Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
భారత దేశం మొత్తం అప్పు రూ. 135.87 లక్షల కోట్లుస్వాతంత్రానంతరం 67 ఏళ్లలో రూ. 55 లక్షల కోట్ల అప్పులుమోదీ హయాంలో ఈ 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్ల అప్పులుఏటా సగటున రూ. 10 లక్షల కోట్ల రుణాలుఅప్పుల్లో ప్రపంచ రికార్డు దిశగా ప్రధాని మోదీపన్నుల వసూళ్లలోనూ తగ్గేదిలే అంటున్న కేంద్రంపెట్రో బాదుడే రూ. 3 లక్షల కోట్లులక్షల కోట్ల రుణాలు, పన్నుల వసూళ్లు ఏం చేస్తున్నట్లు ? స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసిన మొత్తం అపులు… రూ. 55,87,149 కోట్లు. బూటకపు వాగ్దానాలతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. అప్పటి నుంచి 2022 వరకు చేసిన అప్పులు రూ. అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు. అంటే… 67 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులు కంటే… కేవలం 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన…
-సీబీఐ, ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు..?-కేంద్రం చర్యలపై నెల వేచి చూస్తానని స్పష్టీకరణ తెలంగాణకు ప్రాంతీయ పార్టీ అవసరముందని వెల్లడి-మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. నెలలు గడచినా అందుకు సంబంధించిన ఊసే ఉండటం లేదు. ఇక దమ్ముంటే టచ్ చేసి చూడాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ.. ఇద్దరిలో ఎవరూ మరో అడుగు ముందుకు వేయడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయ ప్రయాణం ఎటు..? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా ప్రశ్నించారు. సీబీఐ,…
-ప్రజాదర్బార్ లు లేవు, గోడు వినే నాథులు లేరు కేసీఆర్ సచివాలయానికి రాడు, ప్రగతి భవన్ కు రానివ్వడు-అర్జీ తీసుకోడు.. ధర్నాచౌక్ లో అరవనివ్వడు-ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం కరవు-నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..? రాజుల కాలంలో అంతఃపురం వద్ద ధర్మగంట ఉండేది. అక్కడికి వెళ్లి… ఎవరైనా ధర్మగంట మోగిస్తే… ప్రభువైన రాజు బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. ధర్మగంట మోగిందంటే.. నిద్రలో ఉన్నా.. మేల్కొని.. బయటకు రావడం… జనం గోడు వినడం.. ఆనాటి రాజుల విధ్యుక్త ధర్మం. పాలన ఏ రూపంలో ఉన్నా.. జనం తమ బాధలు చెప్పుకునే ఒక వ్యవస్థ ఉండేది… ఉంటుంది… ఉండాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… పాలకులే సేవకులు. ప్రభువులు ఆదేశిస్తే పాలకులు తమ కర్తవ్యం నిర్వర్తించాలి. సేవకులు విధులు నిర్వర్తించకుంటే.. ప్రభువులు ఏం చేయాలి..? ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి తప్ప.. ప్రజలే స్వయంగా పాలకుల్ని మధ్యలో దింపే వ్యవస్థ లేదు. మరేం చేయాలి….?…
-కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతిన్న కేసీఆర్-హస్తం హామీలపై స్పందించేందుకు మల్లగుల్లాలు డిక్లరేషన్ పై మాట్లాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం-పొలిటికల్ టూరిస్టులు అంటూ అవాకులు, చెవాకులుకేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ తెలంగాణలో రైతుల్ని బ్రహ్మాండంగా ఉద్ధరించామని, ఇక దేశంలో రైతుల్ని ఆదుకునే దిక్కు ఒక్క టీఆర్ఎస్సేనని, దేశ రాజకీయాల్ని దున్నేస్తానంటూ నాగలి పట్టుకుని బయల్దేరుతున్న కేసీఆర్… నేల విడిచి సాము చేస్తున్నారు. వాస్తవాల్ని కనుమరుగు చేస్తూ… జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఐడియాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా 2014లో మోడీకి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియా కూడా అదే కదా. కానీ.. కేసీఆర్ నిజంగా రైతు బంధువా…? వరి వేస్తే ఉరే అన్నడు. బీజేపీతో పంచాయితీ పెట్టుకుని అది రైతుల సమస్య అని మభ్యపెట్టలేదా..? కేసీఆర్ తో పంచాయితీ పెట్టుకున్న బీజేపీ రైతుల్ని బలి తీసుకోలేదా…?…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన రాహుల్ గాంధీ గారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో ఆర్డినేటర్ డా. సి. రోహిన్ రెడ్డి. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ గారికి వందలాది మంది కార్యకర్తలతో రోహిన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తాను పోటీ చేయాలని ఆశిస్తోన్న ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హోటల్ తాజ్ కృష్ణలో రాహుల్ బస చేయగా.. వారి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. శనివారం తాజ్ కృష్ణ నుంచి సంజీవయ్య పార్క్ కి రాహుల్ బయలుదేరగా.. వారి వెంట వెంట రోహిన్ రెడ్డి భారీసంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ దారిలో బుల్లెట్ ర్యాలీ అందరినీ ఆకర్షించింది, అక్కడి నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం మీదుగా గాంధీభవన్ వరకు జై కాంగ్రెస్,…
సురభీ గౌతమ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్ మాట్లాడలేక అవమానపడింది. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు… ‘ఆరో తరగతి లెక్కల పరీక్షలో వందకు వంద మార్కులు సాధించాను. అప్పుడే క్లాసులో నాకంటూ ఓ గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమయింది” అంటూ తన స్కూలు చదువును గుర్తు చేసుకుంది సురభి. పదో తరగతిలో లెక్కలు, సైన్స్లో వందకు వంద మార్కులను సాధించింది. ఈ విజయం ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కలను నేరవేర్చుకోవడానికి ఈ విజయాన్ని ఓ మార్గంగా భావించింది.బాధ్యతగా భావించిప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్ ఉండాలి.…
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్ తెలంగాణ అంటే మాకు ఆత్మగౌరవం: రేవంత్రెడ్డి రైతుల కుటుంబాలను కేసీఆర్ ఛిన్నాభిన్నం చేశారు: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్ ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం: రేవంత్ రెడ్డి భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తాం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: రేవంత్ రెడ్డి రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుంది పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటాం పంటల బీమా పథకం అమలు చేసి.. నష్టపరిహారం వెంటనే అందజేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు: రేవంత్ రెడ్డి పోడు రైతులకు పట్టాలు ఇస్తాం: రేవంత్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి చట్టపరంగా రైతు కమిషన్ను ఏర్పాటు చేస్తాం:…
ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ – ధరణి పోర్టల్ రద్దు రాహుల్ గాంధీ సాక్షిగా రైతు డిక్లరేషన్ ప్రకటన365 రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్భూమిలేని రైతులకి పెట్టుబడి సహాయంపంట గిట్టుబాటు ధరల ప్రకటనకేసీఆర్ వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేశారురైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. భూమి కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా నూతన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. ఈ మేరకు వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ వేదికగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని..…
ప్రజలు టీఆర్ఎస్కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు: రాహుల్గాంధీరెండుసార్లు అవకాశమిచ్చిన టీఆర్ఎస్ ప్రజల కోరిక నెరవేర్చలేదు:వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలి: రాహుల్గాంధీతెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక నెరవేరుస్తుంది: రాహుల్ తెరాస, భాజపా మధ్య ఒప్పందం ఉంది: రాహుల్గాంధీమోదీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ సహకరిస్తోంది: రాహుల్గాంధీమోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్ఎస్ సహకరించింది: రాహుల్తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసు: రాహుల్గాంధీకాంగ్రెస్, భాజపా కలవదని ఆ పార్టీ నేతలకు తెలుసు: రాహుల్కాంగ్రెస్ ఎప్పటికీ కలవదని.. టీఆర్ఎస్తో కలుస్తారు: రాహుల్తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని భాజపా భావిస్తోందిటీఆర్ఎస్ రిమోట్ భాజపా చేతిలో ఉంది: రాహుల్గాంధీ
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ అట్టహాసంగా జరుగుతోంది. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల కోసం ఒక వేదిక కేటాయించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడిన రాహుల్… వారిని పరామర్శించారు. కన్నీరు తుడిచి… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాహుల్ వెంట ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రైతుల సమస్యల్ని వివరించారు.