రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా గొప్ప అవార్డులు అందజేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రకటించారు. ఇది ప్రతి ఏడాది ఏప్రిల్ 14 న ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తామని కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వ మానవుడని, అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమని కేసీఆర్ అన్నారు.
ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ అవార్డు ఎవ్వరికి ఇస్తారు అనే చర్చ అప్పుడే మొదలయింది. ఇది కేవలం దళితులకు మాత్రమే ఇవ్వాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. బాగానే ఉంది. కానీ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అవార్డు అనేది ప్రతిభను చూసి ఇవ్వాలి. కానీ కులాన్ని ఆధారం చేసుకుని ఇవ్వరాదు. ఇందులో ఎలాంటి రిజర్వేషను ఉండరాదు. ఇది పద్మశ్రీ, పద్మవిభూషణ్లాంటి ప్రభుత్వ అవార్డుల చట్టంలో రాసుంది. దానిని రాజ్యాంగంలో రాసింది కూడా అంబేడ్కరే. దానిప్రకరం చూసే అంబేడ్కర్ అవార్డు కేవలం దళితులకు మాత్రమే ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే అగ్ర కులాల్ల వాళ్ళు ఊరుకోరు. తప్పక కోర్టు కు వెళతారు. అది ఆగిపోయే ప్రమదం పొంచి ఉంది.
ఒకవేళ ప్రతిభను ఆధారం చేసునుని అగ్ర వర్ణాలకు కూడా ఇస్తే దళితులూ ఊరుకోరు. ”పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటి అన్ని అవార్డులల్లో మాకు అన్యాయం జరుగుతోంది. చివరికి మా అంబేడ్కర్ అవార్డు ని కూడా అగ్ర వర్ణాలు గద్దల్లా తన్నుకుపోవాలా?” అని కోర్ట్కు వెళ్లే అవకాశం ఉంది. అది కూడా నిజమే. వాళ్ళకు ఏమి మిగలలేదు. కనీసం ఈ అవార్డు కూడా మిగలకపోతే ఎలా? అప్పుడు కూడా ఇది ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
లోగడ ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా ఇలాగే అంబేడ్కర్ అవార్డు ప్రకటించారు. ఆమె వేసిన కమిటీకి ఇలాంటి తలనొప్పులు వచ్చాయి. అందుకే ఆమె వాటిని పక్కన పెట్టారు. మరి కేసీఆర్ ఈ సమస్యను ఎలా ఎదురుకుంటారో చూడాలి.
ఒకటి మాత్రం నిజం. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆశాదీపం. విశ్వమానవుడి విశ్వరూపం. అంబేడ్కర్ సిద్ధాంతాలు పాటించిన వాళ్ళకు తప్పక ఈ అవార్డు ఇవ్వాలి. అది దళితులు కావచ్చు, లేదా అగ్ర వర్ణాలు కావచ్చు. ఇక్కడ కులం కంటే ప్రతిభ, సేవకే పెద్దపీట వేయాలి.
దళితులకు ఉత్తమ సేవలు అందించినవారికి మాత్రమే అవార్డులు ఇవ్వాలి. అగ్ర కులాలల్లో కూడా దళితులకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రచయితలు, కవులే ఎక్కువ. వాళ్ళకు కూడా ఈ అవార్డు ఇస్తేనే అంబేడ్కర్ ఆత్మా శాంతిస్తుంది. కనీసం తెలంగాణ చుట్టూ హాయిగా తిరుగుతుంది.