టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఓ మూవీ ద్వారా హీరోయిన్ అప్సరరాణి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. డేంజరస్, క్రాక్ సినిమాలోనూ ఐటెం సాంగ్స్ తో ఆదరగొట్టేసింది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అందాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉంటుంది.
ఆర్జీవీ తెరకెక్కించిన లెస్బియన్ మూవీలో అపర్స రాణి బోల్డ్ గా నటించింది. ఈ సమయంలోనే ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్సర రాణి మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కన్నడ ఇండస్ట్రీలో మొదటిసారి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ డైరక్టర్ ఛాన్స్ ఇస్తానని కబురు పెట్టాడని చెప్పింది.
సినిమా విషయాలపై చర్చించేందుకు ఆ డైరక్టర్ గదికి రమ్మని పిలిచారు. అయితే , నేను మా నాన్నను వెంటతీసుకెళ్ళాను. మా నాన్నను బయట నిలిపివేయడంతో.. నేను ఒంటరిగా గదిలోకి వెళ్ళాను. అప్పుడు ఆ డైరక్టర్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను కాని, నాతో పడుకోవాల్సిందేనంటూ నా చేయి పట్టుకొబోయాడంటూ చెప్పుకొచ్చింది అప్సర రాణి. దాంతో వెంటనే నాన్నతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ ఎమోషనల్ అయింది.
కన్నడ ఇండస్ట్రీలో ఎదురైనట్లుగా తెలుగు ఇండస్ట్రీలో అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అప్సర రాణి చెప్పుకొచ్చింది.