ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఈ ఎన్నికపై గట్టిగా ఫోకస్ చేయాల్సి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మూడు స్థానాలు టీడీపీ ఖాతాలో పడటంతో సైకిల్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అదే ఊపులో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ ఓ స్థానం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని బరిలో నిలిపారు. సంఖ్యా బలం తక్కువే ఉన్నా వైసీపీలో అసంతృప్తులు ఉన్నారని వారు ఓటు వేస్తారని నమ్మకంతో టీడీపీ అభ్యర్థిని పోటీకి దించింది.
గురువారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 175మంది ఎమ్మెల్యేలకు గాను 174ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కరు మాత్రమే ఇంకా ఓటు వేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు ఇంకా ఓటు వేయలేదు. ఒక్క ఓటు పడకపోయిన అది వైసీపీకి ఇబ్బంది అవుతుంది. టీడీపీ గెలుపుకు దోహదం చేస్తుంది. అందుకే ఆయన కోసం ఏకంగా విమానాన్ని లేదా హెలిక్యాప్టర్ ను ఏర్పాటు చేసే పనిలో పడింది వైసీపీ.
సాయంత్రం వరకూ సమయం ఉండడంతో ఏ క్షణమైనా వచ్చి ఆ వైసీపీ ఎమ్మెల్యేతో ఓటు వేయించాలని వైసీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. విజయనగరం జిల్లాలోని నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన బొడ్డుకొండ అప్పలనాయుడు కోసం హెలికాప్టర్ పంపే పనిలో పడింది. ఇవాళ అప్పలనాయుడి కుమారుడి వివాహం ఉంది. అందుకే ఆయన ఓటు వేసేందుకు విజయనగరం నుంచి విజయవాడకు రాలేకపోయారు. వివాహ తంతు ముగియగానే విజయవాడానికి వస్తానని తెలిపాడట.. దీంతో వైసీపీ అధిష్టానం ఈ ఎమ్మెల్యే కోసం ఏకంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ ను పంపింది. ఒక్క ఓటు కోసం వైసీపీ చేసిన ఈ సాహసం చూస్తే వారికి ఎమ్మెల్సీని గెలవడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతోంది.
Also Read : టీడీపీలోకి 16మంది వైసీపీ ఎమ్మెల్యేలు – వైసీపీ క్యాంప్ లో కలవరం