కేవలం ఆడవాళ్ళ కోసమే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వడం గురించి మనకు తెలుసు. కానీ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వాళ్ళుకూడా మహిళల కోసం జూబ్లి హిల్స్ లో సూపర్ లగ్జరి అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇందులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి. అలాగని పేద ఆడవాళ్ళకు దయతో ఇవ్వడం లేదు.
ప్రతి పోర్షన్ పదమూడు వేల ఎస్ ఎఫ్ టి ఉంటుంది. సూపర్ లగ్జరీ అందాలు, సదుపాయాలు. ఒకొక్క పోర్షన్ ధర చెపితే మీ గుండె ఆగిపోతుంది. ప్రతి పోర్షన్ ధర అక్షరాలా రూ. 12 కొట్ల నుంచి రూ. 20 కోట్లు. ఇన్ని కోట్లు ఇచ్చాము, కాబట్టి మా ఫ్యామిలీ మగాళ్ళతో ఉంటాము అంటే కుదరదు.
కేవలం ఆడ ఫ్యామిలీ మాత్రమే ఉండాలి. మగ పురుగులను ఆడ వాచ్ మెన్ లు లోనికి అనుమతించరు. ఎందుకంటే ఓ మగాడు ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఇతర మహిళలను ఏమైనా చేయవచ్చు. అంటే రైల్లో లేడీస్ కంపార్ట్మెంట్ లాగా ఇది నూటికి నూరుపాళ్ళు ఆడవాళ్ళతో ఉండాలి.
దీనిని ‘ది వరల్డ్’ అనే రియల్ ఎస్టేట్ జూబ్లిహిల్స్ లో మహిళలకోసం కడుతోంది. మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రకటించింది. అన్ని అపార్ట్మెంట్లు హాట్ కేకుల్లగా అమ్ముడుపోయాయి. ఇలాంటి మహిళా అపార్ట్మెంట్లు యూరప్ లో చాలా ఉన్నాయి. ఇందులో ఉడడం మహిళలకు పూర్తి రక్షణ దొరుకుతుంది.
కానీ మన దేశంలో తొలిసారి హైదరాబాద్ లో కట్టడం విశేషం. రాబోయే విశ్వ నగరానికి ఇది శుభసూచికం.