Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
హైడ్రామాకు తెరదించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి లాజిక్ లేకుండా మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని ఓసారి… మరోసారి కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకే రాజీనామా అంటూ నాలుక మడతేశారు. అంతేకాదు.. తన రాజీనామా మునుగోడు ఆత్మగౌరవానికి సంబంధించినది అంటూ నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కాని తను కాంగ్రెస్ కోసం త్యాగం చేశానని మాట్లాడం ఆశ్చర్యపరిచింది. 2009లో వ్యాపారవేత్తగా ఉన్న రాజగోపాల్ కు భువనగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అవకాశం కల్పించింది కాంగ్రెస్. 2014లో భువనగిరిలో ఓటమి పాలైతే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి గౌరవించింది. ఆ తరువాత 2018ముందస్తు ఎన్నికల్లో మునుగోడు…
రాజన్న మేము గుర్తున్నమ అన్న … గాదె అన్న నికోసం … మా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాం చూడు … మమల్ని కార్యకర్త అంటారు అన్న … నీకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటిది అన్న … ఓ … నీ జీవితానికి గుర్తింపు ఈచ్చిందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … గట్లనే నిన్ను ఎంపీ చేసినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … మీ అన్నకు మంత్రిని చేసే , ఎమ్మెల్యే నీ చేసే గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … నీకు mlc , ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … నీ company లు పెంచుకున్నవ్ కదా అన్న గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … బీజేపీ రేట్లు పెంచి…
తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలలో కలుషిత ఆహరం తిని తల్లడిల్లుతోన్న విద్యార్థుల వేదనలే పేపర్లో బ్యానర్ ఐటెం గా ప్రతిరోజు కనిపిస్తున్నాయి. జిల్లాకో చోట కలుషిత ఆహరం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలైన సంఘటనలు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. అంగన్ వాడీ, ప్రాథమిక , సెకండరీ , హై స్కూల్ , గురుకుల స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల స్థాయివరకున్న వసతి గృహాలలో కలుషిత ఆహరంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అవుతున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన భోజనం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఫెయిల్ అయింది. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్…సర్కార్ సంక్షేమ వసతి గృహాల్లో తినే తిండిని కూడా కలుషితం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా కలుషిత ఆహరం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నా ప్రభుత్వం మకేమి అన్నట్లుగా…
రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (RFCL) ఎరువుల కర్మాగారం. 1999 మార్చి 31న అర్ధరాత్రి మూతపడ్డ కర్మాగారాన్ని 2014 లో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవతో సుమారు రూ.5,254 కోట్ల అంచనాలతో నిర్మాణం పనులు చేపట్టగా… కరోనా సహా వివిధ కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రూ.6,120కోట్ల 55 లక్షలతో రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభమైంది. అయితే ఎరువుల ప్రొడక్షన్ అయిన తర్వాత ఎరువులను బ్యాగింగ్ లోడింగ్ మరియు అన్ లోడింగ్ చేసే విభాగానికి సంబంధించి లేబర్, హమాలీ పనులను పశ్చిమ బెంగాల్ కు చెందిన ఫైవ్ స్టార్ అనే కంపెనీ ఏడాది కాలానికి కాంట్రాక్ట్ దక్కించుకుంది, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థానిక టీఆర్ఎస్ నాయకుల ద్వారా సదరు కాంట్రాక్టర్ కు 2 కోట్ల రూపాయలు గుడ్ విల్ ఇచ్చి తన బినామీలకు కాంట్రాక్ట్ పనులను ఇప్పించుకుని లేబర్, హమాలీలను పనుల్లోకి తీసుకోవడం…
ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు టీఆర్ఎ స్ లో కాక రేపుతున్నాయి. సర్వేలో టీఆర్ఎస్ దే అధికారమని తేల్చినా.. ఉమ్మడి ఏడు జిల్లాలో బీజేపీ కారుకు గట్టి పోటీనిస్తుందని పేర్కొనటం గులాబీ బాస్ కు అస్సలు మింగుడు పడటం లేదు. ఆరా సంస్థ చేసిన సర్వేకు విశ్వసనీయత లేదని కేసీఆర్ కు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ… ఈ సర్వేలో టీఆర్ఎస్ కు బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని వెల్లడించడం పట్ల ప్రగతి భవన్ లో కలకలం రేగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని బీజేపీ జాతీయ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తోన్న సమయంలో… తాజా సర్వే ఫలితం ఎటు వైపు దారి తీస్తుందోనని కేసీఆర్ ఆందోళనగా తెలుస్తోంది. బీజేపీలో బూస్టింగ్ నింపిన ఆరా సర్వేతో ఆ పార్టీలోకి చేరికలు మరింత ముమ్మరం అవుతాయా అని టీర్ఎస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలోని…
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు లేనంతగా హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతుండగా…ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము ముందస్తుకు సిద్దంగా ఉన్నామని, విపక్షాలు తేదీని ఖరారు చేయాలనీ సవాల్ విసిరారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా స్పందించాయి. నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రా.. తేల్చుకుందాం నువ్వా- నేనో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. బండి సంజయ్ కూడా ముందస్తుకు తామెప్పుడో ప్రిపేర్ అయి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల అటెన్షన్ తన వైపు మళ్లించుకున్నా కేసీఆర్.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వరుణ దేవుడు కరుణించిన తరువాత కేసీఆర్…
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలతో మెతుకుసీమ వాసులు మళ్ళీ హస్తం వైపు ఆకర్షితులు అవుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాస్ గా చార్జ్ తీసుకున్నాక కేసీఆర్ సొంత జిల్లా కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడంలో సక్సెస్ అవుతారా అని రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా గమనించాయి. ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పునర్ వైభవాన్ని పొందేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బలోపేతానికి మెదక్ నుంచే పునాది పడాలని గజ్వేల్ లో జరిగిన దళిత , గిరిజన ఆదివాసీ దండోరా సభలో ప్రకటించిన రేవంత్.. అన్నట్టుగానే తన వర్క్ షురూ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ నేతలు నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారు. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కాలికి బలపం కట్టుకున్నట్టుగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అన్నింటిని చుట్టేస్తున్నారు.…
తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారని బీజేపీ నేతల ప్రకటనలతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ విషయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ పలువురు కీలక నేతలపై కన్నేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు బీజేపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పీకే సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టీఆర్ఎస్ టికెట్లు ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈసారి 30 మంది సిట్టింగ్ లకు నిరాశ తప్పదని తెలుస్తోంది. అందులో భాగంగా ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతోన్నా సీఎం సాబ్ కరుణించడం లేదట. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే వెళ్ళండనే విధంగా పక్కకు పెడుతుండటంతో .. ఇదే అదునుగా భావించిన కమలం క్యాంప్ కొంతమంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు షురూ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాజ్యసభ…
టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త పీకే సర్వేలో టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆరా సర్వే అధికార పార్టీకి అనుకూల రిజల్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్దగా నెట్వర్క్ లేని ఆరా తెలంగాణలో ప్రజల పల్స్ పట్టుకున్నామని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తమ సర్వే రిజల్ట్ ను షేర్ చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ అనుకూల సర్వే సంస్థగా పేరొందిన ఆరా… ప్రస్తుత పరిస్థితిని కాస్త టీఆర్ఎస్ కు ప్రతికూలమని చెప్తూనే..బీజేపీ – టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ ను కావాలనే వెనక్కి తోసినట్టుగా స్పష్టం అవుతోంది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలో ఏకంగా ఏడు జిల్లాలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుందని , కేవలం మూడు జిల్లాలో టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రభావాన్ని పలుచన చేసే ప్రయత్నం చేసింది. ఎన్నికల…
అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి కొండలపై నుంచి వరద పోటెత్తింది. ఈ వరదలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రకు రాష్ట్ర ఎమ్మెల్యే రాజాసింగ్ తన పరివారంతో కలిసి వెళ్లారు. ఆయన, తన కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. వారిని అక్కడి పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఇటీవల నా కుమార్తె వివాహం జరిగింది. కుమార్తె, అల్లుడితో పాటు 11 మంది కుటుంబ సభ్యులతో ఈనెల 6న అమర్‌నాథ్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరాం. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రద్దు కావడంతో దిల్లీ నుంచి అతికష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నాం. రాత్రి అక్కడ ఓ టెంట్‌లో నిద్రించి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్‌నాథ్‌కు చేరుకున్నాం.” అని రాజాసింగ్ తెలిపారు. “మధ్యాహ్నం ఒంటి…