పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేస్కుని ప్రజలలో చులకన అయ్యి రాజకీయంగా ఓటమి పాలయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కడతాను అని నిన్నటివరకు నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయమే కొంపముంచింది అని ఈ రోజు ఉదయం వచ్చిన సర్వే ప్రాథమిక ఫలితాలు తేటతెల్లం చేశాయి అని తెలిసింది.
మూడు రాజధానులు కడతాను అని నిన్న రాత్రి వరకు జగన్ ప్రకటించారు. దానివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చుకుని ఓట్లు వేస్తారు అని కలలు కన్నారు. కానీ అవి పగటి కలలు అని ఎమ్మెల్సి ఓటర్లు ఇచ్చిన ట్విస్ట్ తో ఈ రోజు ఉదయం మేలుకున్నారు. సర్వే రిపోర్ట్ చూసి ఖంగుతిన్నాడు. ఎమ్మెల్సి స్థానాలలో ఓడిపోయిన వై ఎస్ ఆర్ పార్టీ నాయకులకు జగన్ ఫోన్ చేసి ‘మనం ఎందుకు ఓడిపోయామో చెప్పగలరా?’ అని ఒకే ఒక్క ప్రశ్న అడిగినట్లు తెలిసింది.
వాళ్ళు అందరు మూకుమ్మడిగా చెప్పిన సాకు ఒక్కటే. ‘మీరు తీసుకున్న మూడు రాజధానుల పథకమే కొంపముంచింది’ అని చెప్పినట్లు తెలిసింది.
ఉత్తర ఆంధ్ర కు ఇన్చార్జ్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కి జగన్ ఫోన్ చేసి ‘ఓటమికి గల కారణం ఏమిటని’ కోపంతో అరిచినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి కూడా కోపం, అవమానం తో ఊగిపోతు ”ఆ దిక్కుమాలిన మూడు రాజధానుల నినాదాన్ని వెంటేసుకుని తిరిగావు. మనం ఓడిపోక ఎట్టా గెలుత్తాము సామీ? విశాఖ వాసులు కూడా మాకు రాజధాని అక్కరలేదు అని చెప్పబడాలా? చివరికి ఓటమి ఎరుగని మీ పులివెందుల ఓటర్లు కూడా సీమకు రాజధాని ఒద్దని చెప్పబడాలా? ఇంకా ఎట్టా గెలిసి సచ్చేది. తప్పు నువ్వు సేసి మా మీద రుద్దామాకా?” అని లైన్ కట్ చేసినట్లు తెలిసింది.
అయినా జగన్ వాళ్ళ మాటలు నమ్మలేదు. వాళ్ళ తమ ఓటమిని మూడు రాజధానులకు అంటగట్టి తనను దోషిని చేస్తున్నారు అని తిట్టాడు. కానీ ఈ రోజు బయటివాళ్ళు జరిపిన సర్వే ప్రాథమిక ఫలితాలు కూడా ఇదే విషయం చెప్పేసరికి అతను ఖంగుతిన్నాడు.
మరి విశాఖలో రెండో రాజధాని, సీమలో మూడో రాజధాని కడతానని మాటిచ్చిన జగన్ ఇప్పుడు ఆ ఆలోచన మార్చున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గాల ప్రజలకు ఏం జవాబు చెప్పి ఎమ్మెల్లే ఎన్నికలలలో ఓట్లు అడుగుతారో చూడాలి. అల్ రెడీ ఇప్పుడున్న అమరావతి రాజాధాని ఓటర్లు జగన్ మీదమంది పడుతున్నారు. ఎలాగో ఆ స్థానం కోల్పోయినట్లే. ఇక చక్రం ఎలా తిప్పుతాడో చూడాలి.