శనివారం రాత్రి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన చంద్ర బాబు ఈ సారి బీజేపీ తో పొత్తులో ఉంటారన్న వార్తలు వస్తున్నాయి.జగన్ ను ఓడించే దిశగా బీజేపీ తో టీడిపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తాలు రాజకీయ పార్టీలలో చర్చనియంశంగా మారింది.
అమిత్ షాను కలసిన చంద్రబాబు ఎనిమిది ఎంపీ సీట్లు 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పారని ఆ ప్రతిపాదనతో కూడిన జాబితాను సీట్ల వివరాలను కూడా ఇచ్చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు బీజేపీకి ఇన్ని సీట్లు ఇస్తారు. వీరే అభ్యర్ధులు అంటూ జాబితా కూడా పెట్టేసి వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ లిస్ట్ లో ఏముందో ఒక సారి చూద్దాం.
ముందుగా ఎనిమిది ఎంపీల లిస్ట్ చూస్తే సుజనా చౌదరి (విజయవాడ) దగ్గుబాటి పురంధేశ్వరి (విశాఖపట్నం) మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (కడప) సీఎం రమేష్ (రాజంపేట) టిజి వెంకటేష్ (కర్నూలు) కామినేని శ్రీనివాస్ (ఏలూరు) సత్యకుమార్ (నెల్లూరు) జీవిఎల్ నరసింహారావు (నరసరావుపేట)గా ఉంది. అంటే వీరంతా బీజేపీ తరఫున టీడీపీ మద్దతుతో పోటీ చేసే ఎంపీ అభ్యర్ధులు .
ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే పన్నెడింటిని కేటాయించారని కూడా పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అవేంటి అని చూస్తే వరదాపురం సూరి(ధర్మవరం) విష్ణువర్ధన్ రెడ్డి(కదిరి) విష్ణుకుమార్ రాజు(విశాఖ నార్త్) భానుప్రకాశ్ రెడ్డి(తిరుపతి) సాధినేని యామినిశర్మ(గుంటూరు వెస్ట్) రమేష్ నాయుడు(రాజంపేట) పివిఎన్ మాధవ్(విశాఖ వెస్ట్) ఎస్.కే. భాజి(విజయవాడ వెస్ట్) అంజనేయరెడ్డి (నెల్లూరు సిటీ) పూడి తిరుపతి రావు(ఆముదాలవలస) సోము వీర్రాజు(రాజమండ్రి సిటీ) లంకా దినకర్ (గన్నవరం)ల పేర్లు ఉన్నాయి.
మరి ఇలా ఈ లిస్ట్ లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు.అయితే ఈ భేటిలో పొత్తుల గురించి ప్రస్తావించారా లేదా…అన్నది ఇంకా క్లారిటి లేదు.అయితే ఈ జాబితాలో కేటాయించిన పేర్లు ఫేక్ అని సమాచారం.మరి ఇది ఎంత వరకు నిజం అనేది వచ్చే ఎన్నికలో చూడాలి మరి.