Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
FRBM చట్టం.. అంటే – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడీ చట్టాన్నే అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోంది. పరిమితికి మించి దేశంలో అప్పులు చేస్తోన్న మోడీ సర్కార్.. బీజేపీ రూలింగ్ లో లేని రాష్ట్రాల్లో మాత్రం ఆర్థిక వనరుల సేకరణకు అడ్డుపడుతూ అభివృద్ధికి మోకాలడ్డుతోంది. తమతో అంటగాకే రాష్ట్రాలకు మాత్రం ఎప్ఆర్బీఎం పరిమితులు చూసీ చూడనట్లు వదిలేస్తూ అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది. రాజకీయ వైరుధ్యం ఉన్న రాష్ట్రాలకు మాత్రం చిక్కులు పెడుతోంది. FRBM చట్టం ప్రకారం రాష్ట్రాల అప్పులు జీఎస్డీపీలో 25 శాతానికి మించకూడదు. తెలంగాణ ఆర్థిక గణాంకాల ప్రకారం… రాష్ట్ర మొత్తం అప్పులు సుమారు 4.20 లక్షల కోట్లు. బడ్జెట్ లో పేర్కొన్నవి 2.85 లక్షల కోట్లు కాగా బడ్జెట్ యేతర అప్పులు మరో 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం అప్పులు కలిపి జీఎస్డీపీలో 36 శాతానికి చేరాయి.…
ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రాణాపాయంలో శత్రువు ఉన్నా.. ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది, ఓ పసి బిడ్డ ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతుంటే.. ఎంత బండ రాతి హృదయమైనా కరిగిపోతుంది. ఆ బిడ్డను కాపాడేందుకు చేతనైన సాయం చేయాలని అనిపిస్తుంది. కానీ నిత్యం కేసులు, గొడవలు, అల్లర్ల మధ్య డ్యూటీ చేసే ఆ పోలీసుల హృదయాలు.. బండరాయి కన్నా మోటుగా తయారయ్యాయేమో ! తమ బాబు అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కి వస్తోన్న కారుని చెకింగ్ పేరుతో ఖాకీలు ఆపారు. రూ. 1,100 చలానా ఉందని చెప్పి, కట్టిన తర్వాతే వెళ్లాలని హుకం జారీ చేశారు. ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో బిడ్డ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. చలానా అయితే చెల్లించారు… మరి పోలీసులు ఆ చిన్నారి ప్రాణాలను తెచ్చివ్వగలరా ?? ఇదేనా ప్రభుత్వం చెప్పే ఫ్రెండ్లీ పోలీసింగ్ ?? బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. జనగామా జిల్లా…
రైతులు సాగు పనులకి సిద్ధమవుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ సారి వర్షాకాలంలో కూడా దేశవ్యాప్తంగా మంచి వానలు పడతాయని, సాధారణ వర్షపాతానికి మించి నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు వర్షపాతంపై రెండో విడత అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. రాబోయే నాలుగు నెలల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సగటు వర్షపాతం 103 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంతకముందు ఏప్రిల్ లో విడుదల చేసిన అంచనాల్లో వర్షపాతం సగటు 99 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత 50 ఏళ్లలో కురిసిన వర్షాల సగటుతో సాధారణ వర్షపాతాన్ని లెక్కిస్తారు. దీన్నే సుదీర్ఘ కాల సగటు ( లాంగ్ పీరియడ్ యావరేజ్ – LPA ) అంటారు. దేశం మొత్తానికి ఎల్పీఏ 87 సెంటీమీటర్లని ఐఎండీ తెలిపింది. వరుసగా నాలుగో ఏడాదీ దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలే నమోదవుతాయన్న ఐఎండీ…
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 మంది నిరసనకారులు వేదిక ముందుకు వచ్చి రైతు నేతలపై ఇంక్ చల్లారు. టికాయత్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్ వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. టికాయత్ సహా రైతు నేతలుపై ఇంక్ చల్లిన ముగ్గురు నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన టికాయత్, కర్ణాటక ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి తాము విజయం…
-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలు కులాల వారీగా ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి వారికి రాజకీయ ప్రాథమ్యం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మున్నురు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. జనాభాలో 18శాతం ఉన్న వీరిని తమ వైపు తిప్పుకునేందుకు తెరాస, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో మున్నురు కాపులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. పార్టీలో సైతం వీరికి అదే స్థాయిలో ప్రాథమ్యం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి. పార్టీ పగ్గాలు సైతం డీ. శ్రీనివాస్, పోన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ వంటి వారికి అప్పగించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మున్నురు కాపులకు ఆధరణ తగ్గింది.…
తెలంగాణకు వచ్చి మోదీ తెచ్చింది ఏముంది ?చెన్నైకి వెళ్లి రూ. 31 వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనతెలంగాణలో కేసీఆర్ ది అవినీతి పాలన అంటూ విమర్శలుమరి ప్రధానిగా ఉన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోరు ? తెలంగాణ అంటే… ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు అంత చిన్నచూపు ? కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు తీరుని గమనిస్తే.. ఎవరికైనా ఇదే ప్రశ్న అడాగలని అనిపిస్తుంది. ఒకవేల అలా అనిపించకపోతే ఒకటి.. వారికి దేశ పరిపాలనపై అవగాహన లేకుండా ఉండాలి లేదా రెండు.. వారు మోడీ భజన భక్తులైనా అయి ఉండాలి. కాంగ్రెస్ ధృడ సంకల్పంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి నేటి వరకు .. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చింది అరకొర నిధులే. ఆ ఇచ్చినవి కూడా హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన వాటానే.…
భారత్ లో నిరుద్యోగిత 24 శాతంప్రపంచంలోనే అత్యధికంవిభజిత విధానాలతో ఆర్థిక పునాదులకు నష్టందేశంలో 1990 ల నాటి పరిస్థితులుఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు భారత దేశంలో రోజు రోజుకీ ఎక్కువ అవుతోన్న నిరుద్యోగిత, పతనం అవుతోన్న వృద్ధి రేటు ఆర్థిక, సామాజిక నిపుణులను కలవరపెడుతోంది. దేశ ఆర్థిక పునాదాలు బలంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుత తిరోగమానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని పరోక్షంగా విమర్శిస్తున్నారు. 2009 నుంచి 2012 వరకు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ గా వ్యవహరించిన ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు.. తాజాగా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల మధ్య విభజన తెచ్చే విధానాలు దేశ ప్రగతి పునాదులను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నప్పటికీ, సమాజంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయని,…
కాంగ్రెస్ రహిత కూటమి కోసం పాట్లు సాధ్యం కాదంటున్న రాజకీయ ప్రముఖులు కొండంత రాగం తీసినా.. వృథా ప్రయాసే ! బీజేపీని ఢీకొట్టాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరిక ఎక్కువైనట్లుంది. అందుకే జాతీయ స్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన అడుగులకి మడుగులొత్తే ఆస్థాన మీడియా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసి నరేంద్ర మోడీని బలంగా ఢీకొట్టాలనేది కేసీఆర్ సంకల్పమని కథనాల మీద కథనాలు వండి వారుస్తోంది. 2018 రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ జాతీయ రాగం అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత కూటమి ఏర్పాటు అంటూ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తో మంతనాలు జరిపారు. ఇళ్లు వెతుక్కుంటూ వచ్చిన కేసీఆర్ అండ్ బృందానికి మంచి అతిథి మర్యాదలు చేసిన మమతా, నవనీన్ లు.. ఆ తర్వాత కూటమి…
ఆధునిక భారత నిర్మాత, దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన దూరదృష్టి కలిగిన నాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ. టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్.. సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ. 1984 అక్టోబర్ 31న ఇందిర గాంధీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజీవ్ ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి మరణం బాధపెడుతున్నా ఎంతో ఓర్పుతో బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయసు 40 ఏళ్లే. దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో ప్రధాని…
మరో రెండేళ్లు పెంచిన ప్రభుత్వంగతంలో 3 ఏళ్ల పెంపుభారీగా పెరగనున్న దరఖాస్తులుదరఖాస్తు గడువు ఈ రోజుతో ఆఖరు ?గడువు పెంపుపై ఇంకా వెలువడని ప్రకటనఆందోళనలో అభ్యర్థులు – ఇంటర్నెట్ తో కుస్తీలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేండ్ల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని కోరుతూ వచ్చిన విన్నపాలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజీపీని ఆదేశించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేండ్ల వయోపరిమితి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 2 ఏళ్లు పెంచడంతో… మొత్తంగా యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి 5 ఏళ్లు పెంచినట్లైంది. వయోపరిమితి మరో రెండేళ్లు పెంచడంతో… ఓసీ అభ్యర్థుల ఏజ్ లిమిట్…