కరోనా పీడ విరగడైనట్టేనని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వేళ భారతదేశాన్ని మరో వైరస్ భయపెడుతోంది.
తమిళనాడులో “మద్రాస్ ఐ” అనే వైరస్ విజృంభిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి తమిళనాడును తాజాగా షేక్ చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తమిళనాడును కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో మళ్ళీ కరోనా నాటి పరిస్థితులు పునరావృత్తం అవ్వనున్నాయా..? అని తమిళనాడు జనం ఆందోళన చెందుతున్నారు.
కంటివాపు, కళ్ళు ఎర్రబారడం వంటివి ఈ వైరస్ లక్షణాలుగా వైద్యులు చెప్తున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారు ఐదు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వ్యాధి ప్రాణంతకం కాదు కాని వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.