తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా మెలుగుతోన్న వారిలో మహేష్ బాబు – నమ్రత జంట మొదటి ప్లేసులో ఉంటుంది. మహేష్ బాబుకు సహకరిస్తూ ఇద్దరి పిల్లల బాధ్యతలను చూసుకుంటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు నమ్రత. అయితే పెళ్లి కాకముందే నమ్రత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కాని పెళ్లి అయ్యాక ఆమె సినిమాలు చేయడం పూర్తిగా మానేసి కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు విధించి నమ్రతను మహేష్ బాబు పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో ఎవరికీ ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏదీ ఏమైనా నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయం ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నమ్రత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ పాత్రను చేయాలని త్రివిక్రమ్ నేరుగా నమ్రతను అడగడంతో ఆమె కాదనలేకపోయారట.
ఆ తరువాత ఈ విషయాన్ని మహేష్ బాబు దృష్టికి నమ్రత తీసుకెళ్లగా ఆయన ఫైర్ అయ్యాడట. తనకు ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని నమ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. మహేష్ బాబు మాటలకు నమ్రత మనస్తాపం చెందిందని.. ఇంతచిన్న విషయానికి రాద్దాంతం చేయాలా అంటూ విసుక్కుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం వీళ్ళ మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తుంది.