్ మార్కెట్లో ఎన్నో రకాల వస్తువులు దొరికినట్లే తమలపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వ్యాధులు, డిజార్డర్లకు వీటిని…
స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు విభాగానికి ముఖ్య అధికారిగా ఉన్న ఎ.ఆర్. శ్రీనివాస్ అనే ఐ.పీ.ఎస్ అధికారి సిట్ కు అనర్హుడని, కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజుల జైలు శిక్ష, జరిమాన పడ్డ అధికారికి ఇంత తీవ్రమైన టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసును ఎలా అప్పగించారని? కాంగ్రెస్ లీడర్, సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం హై కోర్ట్ ఈ కేసు పూర్వపరాలను పరిశీలించింది. ఎ.ఆర్.శ్రీనివాస్ పేపర్ లీక్ కుంబకోణం లో ఎలాంటి పక్షపాత దొరణి లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు చేశారు. వాటిని సీల్డ్ కవర్లో పెట్టి ఈ మద్యే హైకోర్ట్ కు సమర్పించారు. వాటిని పరిశీలించిన జెస్టిస్ ఆ దర్యాప్తు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎ.ఆర్. శ్రీనివాస్ పనితీరును మెచ్చుకుని క్లీన్ చీట్ ఇచ్చారు జెస్టిస్. అంతేకాకుండా ఈ కేసును సిబిఐ…
చాలాకాలంగా మహారాష్ట్ర లోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయం సెక్యూరిటీ వివాదం కేసు కోర్టులో ఉంది. దీనికి కారణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో సరైన భద్రత లేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దేశంలో తిరుపతి తరువాత అత్యదిక భక్తుల ఆదరణ పొందిన గొప్ప ఆలయం ఇదే. అయితే ఈ ఆలయానికి భద్రతా సమస్యలు చాలా ఉన్నాయని లోగడ భక్తులు మీడియా ద్వారా బాహాటంగానే వెల్లడించారు. దీనికి కారణం కొందరు తీవ్రవాదులు ఈ గుడిలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని లోగడ ఇంటలి జెన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో కొందరు సీఐఎస్ఎఫ్ భద్రతా కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. ఆలయననికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వి వి పిలు విరివిగా వస్తుంటారు. దేశంలోని సంపన్నులు కూడా వస్తుంటారు. అయితే ఈ షిర్డీ ఆలయానికి భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ ఎప్పటినుంచో నిర్వహిస్తోంది. ఆలయ…
నాగర్ కర్నూల్ లోని నల్లమల అడవులలో ఉన్న ‘సలేశ్వరం లింగం’ పుణ్య క్షేత్రం గురించి కేవలం శివ భక్తులకు మాత్రమే తెలుసు. ఆరో శతాబ్దంలో ఈ పుణ్య క్షేతం గురించి పురానాలల్లో రాసుంది. ఈ గుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే అంశాలు ఇవి. 1. నల్లమల అడవులలో కృరమృగాలు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అది కూడా చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు. మూడో రోజుల తరువాత మూసేస్తారు. 2. ఈ ఆలయంలో చెంచులు మాత్రమే పూజలు చేస్తారు. ౩. ఈ ఆలయానికి శ్రీశైలం – హైదరాబాద్ హైవే మీదుగా వెళ్ళాలి. ప్రధాన రహదారి నుంచి నల్లమల అడవులలోకి వెళ్లే దారిలో 35 కిలో మీటర్లల్లో ఆలయం ఉంటుంది. అయితే ౩౦ కిలో మీటర్లు వాహనాల్లో వెళ్ళడానికి…