Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శ్రీలంక విద్యుత్ బోర్డు ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని భారత పారిశ్రామికవేత్త అదానీకి కట్టబెట్టేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై నరేంద్ర మోదీ ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఇదే విషయాన్ని రాజపక్స స్వయంగా తనకు చెప్పారని పేర్కొన్నారు. జూన్ 10న శ్రీలంకలో జరిగిన ప్రభుత్వ సంస్థల కమిటీ ఓపెన్ హియరింగ్ లో సెలాన్ విద్యుత్ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాన్డో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో ట్విటర్లో బాగా వైరల్ అవుతోంది. వీడియోలోని వివరాలు ఇలా ఉన్నాయి. “గతేడాది నవంబర్ 24న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో నేను భేటీ అయిన సమయంలో.. మన్నార్ జిల్లాలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అదానీ గ్రూప్ కి ఇవ్వాలని భారత ప్రధాని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయంతో తనకు కానీ, విద్యుత్ బోర్డుకి…
తెలంగాణలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకం. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో కొంచెం ఇష్టం – చాలా కష్టం అన్న భావన వచ్చింది. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు జనం నాడిని పరిశీలిస్తే.. వారంతా మంచి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ.. అధికారం కోసం పోటాపోటీగా పోరాడుతున్నాయి. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే మాత్రం.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే… కాంగ్రెస్ వల్లే సాధ్యమన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లోను నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే, మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది సీనియర్ నాయకుల అంచనా. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన…
ఆమె బాట…. పూల బాట కాదుఆమె ప్రయాణం… నల్లేరుపై నడక కాదుఅనుకున్న గమ్యం దిశగా సాగిన గమనంలోఎంచుకున్న లక్ష్యం దిశగా నడిచిన ప్రయాణంలోఆటుపోట్లు ఎదుర్కొంటూకష్టాలు ఓర్చుకుంటూకన్నీళ్లను దాచుకుంటూమనసులో చీకట్లు కమ్ముకున్నామోముపై చిరునవ్వులు చిందిస్తూఅందరికీ ఆత్మీయ పలకరింపుగా మారారువిమర్శల రాళ్లను విజయ సౌధానికి పునాదిగా మలచుకున్నారుపేరు చెబితే… పరిచయం అవసరం లేని స్థాయికి చేరుకున్నారు. https://youtu.be/Vz-Ro_8UR9E ఆమెది.. తలవంచని వ్యక్తిత్వం…. ముక్కుసూటి మనస్తత్వంకల్మషమెరుగని చిరునవ్వుతో… ఆత్మీయ పలకరింపుతోప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారుటీవీ రంగంలో ఠీవీగా నిలిచారు. ఆమె… తెలుగునాట తొలితరం యాంకర్ఆమెది… బుల్లితెరపై అలుపెరుగని కెరియర్విరామమే తప్ప… విరమణ ఎరుగని ప్రయాణంలోయూట్యూబ్ వేదికగామనతో మరిన్ని ముచ్చట్లు చెప్పేందుకు వస్తున్నారు….ఆమె….. మరెవరో కాదు….ప్రేక్షకుల మదిలో ప్రతిధ్వనించే ‘హృదయాంజలి’….. ఉదయభాను.
-రెపో రేటు పెంచిన ఆర్బీఐ-సవరించిన రేట్లు ప్రకటన భారత రిజర్వ్ భ్యాంక్-ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందుకు రెపోరేటును పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాల్ని ప్రకటించారు. రెపో రేటును పెంచి 4.90 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. రెపో రేటు అంటే.. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు అని అర్థం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో పాటు పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్ తెలిపారు. అటు.. రేపోరేట్లు పెరగడంతో వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచనున్నాయి. ప్రస్తుత రెపో రేటుతో…
ఎమ్మెల్యే కొడుకు రేప్ కేసులో ఉన్నాడు అంటాడు కాని వాడి పేరు చెప్పడు రఘునందన్ రావు.అక్కడ అత్యాచారం జరిగింది అంటూనే కేసును తప్పుదోవ పట్టించేందుకు mutual kiss ఫోటోను వైరల్ చేస్తాడు. పింక్ సినిమా చూసాం కదా. NO means NO అని. ఆ అమ్మాయి ఒంటిమీద గాయలున్నాయని కదా పోలీసుల, అమ్మాయి తండ్రి కథనం. కారు మార్చి తనపై బలవంతం చేశారని కదా ఫిర్యాదు. A kiss is not an invitation for sex. ఈ కాలం అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈ విషయం బాగా తెలుసు. అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటో రోడ్డెక్కిన మనుషులపై కుక్కలను వొదులుతారు ఫ్రెండ్లి పోలీసులు. పిలిస్తే రాలేదని కాళ్ళూ విరగ్గొడతారు. KTR నిర్భయ కేసు నిరసనల వెనుక పెల్లుబికిన ప్రజాగ్రహంలో అన్ని పార్టీలు ఉన్నాయి. కాని, కాంగ్రెస్ ఆ నిరసనలపై చేసిన దాడి బీజేపీ కి ప్లస్ అయింది. దానికి తోడు…
FRBM చట్టం.. అంటే – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడీ చట్టాన్నే అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోంది. పరిమితికి మించి దేశంలో అప్పులు చేస్తోన్న మోడీ సర్కార్.. బీజేపీ రూలింగ్ లో లేని రాష్ట్రాల్లో మాత్రం ఆర్థిక వనరుల సేకరణకు అడ్డుపడుతూ అభివృద్ధికి మోకాలడ్డుతోంది. తమతో అంటగాకే రాష్ట్రాలకు మాత్రం ఎప్ఆర్బీఎం పరిమితులు చూసీ చూడనట్లు వదిలేస్తూ అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది. రాజకీయ వైరుధ్యం ఉన్న రాష్ట్రాలకు మాత్రం చిక్కులు పెడుతోంది. FRBM చట్టం ప్రకారం రాష్ట్రాల అప్పులు జీఎస్డీపీలో 25 శాతానికి మించకూడదు. తెలంగాణ ఆర్థిక గణాంకాల ప్రకారం… రాష్ట్ర మొత్తం అప్పులు సుమారు 4.20 లక్షల కోట్లు. బడ్జెట్ లో పేర్కొన్నవి 2.85 లక్షల కోట్లు కాగా బడ్జెట్ యేతర అప్పులు మరో 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం అప్పులు కలిపి జీఎస్డీపీలో 36 శాతానికి చేరాయి.…
ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రాణాపాయంలో శత్రువు ఉన్నా.. ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది, ఓ పసి బిడ్డ ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతుంటే.. ఎంత బండ రాతి హృదయమైనా కరిగిపోతుంది. ఆ బిడ్డను కాపాడేందుకు చేతనైన సాయం చేయాలని అనిపిస్తుంది. కానీ నిత్యం కేసులు, గొడవలు, అల్లర్ల మధ్య డ్యూటీ చేసే ఆ పోలీసుల హృదయాలు.. బండరాయి కన్నా మోటుగా తయారయ్యాయేమో ! తమ బాబు అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కి వస్తోన్న కారుని చెకింగ్ పేరుతో ఖాకీలు ఆపారు. రూ. 1,100 చలానా ఉందని చెప్పి, కట్టిన తర్వాతే వెళ్లాలని హుకం జారీ చేశారు. ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో బిడ్డ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. చలానా అయితే చెల్లించారు… మరి పోలీసులు ఆ చిన్నారి ప్రాణాలను తెచ్చివ్వగలరా ?? ఇదేనా ప్రభుత్వం చెప్పే ఫ్రెండ్లీ పోలీసింగ్ ?? బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. జనగామా జిల్లా…
రైతులు సాగు పనులకి సిద్ధమవుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ సారి వర్షాకాలంలో కూడా దేశవ్యాప్తంగా మంచి వానలు పడతాయని, సాధారణ వర్షపాతానికి మించి నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు వర్షపాతంపై రెండో విడత అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. రాబోయే నాలుగు నెలల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సగటు వర్షపాతం 103 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంతకముందు ఏప్రిల్ లో విడుదల చేసిన అంచనాల్లో వర్షపాతం సగటు 99 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత 50 ఏళ్లలో కురిసిన వర్షాల సగటుతో సాధారణ వర్షపాతాన్ని లెక్కిస్తారు. దీన్నే సుదీర్ఘ కాల సగటు ( లాంగ్ పీరియడ్ యావరేజ్ – LPA ) అంటారు. దేశం మొత్తానికి ఎల్పీఏ 87 సెంటీమీటర్లని ఐఎండీ తెలిపింది. వరుసగా నాలుగో ఏడాదీ దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలే నమోదవుతాయన్న ఐఎండీ…
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 మంది నిరసనకారులు వేదిక ముందుకు వచ్చి రైతు నేతలపై ఇంక్ చల్లారు. టికాయత్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్ వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. టికాయత్ సహా రైతు నేతలుపై ఇంక్ చల్లిన ముగ్గురు నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన టికాయత్, కర్ణాటక ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి తాము విజయం…
-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలు కులాల వారీగా ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి వారికి రాజకీయ ప్రాథమ్యం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మున్నురు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. జనాభాలో 18శాతం ఉన్న వీరిని తమ వైపు తిప్పుకునేందుకు తెరాస, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో మున్నురు కాపులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. పార్టీలో సైతం వీరికి అదే స్థాయిలో ప్రాథమ్యం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి. పార్టీ పగ్గాలు సైతం డీ. శ్రీనివాస్, పోన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ వంటి వారికి అప్పగించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మున్నురు కాపులకు ఆధరణ తగ్గింది.…